తప్పిన పెను ప్రమాదం.. నాలుగు కార్లు ధ్వంసం | Big Neem Tree Fell Down On Four Cars In Nizamabad | Sakshi
Sakshi News home page

తప్పిన పెను ప్రమాదం.. నాలుగు కార్లు ధ్వంసం

Published Sat, Jul 14 2018 2:23 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Big Neem Tree Fell Down On Four Cars In Nizamabad - Sakshi

వర్షాలకు నేలకొరిగిన వందేళ్ల చరిత్ర కల్గిన వేప వృక్షం

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమీపంలో ఒక భారీ వృక్షం నేలకొరిగిన సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారు జామున ఈ ఘటన జరగటంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ వేప వృక్షం నేలకొరిగి పార్కింగ్‌ చేసిన కార్లపై పడటంతో నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. ధ్వంసమైన వాటిలో ఒకటి ఆడి కార్‌ కాగా రెండు హోండా సిటీ, ఒక సాంత్రో కారు ఉన్నాయి. వేప చెట్టుకు వందేళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ధ్వంసమైన కార్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement