
వేప–రాగి చెట్టుకు పెళ్లి చేస్తున్న గ్రామస్తులు
వేలూరు: కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని, యువతకు వివాహాలు జరగాలని కోరుతూ రాణిపేట జిల్లా కలవై గ్రామస్తులు గురువారం రావి–వేప చెట్టుకు వివాహం చేశారు. ముందుగా గంగమ్మ ఆలయ సమీపంలో వివాహం కోసం పంద కాల పూజలు చేసి అరటి చెట్లు, మామిడి ఆకులు తోరణాలు కట్టి ఆలయాన్ని అలంకరించారు.
మేళ తాళాల నడుమ గ్రామస్తులు పెళ్లి సామగ్రిని ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అక్కడున్న రావి, వేప చెట్టుకు వివాహం చేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ 60 ఏళ్ల క్రితం తమ గ్రామం సుభిక్షంగా ఉండాలని వేప, రావి చెట్టుకు వివాహం చేసి పూజలు చేశామని తెలిపారు. ప్రస్తుతం కరోనా కారణంగా వివాహం చేసి పూజలు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment