old man died
-
దుకాణ యజమాని అనుమానాస్పద మృతి
మోత్కూరు: అనుమానాస్పద స్థితిలో పాత ఇనుప సామాను దుకాణ యజమాని మృతి చెందాడు. ఈ ఘటన మోత్కూరు పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణానికి చెందిన ఎండీ కలీమొద్దీన్(70) సుమారు 30 సంవత్సరాలుగా మో త్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంగడిబజార్ ప్రాథమిక పాఠశాల సమీపంలో పాత ఇనుప సామాను దుకాణం నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నాడు. అతడికి భార్యాపిల్లలు లేరు. ఇటీవల కలీమొద్దీన్ భువనగిరికి వెళ్లి తన సమీప బంధువుల వద్ద దాచుకున్న రూ.1.90 లక్షల నగదును తీసుకొని వచ్చి తన దుకాణంలో దాచుకున్నాడు. దుకాణంలో నలుగురైదుగురు కూలీలు రోజువారీగా పని చేస్తుంటారు. వారు గ్రామాలలో కొనుగోలు చేసిన పాత ఇనుప సామాను, ఇతర వస్తువులను ఈ దుకాణంలో విక్రయిస్తారు. మంగళవారం ఉదయం పాలు పోసేందుకు వెళ్లిన వ్యక్తి కలీమొద్దీన్ను పిలువగా అతడు పలకలేదు. దీంతో దుకాణం లోపలికి వెళ్లి చూడగా మంచంపై కలీమొద్దీన్ విగతజీవిగా పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ఏఎస్ఐ ప్రభాకర్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. ఇద్దరు వ్యక్తులను డాగ్ స్క్వాడ్ గుర్తించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఖలీమొద్దీన్ శరీరంపై, మంచం, గోడ, అద్దంపై రక్తం మరకలను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని చౌటుప్పల్ ఏసీపీ మొగులయ్య, రామన్నపేట సీఐ మోతీరామ్ పరిశీలించారు. కలీమొద్దీన్ మంచంపై నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు డబ్బుల కోసం ఆరా తీయగా.. అతడు ఇవ్వకపోవడంతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుని మెడపై ఎడమ వైపు పదునైన ఆయుధంతో బలంగా కొట్టారని, దీంతో రక్తస్రావమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ విలేకరులకు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం కొరకు రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
పండ్లరసంలో మద్యం కలిపి తాగించి..వృద్ధుడు అఘాయిత్యం
ఒంటరిగా చిన్నారులు కనిపిస్తే చిదిమేయాలనుకునే కామాంధులు సమాజంలో పెరిగిపోయారు. అదే కోవలో ఓ పసిమొగ్గకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి ఒడిగట్టిన వృద్ధుడు కడతేరిపోయాడు. బాధితురాలి కుటుంబీకులు దాడి చేసి కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ఐటీ సిటీలోని హెణ్ణూరు పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాక్షి, బనశంకరి: మైనర్ బాలికకు పండ్లరసంలో మద్యం కలిపి తాగించి అత్యాచారానికి పాల్పడిన వృద్ధ కామాంధుడు బాలిక బంధువుల దాడిలో విగత జీవి అయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో హెణ్ణూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కుప్పణ్ణ (72) హతుడు. నమ్మించి ఇంట్లోకి పిలిపించి సోమవారం తూర్పు విభాగం డీసీపీ భీమాశంకర్ గుళేద్ కేసు వివరాలను వెల్లడించారు. కుప్పణ్ణ గత నాలుగేళ్లుగా హెణ్ణూరు పరిధిలోని బాబుసాపాళ్యలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇతడు తాపీ కూలీగా పనిచేసేవాడు. ఆదివారం మధ్యాహ్నం పక్కింట్లో ఉండే నాలుగేళ్ల బాలిక ఇంటిపైన ఆరేసిన దుస్తులను తీసుకురావడానికి వెళ్లింది. అక్కడే ఉన్న కుప్పణ్ణ బాలికకు జ్యూస్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి పిలిపించుకున్నాడు. సరేనని వెళ్లిన బాలికకు జ్యూస్‌లో మద్యం కలిపి ఇవ్వగా తాగిన బాలిక మత్తులోకి జారుకుంది. వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చి దాడి సాయంత్రం వరకు బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. కుప్పణ్ణ ఉండే ఇంటి పై అంతస్తులో బాలిక స్పృహ తప్పి ఉన్నట్లు తెలిసి బాలికను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో బాలిక వివరంగా చెప్పడంతో బంధువులు అగ్రహోదగ్రులయ్యారు. వెంటనే వెళ్లి కుప్పణ్ణను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు వదిలాడు. మరోవైపు కుప్పణ్ణ తమ బాలిక మీద లైంగిక దాడి చేశాడని హెణ్ణూరుపోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి గమనించగా కుప్పణ్ణ శవమై ఉన్నాడు. కుప్పణ్ణ పై పోక్సోయాక్టు కేసు, బాలిక కుటుంబసభ్యులపై హత్యకేసు నమోదైందని డీసీపీ తెలిపారు. హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు. -
అల్లూరికి సేవలందించిన శతాధిక వృద్ధుడి మృతి
రాజవొమ్మంగి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సేవలందించిన ఓ శతాధిక వృద్ధుడు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన బీరబోయిన బాలుదొర (111) ఆదివారం తన నివాసంలో మరణించారు. కొండపల్లి కేంద్రంగా అల్లూరి సీతారామరాజు 1924 మే నెలలో బ్రిటిష్ వారిపై చివరి పోరాటం చేశారు. అప్పట్లో బాలుడిగా ఉన్న తాను.. ఎత్తయిన కొండలపై బస చేసిన అల్లూరి సీతారామరాజుకి ఆహార పదార్థాలు అందజేసేవాడినని.. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిందంటూ నాటి స్మృతులను బాలుదొర తమతో పంచుకొనేవారని స్థానికులు తెలిపారు. అయితే వయసు మీదపడటంతో ఇటీవల మంచం పట్టిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. -
కరోనా నెగిటివ్ వచ్చిన వృద్ధుడు మృతి..
తిరువనంతపురం: కేరళకు చెందిన వృద్ధుడికి(85) కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ శనివారం మృతి చెందాడు. కాగా ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన ఈ వృద్ధుడికి ఆసుపత్రిలో చికిత్స అందించిన తరువాత అతనికి వరుసగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై మలప్పురం జిల్లా కలెక్టర్ జాఫర్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అతడికి ఏప్రిల్ 7, 10, 13 తేదీల్లో వరుసగా మూడు సార్లు వైద్యులు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షలోనూ అతడికి కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే అతను కరోనాతో మరణించలేదు’ అని వెల్లడించారు. ఆరోగ్య శాఖ మంంత్రి కెకె శైలజ కూడా సదరు మృతుడు కరోనా కారణంగా మరణించలేదని, వయసురిత్యా వచ్చే ఆరోగ్య సమస్యలతో మరణించాడని వెల్లడించారు. ఇక మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని.. అంత్యక్రియలకు కోవిడ్-19 ప్రోటోకాల్‌ను పాటించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. (కోలుకున్న వారిపై తిరగబడుతున్న కరోనా) ‘కిడ్నీ, మధుమేహం వ్యాధితో బాధపడుతున్న అతనని ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించించారు. ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ -19 కారణంగా ఒక వ్యక్తి మరణిస్తే రెండు నమూనాలను మాత్రమే తీసుకోవాలి. కానీ మేము అతని నుంచి మూడు నమూనాలను తీసుకుని కరోనా పరీక్షలు నిర్వహించగా మూడుసార్లు నెగిటివ్ వచ్చింది’ అని మంజేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.వి.నందకుమార్ తెలిపారు. కాగా లాక్డౌన్ నేపథ్యంలో అంత్యక్రియల ప్రోటోకాల్ ఆంక్షలపై కలెక్టర్‌ను ప్రశ్నించగా.. 20 మందికి మించి అంత్యక్రియలలో పాల్గొనడానికి వీలు లేదని చెప్పారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని.. -
కారులో వృద్ధుడి సజీవదహనం
తాండూరు టౌన్: పాడైపోయిన ఓ కారుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలోని వాల్మీకినగర్‌కు చెందిన పత్తర్‌షెడ్ వీరన్న (70) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నప్పటికీ వేరుగా ఉంటున్నాడు. కొన్నేళ్లుగా స్థానిక మర్రిచెట్టు కూడలి సమీపంలోని గల్లీలో పాడైపోయిన ఓ కారులో రాత్రిళ్లు నిద్రిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం మర్రిచెట్టు కూడలి వద్ద ఉన్న రక్తమైసమ్మ జాతర సందర్భంగా కారు నిలిపి ఉంచిన సమీపంలో టెంటు వేసి కొందరు వంటలు చేశారు. వీరన్న ఎప్పటిమాదిరిగానే అర్ధరాత్రి కారులో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు టెంటుకు నిప్పంటుకుని కారుపై పడిపోవడంతో దానికి నిప్పంటుకుంది. దీంతో కారులో నిద్రిస్తున్న వీరన్న సజీవ దహనమై గుర్తు పట్టలేని స్థితిలో బూడిదగా మారాడు. మద్యం మత్తులో ఉండటం వల్ల వీరన్న తప్పించుకోలేక మంటల్లో చిక్కుకుని మృతిచెంది ఉంటాడని డీఎస్పీ అనుమానం వ్యక్తంచేశారు. మృతుడి కుమారులు రఘు, చిన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పాపం ముసలయ్య.. ఓటేసి మృతి
సాక్షి, పశ్చిమ గోదావరి: ఎన్నికలు సందర్భంగా జిల్లాలోని దువ్వ పోలింగ్ కేంద్రంలో అపశృతి చోటుచేసుకుంది. బూత్ నెంబర్ 15లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన బంగారు ముసలయ్య అనే వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పటికీ మృతి చెందారు. దీంతో పోలింగ్ కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఓటు వేయడానికి ఆయన ఉదయమే వచ్చినప్పటికీ ఎక్కువసేపు క్యూలైన్లో నిలబడటం వల్ల కుప్పకూలిపోయారని స్థానికులు తెలిపారు. -
పింఛన్ కోసం లైన్లో నిల్చుని ప్రాణాలు విడిచిన వృద్ధుడు
-
మంటగలిసిన మానవత్వం
శ్రీకాకుళం, కాశీబుగ్గ : మానవత్వం మంటగలిసే ఘటన పలాస రైల్వేస్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెంది 15 గంటలు దాటినా ఎవరూ పట్టించుకోలేదు. మంగళవారం ఉదయం నుంచి మృతదేహం పడి ఉన్నా రైల్వే ఉద్యోగులు గానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు గానీ కనీసం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు రాత్రి 9 గంటల సమయంలో కొందరు ప్రయాణికులు స్పందించి రైల్వే పోలీసులకు, మాస్టర్‌కు సమాచారం అందించారు. అయినా వారు కూడా స్పందించకుండా అలాగే వదిలేశారు. -
మంటకలిసిన మానవత్వం..!
సభ్య సమాజం తలదించుకునేలా.. మానవత్వం మంట కలిసిందా అని ప్రశ్నించేలా ఓ విషాద ఘటన తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో చోటుచేసుకుంది. సిరిసిల్ల నెహ్రూనగర్‌లోని అద్దె ఇంట్లో నివాసముంటున్న సిరిపురం వెంకటమల్లు(70)ను అనారోగ్యంతో ఉన్నాడనే కారణంతో చనిపోతే ఇల్లు శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని కనుకుంట్ల మల్లయ్య ఆసుపత్రి నుంచి ఇంట్లోకి రావడానికి అనుమతించలేదు. ఇంటిముందు ఉంచేందుకు సైతం ఒప్పుకోలేదు. దాంతో గత్యంతరం లేక వెంకటమల్లు కుటుంబసభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా ఇందిరమ్మకాలనీ ఊరు చివరకు తరలించారు. అక్కడే కప్పుకునే బట్టలతో గుడిసె లాంటిది ఏర్పాటు చేసుకొని వారం రోజులుగా చలిలోనే వెల్లదీస్తున్నారు. గురువారం వెంకటమల్లు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచాడు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): సిరిపురం వెంకటమల్లు ఎన్నో ఏళ్లుగా మరమగ్గాల కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సంవత్సర కాలంగా అనారోగ్యంగా ఉండటంతో పని చేయడం లేదు. తరచూ సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడు. సిరిసిల్ల నెహ్రూనగర్‌లో కనుకుంట్ల మల్లయ్య ఇంట్లో రూ.వెయ్యికి గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వారం రోజుల పక్షం రోజుల క్రితం వెంకటమల్లు ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయగా.. ఇంటి యజమాని మల్లయ్య ఇంట్లోకి తీసుకురావడానికి అనుమతించలేదు. ఎంత ప్రధేయపడినా ఒప్పుకోలేదు. దాంతో దిక్కుతోచని స్థితిలో ఆటోలో కార్మిక క్షేత్రం ఇందిరమ్మకాలనీ ఊరి చివరికి తీసుకొచ్చారు. ఊరి చివరన దుస్తులతో గుడిసె లాంటి నిర్మాణం ఏర్పాటు చేసుకొని చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ వెల్లదీస్తున్న క్రమంలో గురువారం ఉదయం 9 గంటలకు వెంకటమల్లు మరణించాడు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్లు మమత, రమ్య, కొడుకు మధన్ ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహం జరగగా.. కొడుకు మధన్ ఐటీఐ చదువుతున్నాడు. గూడు లేని పక్షుల వలే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మనసున్న చాలామందిని కంటతడి పెట్టించింది ఈ ఘటన. మనుషుల్లో మానవత్వం ఉందా లేక చచ్చిపోయిందా అని మనకి మనమే ప్రశ్నించుకునే పరిస్థితిని కల్పించింది ఈ సంఘటన. వెంకటమల్లు కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేయూతనందించాలని, ఉండడానికి గూడు కల్పించాలని ఇందిరమ్మకాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కౌన్సిలర్ ఔదార్యం కార్మిక క్షేత్రం సిరిసిల్లకు చెందిన సిరిపురం వెంకటమల్లు(65) అనే నేత కార్మికుడు గురువారం అనారోగ్యంతో చనిపోయాడు. పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన వెంకటమల్లు చాలా రోజులుగా స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గురువారం ఉదయం అనారోగ్యంతో చనిపోగా.. సొంతిల్లు లేక అతడి శవాన్ని యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో మృతదేహాన్ని తంగళ్లపల్లిలోని ఇందిరానగర్‌కు తరలించారు. కుటుంబసభ్యుల వద్ద అంత్యక్రియలు జరపడానికి డబ్బులు లేకపోవడంతో.. 15వ వార్డు కౌన్సిలర్ అన్నారం లావణ్యశ్రీనివాస్ రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు. -
జనగామలో రైలు నుంచి జారిపడి వృద్ధుడు..
సాక్షి, జనగామ అర్బన్: జనగామ పెంబర్తి రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైల్లో నుంచి జారిపడి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. కాజీపేట జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం..సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోసాన్పల్లి గ్రామానికి చెందిన గంధారి లక్ష్మయ్య (70) హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో కుమారుల వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో నవంబర్ 27న పోసాన్‌పల్లికి వచ్చిన లక్ష్మయ్య గురువారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో రైల్లో నుంచి జారిపడి మృతి చెందినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పెంబర్తి రైల్వేస్టేషన్ మాస్టర్ బి. గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన బంధువులకు అప్పగించామని తెలిపారు. -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
చంద్రగిరి: వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని నరసింగాపురం హరిజనవాడకు చెందిన గంగయ్య(62) ఎండ వేడిమిని తట్టుకోలేక మూడు రోజులుగా తీవ్ర అస్వస్థతకు లోనై విరోచనాలు, వాం తులతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనకు పలుచోట్ల చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంటి వద్ద ఆయన మరోసారి అస్వస్థతకు గురై మృతి చెందాడన్నారు. -
నీటి గుంతలో పడి వృద్ధుడు మృతి
సిద్దవటం : మండలంలోని వెంకటాయపల్లెకు చెందిన రైతు జ్యోతి గంగులయ్య (70) నీటి గుంతలో పడి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంగులయ్య తాను సాగు చేసిన వేరుశెనగ పంటకు శనివారం సాయంత్రం నీరు పెట్టేందుకు వెళ్లాడు. బోరులో నుంచి మోటారు ద్వారా వచ్చే నీరు దునికే ప్రదేశంలో గుంత ఉండటంతో.. ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయాడు. ఆయన బయటకు రాలేక పోవడం, చుట్టు పక్కల పొలాల్లో రైతులెవరూ చూడక పోవడంతో ఊపిరాడక చనిపోయాడు. ఆదివారం ఉదయం పక్క పొలం రైతు ఈరిశెట్టి వెంకటసుబ్బయ్య తిరుగుతుండగా.. గంగులయ్య నీటి గుంతలో పడి ఉండటంతో వెళ్లి పలకరించాడు. ఆయన నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో చనిపోయినట్లు గ్రహించాడు. వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపాడు. వారు వచ్చి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని వీఆర్వో చక్రధర్ పరిశీలించి తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. -
కుంపటే అనుకుంటే... ప్రాణం తీసింది!
జ్వరంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు చలికి తట్టుకునేందుకు తాను నిద్రిస్తున్న పట్టి మంచం కింద నిప్పుల కుంపటి పెట్టమని భార్య పెట్టింది కు చెప్పాడు. భర్త చెప్పిందే తడవుగా ఆ భార్య చలి పులి నుంచి కొంతైనా ఉపశమనం కలుగుతుందని భావించి కుంపటి పెట్టింది. అయితే ఆ కుంపటే అతన్ని సజీవ దహనం చేసింది. ఈ విషాద సంఘటన వివరాల్లోకి వెళ్తే... మెరకముడిదాం: మండలంలోని గోపన్నవలస గ్రామంలో రజక కులానికి చెందిన గురాన పైడియ్య( 65) అనే వృద్ధుడు, అతని భార్య అప్పమ్మలు కూలీ పనులు చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. గురాన పైడియ్యకు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరం తీవ్రత ఎక్కువగా వుండడంతో మంచం కూడా దిగలేని పరిస్థితిలో పైడియ్య పడుకున్నాడు. తనకు ఎక్కువగా చలి వేస్తుందని తన మంచం కింద బొగ్గుల కుంపటి పెడితే చలి తగ్గుతుందని తన భార్య అప్పమ్మను పైడియ్య కోరాడు. దీంతో అప్పమ్మ వెంటనే బొగ్గుల కుంపటిని రాజేసి పైడియ్య మంచం కింద పెట్టింది. ఎప్పటిలాగే తను కూలీ పనికి వెళ్లింది. తిరిగి అప్పమ్మ వచ్చేసరికి పైడియ్య కాలిన గాయాలతో కింద పడి వున్నాడు. దీనిని గమనించిన అప్పమ్మ లబోదిబోమని ఏడుస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా పరుగున వచ్చారు. అప్పటికే పైడియ్య కుంపటి రాజుకొని మంటలు కాస్తా మంచానికి అంటుకొని సజీవ దహనమయ్యాడు. పైడియ్యకు జ్వరం తీవ్రత ఎక్కువగా వుండడంతో లేవలేని పరిస్థితిలో వుండడంతో అతను సజీవ దహనమయ్యాడు. పైడియ్యకు భార్య అప్పమ్మతో పాటూ ముగ్గురు కొడుకులు వున్నారు. వీరంతా రెక్కాడితేనేగాని కడుపు నిండని పరిస్థితిలో వున్నారు. విషయం తెలుసుకున్న బుదరాయవలస ఎస్ఐ పి.నారాయణరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడు భార్య అప్పమ్మ, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. -
దుప్పటికి నిప్పు, వృద్ధుడి సజీవ దహనం
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం చలిమంటలు అంటుకుని ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామానికి చెందిన అప్పలస్వామి(80) అనే వృద్ధుడు చలికి తట్టుకోలేక పూరిపాకలో కుంపటి పెట్టుకిని మంటలు వేసుకుని పక్కనే కూర్చున్నాడు. అయితే... ప్రమాదవశాత్తూ దుప్పటికి నిప్పు అంటుకుని మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడు. దాంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
ప్రాణం తీసిన నోట్ల రద్దు వ్యవహారం
-
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
- వాగులో మునిగి వృద్ధుని మృతి గిద్దలూరు రూరల్ : వినాయక నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు వాగులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మండలంలోని కొమ్మునూరు పంచాయతీ పరిధి ఎగ్గన్నపల్లిలో బుధవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామంలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు యువకులు సగిలేరు, ఎనుమలేరులు కలిసే చోట వాగు వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. ఆ సమయంలో అటువైపుగా పొలాల్లో ఉన్న బత్తుల రామయ్య (62) యువకులతో కలిసి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాడు. రామయ్య ప్రమాదవశాత్తూ వాగులో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. అనంతరం యువకులంతా రామయ్య మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై రాంబాబు సంఘటన స్థలానికి వివరాలు సేకరించారు. వీఆర్ఓ రమణ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'ఆసరా' కోసం వచ్చిన వృద్ధుడి మృతి
చింతకాని: ఆసరా పింఛన్ కోసం వచ్చిన వృద్ధుడు బ్యాంకు ఆవరణలో మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. సీతంపేట గ్రామానికి చెందిన నారపోగు పుల్లయ్య(80) పింఛన్ కోసం నాగులవంచ ఏపీజీవీబీ బ్యాంకుకు వచ్చాడు. అయితే క్యూలో చాలాసేపు నిలబడ్డ ఆ వృద్ధుడు తన వంతు ఆలస్యం కావడంతో ఓపిక నశించిపోయి కుప్పకూలిపోయాడు. లైన్లో ఉన్న వారు పుల్లయ్యను కదిలించి చూడగా, చలనం లేదని గుర్తించారు. దీంతో ఆసరా కోసం వచ్చిన ఆ వృద్ధుడు శవమైపోయాడని అక్కడి వారు చెబుతున్నారు. -
బైక్ ఢీకొని వృద్ధుడు దుర్మరణం
బసంత్‌నగర్: కరీంనగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. రామగుండం పట్టణ శివార్లలో వేగంగా వెళ్తున్న బైక్.... రోడ్డు దాటుతున్న పద్యానాయక్ (60) అనే వ్యక్తిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడిని బసంత్ నగర్ సమీపంలోని లంబాడ తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వడదెబ్బకు మరో వ్యక్తి మృతి
గుంటూరు(ఎడ్లపాడు): వడదెబ్బకు ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జక్కాపురం గ్రామానికి చెందిన ముద్దు శివరామకృష్ణయ్య(70) ఇంటి వసరాలో నిద్రిస్తుండగా వడగాలుల తీవ్రతకు మృతి చెందాడు. -
వడదెబ్బకు వృద్ధుడి మృతి
పుత్తూరు రూరల్ : వడదెబ్బకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పుత్తూరు మండల పరిధిలోని తడుకు హరిజనవాడలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తడుకు హరిజనవాడకు చెందిన పీ.మునస్వామి(55) ఆరుబయట మల మూత్ర విసర్జనకు పొలాల్లోకి వెళుతూ వడదెబ్బ సోకడంతో తిరుపతి-చెన్నై జాతీయ రహదారి పక్కన స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి చనిపోయాడు. మునస్వామి భార్య, కుమారుడు గతంలోనే మృతి చెందగా, కోడలు జ్యోతి, ఆమె పిల్లలిద్దరినీ సంరక్షిస్తున్నారు. ఆయన మృతితో వారు అనాథలయ్యారు. -
తేనెటీగల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వృద్ధుడు మృతి
గుంటూరు: మాచర్ల మండలం అలగరాజుపల్లిలో తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒక వృద్ధుడు నీళ్లట్యాంకులోకి దిగి ఊపిరాడక మృతిచెందాడు. వివరాలు..కృష్ణయ్య అనే వృద్ధుడు తేనెటీగల బారినుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో వాటర్ ట్యాంక్ లోకి దిగాడు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో ఊపిరాడక మృతిచెందాడు. -
నలుగురు వృద్ధులు మృతి
పింఛన్లు అందలేదని మనస్తాపం గుండెపోటుతో మరో వికలాంగుడు.. సాక్షి నెట్వర్క్: ఆసరా పింఛన్లు అందలేదని కలత చెంది వేర్వేరు జిల్లాల్లో నలుగురు మృతి చెందారు. ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు బోయ నాగమ్మ(85), వికలాంగురాలు ఖాజాబీ(35) లకు గతంలో పించణ్ వచ్చేది. తాజా జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో గురువారం గుండెపోటుతో మరణించారు. ఇదే జిల్లా నర్వ మండలం కన్మనూర్ పంచాయతీ పరిధి గాజులయ్య తండాకు చంఎదిన పాలమూరు రుక్కమ్మ(68) గతంలో పింఛన్ పొందేది. ఇటీవల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. గురువారం జాబితా ప్రకటించగా, అందులో ఆమె పేరు లేదు. మనస్తాపానికి గురై ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధి యూసుఫ్‌పేటకు చెందిన ఉప్పరి తుకారం(70)కు గతంలో పించన వచ్చేది. వికలాంగుడైన మనవడికి, తనకు పింఛన్ మంజూరు కాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందాడు. గురువారం వేకువ జామున గుండెపోటుకు గురై మరణించాడు. ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన జె. లక్ష్మయ్య(70) పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. జాబితాలో పేరు లేకపోవడంతో మనోవేదనకు గురై మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చిన్నలింగాపూర్‌కు చెందిన బొల్గం రాజు(15)కు పోలియోతో కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. గతంలో పింఛన్ వచ్చేది. తాజా జాబితాలో పేరు లేకపోవడంతో తల్లి భాగ్య వీల్‌చెయిర్‌లో రాజును తీసుకొని అధికారుల చుట్టూ తిరిగింది. పింఛన్ రాలేదన్న బెంగతో గురువారం రాజు గుండెపోటుతో మరణించాడు. -
పెన్షన్ రాలేదని గుండెపోటుతో వృద్ధుడి మృతి
పెన్షన్ల లిస్టులో తన పేరులేదని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఓ విషాద ఘటన యాదగిరిగుట్ట మండలం దాసరపల్లిలో శనివారం చోటుచేసుకుంది. బాలయ్య అనే 80ఏళ్ల వృద్ధుడు పెన్షన్ రాలేదని మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ పంచాయతీ వద్ద అంటించిన లిస్టులో తన పేరులేదని తెలిసి ఆవేదన చెందడంతో ఒక్కసారిగా గుండెనొప్పివచ్చింది. దాంతో ఆ వృద్ధుడు అక్కడే కుప్పకూలిపోయాడు.