తిరువనంతపురం: కేరళకు చెందిన వృద్ధుడికి(85) కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ శనివారం మృతి చెందాడు. కాగా ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన ఈ వృద్ధుడికి ఆసుపత్రిలో చికిత్స అందించిన తరువాత అతనికి వరుసగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై మలప్పురం జిల్లా కలెక్టర్ జాఫర్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అతడికి ఏప్రిల్ 7, 10, 13 తేదీల్లో వరుసగా మూడు సార్లు వైద్యులు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షలోనూ అతడికి కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే అతను కరోనాతో మరణించలేదు’ అని వెల్లడించారు.
ఆరోగ్య శాఖ మంంత్రి కెకె శైలజ కూడా సదరు మృతుడు కరోనా కారణంగా మరణించలేదని, వయసురిత్యా వచ్చే ఆరోగ్య సమస్యలతో మరణించాడని వెల్లడించారు. ఇక మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని.. అంత్యక్రియలకు కోవిడ్-19 ప్రోటోకాల్‌ను పాటించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
(కోలుకున్న వారిపై తిరగబడుతున్న కరోనా)
‘కిడ్నీ, మధుమేహం వ్యాధితో బాధపడుతున్న అతనని ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించించారు. ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ -19 కారణంగా ఒక వ్యక్తి మరణిస్తే రెండు నమూనాలను మాత్రమే తీసుకోవాలి. కానీ మేము అతని నుంచి మూడు నమూనాలను తీసుకుని కరోనా పరీక్షలు నిర్వహించగా మూడుసార్లు నెగిటివ్ వచ్చింది’ అని మంజేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.వి.నందకుమార్ తెలిపారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో అంత్యక్రియల ప్రోటోకాల్ ఆంక్షలపై కలెక్టర్‌ను ప్రశ్నించగా.. 20 మందికి మించి అంత్యక్రియలలో పాల్గొనడానికి వీలు లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment