డీజీపీల సదస్సులో పాల్గొన్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్ని రాష్ట్రాల డీజీపీల సదస్సుకు హాజరయ్యారు. రెండు రోజులుగా గౌహతిలో కొనసాగుతున్న ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించి కీలక అంశాలను చర్చిస్తున్నారు. ఉగ్రవాదం, చొరబాట్లను అరికట్టడంపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు.
ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక 33 వేలమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నిఘా వ్యవస్థ కీలకమైనది పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు అన్ని రాష్ట్రాల డీజీపీలు పాల్గొన్నారు.