Big tree
-
ఈ చెట్టుని కోతులు కూడా ఎక్కలేవు! ఎందుకో తెలుసా?
కోతులు ఏ చెట్టు మీదకైనా ఇట్టే ఎక్కేస్తాయి. ఈ చెట్టు మీద మాత్రం కోతులు అడుగుపెట్టవు. దీనిని ‘శాండ్బాక్స్ ట్రీ’ అంటారు. దీని కాండం నిండా పదునైన విషపు ముళ్లు ఉంటాయి.దాదాపు రెండువందల అడుగు ఎత్తు వరకు పెరిగే ఈ చెట్ల ఆకులు రెండడుగుల పరిమాణంలో ఉంటాయి. ఈ చెట్లకు చిన్నసైజు గుమ్మడికాయల వంటి కాయలు కాస్తాయి. ఇవి పూర్తిగా పండిపోయాక పేలిపోతాయి. ఈ పండ్ల పేలుడు ధాటికి వాటి నుంచి గింజలు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తాయి. ఈ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లోని తడినేలల్లో పెరుగుతాయి.ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా.. -
పచ్చని చెట్టు పొట్టన పెట్టుకుంది
ఖానాపూర్: జలపాతం చూసేందుకు మిత్రులంతా కలిసి బయల్దేరిన విహార యాత్ర విషాద యాత్రగా మారింది. వారు ప్రయాణిస్తున్న వాహనంపై చెట్టు కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన 12 మంది మిత్రులు ఆదిలాబాద్ జిల్లా నేరెడుగొండ మండలం కుంటాల జలపాతాన్ని చూసేందుకు టాటా మ్యాజిక్ వాహనంలో ఉదయం బయల్దేరారు. ఖానాపూర్ మండలం ఎక్బాల్‌పూర్ వద్దకు రాగానే వీరి వాహనంపై రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం కూలింది. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్‌తో కలిపి 13 మంది ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్ వంతడుపుల బుచ్చిరాం (49), ఉట్నూర్ రవి (35) అక్కడికక్కడే మృతి చెందారు. పందిరి నిఖిల్‌కు తీవ్రంగా, మిగిలిన పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాహనం మధ్యలో చెట్టు పడి ఉంటే ప్రాణనష్టం ఇంకా ఎక్కువ జరిగేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పిన పెను ప్రమాదం.. నాలుగు కార్లు ధ్వంసం
సాక్షి, నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఒక భారీ వృక్షం నేలకొరిగిన సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారు జామున ఈ ఘటన జరగటంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ వేప వృక్షం నేలకొరిగి పార్కింగ్ చేసిన కార్లపై పడటంతో నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. ధ్వంసమైన వాటిలో ఒకటి ఆడి కార్ కాగా రెండు హోండా సిటీ, ఒక సాంత్రో కారు ఉన్నాయి. వేప చెట్టుకు వందేళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. -
సాగర తీరం.. సుందర దృశ్యం
ఒక్కొక్కసారి ప్రకృతిలో ప్రతిచర్య మనిషిని ఆహ్లాదానికి గురి చేస్తుంటాయి. చినమైనవానిలంకలో సముద్ర తీరానికి ఒక భారీ వృక్షం కొట్టుకు వచ్చింది. స్థానిక శిథిల తుపాను భవనం సముద్ర గర్భంలో కలిసిన ప్రాంతంలో ఆ వృక్షం పడి ఉంది. సందర్శకులకు ఈ దృశ్యం ఆనందం కలిగిస్తుండటంతో పలువురు పర్యాటకులు ఈ సుందర దృశ్యాన్ని కెమేరాల్లో బంధిస్తున్నారు. – నరసాపురం రూరల్ -
వృక్షరాజాన్ని బతికించాలని..
వృక్షో రక్షతి రక్షితః.. అంటే చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని దీని అర్థం. అందుకే తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ యువకులు 120 సంవత్సరాల వయసున్న ఈ మర్రి చెట్టును బతికించేందుకు శనివారం తీవ్రంగా కృషి చేశారు. గ్రామంలోని రెడ్ల బజారు రామమందిరం సమీపంలో ఉన్న ఈ చెట్టు నేలకొరగడంతో ఉండవల్లి సెంటర్ నుంచి క్రేన్, పొక్లెయిన్ తెప్పించి చెట్టును తిరిగి అదే స్థానంలో భారీ గొయ్యి తీసి నిలబెట్టారు. బరువు తగ్గించేందుకు చెట్టు కొమ్మలు నరికేశారు. అనంతరం మూడు ట్యాంకర్ల నీరు తెప్పించి నీళ్లు పోశారు. – ఉండవల్లి (తాడేపల్లి రూరల్)