సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులకు గాయాలు కావడంతో వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. నర్సంపేటలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కమలాపురం క్రాస్ రోడ్ వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు, నర్సంపేట ఎమ్మెల్యే సతీమణి జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 14 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ధ్వంసం కాగా.. ఆమె కూడా గాయపడ్డారు. అయితే కారులో ఉండే బెలున్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో వెంటనే స్వప్నను వరంగల్ ఆసుపత్రికి తరలించగా.. విద్యార్థులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో విద్యార్థులు గాయపడటంతో స్థానికులతో పాటు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భార్యను పోలీసులు సేవ్ చేసే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యుల కోసమే ఉన్నారా అని పోలీసులను పేరెంట్స్ నిలదీశారు. ఎమ్మెల్యే వాహనం అతివేగంతో వెళ్ళిన విజువల్స్ అక్కడున్న సీపీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఇది కూడా చదవండి: కేబుల్ బ్రిడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా
Comments
Please login to add a commentAdd a comment