neem tree
-
పాలు కారుస్తున్న వేప చెట్టు ఎగవడ్డ అమ్మలక్కలు
-
రెడ్ బుక్ లో వేప చెట్టు
-
ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా వేపాకులతో చెక్ పెట్టొచ్చు
వేప చెట్టు ఇంటి దగ్గర్లో ఉంటే వేరే సౌందర్యసాధనాలతో పనే ఉండదు. వేపాకులు, బెరడు, వేపనూనె ఔషధాలుగానే కాదు, సౌందర్య సాధనాలుగానూ ఉపయోగపడతాయి. ఎలాంటి చర్మ సమస్యలకైనా వేపతో ఇట్టే చెక్ పెట్టేయవచ్చు. ► ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడుతుంటే వేపాకులతో చక్కని విరుగుడు ఉంది. గుప్పెడు వేపాకులను అరలీటరు నీటిలో వేయాలి. వేపాకులు పూర్తిగా మెత్తగా మారిపోయేంత వరకు ఆ నీటిని మరిగించాలి. కాసేపటికి నీరు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అప్పుడు వడగట్టి ఆ కషాయాన్ని సీసాలో భద్రపరచుకోవాలి. ►ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ నీటితో కాస్త దూదిని తడిపి ముఖాన్ని రుద్దుకుంటే చాలు. మొటిమలు, మచ్చలు మటుమాయం అవుతాయి. ∙చర్మం పొడిబారి, తరచు దురదలు పెడుతున్నట్లయితే, పైన చెప్పుకున్నట్లే వేపాకులతో కషాయం చేసి, బకెట్ నీటిలో ఒకకప్పు కషాయాన్ని పోసి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే చాలు, కొద్దిరోజుల్లోనే చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది. ► ముఖం తరచు జిడ్డుగా మారుతుంటే, వేపాకుల పొడి, గంధం పొడి, గులాబి రేకుల పొడి సమభాగాలుగా తీసుకుని కలుపుకోవాలి. చెంచాడు పొడిలో మూడు నాలుగు చుక్కల వేపనూనె, కొద్దిగా తేనె, నిమ్మరసం పిండుకుని ముద్దలా కలుపుకోవాలి. దానిని ముఖానికి పట్టించి, అరగంటసేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది. -
Neem Tree: వేపకు మళ్లీ ఆపదొచ్చింది.. మేలుకోకపోతే వింత రోగంతో..
ఆత్మకూరు (ఎం)/యాదాద్రి భువనగిరి: వేపకు మళ్లీ ఆపదొచ్చింది. వింత రోగంతో పచ్చని వృక్షాలు మాడిపోతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లు కళ్లెదుటే మోడుబారి పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కూడా వైరస్ సోకి పెద్ద ఎత్తున చెట్లు మోడుబారాయి. గత సంవత్సరం మాదిరిగానే మళ్లీ వేప చెట్లు వైరస్‌కు గురవుతున్నాయి. వైరస్ ద్వారా తెగులు సృష్టిలో రకరకాల చెట్లు ఉన్నప్పటికీ వేపది ప్రత్యేక స్థానం. ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టుతో అనేక రకాల ప్రయోజనాలున్నాయి. అలాంటి ప్రాధాన్యం కలిగిన వేప చెట్టు ఇప్పుడు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్ బారిన పడింది. ఈ వైరస్ సోకిన చెట్ల కొమ్మలు పసుపు, గోదుమ రంగులోకి మారి ఆ తర్వాత నిర్జీవ స్థితికి చేరుతున్నాయి. ఈ వైరస్ ఒక వేప చెట్టు నుంచి మరో వేప చెట్టుకు వస్తుంది. వాడాల్సిన మందులు వైరస్ బారిన పడిన వేప చెట్లకు కార్భోలానిజిమ్ ద్రావకాన్ని ఒక గ్రాం ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పది రోజుల తర్వాత కాపర్ ఆక్సై డ్ క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతేకాకుండా వైరస్ ఆశించిన చెట్టు కొమ్మలను నరికివేయాలి. నరికిన కొమ్మలకు గోరింటాకు ముద్దగా చేసి అంటించాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. (చదవండి: వీళ్లు మనుషులేనా.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్ చేసి గుండుకొట్టించి) గత ఏడాది మొక్కుబడి చర్యలు గత ఏడాది వేప చెట్లు వైరస్ బారిన పడి ఎండిపోతుండడంతో అప్రమత్తం అయిన ప్రభుత్వం.. చెట్లను కాపాడుకునేందుకు సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి వేప చెట్లకు మందులు పిచికారీ చేయాల్సి ఉంది. మొక్కుబడిగా కొన్ని చెట్లకు మాత్రమే మందులు వేసి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. మందు పిచికారీ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది కావడంతో సర్పంచ్‌లు చేతులెత్తేశారు. దీంతో వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. (చదవండి: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా హాస్టళ్లు, లాడ్జీలు.. పోలీసుల ప్రత్యేక యాప్) ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది వేప చెట్లకు వైరస్ తీవ్ర త ఈసారి ఎక్కువగా ఉంది. తేమ శాతం అధికంగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వైరస్ సోకిన చెట్టు ఆరు నెల్లోపు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే చిగురిస్తాయి. గతంలో సర్పంచ్‌లకు చెప్పి మందు పిచికారీ చేయించాం. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. –అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి మందులు పిచికారీ చేయాలి వేప చెట్లతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. పూర్తిగా ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లు వైరస్ బారిన పడి ఎండిపోతుండడం ఆందోళన కలిగి స్తోంది. ప్రభుత్వం ముందుకొచ్చి సంరక్షణలు చర్యలు చేపట్టాలి. అధికారులకు ఆదేశాలు జారీ చేసి మందులు పిచికారీ చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే చెట్లు అంతరించే ప్రమాదం ఉంది –డి.వెంకన్న, సైన్స్ ఉపాధ్యాయుడు, ఆత్మకూరు(ఎం) అధికారులు స్పందించాలి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి వేప పుల్లతోనే దంతాలు తోముకుంటున్నా. గత ఏడాది వేప చెట్లకు వైరస్ సోకి చాలా వరకు ఎండిపోయాయి. మళ్లీ అదే మాదిరిగా ఇప్పుడు ఎండిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మొదటిసారి పూర్తిస్థాయిలో నివారణ చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వెంటనే స్పందించి చెట్లను కాపాడాలి. –బద్దం శంకర్‌రెడ్డి, రైతు, కాల్వపల్లి, ఆత్మకూరు(ఎం) మండలం -
వేపను వదలని శిలీంధ్రం
సాక్షి, హైదరాబాద్: గతేడాది వేప చెట్లను అతలాకుతలం చేసిన ఫంగస్ ఇక కొన్నేళ్లపాటు ఆ వృక్ష జాతి పాలిట ‘సీజనల్ వ్యాధి’గా కొనసాగనుంది. వచ్చే ఐదారేళ్లపాటు ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో ఆ శిలీంధ్రం ఆశించి వేప చెట్లకు నష్టం చేసే అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం తాజాగా ఈ విషయం గుర్తించింది. ఈ నెల 15 నుంచి జరిపిన పరిశోధనలో, గతేడాది తీవ్ర ప్రభావం చూపిన ఫోమోప్సిస్ అజాడిరెక్టే, ఫ్యుజేరియం అనే ఫంగస్ వేప చెట్లకు మళ్లీ ఆశించినట్టు తేల్చారు. గతేడాది ప్రభావం తీవ్రంగా ఉండగా, ఈసారి కాస్త తక్కువగా ఉంది. దాదాపు 20 శాతం చెట్లు చనిపోతాయన్న అంచనా గతేడాది వ్యక్తమైనా, చివరకు ఔషధ వృక్షంగా పేరుగాంచిన వేప తనను తాను బతికించుకుంది. అతి తక్కువ సంఖ్యలోనే చెట్లు చనిపోయాయి. ప్రభావం తీవ్రంగా ఉన్నా చివరకు ప్రమాదం నుంచి వాటంతట అవే బయపడడాన్ని చూసి శిలీంధ్రాన్ని విజయవంతంగా జయించినట్టేనని, ఇక ఆ శిలీంద్రం అంతమైనట్టేనని భావించారు. కానీ, సరిగ్గా మళ్లీ గత ఆగస్టు చివరికల్లా కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మల చివర్లు ఎండిపోవటం మొదలైంది. క్రమంగా సమస్య పెరుగుతుండటంతో ఈ నెల రెండో వారంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ ఆదేశం మేరకు డాక్టర్ సి.నరేందర్‌రెడ్డి, డాక్టర్ ఎస్జే రహమాన్, డాక్టర్ జి.ఉమాదేవి, డాక్టర్ ఎస్.హుస్సాని, డాక్టర్ ఎం.లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎం.వెంకటయ్య, డాక్టర్ బి.రాజేశ్వరి, డాక్టర్ మాధవిలతో కూడిన బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటించి వేప నమూనాలు సేకరించి యూనివర్సిటీ ల్యాబ్‌లో వారం పాటు బీఓడీ ఇంక్యుబేటర్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఫొమోప్సిస్ అజాడిరెక్టే, ఫ్యుజేరియం ఫంగస్ భారీగానే ఉన్నట్టు తేలింది. అయితే ఈసారి వాటిపై రసాయనాలు పిచికారీ చేయాల్సిన అవసరం లేదని, మళ్లీ పొడి వాతావరణం వచ్చేసరికి ఫంగస్‌ను వేప జయిస్తుందని పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ పేర్కొన్నారు. భారీ వర్షాలతోనే.. గతేడాది ఆశించిన శిలీంధ్రం పూర్తిగా మాయం కాకముందే వరసపెట్టి భారీగా కురిసిన వర్షాలతో మళ్లీ అది ఉత్తేజితం అయిందని జగదీశ్వర్ చెప్పారు. మధ్యలో దాదాపు పక్షం రోజుల పాటు పూర్తి పొడి వాతావరణం కొనసాగిన సమయంలో వీచిన గాలులకు శిలీంద్రం వాతావరణంలో కలిసి మిగతా ప్రాంతాలకు వేగంగా విస్తరించిందని పేర్కొన్నారు. అయితే దాన్ని తట్టుకునే శక్తి వేపకు ఈపాటికే వచ్చిందని, భారీ నష్టం లేకుండానే క్రమంగా అది తగ్గుముఖం పడుతుందని వివరించారు. కానీ సీజనల్ వ్యాధి మాదిరి కొన్నేళ్లపాటు వేపను ఆశించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతేడాది క్రిమినాశకాలు, శిలీంధ్ర నాశకాలను ప్రభుత్వానికి సిఫారసు చేసినప్పటికీ, ఈ సారి మాత్రం అలాంటి సిఫారసులు చేయటం లేదని తెలిపారు. నర్సరీల్లో పెంచే వేప మొక్కలకు మాత్రం మందులను పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. కార్బెండిజమ్, మాంకోజెబ్, థియామెథాక్సమ్, అసెటామాప్రిడ్లను పిచికారీ చేయొచ్చని సూచించారు. -
Ugadi 2022: విరబూసిన వేప..
-
Neem Tree: వెయ్యి జబ్బులను నయం చేసే.. వేప చెట్టుకు ఆపదొచ్చింది..
వేప చెట్టులో వెయ్యి జబ్బులను నయం చేసే గుణాలున్నాయంటారు. ఆయుర్వేదంలో ఇది లేని మందు లేదు. ఇక వేప నూనె, వేప కషాయాలను చీడపీడల నివారణకూ ఉపయోగిస్తారు. నాలుగైదు లేత వేపాకులు తింటే రక్తం శుద్ధి అవుతుందంటారు. చిన్నారులకు చెంచాడు వేప కషాయం తాపితే దగ్గు తదితర సమస్యలు బలాదూర్ అనాల్సిందే. అపర సంజీవినిగా పరిగణించే ఈ వేప చెట్లకే ఇప్పుడు ఆపదొచ్చింది. ఉన్నట్టుండి ఆకులన్నీ ఎండిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే వేలకొలది చెట్లు మోడు బారుతుండటతంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని కాపాడేందుకు అటు అటవీ శాఖ అధికారులు కానీ ఇటు అగ్రికల్చర్ అధికారులు కానీ ముందుకు రావడం లేదు. – కర్నూలు అగ్రికల్చర్/ఆత్మకూరు రూరల్ చిగురుటాకు వద్ద మొదలై.. వేప చెట్టు చిగురుటాకులు ఎండిపోతున్నాయి. క్రమంగా చెట్టుకు ఉన్న మిగతా ఆకులన్నింటికీ ఈ తెగులు వ్యాపిస్తోంది. చివరికి చెట్టు మొత్తానికి పాకి మోడుగా కళావిహీనంగా తయారవుతుంది. ఈ తెగులు కర్ణాటకలో మొదలై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలకూ విస్తరించినట్లు సమాచారం. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా వేప చెట్టు ఎండిపోయి కనిపిస్తుండటంతో భవిష్యత్‌లో వేప ఉత్పత్తులు కనుమరుగై పోయే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!) తెగులుపై భిన్నాభిప్రాయం.. వేపచెట్లు ఎండిపోతుండటంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. డై బ్యాక్ డిసీజ్ వల్లే వేప చెట్ల చిగుర్లు ఎండిపోయి చనిపోతున్నాయని కొందరు వృక్ష శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాదుకాదు ఫోమోప్సిన్ అజాడిరిక్టేట్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లే చెట్లు ఎండిపోతున్నాయని మరికొందరు చెబుతున్నారు. గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ విజృంభిస్తుందంటున్నారు. గోరింటాకు రసాన్ని వేప చెట్లపై పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించ వచ్చని చెబుతున్నారు. ఈ ఫంగస్ వ్యాప్తి చెందిన చెట్లపై ఎండిపోయిన ఆకులు, కొమ్మల్లో టీ మస్కిటో బగ్ అనే క్రిమి స్థిర నివాసం ఏర్పరుచుకుని వేప చెట్టు నిర్జీవమయ్యేలా చేస్తోందని వృక్ష శాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు. తక్కువ వయస్సు ఉన్న వేప చెట్లు ఈ తెగులు నుంచి త్వరగా కోలుకుంటుండగా కాస్త వయసైన చెట్లు ఎండిపోతున్నాయంటున్నారు. కానీ అధికారికంగా ఎవరూ ఫలానా తెగులు వల్లే చెట్లు ఎండిపోతున్నాయని కానీ, వాటి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని కానీ ప్రకటించకపోతుండటంతో వేప చెట్టు మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. -
ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!!
వ్యవసాయంలో చీడ పీడల నియంత్రణతోపాటు ఆయుర్వేదంలోనూ కీలక పాత్ర నిర్వహించే వేప చెట్టుకు పెను కష్టం వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వేప చెట్లు చిగుర్ల దగ్గర నుంచి కింది వరకు క్రమంగా నిలువునా ఎండిపోతున్నాయి. అనంతపురం, కర్నూలు తదితర రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోనూ వేపచెట్లు ఎండిపోతున్నాయని సమాచారం. మొవ్వులు, చిగుర్లు, లేత కొమ్మలు, ఆకులు ఎర్రగా మారి రాలిపోతున్నాయి. పూత, కాయలు కుళ్లిపోతున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉంటే ఎంత ముదురు చెట్టయినా కొద్ది రోజుల్లోనే చనిపోతున్నది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు పది శాతం చెట్లు చనిపోయినట్లు చెబుతున్నారు. పొలాలు, బంజరు భూముల్లోనే కాకుండా.. బెంగళూరు, హైదరాబాద్, అనంతపురం వంటి నగర, పట్టణ ప్రాంతాల్లోనూ వేప చెట్లు చనిపోతున్నాయి. కారణం ఏమిటి? ‘డై బ్యాక్ డిసీజ్’ అని కొందరు, కాదు ‘టి మస్కిటో బగ్’ వల్ల అని మరికొందరు నిపుణులు చెబుతుండటంతో స్పష్టత కరువైంది. మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్లు, పంటలను నష్టపరిచే పురుగులను వికర్షింపుజేయటంలో వేప పిండి, వేప నూనె కీలకపాత్ర నిర్వహిస్తాయి. ముఖ్యంగా సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులు ఈ తెగులుతో వేప చెట్లు ఉన్నట్టుండి చనిపోతుండటం, కాయలు కుళ్లిపోతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెగులు/పురుగు బారిన పడిన వేప చెట్టు భాగాలను తొలగించి నాశనం చేయటం ద్వారా వ్యాప్తిని అరికట్ట వచ్చని అంటున్నారు. శిలీంధ్ర నాశనులైన పురుగుమందులను చెట్లపై పిచికారీ చేయాలని కొందరు చెబుతుంటే.. ఏ శాఖ వారు పిచికారీ చేయాలన్నది సమసోయ. చెట్టు మొదటు చుట్టూ మందు కలిపిన నీటిని పోయటం ద్వారా వేపచెట్లను రక్షించుకోవచ్చని మరికొందరు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జీడిమామిడి పంటకు ఎక్కువగా టీ మస్కిటో పురుగు ఆశిస్తున్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జామ, చింత, మిరప, ఆపిల్, కోకోకూ ముప్పు ఉందట. అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృత పరిశోధనలు అవసరం వేప చెట్లకు ఈ బెడద కొత్తది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సమస్య ఎదురవుతూనే ఉందని చెబుతున్నారు. తెగులు/పురుగు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే చెట్టు చనిపోతున్నట్లు గుర్తించారు. ఒక మోస్తరుగా ఉంటే ఆ సీజన్‌కు ఆకులు ఎండిపోయినా, తర్వాత వర్షాకాలంలో మళ్లీ చిగురిస్తున్నట్లు చెబుతున్నారు. అటవీ శాఖ పరిధిలోని పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలు, జాతీయ పరిశోధనా సంస్థలు ఈ సమస్యపై ఇప్పటి వరకు దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం లేదు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల సమన్వయంతో విస్తృతంగా పరిశోధనలు జరిపి వేపను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు, రైతులు అభిప్రాయపడుతున్నారు. ‘టీ మస్కిటో బగ్’తోనే చెట్లు ఎండుతున్నాయి ►‘టీ మస్కిటో బగ్’ రాత్రిళ్లు వేప చెట్లపై చేరి రసం పీల్చటమే కారణం ►సుడి భాగం నుంచి క్రమంగా వేర్లతో సహా ఎండిపోతున్న చెట్లు అనంతపురం జిల్లా వ్యాప్తంగా వందలాది వేప చెట్లు ఎండుముఖం పడుతున్న పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 10 లక్షల సంఖ్యలో వేప చెట్లు ఉన్నాయి. అందులో ఇప్పటికే 20 శాతం చెట్లు ఎండుముఖం పట్టినట్లు అంచనా వేస్తున్నారు. టీ మస్కిటో బగ్ అనే పురుగు ఆశించడం వల్ల వేపచెట్లు ఎండుతున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఏఆర్ఎస్), కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు తెలిపారు. ‘టీ మస్కిటో బగ్’ అనే పురుగు ఆశించడం వల్ల సుడి భాగం క్రమంగా రెమ్మలు, కొమ్మలు, కాండం ఎండిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుందని తెలిపారు. టీ మస్కిటో బగ్ సగటు జీవిత కాలం 22 రోజులు. ఈ పురుగు ఉదయం, సాయంత్రం వేప చెట్లను ఆశించి రసం పీల్చడం వల్ల చెట్లు ఎండుతున్నదని అంటున్నారు. పగటి సమయం ఎక్కడైనా పొదల్లో దాక్కుని ఉంటుందని తెలిపారు. అధిక వర్షాలకు కూడా ఇలా జరుగుతుందన్నారు. ఇది నల్లటి తల, ఎర్రటి గోధుమ రంగులో ఉంటుందన్నారు. పూర్తి స్థాయి పరిశోధనలు జరగాలి సర్వరోగ నివారణిగా, పరమ పవిత్రంగా భావించే వేప చెట్లకు ఇలాంటి పరిస్థితి రావడం వల్ల రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మా కళాశాల ఆవరణలో ఉన్న వేప చెట్టు పూర్తిగా ఎండిపోయింది. దీనిపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగాలి. నివారణ చర్యలు చేపట్టాలి. సమస్య ఉన్న చెట్లపై బావిస్టన్ మందు పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. – డాక్టర్ ఎల్.నాగిరెడ్డి (90529 36150), వృక్ష శాస్త్ర సహాయ ఆచార్యులు, మాస్టర్ మైండ్స్ డిగ్రీ కళాశాల, అనంతపురం అప్పుడప్పుడు ఇంతే.. ఆందోళన వద్దు.. ‘టీ మస్కిటో బగ్’ ఆశించడం వల్ల వేప చెట్లు ఎండుతున్నాయి. అధిక వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల అప్పుడపుడు ఇది ఆశిస్తుంది. పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే 10 శాతం లోపు చెట్లు చనిపోవచ్చు. లేదంటే, చలికాలం తగ్గిన తర్వాత చెట్లన్నీ తిరిగి కొత్త చిగుర్లు వేయడం గతంలో చూశాం. ఈ పురుగు నివారణకు 2 మి.లీ. ప్రొపినోఫాస్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా 2 మి.లీ. డయోమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. – డాక్టర్ పి.రాధిక (94905 40120), ప్రధాన శాస్త్రవేత్త, కీటక శాస్త్ర విభాగం, వ్యవసాయ పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం జిల్లా గోరింటాకు ద్రావణం పిచికారీ చేయాలి సహజ ఔషధ గుణాలున్న వేప చెట్లు ‘వేప డై బాక్ వ్యాధి’ నాశనం అవుతున్నాయి. ఈ శిలీంధ్రపు వ్యాధిని మొదటగా డెహ్రాడూన్ అడవుల్లో 1997లో కనుగొన్నారు. ఇది ‘ఫామోఫ్సిస్ ఆజాడిరక్టే’ అనే శిలీంద్రం వల్ల వస్తుందని మైసూర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సతీష్, శంకర్ భట్, దేవకి గుర్తించారు. లేత చిగుళ్లు, కొమ్మలు నల్లగా మాడిపోవడం, పూలు వాడిపోవడం, కాయలు కుళ్ళి పోవటం దీని ముఖ్య లక్షణాలు. వర్షాకాలంలో ప్రారంభమై చలికాలం వరకు తీవ్రంగా ఉంటుంది. సంవత్సరం అంతా ఈ వ్యాధి ప్రబలుతూనే ఉంటుంది. దీని వల్ల నూటికి నూరు శాతం కాయలు కుళ్ళి పోతాయి. ఈ వ్యాధి వర్షం నీరు, కీటకాలు, గాలి ద్వారా వ్యాపిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేప చెట్లు చనిపోయే అవకాశం ఉంది. దీని నివారణకు గోరింటాకును ముద్దగా నూరి కొమ్మల చివర్లపై పిచికారీ చెయ్యాలి. అంతే కాక బావిస్టీన్, కాలిజిన్, మోనోక్రోటోపాస్ లాంటి శిలీంద్ర నాశక మందులు లేదా నీలగిరి నూనె, మిరియాల నూనె వంటి వాటితో కూడా తగ్గే అవకాశం వుంది. – డా. బి.సదాశివయ్య(99635 36233), వృక్ష శాస్త్ర సహాయ ఆచార్యులు, డా. బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్ల సేంద్రియ పత్తిపై శిఖరాగ్రసభ అంతర్జాతీయంగా పత్తి సాగు విస్తీర్ణంలో ఒక్క శాతం మాత్రమే సేంద్రియ పద్ధతుల్లో సాగువుతోంది. పత్తి సాగును మరింత ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియం వైపు మళ్లించి, సేంద్రియ పత్తితో తయారు చేసిన వస్త్రాలను మార్కెట్లోకి తేవటం ద్వారా రైతు ఆదాయం పెంపొందించవచ్చు. భూమి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతాయని న్యూజిలాండ్‌కు చెందిన లాభాపేక్ష లేని సంస్థ ‘ఆర్గానిక్ కాటన్ యాక్సిలరేటర్’ భావిస్తోంది. సేంద్రియ పత్తి సాగును విస్తరింపజేయడానికి ఉన్న అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు నవంబర్ 8,9 తేదీల్లో అంతర్జాతీయ శిఖరాగ్రసభను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఆసక్తి గల వారు వర్చువల్‌గా జరుగుతున్న ఈ సభలో ఉచితంగా రిజిస్టర్ చేసుకొని పాల్గొనవచ్చు.. www.organiccottonaccelerator.org ప్రకృతి వ్యవసాయంపై 6 వారాల శిక్షణ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘భూమి కాలేజి’ ప్రకృతి వ్యవసాయంపై ఔత్సాహికులకు లోతైన అవగాహన కల్పించే లక్ష్యంతో 6 వారాల పాటు ఆంగ్ల మాధ్యమంలో రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనుంది. డిసెంబర్ 6 నుంచి జనవరి 15 వరకు. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనుభవం గడించిన వారు పాఠాలు చెబుతారు. పొలాలు చూపిస్తారు. నలుగురితో కలిసి మెలసి స్వయంగా వ్యవసాయ పనులు చేయటం, ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని స్వీకరించడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఫీజు రూ. 40 వేలు. వివరాలకు.. www.bhoomicollege.org చదవండి: 65 ఏళ్ల ఎదురుచూపు.. మరణం వరకు.. అద్భుత ప్రేమ గాథ! -
ఆ చెట్లను చూస్తే.. చరిత్రను గుర్తు చేసుకోవాల్సిందే..
