కన్నౌజ్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్‌లో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి, అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా సైఫాయి మెడికల్ కాలేజీలో పీజీ చదువుకుంటున్న వైద్య విద్యార్థులు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం లక్నోలో ఓ వివాహ వేడుకకు హాజరైన వైద్య విద్యార్థులు కారులో సైఫాయికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్కార్పియో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
మృతుల్లో డాక్టర్ అనిరుధ్ వర్మ, డాక్టర్ సంతోష్ కుమార్ మౌర్య, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ నార్దేవ్, మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. మొరాదాబాద్‌లోని బుద్ధ విహార్‌కు చెందిన కరణ్ సింగ్ కుమారుడు జైవీర్ సింగ్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. మృతదేహాలను ప్రస్తుతం మార్చురీలో భద్రపరిచారు.
ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment