
సాక్షి, విజయనగరం: నాలుగు రాష్ట్రాల డీజీపీలు మంగళవారం ఉదయం రహస్యంగా సమావేశమయ్యారు. విజయనగరంలోని ఓ రిసార్టులో ఈ సమావేశం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల డీజీపీలు విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో గల ఓ ప్రైవేటు రిసార్టులో సమావేశమయ్యారు. అలాగే ఈ సమావేశానికి బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
నాలుగు రాష్ట్రాలు, వాటి సరిహద్దులోగల మావోయిస్టుల అణిచివేత, సాగర తీర భద్రతపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కాగా... వీరి సమావేశాన్ని పోలీస్ శాఖ అత్యంత గోప్యంగా ఉంచింది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంపై చర్చించనుండడంతో సమావేశాన్ని రహస్యంగా ఉంచినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment