
లారీని ఢీకొన్న స్కూల్ బస్సు
నర్సంపేట: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శివారులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. నర్సంపేట సెయింట్ మేరీ స్కూల్‌కు చెందిన బస్సు 50 మంది విద్యార్థులతో వేగంగా వెళుతూ ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ సంఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు చేర్చారు.