DGPs meeting
-
బోర్డర్లో రెచ్చిపోతున్న చైనా.. నివేదికలో పలు సంచలన అంశాలు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద డ్రాగన్ దేశం చైనా రెచ్చిపోతోంది. డ్రాగన్ సైన్యం భారత భూభాగంలోకి క్రమంగా చొచ్చుకొస్తూ సరిహద్దును సైతం మార్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన డీజీపీల సమావేశంలో చైనా వ్యవహారంపై అధికారులు సమర్పించిన ఓ నివేదికలో పలు సంచలన అంశాలు బహిర్గతమయ్యాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో భారత్–చైనా సైనికుల నడుమ మరిన్ని ఘర్షణలు జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనాన్ని వెలువరించింది. భారత్–చైనాల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలు, నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ‘‘2013–14 తర్వాత రెండు మూడేళ్లకోసారి ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతల తీవ్రత పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సరిహద్దులో ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక బలగాలను పెంచుకుంటున్నాయి. చైనా చర్యల వల్ల తూర్పు లద్దాఖ్‌లో భారత్ ఇప్పటికే పలు కీలక గస్తీ పాయింట్లను కోల్పోయింది. చైనా దూకుడును అడ్డుకోవాలంటే సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలి. సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అని సూచించారు. -
ఏపీ పోలీసు శాఖకు అరుదైన గౌరవం
విజయవాడ : ఏపీ పోలీసు శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ప్రజలపై విశ్వాసం. సమర్థత, నిజాయితీలో దేశంలోనే ఏపీకి మొదటిస్థానం వరించింది. ఈ విషయాన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు రోజుల పాటు జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ఏపీకి ప్రథమ స్థానం లభించడంపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్మోహన్రెడ్డిలు ప్రశంసించారు. -
దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం
సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన డీజీపీలు మహేంద్ర రెడ్డి, లోకనాధ్ బెహ్రా, జేకే త్రిపాఠి, ప్రవీణ్ సుద్.. పోలీస్ శాఖలోని వివిధ భాగాల అధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, కోవిడ్ నియంత్రణలో రాష్ట్రాల మధ్య సమన్వయం, తీరప్రాంత గస్తీ, మనుషుల అక్రమ రవాణాలపై చర్చించారు. చెన్నై, కోల్కత్తా కేంద్రంగా కృష్ణా, అనంతపురం, ఉభయగోదావరి జిల్లాల మనుషుల అక్రమ రవాణా అరికట్టేందుకు సహకరించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇతర రాష్ట్రాల డీజీపీలను కోరారు. ఏపీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గురించి వివరించారు. ఎస్ఈబీ ఏర్పాటుతో ఏడువారాల్లో 20 వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్ వెల్లడించారు. చదవండి: ‘మేలు మరిచిపోలేం..రుణపడి ఉంటాం’ -
సాయుధ బలగాల సంక్షేమానికి తోడ్పడండి
పుణె: సాయుధ బలగాల సంక్షేమానికి ప్రజలు తోడ్పడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శనివారం పుణేలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అక్కడే ఆయన 2016లో నగ్రోటా ఉగ్రదాడిలో నేలకొరిగిన మేజర్ కునాల్ గోసావి భార్య, కుమార్తెలతో మాట్లాడారు. అనంతరం ఫ్లాగ్ డే కార్యక్రమానికి సంబంధించిన 57 నిమిషాల వీడియోను ప్రధాని ట్విట్టర్లో విడుదల చేశారు. ‘ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా అత్యుత్తమ ధైర్య సాహసాలు చూపుతున్న సాయుధ బలగాలకు, వారి కుటుంబాలకు నా సెల్యూట్. మన బలగాల సంక్షేమానికి మీరు కూడా సాయం అందించాల్సిందిగా కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ డైరెక్టర్ జనరళ్లు, ఇన్స్పెక్టర్ జనరళ్ల జాతీయ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చిలో జరిగిన ఈ సదస్సుకు హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సు ఆదివారంతో ముగియనుంది. -
రిసార్టులో పోలీసు బాస్‌లు
సాక్షి, విజయనగరం: నాలుగు రాష్ట్రాల డీజీపీలు మంగళవారం ఉదయం రహస్యంగా సమావేశమయ్యారు. విజయనగరంలోని ఓ రిసార్టులో ఈ సమావేశం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల డీజీపీలు విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో గల ఓ ప్రైవేటు రిసార్టులో సమావేశమయ్యారు. అలాగే ఈ సమావేశానికి బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. నాలుగు రాష్ట్రాలు, వాటి సరిహద్దులోగల మావోయిస్టుల అణిచివేత, సాగర తీర భద్రతపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కాగా... వీరి సమావేశాన్ని పోలీస్ శాఖ అత్యంత గోప్యంగా ఉంచింది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంపై చర్చించనుండడంతో సమావేశాన్ని రహస్యంగా ఉంచినట్టు సమాచారం. -
నైపుణ్యాభివృద్ధి అవసరం
పోలీసులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి డీజీపీ, ఐజీపీల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ విధి నిర్వహణలో ప్రతిభ చూపిన నిఘా అధికారులకు పతకాలు ప్రదానం ‘మీకు అందుబాటులో భారత పోలీసులు’ యాప్ ఆవిష్కరణ సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లిన మోదీ గంటన్నర పాటు నిరీక్షించిన గవర్నర్, సీఎం ప్రధానితో పది నిమిషాలు చర్చ.. ఘనంగా వీడ్కోలు సాక్షి, హైదరాబాద్: పోలీసులు చురుకైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని, శిక్షణలో భాగంగా ఈ ప్రక్రియ జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మానవ మనస్తత్వం, ప్రవర్తనా మనోవిజ్ఞాన నైపుణ్యం శిక్షణలో కీలకాంశాలుగా ఉండాలని చెప్పారు. వాటితోపాటు నాయకత్వ నైపుణ్య స ముపార్జన ఎంతో ప్రధానమని, పోలీసు సిబ్బందిలో ఈ నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత సీనియర్ అధికారులదేనని స్పష్టం చేశారు. డీజీపీ, ఐజీపీల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి జాతీయ పోలీసు అకాడమీలో బస చేసిన ఆయన... శనివారం తెల్లవారుజామున యోగాతో తన కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం అకాడమీలో జరిగిన డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. డీజీపీలు, ఐజీపీల వార్షిక సదస్సు నిర్వహణ విధానంలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనుభవాలను పంచుకునేందుకు ఇదో చక్కని వేదికగా మారిందని, తద్వారా విధాన రూపకల్పనకు అవసరమైన సమాచారం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కార్యాచరణలోని అంశాల వారీగా నిర్దిష్ట ఫలితాలు రాబట్టాల్సిన అవసరం ఉందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు మేధస్సు, ప్రత్యక్ష గస్తీకి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఉత్తమ శిక్షణ ద్వారా పోలీసు బలగాల్లో గుణాత్మక మార్పు తేవాలని ప్రధాని పిలుపునిచ్చారు. నిరంతర ప్రగతి కోసం సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవ సామర్థ్యం మేళవింపు పోలీసు బలగాలకు ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా ‘మీకు అందుబాటులో భారత పోలీసులు (Indian Police at Your Call)’అనే యాప్‌ను మోదీ ఆవిష్కరించారు. అనంతరం విధి నిర్వహణలో విశేష ప్రతిభ చూపిన నిఘా విభాగం అధికారులను పోలీసు పతకాలతో సత్కరించారు. అంతకుముందు జాతీయ పోలీసు అకాడమీలోని అమర వీరుల స్మారకం వద్ద ప్రధాని పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి మొక్కను నాటారు. ముంబై ఉగ్రదాడిని స్మరించుకున్న ప్రధాని ‘‘ఈ రోజు నవంబర్ 26. ముంబై నగరంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన రోజు. ఆ ఉగ్ర దాడిని తిప్పికొట్టడంలో పోలీసులు అసమాన ధైర్య సాహసాలు చూపారు. విధి నిర్వహణలో భాగంగా దేశంలో ఇప్పటి వరకు 33 వేల మంది పోలీసులు అమరులయ్యారు..’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, హాన్సరాజ్ అహీర్, పోలీసు అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణ, వివిధ రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు పాల్గొన్నారు. ఘనంగా వీడ్కోలు డీజీపీల సదస్సులో పాల్గొని, తిరిగి ఢిల్లీకి బయలుదేరిన ప్రధాని మోదీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5.40 గంటలకే మోదీ బయలుదేరాల్సి ఉంది. కానీ ఆలస్యంగా సాయంత్రం 6.45 గంటలకు మోదీ విమానాశ్రయానికి చేరుకున్నారు. మోదీని కలిసేందుకు సాయంత్రం 5.30 గంటలకు ముందే విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మంత్రులు, నేతలు దాదాపు గంటన్నర పాటు వేచి చూశారు. ప్రధాని రాగానే గవర్నర్, సీఎంలతో పాటు మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు ఈటల, కేటీఆర్, హరీశ్‌రావు, పోచారం, నారుుని, తలసాని, మహేందర్‌రెడ్డి, పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, కేకే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రామచంద్రరావు, రాజాసింగ్, నేతలు నాగం, దినేశ్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ తదితరులు కలిశారు. 10 నిమిషాలు చర్చ! విమానాశ్రయంలో ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రధానికి కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కరెన్సీ కొరత తీవ్రంగా ఉందని, వెంటనే బ్యాంకులకు, ఏటీఎంలకు కొత్త నోట్లను సరఫరా చేయాలని కోరినట్లు సమాచారం. నోట్ల రద్దుకు నిరసనగా 28న విపక్షాలు తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌కు తాము దూరంగా ఉంటున్నామని ప్రధానికి వివరించినట్లు తెలిసింది. అనంతరం 7.10 గంటల సమయంలో మోదీ వాయుసేన విమానంలోకి ఢిల్లీకి బయలుదేరారు. భద్రతా లోపాలపై మందలింపు! శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వచ్చిన సమయంలో కాన్వాయ్ సమీపం వరకు మీడియాతో పాటు సాధారణ వ్యక్తులు కూడా రావడంపై స్థానిక పోలీసులు, భద్రతాధికారులను ప్రధాని భద్రతా బృందం మందలించినట్లు సమాచారం. వీఐపీ గేటుకు సమీపంలోనే మరో గేటు ఉండడం, అక్కడ ఎలాంటి భద్రత లేకపోవడాన్ని ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. దీంతో శనివారం సాయంత్రం పోలీసులు వీఐపీ గేటు సమీపంలోని గేటును పూర్తిగా మూసి వేసి, మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. -
అమరులైన పోలీసులకు ప్రధాని మోదీ నివాళి
హైదరాబాద్ : రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోదీ అకాడమీ ఆవరణలో మొక్కను నాటారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఐపీఎస్ అధికారుల స్మృతి వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించి..వారి సేవలను ఆయన కొనియాడారు. ఇండియన్ పోలీస్ మొబైల్ యాప్(ఇండియన్ పోలీసు ఎట్ యువర్ కాల్)ను ప్రధాని ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల సదస్సులో మోదీ పాల్గొని ఐబీ ఆఫీసర్లకు పోలీసు మెడల్స్ అందజేశారు. -
25న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 25న(శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. 26న రాజేంద్రనగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమిలో అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అదే రోజు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్తారు. దేశవ్యాప్తంగా కరెన్సీ కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గత శనివారం ఎన్ఎస్జీ అధికారులు భద్రతా ఏర్పాట్లుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. -
డీజీపీ సదస్సుకు ప్రధాని మోదీ !
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్ అకాడమిలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరగనున్న అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సులో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరెన్సీ కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా శనివారం ఎన్ఎస్జీ అధికారులు భద్రతా ఏర్పాట్లుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. -
పోలీసులపై చిత్ర పరిశ్రమ దుష్ప్రచారం తగదు: మోదీ
న్యూఢిల్లీ: సినీరంగం.. సామాన్యుల దృష్టిలో పోలీసుల పట్ల చెడు అభిప్రాయం కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సినీ ప్రముఖలతో సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల త్యాగాల గురించి తెలియజేస్తామని చెప్పారు. ఆదివారం మోదీ గౌహతిలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సుకు హాజరయ్యారు. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక విధి నిర్వహణలో 33 వేలమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. భద్రత వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండవచ్చని, మంచిని వదిలి చెడు గురించే ఎక్కువగా ప్రచారం తగదని సినీరంగానికి సూచించారు. -
డీజీపీల సదస్సులో పాల్గొన్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సుకు హాజరయ్యారు. రెండు రోజులుగా గౌహతిలో కొనసాగుతున్న ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించి కీలక అంశాలను చర్చిస్తున్నారు. ఉగ్రవాదం, చొరబాట్లను అరికట్టడంపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక 33 వేలమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నిఘా వ్యవస్థ కీలకమైనది పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు పాల్గొన్నారు. -
ఏ సమస్యనైనా ఎదుర్కొంటాం: డీజీపీ
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా అప్రమత్తంగా ఉందని, భవిష్యత్‌లో ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటామని డీజీపీ ప్రసాద రావు అన్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన డీజీపీల సదస్సులో పాల్గొన్న ప్రసాద రావు అనంతరం మీడియాతో మాట్లాడారు. డీజీపీల సమావేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదంపై చర్చించామని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించినట్టు ప్రసాద రావు తెలిపారు. ఎలాంటి సమస్యనయినా క్షేత్రస్థాయిలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన తర్వాత సీమాంధ్రలో ఉద్యమం వచ్చిందని వెల్లడించారు. కాగా ఇదే సమావేశంలో పాల్గొన్న ఐబీ చీఫ్ ఆసిఫ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల భద్రతకు సవాల్ ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.