mla car
-
స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. ఎమ్మెల్యే భార్య, విద్యార్థులకు గాయాలు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులకు గాయాలు కావడంతో వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. నర్సంపేటలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కమలాపురం క్రాస్ రోడ్ వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు, నర్సంపేట ఎమ్మెల్యే సతీమణి జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 14 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ధ్వంసం కాగా.. ఆమె కూడా గాయపడ్డారు. అయితే కారులో ఉండే బెలున్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో వెంటనే స్వప్నను వరంగల్ ఆసుపత్రికి తరలించగా.. విద్యార్థులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో విద్యార్థులు గాయపడటంతో స్థానికులతో పాటు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భార్యను పోలీసులు సేవ్ చేసే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యుల కోసమే ఉన్నారా అని పోలీసులను పేరెంట్స్ నిలదీశారు. ఎమ్మెల్యే వాహనం అతివేగంతో వెళ్ళిన విజువల్స్ అక్కడున్న సీపీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇది కూడా చదవండి: కేబుల్ బ్రిడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా -
ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి
కొరాపుట్: అధికార పార్టీ బీజూ జనతాదల్కు చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే, జిల్లా ప్రణాళికా సంఘం అధ్యక్షుడు రఘురాం పొడాల్పై కోడి గుడ్లతో దాడి జరిగింది. ఈ నేపథ్యంలోకొరాపుట్ జిల్లా లమతాపుట్ సమితి కేంద్రంలో వివాదం చెలరేగాయి. లమతాపుట్లో ప్రభుత్వం నూతనంగా పంచాయతీ భవనం నిర్మించింది. దీనికి సంబంధించి ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరు కానున్నారు. ఈ మేరకు భవన శిలాఫలకంపై ఎమ్మెల్యే, కలెక్టర్ పేర్లు ఉన్నాయి. అయితే విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక జిల్లా పరిషత్ సభ్యుల పేర్లు లేవు. దీనిని గమనించిన ఆ పార్టీ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. దీనిపై అధికారుల నుంచి స్పందన కరువైంది. ఇంతలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఆరుగురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే రఘురాం భవనం ప్రారంభించేందుకు కారులో వచ్చారు. అప్పటికే ఆగ్రహావేశాలతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు.. మార్కెట్ మీదుగా ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్తుండగా కోడి గుడ్లతో దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోగా పరారయ్యారు. అయితే యథావిధిగా కార్యక్రమ వేదిక వద్దకు చేరుకున్న రఘురాం పొడాల్.. భవనాన్ని ప్రారంభించారు. ఈ ఘటన అనంతరం మరో కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారులో భారీగా నోట్ల కట్టలు!
హౌరా(పశ్చిమబెంగాల్): ఉపాధ్యాయ నియామక స్కామ్‌లో ఈడీ సోదాల్లో మాజీ మంత్రి పార్థా ఛటర్జీకి చెందినదిగా భావిస్తున్న రూ.50 కోట్ల నగదు కట్టలు గుట్టలుగా బయటపడటాన్ని మర్చిపోకముందే పశ్చిమబెంగాల్లో మళ్లీ కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. అది కూడా పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల కార్లో! ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్ కొంగరి శనివారం రాత్రి బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ప్రయాణిస్తున్న కారును పోలీసులు ఆపారు. అందులోంచి భారీ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు హౌరా (రూరల్) ఎస్పీ స్వాతి చెప్పారు. ఇప్పటిదాకా రూ.50లక్షలకుపైగా నగదు లెక్కించామని, నగదు లెక్కింపు యంత్రాన్ని తెప్పిస్తున్నామని చెప్పారు. మంత్రి ఇంట్లో నోట్ల కట్టల గుట్టలు.. టీచర్ నియామక కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసి విచారిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటికే ఆయనకు సంబంధించి నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో రెండు సార్లు కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకుంది. మంత్రికి సంబంధించిన ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తోంది. ఛటర్జీకి సన్నిహితురాలైన నటి అర్పిత ముఖర్జీ రెండో అపార్ట్మెంట్లో బుధవారం దాడులు చేసిన ఈడీ రూ.28.90 కోట్ల నగదు, 5 కేజీలకుపైగా నగలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ముఖర్జీకి చెందిన మరో ఇంటిలో రూ.21.90 కోట్ల నగదు, రూ.56 లక్షల విదేశీ కరెన్సీ, రూ.76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకుంది. ఇదీ చదవండి: పార్థా ఛటర్జీ ఇంట్లోకి దూరిన దొంగ.. ఈడీ రైడ్‌గా భావించిన స్థానికులు -
జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే కారు బీభత్సం కేసులో కొత్త కోణం
-
ఎంపీ, ఎమ్మెల్యేల కాన్వాయ్ అడ్డగింత
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ కొద్దిరోజులుగా దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ఎంపీ మాగంటి మురళీమోహన్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కాన్వాయ్‌లను సోమవారం అడ్డగించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల క్యాంపస్‌లో జాబ్‌మేళాను ప్రారంభించడానికి వెళ్తున్న వారిని ఆపి తమ సమస్యలపై నినాదాలు చేస్తూ గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందిస్తూ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ నాయకులు వి.కనకరాజు, జీఎల్ మాణిక్యం, యు.లక్ష్మణరావు, చిక్కాల నర్సింహారావు, కుమార్రాజు, సాంబశివనాయుడు, వాణి, బీవీ నాయుడు, వేదమూర్తి పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కారు, బైకు ఢీ.. ఒకరి మృతి
పనాజీ: గోవాలో ఎమ్మెల్యే కారు, బైకు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. శుక్రవారం పనాజీ విమానాశ్రయం సమీపంలో ఎమ్మెల్యే సుభాష్ పాల్ దేశాయి ప్రయాణిస్తున్న కారు, ఓ బైకుపై దూసుకెళ్లింది. ప్రమాదం స్థలంలో ఒకరు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా కారును ఎవరు నడిపారు అన్న విషయం తెలియరాలేదు. ప్రాథమిక నివేదిక ప్రకారం బైకు నడుపుతున్న వ్యక్తి రాంగ్ రూట్లో వచ్చి ఎమ్మెల్యే కారును ఢీకొన్నట్టు తెలుస్తోంది. దీన్ని అసహజమైన మరణంగా కేసు నమోదు చేశారు. -
ఎమ్మెల్యే కారు ఢీ: యువకుడు మృతి
తూర్పు గోదావరి జిల్లాలో పి.గన్నవరం మండలం మొండెపు లంక వద్ద స్థానిక ఎమ్మెల్యే పి.రాజేశ్వరీ దేవి ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా,మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బందితోపాటు స్థానికుల సహాయంతో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.