కందుకూరు రూరల్: కందుకూరు రెవెన్యూ కార్యాలయం ప్రాంతం చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తోంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల జరిగిన మధ్య కాలంలో ఈ భవనాల నిర్మాణం, మొక్కలు నాటినట్లు పెద్దలు చెబుతారు. అప్పట్లో ఈ ప్రాంతలో నిర్మించిన భవనాలు కూలిపోయినా ఇక్కడ మాత్రం భవన అనవాళ్లు కనిపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయం ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం ఆవరణం పెద్ద పెద్ద వేప చెట్లతో నిండి ఉంటుంది. చెట్లను చూస్తే చాలా చరిత్రను గుర్తు చేసుకోవాల్సిందే. బ్రిటిష్ వారి పరిపాలనలో ఈ చెట్లు నాటబట్టే ఇప్పుడు ఇక్కడ ఇంత నీడ ఉందని ప్రజలు చెప్పుకుంటారు. (చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!)
సహజంగా కార్యాలయానికి రావాలంటే ఏదో ఒక పని ఉంటేనే వస్తుంటారు. కాని కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎప్పుడు ప్రజలతో కళకళలాడుతుంది. దీనికి కారణంగా చల్లటి నీడనిచ్చే వేపచెట్లు ఉండటం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పట్టణంతో పనులు చూసుకొని కాసేపు స్వేద తీరాలంటే ఈ చెట్ల కిందకు రావాల్సిందే. పట్టణంలో ఏ కార్యాలయం ముందు ఇంత ఖాళీ స్థలం, చెట్లు లేవు. ప్రధాన ఓవీ రోడ్డులో పక్కనే పట్టణ నడిబొడ్డులో ఈ కార్యాలయం ఉండడం ప్రజలు ఎక్కువగా ఈ చెట్ల కిందే కనిపిస్తుంటారు. అదే విధంగా తహసీల్దార్ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరినప్పటికి రూపం మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికి ఈ గదిలో పాత రెవెన్యూ రికార్డులు భద్రపరిచి ఉన్నాయి. దీంతో రెవెన్యూ కార్యాలయం ఆవరణం చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment