bike collided
-
రెండు బైక్‌లు ఢీ..ఒకరి మృతి
మునగాల(సూర్యాపేట జిల్లా): మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గుండెపంగు సైదులు(22) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ ఢీకొని వృద్ధురాలి మృతి
బద్వేలు అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె వద్ద శనివారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో నాగదాసరి సుబ్బమ్మ(52) మృతి చెందింది. చెన్నంపల్లె సమీపంలోని ప్రగతినగర్ లో నివసించే ఆమె కూలి పనులు చేసుకొని జీవన ం సాగిస్తూ ఉండేది. శనివారం రాత్రి ఇంటి సమీపంలోని దుకాణం వద్దకు రోడ్డు దాటుకొని నడిచి వెళ్తుండగా.. బద్వేలు నుంచి నాగిశెట్టిపల్లెకు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఓ యువకుడు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైంది.వెంటనే స్థానికులు 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ఎంత కష్టం.. ఎంత కష్టం..!
రోడ్డు ప్రమాదంలో యువకుడి శరీరంలోకి దిగిన రాడ్ బయ్యారం : ఎదురెదురుగా వెళ్తున్న ఆటో, బైక్ ఢీకొనడంతో ఓ యువకుడి శరీరంలోకి ఆటోకు చెందిన ఇనుప రాడ్ దూసుకెళ్లింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలం పాత ఇర్సులాపురం క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం జరిగింది. కంబాలపల్లి గ్రామానికి చెందిన మాడె వెంకన్న, దొడ్డారపు రమేష్ బైక్‌పై బయ్యారం నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో రామచంద్రాపురం నుంచి బయ్యారం వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న మాడె వెంకన్న పొట్ట కింది భాగంలోకి ఆటోకు చెందిన ఇనుప రాడ్ దిగడమేగాక, కాలు విరిగిపోయింది. ఇదే ఘటనలో రమేష్‌తోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న చర్లపల్లికి చెందిన తాటి భద్రమ్మకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. రాడ్ దిగి రక్తస్రావం అవుతున్న వెంకన్నకు 108 వాహనంలో ఈఎంటీ నరేష్ ప్రాథమిక చికిత్స చేస్తూనే.. మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, వైద్యులు వెంకన్నకు సర్జరీ చేసి ఆ రాడ్‌ను బయటకు తీశారు. -
బైక్ ఢీకొని వృద్ధుడు దుర్మరణం
బసంత్‌నగర్: కరీంనగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. రామగుండం పట్టణ శివార్లలో వేగంగా వెళ్తున్న బైక్.... రోడ్డు దాటుతున్న పద్యానాయక్ (60) అనే వ్యక్తిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడిని బసంత్ నగర్ సమీపంలోని లంబాడ తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైకు
స్తంభం విరిగిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కీసర: వేగంగా వెళ్తున్న బైకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో విరిగిపడింది. దీంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి మండలంలోని దమ్మాయిగూడ ద్వార కానగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ద్వారకానగర్ కాలనీలో నివాసం ఉండే ఓ యువకుడు ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో తన స్పోర్ట్స్ బైక్‌మీద ఈసీఐఎల్ నుంచి ఇంటికి వస్తున్నాడు. వాహనం అతివేగంగా ఉండడంతో కాలనీలో అదుపుతప్పి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం విరిగిపడింది. అదృష్టవశాత్తు బైకుపై ఉన్న యువకుడు స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కాగా విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ద్వారకానగర్ కాలనీ, సాయితిరుమల కాలనీ, పాత గ్రామం, బ్యాంకు కాలనీల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. -
ఎమ్మెల్యే కారు, బైకు ఢీ.. ఒకరి మృతి
పనాజీ: గోవాలో ఎమ్మెల్యే కారు, బైకు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. శుక్రవారం పనాజీ విమానాశ్రయం సమీపంలో ఎమ్మెల్యే సుభాష్ పాల్ దేశాయి ప్రయాణిస్తున్న కారు, ఓ బైకుపై దూసుకెళ్లింది. ప్రమాదం స్థలంలో ఒకరు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా కారును ఎవరు నడిపారు అన్న విషయం తెలియరాలేదు. ప్రాథమిక నివేదిక ప్రకారం బైకు నడుపుతున్న వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చి ఎమ్మెల్యే కారును ఢీకొన్నట్టు తెలుస్తోంది. దీన్ని అసహజమైన మరణంగా కేసు నమోదు చేశారు.