కందుకూరు రూరల్: కందుకూరు రెవెన్యూ కార్యాలయం ప్రాంతం చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తోంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల జరిగిన మధ్య కాలంలో ఈ భవనాల నిర్మాణం, మొక్కలు నాటినట్లు పెద్దలు చెబుతారు. అప్పట్లో ఈ ప్రాంతలో నిర్మించిన భవనాలు కూలిపోయినా ఇక్కడ మాత్రం భవన అనవాళ్లు కనిపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయం ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం ఆవరణం పెద్ద పెద్ద వేప చెట్లతో నిండి ఉంటుంది. చెట్లను చూస్తే చాలా చరిత్రను గుర్తు చేసుకోవాల్సిందే. బ్రిటిష్ వారి పరిపాలనలో ఈ చెట్లు నాటబట్టే ఇప్పుడు ఇక్కడ ఇంత నీడ ఉందని ప్రజలు చెప్పుకుంటారు. (చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!) సహజంగా కార్యాలయానికి రావాలంటే ఏదో ఒక పని ఉంటేనే వస్తుంటారు. కాని కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎప్పుడు ప్రజలతో కళకళలాడుతుంది. దీనికి కారణంగా చల్లటి నీడనిచ్చే వేపచెట్లు ఉండటం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పట్టణంతో పనులు చూసుకొని కాసేపు స్వేద తీరాలంటే ఈ చెట్ల కిందకు రావాల్సిందే. పట్టణంలో ఏ కార్యాలయం ముందు ఇంత ఖాళీ స్థలం, చెట్లు లేవు. ప్రధాన ఓవీ రోడ్డులో పక్కనే పట్టణ నడిబొడ్డులో ఈ కార్యాలయం ఉండడం ప్రజలు ఎక్కువగా ఈ చెట్ల కిందే కనిపిస్తుంటారు. అదే విధంగా తహసీల్దార్ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరినప్పటికి రూపం మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికి ఈ గదిలో పాత రెవెన్యూ రికార్డులు భద్రపరిచి ఉన్నాయి. దీంతో రెవెన్యూ కార్యాలయం ఆవరణం చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తుంది. -
రావి–వేప చెట్టుకు వివాహం.. ఎందుకో తెలుసా?
వేలూరు: కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని, యువతకు వివాహాలు జరగాలని కోరుతూ రాణిపేట జిల్లా కలవై గ్రామస్తులు గురువారం రావి–వేప చెట్టుకు వివాహం చేశారు. ముందుగా గంగమ్మ ఆలయ సమీపంలో వివాహం కోసం పంద కాల పూజలు చేసి అరటి చెట్లు, మామిడి ఆకులు తోరణాలు కట్టి ఆలయాన్ని అలంకరించారు. మేళ తాళాల నడుమ గ్రామస్తులు పెళ్లి సామగ్రిని ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అక్కడున్న రావి, వేప చెట్టుకు వివాహం చేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ 60 ఏళ్ల క్రితం తమ గ్రామం సుభిక్షంగా ఉండాలని వేప, రావి చెట్టుకు వివాహం చేసి పూజలు చేశామని తెలిపారు. ప్రస్తుతం కరోనా కారణంగా వివాహం చేసి పూజలు చేసినట్లు తెలిపారు. -
పాత వేపచెట్టు : భారీ జరిమానా
సాక్షి,హైదరాబాద్: ‘మొక్కే కదా అని పీకేస్తే...మెగాస్టార్ చిరంజీవి మూవీ ఇంద్ర సినిమాలోని డైలాగ్ గుర్తుందా.. అచ్చంగా పర్యావరణం పట్ల ఇలాగే స్పందించాడో బాలుడు. దీంతో 42 ఏళ్ల వేపచెట్టును నరికి పారేసిన వ్యక్తి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారీ వేపచెట్టును కొట్టివేసిన ఘటనను గమనించిన 8వ తరగతి ఒక విద్యార్థి అటవీ శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు జరిపిన అటవీ శాఖ అధికారులు అనుమతి లేకుండా చెట్టును నరికివేసినట్లు ధృవీకరించారు. ఇందుకు ఆ వ్యక్తికి 62,075 రూపాయల జరిమానా విధించారు. అలాగే ఈ సంఘటన గురించి తమకు సమాచారం ఇచ్చిన బాలుడికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సైదాబాద్ ప్రాంతంలో నాలుగు దశాబ్దాల నాటి పాత వేప చెట్టును నరికివేశాడు ఒకవ్యక్తి. ఇంటి నిర్మాణాకి అడ్డుగా ఉండటంతో వేరే ప్రత్యామ్నాయం వైపు ఏమాత్రం ఆలోచించలేదు. రాత్రికి రాత్రికే ఆ చెట్టును కొట్టించి, అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించడకుండా హుటాహుటిన కలపను కూడా తరలించేశారు. అయితే దీన్ని గమనించిన పిల్లవాడు అందరిలాగా తనకెందుకులే అనుకోలేదు...ఇది మామూలేలే అని అస్సలు మిన్నకుండి పోలేదు.. వెంటనే అటవీశాఖ నంబర్ 1800 425 5364కు ఫోన్ చేశాడు. చెట్టును నరికించిన వ్యక్తి, ఇందుకు సహాయం చేసిన ఇతరులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీనిపై విచారణ జరిపి, సంబంధిత వ్యక్తులపై రూ .62,075 జరిమానా విధించినట్లు హైదరాబాద్ (తూర్పు) అటవీ అధికారి వెంకటయ్య తెలిపారు. ఈ సందర్భంగా చిన్న వయసులోనే బాధ్యతాయుతంగా వ్యవహరించిన విద్యార్థిని అభినందించారు. ఒక పిల్లవాడు ఫిర్యాదుపై స్పందించి, జరిమానా విధించడం విశేషమే మరి. -
