కరీంనగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు.
బసంత్‌నగర్: కరీంనగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. రామగుండం పట్టణ శివార్లలో వేగంగా వెళ్తున్న బైక్.... రోడ్డు దాటుతున్న పద్యానాయక్ (60) అనే వ్యక్తిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడిని బసంత్ నగర్ సమీపంలోని లంబాడ తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.