తల్లి, ఏడుగురు పిల్లలు సజీవదహనం | fire kills seven children, mother in Pakistan | Sakshi
Sakshi News home page

తల్లి, ఏడుగురు పిల్లలు సజీవదహనం

Published Fri, Dec 11 2015 6:26 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

తల్లి, ఏడుగురు పిల్లలు సజీవదహనం - Sakshi

తల్లి, ఏడుగురు పిల్లలు సజీవదహనం

ఇస్లామాబాద్: చలి కాచుకోవడానికి పెట్టుకున్న నెగడు(కట్టె మొద్దులతో వేసిన మంట) ఓ కుటుంబం పాలిట మృత్యుపాశంగా మారిన విషాద ఘటన పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ దాదు జిల్లాలోని గోరఖ్ కొండ ప్రాంతంలో జరిగింది. తీవ్రమైన చలికి తట్టుకోలేక పెట్టుకున్న నెగడు ఓ నిరుపేద కుటుంబంలోని తల్లీ పిల్లలను మంటలకు ఆహుతి చేసింది. ఏడుగురు పిల్లలు  సహా తల్లి మంటల్లో సజీవ దహనం కాగా తండ్రి తీవ్ర గాయాలపాలయ్యాడు.

చలిగాలులను తట్టుకునేందుకు గుడిసెలో వేసిన నెగడు, ప్రమాదవశాత్తు గుడిసెకు అంటుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో గుడిసెలోని వారందరూ సజీవ దహనమయ్యారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement