సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన డీజీపీలు మహేంద్ర రెడ్డి, లోకనాధ్ బెహ్రా, జేకే త్రిపాఠి, ప్రవీణ్ సుద్.. పోలీస్ శాఖలోని వివిధ భాగాల అధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, కోవిడ్ నియంత్రణలో రాష్ట్రాల మధ్య సమన్వయం, తీరప్రాంత గస్తీ, మనుషుల అక్రమ రవాణాలపై చర్చించారు.
చెన్నై, కోల్‌కత్తా కేంద్రంగా కృష్ణా, అనంతపురం, ఉభయగోదావరి జిల్లాల మనుషుల అక్రమ రవాణా అరికట్టేందుకు సహకరించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇతర రాష్ట్రాల డీజీపీలను కోరారు. ఏపీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో గురించి వివరించారు. ఎస్‌ఈబీ ఏర్పాటుతో ఏడువారాల్లో 20 వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్ వెల్లడించారు. చదవండి: ‘మేలు మరిచిపోలేం..రుణపడి ఉంటాం’
Comments
Please login to add a commentAdd a comment