సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం చలిమంటలు అంటుకుని ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. గజపతినగరం నియోజకవర‍్గం దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామానికి చెందిన అప్పలస్వామి(80) అనే వృద్ధుడు చలికి తట్టుకోలేక పూరిపాకలో కుంపటి పెట్టుకిని మంటలు వేసుకుని పక్కనే కూర్చున్నాడు. అయితే... ప్రమాదవశాత్తూ దుప‍్పటికి నిప్పు అంటుకుని మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడు. దాంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment