చింతకాని: ఆసరా పింఛన్ కోసం వచ్చిన వృద్ధుడు బ్యాంకు ఆవరణలో మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. సీతంపేట గ్రామానికి చెందిన నారపోగు పుల్లయ్య(80) పింఛన్ కోసం నాగులవంచ ఏపీజీవీబీ బ్యాంకుకు వచ్చాడు. అయితే క్యూలో చాలాసేపు నిలబడ్డ ఆ వృద్ధుడు తన వంతు ఆలస్యం కావడంతో ఓపిక నశించిపోయి కుప్పకూలిపోయాడు. లైన్లో ఉన్న వారు పుల్లయ్యను కదిలించి చూడగా, చలనం లేదని గుర్తించారు. దీంతో ఆసరా కోసం వచ్చిన ఆ వృద్ధుడు శవమైపోయాడని అక్కడి వారు చెబుతున్నారు.
'ఆసరా' కోసం వచ్చిన వృద్ధుడి మృతి
Published Thu, Jun 9 2016 2:25 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM
Advertisement
Advertisement