పనాజీ: గోవాలో ఎమ్మెల్యే కారు, బైకు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. శుక్రవారం పనాజీ విమానాశ్రయం సమీపంలో ఎమ్మెల్యే సుభాష్ పాల్ దేశాయి ప్రయాణిస్తున్న కారు, ఓ బైకుపై దూసుకెళ్లింది.
ప్రమాదం స్థలంలో ఒకరు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా కారును ఎవరు నడిపారు అన్న విషయం తెలియరాలేదు. ప్రాథమిక నివేదిక ప్రకారం బైకు నడుపుతున్న వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చి ఎమ్మెల్యే కారును ఢీకొన్నట్టు తెలుస్తోంది. దీన్ని అసహజమైన మరణంగా కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే కారు, బైకు ఢీ.. ఒకరి మృతి
Published Fri, May 15 2015 2:58 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement
Advertisement