ఎంత కష్టం.. ఎంత కష్టం..!
రోడ్డు ప్రమాదంలో యువకుడి శరీరంలోకి దిగిన రాడ్
బయ్యారం : ఎదురెదురుగా వెళ్తున్న ఆటో, బైక్ ఢీకొనడంతో ఓ యువకుడి శరీరంలోకి ఆటోకు చెందిన ఇనుప రాడ్ దూసుకెళ్లింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలం పాత ఇర్సులాపురం క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం జరిగింది. కంబాలపల్లి గ్రామానికి చెందిన మాడె వెంకన్న, దొడ్డారపు రమేష్ బైక్‌పై బయ్యారం నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో రామచంద్రాపురం నుంచి బయ్యారం వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
దీంతో బైక్‌పై ఉన్న మాడె వెంకన్న పొట్ట కింది భాగంలోకి ఆటోకు చెందిన ఇనుప రాడ్ దిగడమేగాక, కాలు విరిగిపోయింది. ఇదే ఘటనలో రమేష్‌తోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న చర్లపల్లికి చెందిన తాటి భద్రమ్మకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. రాడ్ దిగి రక్తస్రావం అవుతున్న వెంకన్నకు 108 వాహనంలో ఈఎంటీ నరేష్ ప్రాథమిక చికిత్స చేస్తూనే.. మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, వైద్యులు వెంకన్నకు సర్జరీ చేసి ఆ రాడ్‌ను బయటకు తీశారు.