బస్సుకు ‘వేప’ తోరణం
సాక్షి, చెన్నై : ఝూమ్.. మంత్రకాళి అంటూ కరోనాను తరిమి కొట్టేందుకు కోయంబత్తూరు గాంధీపురం గ్రామస్తులు సిద్ధమయ్యారు. తమగ్రామానికి వచ్చే ఒక్కగానొక్క బస్సులో సురక్షిత ప్రయాణానికి తగ్గ ఏర్పాటు చేసుకున్నారు. బస్సును వేప ఆకుల తోరణాలతో ముంచెత్తారు. పసుపు నీళ్లు చల్లి, నిమ్మకాయల మాలవేసి మరీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో జనంలో ఆందోళన రెట్టింపవుతోంది. నగర వాసుల్లోనే కాదు, కుగ్రామాల్లోని ప్రజలను ఈ వైరస్ వణికిస్తోంది. మరోవైపు వైరస్‌ను తరిమి కొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోలో కోయంబత్తూరు శివారులో కేరళ సరిహద్దుల్లో ఉన్న కుగ్రామం గాంధీపురం వాసులు మరింత అప్రమత్తమయ్యారు. పాతకాలపు పద్ధతులు అంటూ, అమ్మ వారు వచ్చినప్పుడు, గాలి సోకినా, గ్రామాల్లో ఏదేని రుగ్మతులు సోకినప్పుడు ఏ విధంగా ఆచరిస్తారో అదే తరహాలో ముందుకు సాగారు. (కరోనా కట్టడి : లాక్డౌన్లు సరిపోతాయా?) బస్సుకు తోరణం... తమ గ్రామం అటూ కేరళ, ఇటు తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో ఆ గ్రామస్తులు ఆందోళనలో పడ్డారు. గ్రామానికి వచ్చే ఒక్కగానొక్క బస్సును గ్రామస్తులే శుభ్రం చేశారు. గ్రామం నుంచి వివిధ పనులు నిమిత్తం కోయంబత్తూరుకు వెళ్లాల్సి ఉండడంతో, ఈ బస్సే దిక్కు. తమ బస్సును శుభ్రం చేయడంతో పాటు దానికి వేపాకులతో తోరణాలు కట్టారు. బస్సు చుట్టూ, సీట్లలో వేప ఆకుల్ని వేశారు. బస్సు ముందు భాగంలో నిమ్మకాయలతో పాల, అక్కడక్కడా బస్సు లోపల నిమ్మకాయలు ఉంచారు. బస్సును పసుపు మయం చేసే విధంగా పసుపు పూయడమే కాదు, పసుపు నీళ్లు చల్చారు. పయనం చేసే వాళ్లందరూ చేతులు, కాళ్లను, పసుపు నీళ్లతో శుభ్రం చేసుకున్న అనంతరం బస్సులోకి అనుమతించారు. శనివారం సాగిన ఈ వ్యవహారానికి తగ్గ వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బస్సుల్లో ఎక్కే క్రమంలో కొందరు అయితే.. ఝూమ్.. మంత్రకాళి కరోనా... పారిపో.. అంటూ నినాదించడం గమనార్హం. (‘‘మమ’’ అనిపించారు) -
తప్పిన పెను ప్రమాదం.. నాలుగు కార్లు ధ్వంసం
సాక్షి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఒక భారీ వృక్షం నేలకొరిగిన సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారు జామున ఈ ఘటన జరగటంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ వేప వృక్షం నేలకొరిగి పార్కింగ్ చేసిన కార్లపై పడటంతో నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. ధ్వంసమైన వాటిలో ఒకటి ఆడి కార్ కాగా రెండు హోండా సిటీ, ఒక సాంత్రో కారు ఉన్నాయి. వేప చెట్టుకు వందేళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. -
రావిచెట్టు, వేపచెట్టుకు పెళ్లి
తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మ ండలంలోని హైదర్‌సాయిపేట తూర్పుతండా లో ఆదివారం తెల్లవారుజామున రావిచెట్టు, వేపచెట్టుకు పెళ్లి చేశారు. తూర్పుతండాకు చెం దిన బానోతు గోపి ఇంట్లో రావిచెట్టు, వేప చె ట్టు పక్కపక్కనే పెరిగి వృక్షాలుగా మారాయి. ఆ రెండు ఒకే చోట ఉంటే వాటికి పెళ్లి జరిపిస్తే కుటుంబానికి శుభం కలుగుతుందని పురోహితులు చెప్పారు. దీంతో తెల్లవారుజామున బా నోతు గోపి, సక్కుబాయి దంపతులు, మేళతాలలు, పురోహితుడి వేదమంత్రోచ్ఛరణల మద్య వివాహం జరిపించారు. మనుషులకు క్ర తువు ఎలా నిర్వహిస్తారో అలాగే ఈ వివాహం జరిపించారు. -
భారతీయ సంస్కృతిలో విడదీయరాని భాగం
భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా పూజిస్తారు. వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కొనియాడుతోంది. అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు. వేపచెట్టు కలపను తలుపులు, కిటికీలు తయారు చేయటానికి వాడుతారు. వారానికి ఒకసారి పరగడుపున 7 నుంచి 8 వేప చిగుళ్లు నూరి ఉండ చేసి మింగి, పావుకప్పు పెరుగు సేవిస్తుంటే కడుపు, పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి. వేపచిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. ఒక వారంపాటు ఉదయం పరగడుపునే 5 వేపాకులు, 5 మిరియాలు కలిపి నమిలి మింగుతూ ఉంటే వివిధ రకాల అంటువ్యాధులు రాకుండా రక్షణనిస్తుంది. వేపపువ్వును ఆంధ్రులు, కన్నడిగులు, మహారాష్ట్రులు ఉగాది పచ్చడిలో చేదు రుచికోసం వాడతారు. వేపచెట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా ఎంపికయింది. వేపగాలి పీల్చని, వేపపుల్లతో పళ్లు తోమని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని గ్రామాలలో వేపచెట్టుని దైవంగా భావించి ప్రతి శుభకార్యంలోనూ మొదటగా వేపచెట్టునే పూజిస్తారు. ఇలా వేపచెట్టు మన సంస్కృతిలో ఒక ప్రధాన భాగమయింది. -
ఏపీకి చిహ్నాలు ఖరారు చేసిన ప్రభుత్వం
-
రాష్ట్ర వృక్షంగా వేప
రాష్ట్ర చిహ్నాలపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నాలుగేళ్ల తర్వాత వాటిని గుర్తించింది. వృక్షంగా వేపచెట్టును, పుష్పంగా మల్లెను, జంతువుగా కృష్ణ జింకను, పక్షిగా రామచిలుకను గుర్తిస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాక్షి, అమరావతి: వేద కాలం నుంచి పూజలందుకుంటూ, పుష్కలమైన ఔషధ గుణాలు కలిగిన వేపచెట్టును ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా నిర్ణయించింది. విభజన నేపథ్యంలో నాలుగేళ్ల తరువాత రాష్ట్రానికి ప్రత్యేక చిహ్నాలు ఖరారు చేసింది. వేపచెట్టును దేవతా స్వరూపంగా భావించి పూజించే సంప్రదాయం అనేక ప్రాంతాల్లో ఉంది. ఉగాది పర్వదినాన తెలుగువారికే ప్రత్యేకమైన ఉగాది పచ్చడిలో వేప పువ్వును ఉపయోగిస్తారు. వేప గింజల నుంచి తీసే నూనెను సబ్బులు, షాంపూలు, క్రీమ్స్‌లో ఉపయోగిస్తారు. వేప చెట్టులోని వివిధ భాగాలను ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. చర్మవ్యాధులకు వేపాకుతో చేసిన లేపనం దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీని శాస్త్రీయ నామం అజాడిరక్త ఇండిక. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అటవీ పర్యావరణ శాఖ వేపను రాష్ట్ర వృక్షంగా ఖరారు చేసింది. పొడవాటి మెలికలు తిరిగిన కొమ్ములతో శరీరంపై వివిధ వర్ణాల మచ్చలతో చూడటానికి అందంగా కనిపించే కృష్ణ జింకను ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా నిర్ణయించింది. దీని శాస్త్రీయ నామం ఏంటిలోప్ సెర్వికాప్రా. ప్రాచీన హిందూ పురాణాల్లో కృష్ణజింక చంద్రుని వాహనంగా చెప్పబడింది. అయితే ప్రస్తుతం ఇది అంతరించిపోయే జంతువుల జాబితాలో ఉంది. పెంపుడు పక్షిగా మనిషికి అత్యంత సన్నిహితంగా ఉండే రామచిలుకను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేసింది. శుభకార్యాలనగానే గుర్తుకొచ్చే, సువాసనలు వెదజల్లే మల్లె పువ్వును రాష్ట్ర పుష్పంగా ఖరారు చేసింది. ఈమేరకు అటవీ, పర్యావరణ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి జూన్ నాలుగో తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. -
ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఇవే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేసింది. వేప చెట్టును రాష్ట్ర వృక్షంగా, కృష్ణ జింకను రాష్ట్ర జంతువుగా, రామ చిలుకను రాష్ట్ర పక్షిగా, మల్లె పువ్వును రాష్ట్ర పుష్పంగా గుర్తిస్తూ అటవీ శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండేది. దాని స్థానంలో రామ చిలుకను రాష్ట్ర పక్షిగా గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. -
వేప కొమ్మల కోసం....
నెల్లిమర్ల రూరల్ : మండలంలో బొప్పడాం ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు వేపకొమ్మల కోసం పాఠశాలలో చదువుతున్న చిన్నారిని ప్రమాదకరంగా చెట్టు ఎక్కించారు. ఆ విద్యార్థి చెట్టునైతే ఎక్కగలిగాడు గానీ దిగేసరికి ఆపసోపాలు పడ్డాడు. ఈ దృశ్యం సాక్షి కెమోరాకు సోమవారం చిక్కింది. కార్పొరేట్‌కు పోటీగా ప్రభుత్వ విద్యను అందిస్తున్నామని ఓ వైపు చెబుతున్న ప్రభుత్వం పాఠశాలలో పిల్లలతో అంత పెద్ద వృక్షాన్ని కేవలం వేపకొమ్మల కోసం ఎక్కించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రమాదవశాత్తు ఆ విద్యార్థి అదుపు తప్పితే బాధ్యత ఎవరు వహిస్తారు? బొప్పడాం ప్రధాన రహదారి పక్కన పాఠశాల ఉండటంతో పలువురు ఈ దృశ్యాన్ని చూశారు. సంబంధిత ఉపాధ్యాయుడిని సాక్షి వివరణ కోరగా పాఠశాలలో బియ్యం పాడవ్వకుండా ఉండేందుకు వేపకొమ్మలను తీసుకురమ్మని విద్యార్థికి చెప్పానని తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. -
వేపచెట్టు నుంచి..పాలు
బరంపురం: గంజాం జిల్లాలోని కళ్లికోట్ ప్రాంతంలో వేపచెట్టు నుంచి రెండురోజులుగా ఏకధాటిగా పాలు కారుతున్న దృశ్యం స్థానికులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్లికోట్ బ్లాక్ పరిధి డిమిరియా పంచాయతీలోని పొలుదుపల్లి గ్రామ శివారు ఒక పొలంలో వేపచెట్టు నుంచి రెండు రోజులుగా పాలు కారుతున్నాయి. మంగళవారం ఉదయం పొలం పనికి వెళ్లిన సుదర్శన్ నాయక్ దీన్ని చూసి ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. దీంతో ఆనోటా ఈనోటా విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు తండోపతండాలుగా చేరుకున్నారు. మరి కొంత మంది మహిళలు పసుపు, కుంకుమలతో భక్తి శ్రద్ధలతో వేపచెట్టుకు పూజలు చేశారు. -
వేప చెట్టుకు సీతాఫలం!
మహబూబ్‌నగర్ రూరల్: ఓ వేప చెట్టుకు సీతాఫలం కాసింది. మహబూబ్ నగర్ రూరల్ మండలం ఫతేపూర్‌లో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న వేప చెట్టుకు సీతాఫలం కాయ కాసింది. దీన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. -
వేపచెట్టుకు దబ్బకాయ
-
వేపచెట్టుకు దబ్బకాయ..
-
తండోప తండాలుగా.... తరలినారు చూడు
భువనేశ్వర్: అది చల్లటి నీడనిచ్చే వేప చెట్టు. మొన్నటి వరకు కళ్లు నులుముకొని చూసినా అక్కడ ఎవరూ కనిపించే వారు కాదు. ఇప్పుడు లక్షలాది మంది జనం మధ్య అది పులకించి పోతోంది. దేశంలోని దారులన్నీ అటే దారి తీస్తున్నాయి. తండోప తండాలుగా జనం తరలి వస్తూ ఆ చెట్టును దర్శించుకొని తన్మయత్నంలో తాదామ్యం చెందుతున్నారు. అందుకు కారణం....12వ శతాబ్దంనాటి పూరి జగన్నాథ ఆలయంలో జూన్‌లో జరుగనున్న ఉత్సవం కోసం భగవాన్ సుదర్శనుడి విగ్రహాన్ని తయారు చేయడం కోసం ఆ చెట్టును ఎంపిక చేయడమే. జగన్నాథ ఆలయం ఆనవాయితీ ప్రకారం జూన్ నెలలో జరిగే ఉత్సవం కోసం నవకళావర్ పేరిట పూరి జగన్నాథుడు, దేవి సుభద్ర, బలభద్రుడు, సుదర్శనుడి విగ్రహాలను కొత్తవి చేయిస్తారు. అందుకు నలుగురి దేవతా విగ్రహాల కోసం నాలుగు పవిత్రమైన వేప చెట్లను ఎంపిక చేస్తారు. ముందుగా సుదర్శనుడి కోసం, తర్వాత బలభద్రుడి కోసం, ఆ తర్వాత దేవి సుభద్ర కోసం, చివరన జగన్నాథుడి కోసం పవిత్ర చెట్లను ఎంపిక చేస్తారు. ఒకే చెట్టులో శంఖం, చక్రం, గధ, పద్మం ఆకృతులు కనిపిస్తేనే ఆ చెట్టును ఈ దేవతల విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగానే ముందుగా సుదర్శనుడి విగ్రహం కోసం భువనేశ్వర్‌కు పది కిలోమీటర్ల దూరంలోవున్న గడకుంటాయక్ గ్రామంలోని ఓ వేప చెట్టును ఆదివారం నాడు ఆలయ నిర్వాహకులు ఎంపిక చేశారు. ఈ సమాచారం నలు దిశలా వ్యాపించడంతో ప్రతి దిక్కు నుంచి భక్తజనం తరలి వస్తున్నారు. పూజాది కార్యక్రమాలు నిర్వహించి పులకించి పోతున్నారు. ఈ చెట్టుకు మరో విశేషం కూడా ఉంది. 1999లో ఒరిస్సాలో బీభత్సం సృష్టించిన పెను తుపాను తాకిడికి కూడా ఇది చెక్కు చెదరలేదు. తన రూపాన్ని సంతరించుకోబోతున్న ఆ చెట్టును ఆ భగవంతుడే రక్షించి ఉంటాడని ఓ భక్తురాలి వ్యాఖ్యానం. సాక్షాత్తు దైవ స్వరూపం సంతరించుకోనున్న ఆ పవిత్ర వేపచెట్టును కడసారి దర్శించుకునే భాగ్యాన్ని దక్కించుకునేందుకు వస్తున్న అశేష భక్తులకు ఎలాంటి భద్రతాపరమైన చిక్కులు ఏర్పడకుండా చూసేందుకు ఏకంగా 24 బెటాలియన్ల పోలీసులను ఏర్పాటు చేశారు. దైవ కృతుల కోసం ఏతెంచిన పూజారులకు అవసరమైన వసతి ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. గడకుంటాయక్ గ్రామానికి, పవిత్రమైన వేపచెట్టున్న ప్రాంతానికి 24 గంటలపాటు విద్యుత్, నీటి సరఫరాలు చేస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. ఇక బల భద్రుడు, దేవి సుభద్ర, జగన్నాథుడి విగ్రహాల కోసం పవిత్ర చెట్లను వారం రోజుల్లో ఎంపిక చేస్తామని పూరి జగన్నాథ ఆలయం ప్రధాన పాలనాధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి సురేశ్ చంద్ర మహాపాత్ర తెలిపారు. ఇలా ఎంపిక చేసిన చెట్లను మహాదారు అని పిలుస్తారు.