అల్లూరికి సేవలందించిన శతాధిక వృద్ధుడి మృతి | Death Of A Centenarian Who Served Alluri Sitarama Raju | Sakshi
Sakshi News home page

అల్లూరికి సేవలందించిన శతాధిక వృద్ధుడి మృతి

Published Mon, Nov 23 2020 4:34 AM | Last Updated on Mon, Nov 23 2020 4:34 AM

Death Of A Centenarian Who Served Alluri Sitarama Raju - Sakshi

బీరబోయిన బాలుదొర (ఫైల్‌)

రాజవొమ్మంగి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సేవలందించిన ఓ శతాధిక వృద్ధుడు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లికి చెందిన బీరబోయిన బాలుదొర (111) ఆదివారం తన నివాసంలో మరణించారు. కొండపల్లి కేంద్రంగా అల్లూరి సీతారామరాజు 1924 మే నెలలో బ్రిటిష్‌ వారిపై చివరి పోరాటం చేశారు.

అప్పట్లో బాలుడిగా ఉన్న తాను.. ఎత్తయిన కొండలపై బస చేసిన అల్లూరి సీతారామరాజుకి ఆహార పదార్థాలు అందజేసేవాడినని.. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు కలిగిందంటూ నాటి స్మృతులను బాలుదొర తమతో పంచుకొనేవారని స్థానికులు తెలిపారు. అయితే వయసు మీదపడటంతో ఇటీవల మంచం పట్టిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement