narsampet
-
వెండితెరపై ‘పేట’ యువకులు
నర్సంపేట : ఆ ముగ్గురికి చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్రాణం. ఎలాగైనా సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఎక్కడ ఆడిషన్స్ జరిగినా వెళ్లే వారు. అలాగే, వివిధ సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరిగే వారు. చిన్న పాత్ర అయినా ఇవ్వమని కోరారు. తెలిసి వారి వద్దకు వెళ్లి తమలోని నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వారు. అవకాశం వచ్చినట్లు వచ్చే చేజారేది. అయినా ఏమాత్రం నిరాశపడేవారు కాదు. మళ్లీ ప్రయత్నం చేసేవారు. చివరకు అనుకున్నది సాధించారు. తమ ఆకాంక్షకు అనుగుణంగా అవకాశం రావడంతో ఆ ముగ్గురు యువకులు హీరోలుగా రాణిస్తున్నారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు తమప్రతిభతో ముందుకెళుతున్నారు. వారే నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బూరగాని అనిల్, భూక్య సిద్ధు శ్రీఇంద్ర, బూస కుమార్. ఈ ముగ్గురు హీరోలుగా నటించిన తమ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.అనిల్ నటన అద్భుతం..బూరగాని అనిల్‌ది నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండల కేంద్రం. తల్లిదండ్రులు బూరగాని కొమురయ్య–రమాదేవి. అనిల్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సినిమాపై ఆసక్తి ఉండడంతో ఆ రంగం వైపు వెళ్లాడు. పలువురి వద్దకు వెళ్లి తన ప్రతిభను తెలియజేశాడు. వారికి అనిల్ నటన నచ్చడంతో అవకాశం ఇచ్చారు. దీంతో అనిల్ ‘వజ్రాలు కావాలా నాయనా’ అనే సినిమాలో మొదటిసారిగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2017న విడుదలైంది. ఇందులో అనిల్ అద్భుత నటనకు పలువురు ముగ్థులయ్యారు. రెండో సినిమా ‘ఇరావణ’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ప్రేమతో మీ అభిరామ్, దునియా, ప్రేమకుజై, తదితర చిత్రాల్లో నటిస్తున్నట్లు అనిల్ చెప్పాడు. కాగా, టీవీషోలు అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, రాజేశ్వరివిల్లాస్ కాఫీ క్లబ్, అనుపల్లవి, కలవారి కోడలు కనకమహాలక్ష్మి వంటి సీరియల్లో నటిస్తున్నట్లు అనిల్ తెలిపారు.సిద్ధు..‘అనాథ’భూక్య సిద్ధు గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తనలో ఉన్న నటనా ప్రావీణ్యంతో సినిమా రంగంలో రాణించాలని 13 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. చివరకు అదృష్టం వరించింది. వారం రోజుల క్రితం ‘అనా«థ’ అనే సినిమాను నిర్మించి హీరోగా వెండి తెరకు పరిచమయ్యాడు. మొదటి సినిమాలోనే మంచి నటన ప్రావీణ్యం కనబర్చడంతో ఈ సినిమా పలువురిని ఆకట్టుకుంది. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన సకృ, సరోజన దంపతుల కుమారుడు సిద్ధు. మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోగా రాణిస్తూ గోనేంద్ర ఫిలింస్ సంస్థ ద్వారా అనాథ సినిమాను తెలుగు, కన్నడంలో తీసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం రెండో సినిమా కూడా తీస్తున్నట్లు సిద్ధు తెలిపారు.‘రియల్’ రంగం నుంచి హీరోగా..రియల్ ఎస్టేట్ రంగంలో రాణిసూ్తనే సినిమా హీరోగా గుర్తింపు పొందాలనే తపనతో వెండి తెరకు పరిచయమయ్యాడు నర్సంపేట నియోజకవర్గంలోని గుర్రాలగండి రాజపలి్ల గ్రామానికి చెందిన బూస కుమార్. సినిమా రంగంలోని పలువురు ప్రముఖులను కలిసినా ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. దీంతో తానే స్వయంగా ‘షాన్’ అనే సినిమాను రూపొందించాడు. ఇందులో తనే హీరోగా నటించాడు. అంతేకాకుండా నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించి గత సంవత్సరం తన అదృష్టం పరీక్షించుకున్నాడు. వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు పూర్తిగా అవగాహన ఉండడంతో ఆయా ప్రాంతాల్లో చిత్రీకరణ చేసి తన ఆలోచనలకు అనుగుణంగా సినిమా పూర్తి చేశాడు. అనంతరం విడుదల చేసి సఫలీకృతుడయ్యాడు. ప్రస్తుతం మరో సినిమా కూడా చేస్తున్నట్లు ‘సాక్షి’కి వివరించాడు. -
ఈ నెల 16న జరగాల్సిన పెళ్లి.. వరుడు మిస్సింగ్
-
‘పేట’.. సమస్యల మూట.. కాబోయే ఎమ్మెల్యేకు సమస్యల స్వాగతం!
సాక్షి, వరంగల్/మహబూబాబాద్: నర్సంపేట.. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. పాకాల సరస్సు, మాదన్నపేట, తదితర చెరువుల ఆయకట్టు పరిధిలో అత్యధిక స్థాయిలో సాగు అవుతోంది. ఫలితంగా నిత్యం పంట పొలాలతో ఈ నియోజకవర్గం మరో కోనసీమలా కళకళలాడుతోంది. వివిధ ఉద్యమాలు, పోరాటాలకు కేంద్ర బిందువై నిత్య చైతన్యం కలిగిన ఈ నియోజకవర్గం స్వరాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. గత ప్రభుత్వాలు అభివృద్ధి చేసినప్పటికీ చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాబోయే ఎమ్మెల్యేకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నర్సంపేట నియోజకవర్గ పరిధిలో నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2,26,617ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,11,870, సీ్త్రలు 1, 14, 742 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో చేపట్టాల్సి న అభివృద్ధి కార్యక్రమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నర్సంపేట పట్టణంలో.. నర్సంపేట.. వరంగల్ జిల్లాలో ప్రముఖ పట్టణంగా వెలుగొందుతోంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రి, మెడికల్ కాలేజీ పనులు జరుగుతున్నా డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. 40వేల జనాభా పైబడి ఉన్న పట్టణంలో నేటి వరకూ ఆహ్లాదం కోసం పార్కు లేదు. తాగునీరు కోసం మిషన్ భగీరథ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. పట్టణంలోని డ్రెయినేజీ నీరు మాదన్నపేట పంట కాలువలోకి వెళ్తోంది. ఫలితంగా పంటలు దెబ్బతినడంతో పాటు రైతులు పలు వ్యాధులకు గురవుతున్నారు. నెక్కొండ మండలంలో.. నెక్కొండ మండల కేంద్రంలోని బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకురావాలి. విద్యుత్, తాగునీరు సౌకర్యం లేదు. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయి. ఇక బస్సులు కూడా రాకపోవడంతో ఇటు వైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. దీంతో చికెన్ వ్యర్థాలు, వ్యాపార సముదాయాల నుంచి వచ్చే చెత్తకు నిలయంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడంతో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తూ డంపింగ్ యార్డును తలపిస్త్తోంది. నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మరుగుదొడ్లు లేకపోవడంతో స్థానిక ప్రజలతోపాటు రైళ్లు, బస్సుల్లో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సులభ్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. చెన్నారావుపేట మండలంలో.. చెన్నారావుపేట మండలంలోని తిమ్మరాయినిపహాడ్, పాపయ్యపేట, లింగగిరి, గొల్లపల్లితో పాటు పలు గ్రామాలకు వెళ్లే రహదారులపై భారీ గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రమాదాలకు గురై ప్రాణాల మీదికి కూడా తెచ్చుకున్నారు. కనీసం ఆ రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టలేదు. తారు రోడ్లు వేసి ప్రయాణ సౌకర్యం కల్పించాలి. చెన్నారావుపేట–ఖానాపురం, తిమ్మరాయినిపహాడ్–రంగాపురం గ్రామాలను కలిపే మున్నేరువాగుపై (పాకాల) చెక్‌డ్యాంతో పాటు వంతెన నిర్మించాల్సి ఉంది. ఆ హామీలు అలాగే ఉంటున్నాయి. వంతెనల నిర్మాణం పూర్తయితే వాగు పరిధిలో ఉన్న రైతులకు వ్యవసాయ పనుల్లో సమ స్యలు తప్పుతాయి. అంతే కాకుండా రెండు మండలాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి. మండలంలోని కోనాపురం, నంబర్‌వన్ కాలనీతో పాటు పలు గ్రామాల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పనులు పూర్తి కాకపోవడంతో పూర్తిస్థాయిలో గ్రామ పాలకవర్గం నీరు అందించలేకపోతోంది. నీటి సమస్య పరిష్కారానికి పకడ్బందీ ప్రణాళిక ఏర్పాటు చేయాలి. దుగ్గొండి మండలంలో.. దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరు పడకలతోనే కొనసాగుతుంది. దీనిని 30 పడకలకు అప్‌గ్రేడ్ చేసి వైద్యులను నిరంతరం అందుబాటులో ఉంచాలి. మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు స్థలం కేటాయించినా నేటికీ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలి. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని నిరుపేద విద్యార్థులు కోరుతున్నారు. 30 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలి! దుగ్గొండి మండలంలో 42 వేల జనాభా ఉంది. పేదలు అనారోగ్యం బారిన పడితే 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న వరంగల్‌కు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి దుగ్గొండి ఆస్పత్రిని 30 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలి. అన్ని రకాల వ్యాధులకు ఇక్కడే చికిత్స అందించి ప్రజా ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి. – వడ్డేపల్లి చంద్రమౌళి, నాచినపల్లి మాజీ జెడ్పీటీసీ ‘అసైన్డ్’కు పట్టాలివ్వాలి.. నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి శివారులో మాకు ఐదు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. మూడు తరాల నుంచి ఈ భూమిని సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాం. పట్టా పా స్‌బుక్ కోసం పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిశాం. పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని అడిగాం. కానీ నేటి వరకూ ఇవ్వలేదు. ఇప్పటికై నా పాలకులు స్పందించి అసైన్డ్ భూములకు పట్టాలివ్వాలి. – గోనె జువాకర్, రైతు, నాగరాజుపల్లి ఖానాపురం మండలంలో.. ఖానాపురం మండలంలోని ప్రధాన నీటి వనరు పాకాల సరస్సు. పాకాల తూములు శిథిలావస్థకు చేరి మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఆయకట్టు పరిధిలోని ప్రధాన కాలువలు తుంగబంధం, పసునూరు, మాటు వీరారం, జాలుబంధం, సంగెం, తదితర కాల్వలు ఏటా గుర్రపుడెక్కతో నిండిపోయి చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. తద్వారా రైతులు సాగుకు ప్రతీ సంవత్సరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాకాల ఆయకట్టు పరిధిలో వరి పంట పెద్ద ఎత్తున సాగవుతుంది. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో రైతులు రోడ్ల మీద ధాన్యం ఆరబోస్తున్నారు. సబ్ మార్కెట్ యార్డును ఆఽధునికరిస్తే రైతులకు కొంత మేర ఇబ్బందులు తప్పనున్నాయి. మండలంలోని బుధరావుపేటలో 3/1 సర్వే నంబర్లో గల అసైన్డ్ భూమిపై కొన్ని సంవత్సరాలుగా అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. డిగ్రీ కళాశాల, స్టేడియం ఏర్పాటు చేయాలి.. నెక్కొండ మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, స్టేడియం, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల, యువతకు క్రీడల్లో ఆసక్తి పెంపొందడానికి మండలంలో స్టేడియం ఏర్పాటు చేయాలి. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సమస్యలు పరిష్కరించాలి. – బొమ్మెర శ్రీనివాస్, నెక్కొండ కాల్వలను ఆధునికీకరించాలి.. పాకాల ఆయకట్టు పరిధిలోని ప్రధాన కాల్వలను ఆధునికీకరించాలి. తూములకు మరమ్మతులు చేయించాలి. ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి. – కుదురుపాక రాములు, అశోక్‌నగర్ ఇవి చదవండి: ఎన్నికల్లో నోటాను మీటే ఓట్లు ఎన్సో తెలియాలంటే..? వేచుండాల్సిందే! -
నర్సంపేటలో బీఆర్ఎస్పై డబుల్ బెడ్రూం ఎఫెక్ట్?
2018 ఎన్నికల్లో నర్సంపేటలో బీఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన పెద్దిరెడ్డి సుదర్శనరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డిపై 16949 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సుదర్శనరెడ్డి.. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. 2018లో నర్సంపేట నుంచి పోటీచేసి గెలు పొందారు. మాధవరెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి విజయం సాధించగా, 2018లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీచేసి ఓడిపోవడం విశేషం. సుదర్శనరెడ్డికి 94135 ఓట్లు రాగా, మాదవరెడ్డికి 77186 ఓట్లు వచ్చాయి. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : నిరుద్యోగ సమస్య. రోడ్లు. డ్రైనేజీ. డ్రింకింగ్ వాటర్. సరియైన గృహవసతులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు (డబుల్ బెడ్ రూమ్). భూ సమస్యలు. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : వరంగల్ జిల్లాకు ఎడ్యుకేషన్ హబ్‌గా మారిన నర్సంపేట. త్వరలో రాబోతున్న మెడికల్, నర్సింగ్ కళాశాల. ఇప్పటికే ఉన్న రెండు ఇంజనీరింగ్, బీఈడి కళాశాలలు. త్వరలో ప్రారంభం కానున్న 350 పడకల జిల్లా ఆస్పత్రి. ప్రధాన పార్టీల అభ్యర్థులు : బీఆర్ఎస్ పెద్ది సుదర్శన్‌రెడ్డి (కన్ఫాం) కాంగ్రెస్ దొంతి మాధవరెడ్డి (ఆశావాహులు) బీజేపీ రేవూరి ప్రకాశ్‌రెడ్డి (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు రైతులు. వ్యాపారులు. మతం/కులం పరంగా ఓటర్లు బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు భౌగోళిక పరిస్థితులు.. పాఖాల అభయారణ్యం. పర్యాటక కేంద్రంగా పాఖాల సరస్సు. -
స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. ఎమ్మెల్యే భార్య, విద్యార్థులకు గాయాలు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులకు గాయాలు కావడంతో వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. నర్సంపేటలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కమలాపురం క్రాస్ రోడ్ వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు, నర్సంపేట ఎమ్మెల్యే సతీమణి జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 14 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ధ్వంసం కాగా.. ఆమె కూడా గాయపడ్డారు. అయితే కారులో ఉండే బెలున్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో వెంటనే స్వప్నను వరంగల్ ఆసుపత్రికి తరలించగా.. విద్యార్థులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో విద్యార్థులు గాయపడటంతో స్థానికులతో పాటు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భార్యను పోలీసులు సేవ్ చేసే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యుల కోసమే ఉన్నారా అని పోలీసులను పేరెంట్స్ నిలదీశారు. ఎమ్మెల్యే వాహనం అతివేగంతో వెళ్ళిన విజువల్స్ అక్కడున్న సీపీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇది కూడా చదవండి: కేబుల్ బ్రిడ్డి వద్ద రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా -
వరంగల్‌లో కొట్టుకున్న బీజేపీ నేతలు!
-
TS: మోదీ పర్యటన వేళ.. పార్టీ ఆఫీసు ధ్వంసం చేసిన బీజేపీ నేతలు!
సాక్షి, వరంగల్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఇక, రెండు రోజుల్లో వరంగల్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గమన్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలు బీజేపీ ఆఫీసుపైనే దాడులు చేయడం సంచలనంగా మారింది. కొందరు నేతలు తమకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణంలో బీజేపీలో ఒక్కసారిగా ఎప్పటి నుండో నివురుగప్పిన ట్లుగా ఉన్న అసమ్మతి బయటకు వచ్చింది. పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంపై సొంత పార్టీ నేతలు దాడి చేశారు. పార్టీలో మాకు గుర్తింపు లేదు, ప్రాధాన్యం లేదని దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో, ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. వాగ్వాదంలో భాగంగా పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు. అయితే, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలోనే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. ఇక, ప్రధాని మోదీ పర్యటన వేళ వరంగల్ జిల్లాలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: త్వరలో ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నాం.. రేవంత్ సంచలన ఆరోపణలు -
కాంగ్రెస్‌కు ఆ జిల్లాలో అభ్యర్థుల కరువు.. సొంత పార్టీలో లేకపోతేనేం..
తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈసారి అధికారంలోకి వస్తామనే ధీమా కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది. కాని అన్ని చోట్లా సరైన అభ్యర్థులు దొరకాలిగా? అందుకే గెలుపు గుర్రాల అన్వేషణ ప్రారంభించారు. సొంత పార్టీలో లేకపోతే పక్క పార్టీల వారికి గాలం వేస్తున్నారట పీసీసీ నేతలు. ఇంతకీ ఓరుగల్లులో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది?.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నడూ లేనివిధంగా ఐక్యతా రాగం వినిపిస్తోంది. నాయకుల మధ్య విభేదాలు ఎన్ని ఉన్నా..అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ కలిసికట్టుగా పనిచేసి గెలుద్దామన్న ఆలోచనలు కనిపిస్తున్నాయనే చర్చ అయితే సాగుతోంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించాలని అక్కడి నేతలు పట్టుదలతో ఉన్నారు. ఇంటిలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌కే అనుకూల పరిస్థితులున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ నాయకత్వం కూడా దీనిపై విభేదించడంలేదని, అయినప్పటికీ కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ఉండబోవని బీఆర్ఎస్ నాయకలు చెబుతున్నారు. కాని గులాబీ పార్టీ శిబిరంలో ఆందోళన కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను..11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం సొంతంగా చేయించుకున్న సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైనట్లు తెలుస్తోంది. భూ దందాలు, బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సెటిల్మెంట్లకు ఎమ్మెల్యేలు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. చదవండి: రేపు వరంగల్‌లో బీజేపీ సన్నాహక సమావేశం.. ఆ నేతలు కలిసి పనిచేసేనా? కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీకే ఎమ్మెల్యేలు పరిమితం అవుతున్నారన్న విమర్శలు బాగా ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోకుండా.. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తమకు ఆదాయాన్ని అందించేవారికే అపాయింట్మెంట్ ఇస్తూ.. ఎక్కువ సమయం వారికే కేటాయిస్తున్నారన్న చర్చ బలంగా నడుస్తోంది. పైగా ప్రతీ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్లో అంతర్గత కుమ్మలాటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేతల తీరు ఇలాగే కొనసాగితే జిల్లాలో పరిస్థితి చేజారే ప్రమాదం ఉందని పలు సర్వేల ద్వారా బీఆర్ఎస్ అధిష్టానానికి స్పష్టంగా అర్థమైనట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా మెజారిటీ స్థానాల్లో గెలుస్తామన్న ధీమా కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లోని ఉన్న బలమైన నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నర్సంపేట, మహబూబాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలతో చర్చలు జరుపుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో పోటీకి చాలా మంది నాయకులున్నట్లు తెలుస్తోంది. పై మూడు సెగ్మెంట్లలో చర్చలు సఫలమైతే వారు త్వరలోనే హస్తం పార్టీలో చేరతారని అంటున్నారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే అని ప్రజలు విశ్వసిస్తున్నందున, నాయకులంతా ఐక్యంగా ఉంటూ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలని హైకమాండ్ నేతలకు సూచించిందని సమాచారం. -
ఆ బాలిక ఖరీదు.. రూ.13 లక్షలు?
సాక్షి, వరంగల్: ప్రేమపేరుతో నమ్మించి.. ఆపై వంచించిన నిందితుడిపై బాలిక ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. ఆ కేసును నీరుగార్చేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించిన పెద్దలు గద్దలుగా మారారు. రూ.13 లక్షలు బాధితురాలి కుటుంబానికి ఇచ్చేలా తీర్మానం చేసి.. భారీగానే నొక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ అధికారి సమక్షంలోనే ఈ సెటిల్మెంట్ జరిగిందన్న విషయం నర్సంపేటలో చర్చనీయాంశమైంది. బాధితురాలిపై ఒత్తిడి పెరగడంతో.. ఆమె వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్‌ను కలిసి న్యాయం చేయాలని కోరినట్టు సమాచారం. నర్సంపేట పట్టణానికి చెందిన ఓ యువకుడు.. పట్టణానికి సమీపంలో ఉండే ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటుండడంతో ఈమె తరచూ వస్తూ, వెళ్తుండేది. ఈ క్రమంలోనే ప్రేమపేరుతో ఆమెకు దగ్గరైన యువకుడు హైదరాబాద్‌కు వెళ్లి మరీ కొంతకాలం కలిసి ఉన్నాడు. ఆ తర్వాత మొహం చాటేయడంతో.. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2022 ఆగస్టు 14న యువకునిపై పోక్సో కేసు నమోదైంది. అరెస్టయిన యువకుడు జైలుకెళ్లి బెయిల్‌పై బయటకొచ్చాడు. తర్వాత అబ్బాయి బంధువులు, అమ్మాయి బంధువులతో కేసు సెటిల్మెంట్కు ప్రయత్నాలు చేశారు. రూ.13 లక్షలు ఇచ్చేలా నిర్ణయించి.. ముందు రూ.5 లక్షలు, కేసు కాంప్రమైజ్ అయ్యాక మిగిలిన రూ.8 లక్షలు ఇచ్చేలా తీర్మానం రాశారు. బాలిక కుటుంబానికి రూ.2 లక్షలు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని పెద్దలే నొక్కేసినట్టు తెలు స్తోంది. ఈ వ్యవహారమంతా ఓ పోలీసు అధికారి సమక్షంలోనే జరిగిందని సమాచారం. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బా లిక.. న్యాయం కోసం కమిషనర్‌ను ఆశ్రయించినట్టు సమాచారం. చదవండి: ఒక్క రోజులో సినిమా, ఇంధన కొరతకు చెక్.. ఏఐతో ఏదైనా సాధ్యమే! -
Maddikayala Omkar: సామాజిక న్యాయ యోధుడు
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసన సభ్యులు, ఎంసీపీఐ (యూ) వ్యవస్థాపకులు, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 1924లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలం, ఏపూర్‌లో మద్దికాయల రామయ్య, అనంతలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ‘ఆంధ్ర మహా సభ’లో వలంటీర్‌గా చేరి... ఆ తరువాత భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తికై సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించారు. నిజాం సైన్యాలపై, యూనియన్ సైన్యాలపై ఆయన తుపాకీ చేతపట్టి అలుపెరుగని పోరాటం చేశారు. ఆ నాటి నిజాం పాలన ఓంకార్ తలకు వెలకట్టింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పలు బాధ్యతలు చేపట్టి, 1964లో ఏర్పడ్డ మార్క్సిస్ట్ పార్టీలో ముఖ్య నాయకునిగా పేరుగాంచారు. 1972 నుండి 1994 వరకు వరంగల్ జిల్లా నర్సంపేట ప్రజలు ఐదుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసన సభ్యునిగా చట్టసభకు పంపినారు. ప్రజలు ‘అసెంబ్లీ టైగర్’గా ఆయన్ని అభివర్ణించారు. నక్సలైట్లు, భూస్వాములు ఆయనపై అనేకసార్లు హత్యా ప్రయత్నం చేయగా ప్రాణాపాయం నుండి బయట పడిన ఓంకార్‌ను అన్ని వర్గాల ప్రజలు ‘మృత్యుం జయుడు’గా పిలిచారు. 1964 మార్క్సిస్ట్ కార్యక్రమాన్ని నిబద్ధతతో నడపడానికి 1984లో ఎమ్సీపీఐ (యూ)ను ఏర్పాటు చేసి దేశమంతా విస్తరణకు పూనుకున్నారు. వర్గ వ్యవస్థలో భాగం గానే భారతదేశంలో కుల వ్యవస్థ ఉందని ఆయన భావించారు. అగ్రవర్ణ ఆధిపత్యంలో వివక్షకులోనై ఉన్న అణగారిన ప్రజలను సాంఘిక వ్యత్యాసాల నుండి బయట పడేయడానికి ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యపరచి ఆధిపత్య వర్గాల చెంతన ఉన్న దోపిడీ, పెట్టుబడిదారీ వర్గాలపై తిరుగు బాటు చేయించినప్పుడే శ్రామిక వర్గ రాజ్యస్ధాపన సులువు అవుతుందని ఆయన చెప్పారు. ఆర్థిక, రాజకీయ రంగాలపై అగ్రకుల సంపన్న వర్గాల ఆధిపత్యం సాగదంటూ... ‘జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల పంపకం కావాలి, వారే రాజ్యాధికారం చేపట్టాలంటూ 1999 లో 14 కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి రాష్ట్రంలో ‘మహాజన ఫ్రంట్’ ఏర్పాటు చేశారు. జనాభాలో 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణలలోని పేదలు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సమానత్వాన్ని సాధించలేకపోతున్నారు. అందుకే ‘వర్గ వ్యవస్థలోనే కుల వ్యవస్థ’ ఉన్నదని ఓంకార్ స్పష్టం చేశారు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులపై అంచనా ఉన్న ఓంకార్ ఆశయాలకు అనుగుణ్యంగానే ఎమ్సీపీఐ (యూ) కార్యక్రమం ముందుకు సాగుతుంది. ‘ఓట్లు మావే సీట్లు మావే’, ‘ఓట్లు మావి అధికారం మీదంటే’ ఇక చెల్లదంటూ ఏర్పడిన ఆనాటి ‘మహాజన ఫ్రంట్’లో అయినా, 2018లో ‘సామాజిక న్యాయం, బహుజనులకే రాజ్యాధికారం’ అంటూ ఏర్పడిన ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బీఎల్ఎఫ్)లో అయినా ఎమ్సీపీఐ (యూ) భాగస్వామి అయిందంటే... ఓంకార్ ఆశయ సాధన కోసమే. 2008 అక్టోబర్ 17న అమరులైన కామ్రేడ్ ఓంకార్‌కు... నేటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ బహుజన రాజ్యస్థాపనకై పాటుపడడమే ఘనమైన నివాళి. (క్లిక్ చేయండి: ఆయన జీవితమే ఒక సందేశం) – వనం సుధాకర్ ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు (అక్టోబర్ 17న ఓంకార్ వర్ధంతి సందర్భంగా) -
పెద్ది సుదర్శన్‌పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
వరంగల్: తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా.. ఎక్కడ లేని విధంగా నర్సంపేటలో తక్కువ ధరలో ఇంటి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి పెద్ది సుదర్శన్‌రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారని రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నర్సంపేటలో పర్యటించిన కేటీఆర్ మాట్లాడుతూ.. కార్యకర్త నుంచి సర్పంచ్, జడ్పీటీసీ, ఎమ్మెల్యే అయి పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నాడని తెలిపారు. రూ. 100 కోట్ల పై చిలుకు నిధులను మంజూరు చేపించుకొని నర్సంపేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ఎక్కడ కలిసిన నర్సంపేట అభివృద్ధి గురించే ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతారని తెలిపారు.14 ఏళ్ల పాటు కొట్లాడి రోడ్లలకి ఎక్కి రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. బంగారు తెలంగాణ కోసం ఒక్కో అడుగు వేసుకుంటూ పోతున్నామని అన్నారు. 75ఏళ్ల భారత దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంటి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత మన తెలంగాణదని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక నర్సంపేటలో 2 ఇరిగేషన్ ప్రాజెక్టులను మంజూరు చేసుకొని రూ. 670 కోట్ల రూపాయలను వెచ్చించి 60 వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చామని తెలిపారు. 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఒక్కో రైతుకి పెట్టుబడి సాయంగా రూ. 5000 ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తుచేశారు. నర్సంపేటలో పసుపు, పత్తి, మిర్చి బాగా పండుద్దని, వివిధ పంటల కోసం త్వరలో ఆహారశుద్ధి ఫ్యాక్టరీ ఇస్తామని తెలిపారు. మిగిలిపోయిన అభివృద్ధి పనుల కోసం త్వరలో రూ. 50 కోట్లను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. -
దీన స్థితి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి
ఈమె పేరు కన్నం వరలక్ష్మి. ఎంఏ బీఈడీ పూర్తి చేసి 2018లో విద్యావలంటీర్‌గా చెన్నారావుపేట మండలం బోజెర్వు పాఠశాలలో విధుల్లో చేరింది. వరలక్ష్మికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కరోనా మహమ్మారి వల్ల 20 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. కనీసం రెన్యూవల్ చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. దీంతో కుటుంబ పోషణ కోసం సుతారి పనికి వెళ్తున్నా. ప్రభుత్వం స్పందించి నాలుగు నెలల పాత వేతనాలు అందించి.. కరోనా కాలంలో ఆపత్కాలపు భృతి ఇచ్చి, రెన్యూవల్ చేయాలని వేడుకుంది. నర్సంపేట రూరల్: కరోనా మహమ్మారి వల్ల కూలీలుగా మారారు. పాఠశాలలకు వెళ్లి పాఠాలు బోధించాల్సిన విద్యా వలంటీర్లు తీరొక్క పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. ప్రస్తుతానికి పాఠశాలలు తెరిచినా వీరిని రెన్యూవల్ చేయకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే 2019 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల పెండింగ్ వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్లకు భృతి కల్పించిన ప్రభుత్వం.. విద్యావలంటీర్లను మరవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక కుమిలిపోతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసినా ప్రభుత్వ కొలువు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్లుగా చేరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా బోధిస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 3,749 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. హనుమకొండ జిల్లాలో 94, వరంగల్ 44, జనగామ 120, జయశంకర్ భూపాలపల్లి, ములుగులో 931, మహబూబాబాద్ జిల్లాలో 340 చొప్పున మొత్తం 1,529 మంది విద్యావలంటీర్లు విధులు నిర్వర్తించేవారు. అయితే కరోనా మహమ్మారి వీరి ఉపాధిని దెబ్బతీసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం రెన్యూవల్ కూడా చేయకపోవడంతో కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసుకుంటున్నారు. చదవండి: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పాలమూరు బుడ్డోడు పట్టించుకోలేదని ఆవేదన.. 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం తమను çపట్టించుకోలేదని పలువురు వలంటీర్లు వాపోతున్నారు. పల్లె ప్రాంత విద్యార్థులకు సమాచార మాధ్యమాలు అందుబాటులో లేనప్పుడు కీలకంగా వ్యవహరించిన వీరిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ వలంటీర్లకు వర్తింపజేస్తామన్నారు. గురుకులాల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, గెస్టు టీచర్లు, సీఆరీ్పలకు విధులు అప్పగించి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అదే విద్యార్హతలున్న తమపై కనికరం చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కళాశాలలో విద్యార్థుల ఘర్షణ: విద్యార్థి మృతిపై ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేటలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న గొడవ కాస్త ముదిరి ఒకరి ప్రాణం తీసింది. రెండో అంతస్తు నుంచి తోసేయడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఆ వివరాలు.. నర్సంపేట బిట్స్ కాలేజీలో నలుగురు విద్యార్థుల గొడవ ప్రారంభం అయ్యింది. చిన్న వాగ్వాదం కాస్త ముదిరి పెద్ద గొడవకు దారి తీసింది. (చదవండి: మా పిన్ని ఓ లేడీ టైగర్.. రక్షించండి సార్) ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థులు.. సంజయ్ అనే మరో విద్యార్థిని కాలేజ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుంచి తోసేశారు. ఈ ప్రమాదంలో సంజయ్‌కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజయ్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిట్స్ కళాశాలలోని పాలిటెక్నిక్ చదువుతున్న సెకండియర్ విద్యార్ధి సంజయ్ మృతికి కళాశాల యాజమాన్యం కారణమంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. నర్సంపేట - వరంగల్ ప్రధాన రహదారి ధర్నా, రాస్తారోకో చేశారు. వారికి మద్దతుగా విద్యార్ధి సంఘాల నాయకులు కూర్చున్నారు. అయితే ధర్నా చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టారు. చదవండి: వరంగల్ కుటుంబం హత్య: వదిన వల్లే అన్న మారాడని.. -
నేను చిన్నపిల్లను; నాకు పెళ్లొద్దు.. చదువుకుంటా!
సాక్షి,గీసుకొండ: ‘సార్.. నేనింకా చిన్నపిల్లను. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఉంది. ఎంత చెప్పినా పెద్దలు వినడం లేదు. పైగా 30 ఏళ్ల వ్యక్తికి, అదీ మొదటి భార్యతో విడాకులైన వ్యక్తికి నన్ను కట్టబెట్టాలని చూస్తున్నారు. అందరికీ తెలిస్తే అడ్డుకుంటారని దొంగచాటుగా పెళ్లి చేయాలని ప్రయతి్నస్తున్నారు..నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా ఆపండి.. ఇదీ పద్నాలుగేళ్ల బాలిక తనకు వివాహం చేయాలని పెద్దలు యత్నించిన క్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలు... వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట శివారు గార్లగడ్డ తండాకు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలికతో వరంగల్ అర్బన్ జిల్లా వాసి, ఇప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకున్న 30 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయడానికి పెద్దమనుషులు నిర్ణయించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.., చదువుకుంటానని ఆ బాలిక మొరపెట్టుకున్నా పెద్దమనుషులు వినకుండా నిశి్చతార్థం చేశారు. దీంతో దిక్కుతోచని ఆ బాలిక తన స్నేహితురాలితో చైల్డ్‌లైన్‌కు సంబంధించి 1098 ఫోన్ చేయమని చెప్పింది. ఇంతలోనే స్థానిక ఎంపీటీసీ వీరన్న కూడా ఈ విషయాన్ని బాలల సంరక్షణ అధికారులకు తెలియజేశారు. ఇది తెలుసుకున్న పెద్దమనుషులు బుధవారం బాలిక అమ్మమ్మ గ్రామమైన గీసుకొండ మండలంలోని నందనాయక్ తండాలో గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిపించడానికి సిద్ధమవుతుండగా బాలల పరిరక్షణ విభాగం అధికారులు పెళ్లి తంతును అడ్డుకున్నారు. చదవండి: 20 మీటర్లు.. 12 అడుగులు..! -
మహిళా కానిస్టేబుల్ హల్చల్
నర్సంపేట రూరల్: ఓ మామతో కోడలు ఆస్థి విషయంలో మాట్లాడేందుకు మామ అద్దె ఇంటికి రాగా వ్యభిచారం చేయడానికి వచ్చారా అంటూ పక్కనే ఆఫ్ డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వెంబడించి చితకబాదిన సంఘటన నర్సంపేట పట్టణంలో సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట డివిజన్లోని చెన్నారావుపేటకు మండలంలోని ఓ తండాకు చెందిన మామ నర్సంపేట పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నాడు. కాగా నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. కోడలు తన భూమి విషయంలో అద్దెకు ఉంటున్న తన మామ ఇంటి వద్దకు వచ్చి అరుగుమీద కూర్చొని భూమి పంపకాల విషయంలో చర్చించుకుంటున్నారు. అయితే అదే క్రమంలో పక్కనే మహిళా కానిస్టేబుల్ వ్యభిచారం చేయడానికి వచ్చారా అని నిలదీసింది. దీంతో అక్రమ సంబంధం ఎలా అంటకడుతావే అని కానిస్టేబుల్‌పై మామ, కోడలు ఆగ్రహం వ్యక్తం చేసి, డ్యూటీ ఎలా చేస్తావో చూస్తానంటూ ద్విచక్రవాహనం వస్తుండగా విన్న కానిస్టేబుల్, ఆయన భర్త కలిసి వారిని మరో ద్విచక్రవాహనంపై వెంబడించారు. నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్దకు రాగానే వాహనాన్ని ట్రాప్ చేసి ఆపి మామ, కోడలును తీవ్రంగా కొట్టారు. ఇదంతా తతంగం అరగంట సేపు జరిగినప్పటికీ ఎవరూ ఆపకపోవడంతో ఇరువైపులా ట్రాఫిక్ జామయింది. అనంతరం ఇరువర్గాలు స్థానిక స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన జరుగుతున్న క్రమంలో ఎంత పోలీసులైనా మాత్రం నడిరోడ్డుపై ప్రజలకు రౌడీలుగా కొడుతారా అని.. ఇదేనా ప్రెండ్లీ పోలీసింగ్ అంటే అంటూ పలువురు బహిరంగానే విమర్శిస్తున్నారు. దీనిపై స్థానిక ఎస్సై నవీన్‌కుమార్‌ను వివరణ కోరగా విచారణ చేపడుతున్నామన్నారు. -
ఆర్టీసీ సమ్మె: మృత్యు ఒడిలోకి కార్మికుడు
సాక్షి, వరంగల్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల మరణాలు ఆగడం లేదు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కఠినవైఖరి వీడకపోవటంతో తీవ్ర మనస్థాపానికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో చోటుచేసుకుంది. నర్సంపేటకు చెందిన యాకుబ్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత 46 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో చురుకుగా పాల్గొంటున్నాడు. అయితే కార్మికుల పక్షాన కోర్టు తీర్పు రాకపోవడంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కార్మికుని మృతిపై జేఏసీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య అని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. మూడు నెలలుగా జీతాల్లేక ప్రభుత్వం పరోక్షంగా వేధించడం వల్లే యాకుబ్ మరణించాడని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల మృత్యు ఘోష ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినిపించటం లేదా అంటూ పలువురు మండిపడుతున్నారు. -
కళ్లలో కారం కొట్టి.. మారణాయుధాలతో దాడి
సాక్షి, నర్సంపేట : మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లి వస్తున్న భార్యభర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం చల్లి మారణాయుధాలతో దాడి చేసిన ఘటన నర్సంపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన అంబటి వెంకన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. రోజు ఉదయాన్నే వెంకన్న తన భార్య విజయతో కలిసి వాకింగ్‌కు వెళుతుంటాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి తిరిగివస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు వెంకన్న కళ్లలో కారంపొడి చల్లి కత్తులతో దాడి చేసి పారిపోయారు. భార్య విజయ వెంటనే తీవ్రంగా గాయపడిన వెంకన్నను నర్సంపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స నిర్వహించారు. కానీ వెంకన్న పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత మెరుగైన వైద్యం అందించేందుకు వరంగల్‌కు తరలించారు. కాగా, ఈ దాడికి భూవివాదమే కారణమై ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
నేతల్లో గుబులు
సాక్షి, నర్సంపేట: మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికారులు ఎన్నికల నిర్వహణకు వేగవంతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల గుండెల్లో అలజడి మొదలైంది. కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే నేతలు ముందస్తుగానే ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకటన అనంతరం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఏ వార్డు రిజర్వేషన్ల పరంగా ఏ కేటగిరికీ ఖరారవుతుందోనని అందరిలో చర్చ మొదలైంది. తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే అధికారులు ఈ నెల 14 వరకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. కాగా రిజర్వేషన్లు అనుకూలిస్తే తాము.. లేకుంటే తమ సతీమణులను రంగంలోకి దింపడానికి నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నర్సంపేట, పరకాల, వర్దన్నపేట మున్సిపాలిటీల్లో ఈ మేరకు ఆయా పార్టీల టికెట్ల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్‌ల అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిల అనుమతి కోసం ఆ పార్టీ ఆశావహులు పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పోయినసారి నర్సంపేట చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు అవకాశం రాగా వార్డుల వారీగా ఎవరికి రిజర్వేషన్ ప్రకటన వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో పోటీ చేసేవారు అధినాయకుల అనుమతి పొందినవారు రిజర్వేషన్ అనుకూలంగా ఉంటుందో లేదోనని టెన్షన్లో ఉన్నారు. ఈ నెల చివరలో రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో మునిసిపాలిటీల్లో వార్డుల విభజన, సరిహద్దులు ఖరారు చేయగా కులాలు, వర్గాల వారీగా ఓటర్ల గణన వంటి అంశాలు పూర్తి చేసిన అధికారులు ఓటరు జాబితా ప్రకటనపై దృష్టి సారించారు. అయితే తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో ఏ పీఠం ఎవరికి అనుకూలిస్తే వారు.. లేకుంటే తమ సతీమణులను రంగంలోకి దింపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా పార్టీల టికెట్ల కోసం ఆయా పార్టీల ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజర్వేషన్లపై చర్చలు జిల్లాలోని మూడు మునిసిపాలిటీ పీఠాలకు రిజర్వేషన్లు ఏ విధంగా ఉండబోతున్నాయనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాలో పరకాల, నర్సంపేట పాతవి కాగా వర్ధన్నపేటను కొత్తగా ఏర్పాటు చేశారు. మునిసిపల్ చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు రాష్ట్ర యూనిట్‌గా, వార్డు కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్లను మునిసిపల్ యూనిట్‌గా ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వు చేయబోతున్నారు. మరో 50 శాతం జనరల్ కేటగిరిలో ఉండనున్నాయి. అయితే మొత్తంగా 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. రూరల్ జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో నర్సంపేటలో 24, పరకాలలో 22, వర్ధన్నపేటలో 12 వార్డుల కౌన్సిలర్ స్థానాలు ఉండగా అందులో సగభాగం బీసీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వు కానున్నాయి. ఏ మునిసిపాలిటీ ఎవరికి రిజర్వేషన్ ఖరారవుతుందోననే ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం సిద్దం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రధాన రాజకీయ పార్టీల ఆశావహులు తమతమ అంచనాలు, ఊహాగానాలతో తమకే అనుకూలిస్తుందనే గట్టి నమ్మకంతో పోటీకి సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు 14లోపు ఖరారు.. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలకు కొత్త పాలకవర్గాలను ఆగస్టు మొదటి వారంలోపు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వార్డులను ఖరారు చేసిన అధికారులు తుది జాబితా ప్రకటనను మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్‌కు నివేదించారు. వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వ ఆర్డినెన్స్ మేరకు విలీన గ్రామాలను పరిగణ లో కి తీసుకుని వార్డుల విభజనను పూర్తి చేశా రు. కొత్త వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. ఓటరు ముసాయిదా జాబితా, తుది ఓటరు జాబితా ఆధారంగా రాష్ట్రం యూనిట్‌గా చైర్పర్సన్, మునిసిపల్ యూనిట్‌గా వార్డు కౌన్సిలర్ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. -
నా ఇంటి అల్లుణ్ని గెలిపించుకోవాలి : కడియం
సాక్షి, నర్సంపేట : పెద్ది సుదర్శన్ రెడ్డి అభివృద్ధికి మారుపేరని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనియాడారు. రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేల కంటే నర్సంపేట అభివృద్ధే ధ్యేయంగా సుదర్శన్ నిధులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. గురువారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు భూమి పట్టాలు ఇప్పించిన ఘనత సుదర్శన్‌కు దక్కుతుందన్నారు. డాక్టర్ అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ తెచ్చుకున్నామని తెలిపారు.ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ రచించిన ఆర్టికల్ అనుగుణంగానే కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రాబోయే రోజుల్లో తయారు చేయబోతున్నాము. నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి ఏరోజు ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. నా ఇంటి బిడ్డను చేసుకున్న నా ఇంటి అల్లుడు అయిన పెద్ది సుదర్శన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించుకోవాలి’’ అని అన్నారు. -
శిక్షణలో స్నేహం, వివాహం..
నర్సంపేట: చిన్నప్పటి నుంచే పోలీస్ కావాలనే బలమైన కాంక్ష ఉండేది. మా కుటుంబంలో ఎవరూ పోలీసు అధికారులు లేరు. తల్లిదండ్రుల సూచనతో బీటెక్ పూర్తి చేశా. 2012 లో గ్రూప్–1కు ఎంపికై పోలీస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించా. కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నానని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్ అన్నారు. మంగళవారం ఆమె ‘సాక్షి’ ఇంటర్వూ్యలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాన్న కోరిక మేరకు.. మాది హైదరాబాద్. తల్లిదండ్రులు వరలక్ష్మి–సోమశేఖర్. మేము నలుగురం సంతానం. అక్క, అన్న, చెల్లెలు కూడా ఉన్నత చదువులు చదివారు. నాన్న సోమశేఖర్ కోరిక మేరకు నేను గ్రూప్–1కు ఎంపికయ్యా. 2012లో నాకు మొదటి పోస్టింగ్ నల్లగొండ సీసీఎస్‌లో ఇచ్చారు. రెండో పోస్టింగ్ సూర్యాపేట డీఎస్పీగా పనిచేసిన రోజులు మరువలేనివి. మూడో పోస్టింగ్ నర్సంపేట ఏసీపీగా వచ్చా. భర్త చంద్రమోహన్‌తో ఏసీపీ సునీతామోహన్ శిక్షణలో స్నేహం, వివాహం.. గ్రూప్–1కు ఎంపికైన తర్వాత శిక్షణ సమయంలో మా బ్యాచ్‌కు చెందిన ఆదిలాబాద్ జిల్లా వాసి చంద్రమోహన్‌తో స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారి వివాహం వరకు వెళ్లింది. మా ఇద్దరి అభిప్రాయాలను తల్లిదండ్రులు అంగీకరించారు. 2013 డిసెంబర్ 27న వివాహం చేసుకున్నం. చంద్రమోహన్ ప్రస్తుతం కరీంగనర్ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. చాలెంజ్‌గా తీసుకుంటా.. విద్యా, ఉద్యోగాల్లో మహిళలు కూడా రాణించడం సంతోషకరం. పోలీస్ శాఖలో మహిళలు రాణించాలంటే ప్రత్యేక ప్రణాళికలు అవసరం. ఉన్నతాధికారుల సహకారంతో ముందుకు వెళ్తా. ఒత్తిడికి గురికాకుండా పోలీస్ ఉద్యోగాన్ని చాలెంజ్‌గా తీసుకుంటా. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా కఠిన చర్యలు తీసుకుంటా. యువత లక్ష్యాన్ని ఎంచుకోవాలి.. ఇది వరకు ఏదైనా రంగంలో పనిచేసిన వారు ఆదర్శనీయులుగా ఉండడం సహజమే. ఏ రంగంలో లేని వారు కూడా మంచి పనులు చేస్తూ గుర్తింపు పొంది ఆదర్శవంతంగా ఉంటారు. యువత ప్రత్యేక లక్ష్యాన్ని ఎంచుకుని తల్లిదండ్రుల ఆశయలను నెరవేర్చాలి. ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలి. చెడు మార్గంలో పయనించి సమాజానికి చేటును తెచ్చే వారు తల్లిదండ్రులను కూడా ఇబ్బందిపెట్టిన వారు అవుతారు.. -
తాగిన మైకంలో భార్యను చంపిన భర్త
నర్సంపేట రూరల్: తాగిన మైకంలో భార్యను కర్రతో మోది హత్య చేసిన భర్త ఉదంతమిది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ధర్మరావుపేటలో జరిగింది. రాజేందర్, మంగమ్మ(35)లు భార్యాభర్తలు. వీరికి బాబు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలకు తాగుడు అలవాటు ఉందని, రోజూ ఇద్దరూ తాగి గొడవ పడుతుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలో దుర్గమ్మ పూజ ఉండడంతో ఎవరూ తాగవద్దని తోటి కులస్తులు చెప్పడంతో మంగమ్మ తాగలేదు. అయితే రాజేందర్ తాగి వచ్చి అర్ధరాత్రివేళ భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కర్రతో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి కర్రతో తల్లిని కొట్టి చంపాడని బాలిక చుట్టుపక్కలవారికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
ముస్లింల స్థితిగతులపై బీసీ కమిషన్ పరిశీలన
నర్సంపేట : పట్టణంలోని పలు ముస్లిం కుటుంబాలను బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, జాయింట్ కలెక్టర్ హరిత సోమవారం కలుసుకున్నారు. తొలుత వారు ముందుగా ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఆ తర్వాత పట్టణంలోని మసీద్ వద్ద ఉన్న ముస్లిం కుటుంబాలను కలిసి వారి జీవన విధానం, స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ముస్లింలకు ప్రధాన వృత్తి లేదని, దుర్భర జీవితాలను గడుపుతున్నందున వివరాలు సేకరిస్తున్నామని, నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి అందించనున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, మైనార్టీ శాఖ ఈడీ సర్వర్, వరంగల్ ఆర్డీఓ మహేందర్‌జీ, సంగూలాల్, కామగోని శ్రీనివాస్, నాయిని నర్సయ్య, వేముల సాంబయ్య, యాకుబ్, పాష, ఇర్ఫాన్, ముస్లింలు పాల్గొన్నారు. గుండ్రపల్లిలో పర్యటన నెక్కొండ(నర్సంపేట): నెక్కొండ మండలంలోని గుండ్రపల్లిలో బీసీ కమిషన్ సభ్యుడు కృష్ణమోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రజల వాస్తవ జీవన స్థితిగతులను తెలంగాణ సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కాసీ, దుదేకుల కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు అందేలా కృషి చేస్తానని హామి ఇచ్చారు. జిల్లా కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్నబీ, సర్పంచ్ గుగులోత్ నందనాయక్ తదితరులు ఉన్నారు. -
మహిళల అభ్యున్నతికి కృషి
► రూరల్ జిల్లా చెంతన జాతీయ రహదారి ► ఇప్పటికే రెండు పొడవైన రోడ్లు ► తాజాగా నర్సంపేట మీదుగా ఇల్లందు వరకు 85 కిలోమీటర్ల రోడ్డుకు ప్రతిపాదనలు ► ఏజెన్సీ జిల్లాలకు నేరుగా రవాణా సౌకర్యం ► ప్రాజెక్టుల స్థాపనకు అవకాశాలు నర్సంపేట : తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తోందని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. పట్టణంలోని ద్వారకపేట ఎంఏఆర్ ఫంక్షన్హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎంపీ సీతారాంనాయక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని మహిళలకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. స్వశక్తితో ఉపాధి రంగాల్లో రాణించాలని కోరారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ హయాంలోనే అనేక చట్టాలు వచ్చాయన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 33 శాతం రిజర్వేషన్ కల్పించి చట్టాన్ని రూపొందించారన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు సొంత గ్రామాల్లోనే పనులు చూపించిన ఘనత సోనియాగాంధీకే దక్కిందన్నారు. మహిళల అభివృద్ధే లక్ష్యం : పెద్దిమహిళల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాల పెంపుతోపాటు టీచర్‌గా పిలవాలనే హోదా కల్పించడమే ఇందుకు నిదర్శనమన్నారు. నామినేటెడ్ కమిటీల్లో సైతం మహిళలకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. త్వరలో కేబినెట్లో కూడా అవకాశం కల్పించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి : జేసీ హరిత అందివచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ హరిత అన్నారు. మహిళల్లో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తప్పనిసరిగా రిజిస్ట్రర్లలో పేర్లు నమోదు చేయాలని, గర్భిణులు పౌష్టికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. బాల్య వివాహాలు, బ్రూణ హత్యలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనం తరం ఓడీఎఫ్ 100 శాతం పూర్తిచేసిన గంగదేవిపల్లి, మరియపురం, ఒగ్లాపూర్, సింగరాయిపల్లి, దాసరిపల్లి, రేలకుంట సర్పంచులు శాంతి, విజయ, శారద, లక్ష్మీ, వల్లాల ఉషశ్రీ, సాంబక్కను జేసీ హరిత, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు శాలువా, మెమోంటోతో ఘనంగా సన్మానించారు. సభలో ఆర్డీఓ రవి, డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటరమణ, నగర పంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచందర్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, నగర పంచాయతీ కౌన్సిలర్లు, సీడీపీఓ, ఏసీడీపీఓలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న స్కూల్ బస్సు
నర్సంపేట: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శివారులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. నర్సంపేట సెయింట్ మేరీ స్కూల్‌కు చెందిన బస్సు 50 మంది విద్యార్థులతో వేగంగా వెళుతూ ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ సంఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను సురక్షితంగా పాఠశాలకు చేర్చారు. -
ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు
వరంగల్: జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన అన్నసామి ఇంటికి గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న పత్తి, ఫర్నీచర్, నగదు కాలి బూడిదయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో రూ. 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. కాగా.. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన యాలాద్రి అనే వ్యక్తిని కొందరు కర్రలతో కొట్టి చంపారు. ఆ కేసులో అరెస్ట్ అయిన అన్నసామి ఇంటిని ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. -
నర్సంపేటలో ఉన్మాది వీరంగం
నర్సంపేట: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. యాసిడ్ సీసా చేతపట్టుకొని పట్టణంలోని ఓ మెడికల్ షాపు వద్దకు వచ్చిన ఉన్మాది యాసిడ్‌ను షాపు యజమానిపై పోసేందుకు యత్నించాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కత్తి, యాసిడ్ సీసాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
20 క్వింటాళ్ల పటిక స్వాధీనం
నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట చౌరస్తాలో ఎక్సైజ్ అధికారులు 20 క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నారు. ఈ పటికను గుడుంబా తయారీ కోసం వాడతారు. ఎలాంటి అనుమతి లేకుండా రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అధికారుల రాకతో డ్రైవర్ పరారయ్యాడు. పటికను, ఆటోను అధికారులు సీజ్ చేసి ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నర్సంపేటకు సబ్‌కోర్టు మంజూరు
నర్సంపేట : నర్సంపేట మున్సిఫ్ కోర్టుకు అదనంగా సబ్ కోర్టు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం పట్టణంలో మున్సిఫ్ కోర్టు, సెకండ్ మెజిసే్ట్రట్ కోర్టు, స్పెషల్ కోర్టు ఉన్నాయి. ఇంకా పైస్థాయి కోర్టుకు వెళ్లాలంటే మహబూబాబాద్ పోవాల్సిందే. దీంతో డివిజన్లోని ఆరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డివిజన్ ప్రజల సౌకర్యార్ధం నర్సంపేటకు సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించగా రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్ ఆర్డీ 615 జీవో జారీ చేసింది. సబ్ కోర్టు ఏర్పాటుతో 30 మంది సిబ్బంది, 40 మంది న్యాయవాదులు, 150 మందికి అనధికారికంగా ఉపాధి లభించనుంది. ఇటీవల నర్సంపేటకు నూతన భవన నిర్మాణం కోసం రూ. 4 కోట్లతో ప్రతిపాధనలు పంపించారు. త్వరలోనే నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. -
నగర పంచాయతీ ఫర్నిచర్ జప్తునకు కోర్టు ఆదేశాలు
కోర్టు ఆదేశాలను బేఖాతార్ చేసిన ఫలితం నర్సంపేట : కోర్టు తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నర్సంపేట నగర పంచాయతీలోని ఫర్నిచర్‌ను వరంగల్ లేబర్ కోర్టు జప్తు చేయించిన సంఘటన సోమవారం జరిగింది. నర్సంపేట పట్టణానికి చెందిన ఎండీ.మాషుక్ అనే కార్మికుడు 1988లో నర్సంపేట మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఎన్‌ఎంఆర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో 1994లో విద్యుత్ మోటార్ కాలిపోయిన ఘటనకు మాషుక్ను బాధ్యుడిని చేస్తూ అప్పటి పాలకవర్గం అతడిని విధుల్లో నుంచి తొలగించింది. దీంతో మాషుక్ 1998లో వరంగల్‌లోని లేబర్కోర్టును ఆశ్రయించడంతో వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి 2001లో అతడిని విధుల్లోకి తీసుకోవాలని తీర్పునిచ్చారు. దీనిని సవాల్ చేస్తూ అప్పటి గ్రామ పంచాయతీ పాలకులు లేబర్‌కోర్టులో రీపిటిషన్ దాఖలు చేశారు. మరోసారి వాదనలు విన్న కోర్టు మరోసారి మాషుక్కు అనుకూలంగానే తీర్పు వెలువడింది. అయినా అప్పటి పాలకవర్గం, అధికారులు అతడిని విధుల్లోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో మాషుక్ 2015లో మరోసారి లేబర్కోర్టును ఆశ్రయించాడు. దీంతో నగర పంచాయతీ కమిషనర్‌ను బాధ్యులను చేస్తూ కోర్టుకు పిలిపించారు. కోర్టులో అప్పటి కమిషనర్ మాషుక్ను విధుల్లోకి తీసుకుంటామని తెలిపి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి దాటవేశారు. దీంతో కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు రూ.ఽ13 లక్షల జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. నోటీసులకు అధికారులు స్పందించకపోవడంతో నగరపంచాయతీలోని ఫర్నిచర్‌ను సోమవారం కోర్టు అడ్మినిస్టర్ గురునాథ్ వచ్చి జప్తు చేశారు. -
ఇంటి యజమానికి విద్యార్థి టోకరా
నర్సంపేట : నమ్మి గదిని అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ దివాకర్ కథనం ప్రకారం.. పాలకుర్తి మండలం పెద్ద తండాకు చెందిన గుగులోతు శ్రీనాథ్ ఖానాపురం మండలంలోని ఐనపల్లిలో విజేత ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. నర్సంపేట పట్టణంలోని టీఆర్ఎస్ కాలనీలో ఆకారపు కుమారస్వామి ఇంట్లోని గదిలో అద్దెకు ఉంటూ కళాశాలకు వెళ్లొస్తున్నాడు. కొద్దిరోజులు గా జల్సాలు, వ్యసనాలకు అలవాటుపడిన శ్రీనాథ్ ఆగస్టు 30న కుమారస్వామి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి బంగారు అభరణాలను ఎత్తుకెళ్లాడు. సాయంత్రం ఇంటి కి వచ్చిన కుమారస్వామి, కుటుంబ సభ్యులు ఇంట్లో చిందరవందరగా పడేసిన దుస్తులు, సామగ్రిని చూసి ఆందోళనకు గురై ఆభరణాలు చూసుకోగా అపహరణకు గురైనట్లు గుర్తించా రు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనాథ్‌ను రిమాం డ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశం లో ఎస్సైలు ఇ.హరికృష్ణ, హెడ్‌కానిస్టేబుళ్లు సదానందం, మల్లేశం పాల్గొన్నారు. -
ఖానాపురంలోకి మూడు గ్రామాలు
ఖానాపురం : జిల్లాల పునర్విభజనలో భాగంగా మండలంలో మూడు గ్రామాలు నూతనంగా చేరనున్నాయి. ఖానాపురం మండలం వరంగల్ రూరల్ జిల్లాలో కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అదనంగా గ్రామాలు చేరనున్నట్లు సమాచారం. నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలోనే చిన్న మండలంగా ఉన్న ఖానాపురంలో చేరేందుకు గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్, సీతానగర్, భూపతిపేట గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీల్లో తీర్మాణాలు చేసి కలెక్టర్ వాకాటి కరుణకు అందజేశారు. దీంతో ప్రజల అభిప్రాయాలు సేకరించి కలెక్టర్ ఆర్డీఓ రామకృష్ణారెడ్డిని ఆదేశించారు. ఈనెల 16న గూడూరు తహసీల్దార్ లక్ష్మి గ్రామ పంచాయతీల తీర్మాణాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లోకి వెళ్లి ఇటీవల గ్రామ సభలు సైతం నిర్వహించారు. ఒకరిద్దరు మినహా గ్రామాల్లోని ప్రజలు అధికసంఖ్యలో ఖానాపురంలో మండలంలో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. గ్రామసభల్లో ప్రజల అభిప్రాయాలు, తీర్మాణ కాపీలను శనివారం ఆర్డీఓకు అందజేసినట్లు తహసీల్దార్ లక్ష్మి తెలిపారు. ఖానాపురం మండలంలో ప్రస్తుతం 9 గ్రామ పంచాయతీలు ఉండగా చిన్న ఎల్లాపూర్, సీతానగర్, భూపతిపేట గ్రామాలు కలిస్తే గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ మూడు గ్రామాల పరిధిలో 7వేల జనాభా ఉండగా 4500 ఓటర్లు ఉన్నారు. -
నర్సంపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలి
వరంగల్ రూరల్ జిల్లాకు అనువైన ప్రదేశం అఖిలపక్షం ఏకగ్రీవ తీర్మానం పట్టణంలోని వరంగల్ రోడ్డులో రాస్తారోకో నర్సంపేట : వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు చేస్తే నర్సంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించి, కాకతీయలు నిర్మించిన సరస్సు పాకాల పేరును జిల్లాకు నామకరణం చేయాలని జేఏసీ డివిజన్ కన్వీనర్ అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో గుంటి రాంచందర్ అధ్యక్షతన అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లాను రద్దు చేసి ప్రభుత్వం తెరపైకి వరంగల్ రూరల్ జిల్లాను ఏర్పాటు చేసుందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. వరంగల్ జిల్లాలోనే నర్సంపేటను కొనసాగించాలని, ఒకవేళ వరంగల్ రూరల్ జిల్లాలో ప్రభుత్వం కొనసాగించాలనే ఆలోచనకు వస్తే వరంగల్ రూరల్ జిల్లాకు కేంద్రంగా నర్సంపేట రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటుచేయాలన్నారు. తప్పనిసరిగా నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయాలని అఖిలపక్షం ఏకపక్షంగా తీర్మానించినట్లు తెలిపారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో రేపు బంద్ నర్సంపేటను జిల్లా చేయాలని కోరుతూ పట్టణంలో అమరవీరుల స్థూపంవద్ద రాస్తారోకో చేపట్టారు. అనంతరం పలు నినాదాలు చేశారు. ఈనెల 8న బంద్ ప్రకటించినట్లు అంబటి శ్రీనివాస్ తెలిపారు. అయినప్పటికీ నర్సంపేటకు నష్టం కలిగే విధంగా నిర్ణయాలు ఉంటే ఆమరణ నిరాహర దీక్ష చేపడుతామని తెలిపారు. టీఆర్ఎస్, జేఏసీ నాయకుల మధ్య వాగ్వాదం అఖిలపక్ష కమిటీ సమావేశంలో టీఆర్ఎస్, జేఏసీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డిపై జేఏసీ డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడిన విధానంపై టీఆర్ఎస్ నాయకులు కామగోని శ్రీనివాస్ కల్పించుకొని అభ్యంతరం తెలుపుడంతో జేఏసీ నాయకులతో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో అందరూ సర్దుచెప్పి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కొనసాగించారు. జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులు : డాక్టర్ జగదీశ్వర్, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి నర్సంపేట నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రానికి చేయడానికి అన్ని వసతులు ఉన్నాయని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జగదీశ్వర్అన్నారు. రాజకీయ లబ్ధికోసమే జిల్లాల విభజన : నాడెం శాంతి కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జిల్లా పునర్విభజన ప్రజాభీష్టం మేరకే జరగాలే తప్ప రాజకీయ లబ్ధికోసం చేపట్టకూడదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న పిల్లలకు చాక్లెట్లను పంచిన విధంగా జిల్లాల పంపిణీ చేపట్టడం స రైంది కాదన్నారు. జిల్లాలో ప్రజలను ఏకం చేసి వారి అభిష్టం మేరకే జిల్లా విభజన చేపట్టాల ని, రాజకీయ లబ్ధి కోసం చేపట్టకూడదన్నారు. జిల్లా ఏర్పాటుకు వైఎస్సార్సీపీ పూ ర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. జిల్లా కోసం అ ఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమన్నారు. ప్రజల అభీష్టం మేరకు ముందుకు : నాయిని నర్సయ్య, టీఆర్ఎస్ పట్టణ అ«ధ్యక్షుడు ప్రజాభీష్టం మేరకే జిల్లా ఏర్పాటు జరుగుతుందని, జిల్లా పునర్వ్యవస్థీకరణలో మా నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడన్నారు. భవిష్యత్తు కార్యాచరణను మా అధినాయకత్వంతో ప్రకటించి, వారి అభిప్రాయాల మేరకు ముందుకు సాగుతామన్నారు. ప్రాతినిధ్యం తగ్గకుండా చూశారు : రాంచందర్, నగర పంచాయతీ చైర్మన్ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అన్ని నియోజకవర్గా లు చీలిపోయాయని, మా నేత పెద్ది మాత్రం నర్సంపేట ను ఒకే జిల్లాలో కొనసాగే విధంగా కృషి చేశారన్నారు. ఒకవేళ రూరల్ జిల్లా తెరపైకి వస్తే ఖచ్చితంగా నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నగర పంచాయతీ చైర్మన్ పాలెల్లి రాంచందర్ అన్నారు. జిల్లా కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్దం : ఎర్ర యాకుబ్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు వరంగల్ జిల్లాలో నర్సంపేటను కొనసాగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని, ఒకవేళ రూరల్ జిల్లాలోనే నర్సంపేటను కొనసాగించాలంటే మాత్రం నర్సంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కోసం అవసరమైతే ప్రా ణాలకైనా సిద్ధపడుతామన్నారు. -
బంకులో పెట్రోల్ బదులు నీళ్లు
ఆందోళనకు దిగిన వాహనదారులు మహబూబాబాద్ : బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు పోయగా వాహనదారులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మానుకోట పట్టణంలోని ఓ బంకులో సోమవారం రాత్రి జరిగింది. బాధిత వాహనదారుల కథనం ప్రకారం... పట్టణంలో నర్సంపేట రోడ్డులో ఉన్న బంకులో కృష్ణ, శ్రీను, జవహర్, మధు తమ వాహనాల్లో పెట్రోల్ పోయిం చేందుకు బంకుకు వచ్చారు. పెట్రోల్ పో యించుకొని కొద్ది దూరం వెళ్లలా వాహనాలు నిలిచాయి. వెంటనే మెకానిక్ షాప్ వద్దకు తీసుకెళ్లగా వాహనం పెట్రోల్ ట్యాంకులో నీళ్లు ఉన్నాయని చూపాడు. దీంతో వారు బంక్ వద్ద కు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ విషయంపై యజమాని వాహనాలను మరమ్మతు చేయిస్తానని హామీ ఇచ్చాడు. పెట్రోల్ తెచ్చిన ట్యాంకర్‌లోనే నీళ్లు వచ్చాయని బంక్ సిబ్బంది చెబుతున్నారు. కాగా ఇదే బంకులో నీళ్లు రావడం ఇది రెండోసారి. అప్పుడు కూడా వాహనదారులు ఆందోళనకు దిగారు. -
చోరీ కేసులో నలుగురి అరెస్ట్
నర్సంపేట : డివిజన్ వ్యాప్తంగా పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సైలు బండ నారాయణరెడ్డి, హరికృష్ణ తెలిపారు. బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలోని బస్టాండ్ ఎదుట వాహనాలు తనిఖీ చేస్తుం డగా తాళ్లపల్లి రాజు, వేమునూరి సుధాకర్, గుట్టోజు లింగాచారి, ఉల్లేరావుల రాహుల్‌లు తమను చూసి పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఏడాదికాలంగా వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన ఆభరణాలను విక్రయించేందుకు వరంగల్కువెళ్తున్నట్లు తెలిపారు. ముగ్దుంపురంలో 12 గ్రాముల బంగారం, మల్లంపల్లిలో తులమున్న ర బంగారం, 20 తులాల వెండి, తులం బంగారు గొలుసు, ఉంగరాలు, రెండు బంగారు కమ్మలు, 20 తులాల వెండి గొలుసులు, మేడారంలో జాతరకు ముందు రెండున్నర తులాల బంగారం దొంగిలించినట్లు నిందితులు అంగీకరించారన్నారు. నర్సంపేట పట్టణంలోని సంజయ్‌గాంధీ రోడ్లో రెండున్నర తు లాల గోపితాడు, తులమున్నర బం గారు మాటీలు, 15 తులాల పట్టగొలుసులు, పాపయ్యపేటలో తులం బంగారం, 10 తులాల వెండి, నర్సంపేట మండలంలోని రాజుపేటలో మూడున్నర తులాల బంగారం, 8 తులాల వెండిని సదరు నలుగురు వ్యక్తులు అపహరించినట్లు పేర్కొన్నారు. ఆ చోరీ సొత్తులో కొంత విక్రయించి రూ.30 వేలతో జల్సా చేశారన్నారు. ఆభరణాలను స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో ప్రొబేషనరీ ఎస్సై అశోక్, ఏఎస్సై కమలాకర్, సిబ్బంది మల్లేశ్, కుమార్, రాజిరెడ్డి పాల్గొన్నారు. -
తాటి, ఈత మొక్కలు నాటుతున్నాం
వరంగల్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తాటి, ఈత మొక్కలను ఎక్సైజ్ శాఖ ద్వారా చెరువు గట్లపై నాటుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు వెల్లడించారు. ఆ చెట్లను కాపాడుకునే బాధ్యత ప్రజలదే అని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో మంగళవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పద్మారావు పాల్గొన్నారు. అలాగే అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వంద నోటుకు ఎన్ని వంకలో..
హన్మకొండ: వరంగల్ జిల్లా నర్సంపేట ఎస్బీహెచ్ ఏటీఎంలో వింత వంద నోటు వచ్చింది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డ్రైవర్‌గా పని చేస్తున్న లైన్ వెంకటేశ్వర్లు స్వగ్రామం నర్సంపేట. అయితే బుధవారం నర్సంపేటలోని ఎస్బీహెచ్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయగా, అందులో ఈ వంద నోటు వచ్చింది. దీనికి రెండు సిరీస్ నంబర్లు ఉన్నాయని, 4యూఎల్ 266626, 4యూఎల్ 266726 నంబర్లు ముద్రించి ఉన్నాయని చెప్పాడు. రెండు నంబర్ల మధ్య తేడా 101 సంఖ్యగా ఉందని, ముద్రణలో లోపం వల్ల ఇలా వచ్చినట్లుంద ని తెలిపాడు. -
మా పరమేశ్వర్ జాడేది..?
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు నర్సంపేట : ఏడు రోజులు గడిచారు.. వూ పరమేశ్వర్ జాడ తెలియుట్లేదు.. తిరిగొత్తాడనే ఆశ ఉంది.. టీవీల ముందు కూసోని ఎదురు చూస్తున్నం.. ఈ వూటలు నర్సంపేటలోని చిందం పరమేశ్వర్ కుటుంబ సభ్యులవి. హివూచల్‌ప్రదేశ్‌లోని బియూస్ నదీ ప్రవాహంలో కొట్టుకుపోరు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నర్సంపేట పట్టణానికి చెందిన చిందం పరమేశ్వర్ ఉన్న విషయం తెలిసిందే. అతడి కోసం తల్లిదండ్రులు వీరన్న-ఉవు, అక్క ప్రియూంక, అన్న ప్రశాంత్ కన్నీరువుున్నీరుగా రోదిస్తున్నారు. పరమేశ్వర్ జాడ తెలుసుకోవడానికి సోదరుడు ఘటనా స్థలానికి వెళ్లివచ్చాడు. అయినా జాడతెలియలేదు. పరమేశ్వర్ క్షేవుంగా ఇంటికి రావాలని అతడి ప్రాణమిత్రులు, బంధువులు, పలు సంఘాల బాధ్యులు ఇష్టదైవాలను వేడు కుంటూ సంఘీభావం తెలుపుతున్నారు. క్షణమొక యుగం కన్న బిడ్డల కోసం ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. హిమచల్‌ప్రదే శ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నర్సంపేటకు చెందిన పరమేశ్వర్, వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన అఖిల్ ఉన్నాడు. సంఘటన జరిగి ఏడు రోజులు గడిచానా వారి ఆచూకీ దొరక్కపోవడంతో ఇంటిల్లిపాది ముద్దకూడ ముట్టడంలేదు. కంటిమీద కునుకులేదు. ఏడ్చి ఏడ్చి కళ్లల్లోనే నీరు ఇంకిపోతోంది. క్షణమొక యుగంగా గడుపుతున్నారు. వరంగల్ : హిమచల్‌ప్రదే శ్‌లోని బియాస్ నదిలో గల్లంతైనా ఇంజినీరింగ్ విద్యార్థి అఖిల్ కోసం కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన అఖిల్ ఈనెల 3న రాత్రి స్వగృహం నుంచి విజ్ఞాన యాత్రకు బయలు దేరిన అతను తిరిగి ఈనెల 15న రాత్రికి ఇంటికి తిరిగొస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. కొడుకును ఉన్నత చదువులు చదివించి గొప్ప హోదా లో చూడాలని ఆ తల్లిదండ్రుల ఎన్నో కలలు కన్నారు. ఎన్ని ఇబ్బందులుపడినా కొడుకుకు కష్టమంటే తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ చది విస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులు నేడు (ఆది వారం) తిరిగి రావాలసి ఉంది. ఈనెల 8న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదీ ప్రవాహం లో తోటి విద్యార్థులతోపాటు అఖిల్ గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న నాటి నుంచి తల్లిదండ్రులు మిట్టపల్లి సంజయ్-సునీత, అక్క మౌనిక నిద్రహారాలు మాని అఖిల్ కోసం ఎదురు చూస్తున్నారు. అతడిని గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు. చిన్న విషయమైనా జాగ్రత్త తీసుకునే తన కుమారుడు వరదముంపు నుంచి బయట పడలేకపోయాడని తండ్రి సంజయ్ కొడుకును తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. ‘కొడుకు ఇవ్వాల(15న) ఇంటికి వస్తానని చెప్పిండు.. తప్పకుంట వస్తడు’ అని విలపిస్తున్న తల్లి సునీతను ఓదార్చడం ఎవరి తరమూ కావడంలేదు. కనీస సమాచారం ఇవ్వని అధికార యంత్రాంగం హిమచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన గిర్మాజీపేటకు చెం దిన అఖిల్ యోగ క్షేమాలను ఆ కుటుంబ సభ్యులకు తెలియజేయడంలో జిల్లా అధికార యం త్రాంగం విఫలమైంది. బియాస్ నదిలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విషయాలను ఎప్పటికప్పడు తెలుసుకుంటూ పురోగతిని ఆ కుటుంబ సభ్యులకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉండగా ఇంత వరకు ఎవరూ అఖిల్ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చిన దాఖ లాలు లేవు. దీంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
కడియం, రేవూరికి నాన్ బెయిలబుల్ వారెంట్
వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. 2009 ఫిబ్రవరి 19న రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల రిజర్వాయర్‌లో దక్షిణ కాలువ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నాటి టీడీపీ ఎమ్మెల్యేలైన కడియం, రేవూరి ముందుగానే రిజర్వాయర్ నీళ్లు వదిలారు. అక్కడే ఉన్న అప్పటి ధర్మసాగర్ ఎంపీపీ ఆర్.రాజు నేతృత్వంలో వారిని అడ్డుకున్నారు. వీరిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలతో పోలీసులు కడియం, రేవూరి సహా 18 మందిపై కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా వారు వాయిదాలకు రాలేదు. సోమవారం వాయిదా ఉండగా.. గైర్హాజరుకు శ్రీహరి, ప్రకాష్‌రెడ్డి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి ప్రమీలాజైన్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తక్షణమే అరెస్టుకు ఆదేశిస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. -
కొత్త రాష్ర్టంలో సరికొత్త రికార్డు
నర్సంపేట, న్యూస్‌లైన్ : మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. నిన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు చేసి నర్సంపేట జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తి తో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 87.59 శాతం ఓటింగ్‌తో తెలగాణ కొత్త రాష్ట్రం లో సరికొత్త రికార్డును సొంతం చేసుకుని నంబ ర్-1 స్థానంలో ఉంది. సమష్టి కృషి నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలు, 95 రెవెన్యూ గ్రామాలు, 106 గ్రామ పంచాయతీలు, 2,85,360 మంది జనాభా, 2,05,516 మంది ఓటర్లున్నారు. ప్రజలు ఓటు విలువ తెలుసుకోవడంలో అధికారుల కృషితోపాటు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల పట్టుదల కూడా తోడైంది. 1999 నుంచి ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదవుతూ వస్తోం ది. నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలే అధికంగా ఉన్నాయి. అందులోనూ రోడ్డు, ర వాణా సౌకర్యం అంతంత మాత్రమే. అయినా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు కాలినడకన పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు. ప్రశాంత వాతావరణం నర్సంపేటకు కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుంది. ఇక్కడ హత్యా రాజకీయాలూ ఉండే వి. ప్రతీ ఎన్నికల్లో కమ్యూనిస్టులే గెలుస్తూ వచ్చేవారు. ఓడించేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలను అడ్డుకునే క్రమంలో ఘర్షణలు జరిగేవి. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో హత్యలకు దారితీసేది. ఒకానొక దశలో ఓటు వేయడానికి ప్రజలు భయపడే వారు. ఓంకార్ ఎంసీపీఐ స్థాపించిన తర్వాత గెలుపు కోసం ఆయన ప్రతి ఒక్కరితో ఓటు వేయించడానికి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఆయన కృషికి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రత్యేక చొరవ తీసుకుంది. అధికారుల సహకారంతో క్రమేణా ప్రజల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవడమే కాకుండా రికా ర్డు సాధించి ఆదర్శంగా నిలవడానికి పునాదు లు పడ్డాయి. ఉద్దండుల పోటీ ఓ కారణం నియోజకవర్గం జనరల్ కేటగిరికి రిజర్వ్ కావడంతో జిల్లా రాజకీయాల్లో ఇక్కడి నాయకుల పాత్ర కీలకంగా మారింది. ఇక్కడి నుంచి పోటీ చేసే వారే ఆయా పార్టీలకు జిల్లా అధ్యక్షులుగా కొనసాగడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటర్లను పోలింగ్ బూత్‌ల వరకు తీసుకువచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించ డం ఓటింగ్ అత్యధికంగా నమోదు కావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక 10 జిల్లాల్లో నర్సంపేటలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం గర్వంగా ఉందని ఆయా నాయకులు ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు -
78.54 శాతం పోలింగ్ నమోదు
2009 కన్నా 6 శాతం ఎక్కువ నర్సంపేటలో అత్యధికం చివరి స్థానంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి పోలింగ్ 6 శాతం పెరిగింది. 2009లో 72.84శాతం ఉండగా.. ఇప్పుడు 78.54 శాతం నమోదైంది. ఓటరు చైతన్య కార్యక్రమాలతో పాటు పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాట్లపై విస్తృత ప్రచారం, పోలింగ్ రోజు ఎండ తీవ్రత తక్కువగా ఉండడం వంటి అంశాలు పోలింగ్ పెరగడానికి దోహదం చేశాయి. మారుమూల ప్రాంతాలైన భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ ప్రక్రియ పూర్తిచేసినా.. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ గతం కన్నా పెరిగి 80శాతానికి చేరువైంది. ప్రధానంగా అభ్యర్థుల మధ్య ఉన్న పోటీ ప్రభావం పోలింగ్ శాతంపై కనిపించింది. తూర్పులో 11.95 శాతం పెరుగుదల వరంగల్ తూర్పు నియోజకవర్గం కూడా పూర్తిగా అర్బన్ ప్రాంతమైనప్పటికీ పోలింగ్ శాతంలో తూర్పు, పశ్చిమకు తీవ్ర వ్యత్యాసం ఉంది. ఎందుకంటే పశ్చిమలో 2009తో చూస్తే అతితక్కువగా కేవలం 3శాతం మాత్రమే ఓటింగ్ పెరిగితే.. తూర్పులో మాత్రం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్నా అత్యధికంగా పోలింగ్ పెరిగింది. 2009తో చూస్తే సుమారు 11.95శాతం పెరగడం విశేషం. 2009లో 59.87 శాతం ఉండగా 2014లో 71.82 శాతంగా నమోదైంది. తూర్పు, పశ్చిమ రెండూ అర్బన్ పరిధిలోవే అయిప్పనటికీ... పోలింగ్ శాతంలో తేడా ఉండటం గమనార్హం. పశ్చిమ చివరి స్థానంలో... జిల్లాలోని మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ పరుగులు పెట్టగా.. అర్బన్ ప్రాంత ఓటర్లుండే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం పాత కథే పునరావృతమైంది. 2009తో పోల్చి చూస్తే కాస్త నయం అనిపించినా అధికారులు అంచనాల మేరకు ఇక్కడ పోలింగ్ శాతం పెరుగలేదు. అయితే ఇక్కడ ఓటర్ల నమోదు నుంచి ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్, పోల్‌స్లిప్‌ల పంపిణీ, ఓట్లు గల్లంతు, పోలింగ్ రోజు అధికారుల నిర్లక్ష్యపు పనులు వంటి అనేక కారణాలు తక్కువ పోలింగ్ శాతం నమోదుకు కారణంగా కనిపిస్తున్నాయి. జిల్లా పోలింగ్ 6.19శాతం పెరిగితే పశ్చిమలో మాత్రం 3.61శాతం మాత్రమే పెరిగింది. ఆరు స్థానాల్లో 80 శాతానికి పైగా... స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలలో ఈసారి 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. జనగామ, భూపాలపల్లిలో కూడా కొద్దిపాటి తేడాతో 80 శాతంగా ఉంది. ఇక పెరుగదల విషయంలో వరంగల్ తూర్పు తర్వాత వర్ధన్నపేట (9 శాతం), భూపాలపల్లి(8.69 శాతం), పరకాల (8.25 శాతం), జనగామ (7.97 శాతం) నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. ఆ బూత్‌లో ఓటు వేయునిది ఒక్కరే ..! నర్సంపేట : పోలింగ్‌లో అగ్రస్థానంలో నిలుస్తున్న నర్సంపేట నియోజకవర్గంలో వురో రికార్డు నమోదైంది. చెన్నారావుపేట వుండలం పాత వుుగ్దుంపురంలోని 179 పోలింగ్ బూత్ పరిధిలో ఒక్క వుహిళ వూత్రమే ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఈ బూత్‌లో 867 ఓట్లు ఉండగా.. 414 వుంది పురుషులు, 453 వుంది వుహిళలు ఉన్నారు. పురుషులందరూ ఓటు హక్కు వినియోగించుకొని ఓటు చైతన్యాన్ని చాటిచెప్పగా.. ఒక్క వుహిళ వూత్రమే ఓటు హక్కు వినియోగించుకోలేదు. దీంతో ఈ బూత్‌లో పోలింగ్ 99.89 శాతంగా నమోదైంది. -
'పొన్నాల నా టికెట్ అమ్ముకున్నాడు'
తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కుట్రపూరింతగా వ్యవహరించి తనకు వచ్చిన టికెట్‌ను వేరొకరికి అమ్ముకున్నారని నర్సంపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మాధవ్ రెడ్డి ఆరోపించారు. శనివారం వరంగల్‌లో మాధవ్ రెడ్డి మాట్లాడుతూ... పొన్నాల చర్యల వల్ల తాను తీవ్ర మనస్థాపం చెందినట్లు చెప్పారు. అందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నర్సంపేటలో తన నామినేషన్ ఉపసంహరించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. తన గెలుపుతో పొన్నాలకు బుద్ది చెప్తానని మాధవ్ రెడ్డి తెలిపారు. -
'పొన్నాల నమ్మకం ద్రోహం వల్లే టికెట్ పోయింది'
వరంగల్: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై డీసీసీ అధ్యక్షుడు దొంతు మాధవరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొన్నాల నమ్మకద్రోహం వల్లే తనకు కేటాయించిన నర్సంపేట టికెట్ చేజారిందని దొంతు మాధవరెడ్డి ఆరోపించారు. అయితే తనకు నర్సంపేట టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని మాధవరెడ్డి హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న తనకు టికెట్ కేటాయించిన తర్వాత మరో వ్యక్తికి ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్దితో సేవలందించిన తనను అవమానించారని తన అనుచరులతో వాపోయినట్టు సమాచారం. నర్సంపేట టికెట్ ను జేఏసీ కోటాలో లెక్చరర్ జేఏసీ చైర్మన్ కత్తి వెంకటస్వామికి కేటాయించిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ లో వివాదం రేపుతున్ననర్సంపేట అసెంబ్లీ టికెట్
నర్సంపేట: కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన టి.కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకున్న లుకలుకలు ఒక్కొకటి బహిర్గతమవుతున్నాయి. కొంతమంది సిట్టింగ్ లను దూరంగా పెట్టినా, అభ్యర్థుల ఎంపికపై మాత్రం అసంతృప్తి వాదులు నిరసన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. తొలుత ప్రకటించిన మల్కాజిగిరి, కంటోన్మెంట్ స్థానాలను మార్చిన కాంగ్రెస్.. వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ పై వెనక్కి తగ్గింది. ముందుగా మాధవరెడ్డిని పేరును జాబితాలో చేర్చిన కాంగ్రెస్ పెద్దలు అనంతరం దానిపై వెనకంజ వేశారు. దీంతో అప్పుడే నిరసన గళం వినిపిస్తోంది. ఒక్కసారి ఇచ్చిన టికెట్ ను వెనక్కి తీసుకోవడం సరికాదంటూ కేంద్రమంత్రి బలరాం నాయక్ తెలిపారు. ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి టికెట్ నిరాకరించి..పార్టీతో సంబంధం లేని జేఏసీ నేత కత్తి వెంకటస్వామికి ఇవ్వడం ఎంతమాత్రం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్లు కూడా పార్టీ విధానాన్ని తప్పుబడుతున్నారు. ఈ అంశం తీవ్ర వివాదం అయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. దీంతో స్పందించిన దిగ్విజయ్.. ఈ రాత్రికల్లా సమస్యను పరిష్కరిస్తామని సూచించారు. -
తెలంగాణ అభ్యర్థులను మార్చిన ఏఐసిసి
ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇంతకు ముందు ప్రకటించిన శాసనసభకు పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను ఏఐసిసి మార్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, తుంగతుర్తి, నర్సంపేట స్థానాలకు అభ్యర్థులను మార్చినట్లు ఏఐసీసీ ప్రకటించింది. తుంగతుర్తిని అద్దంకి దయాకర్‌కు, నర్సంపేటను కత్తి వెంకటస్వామికి, కంటోన్మెంట్ గజ్జెల కాంతంకు కేటాయించారు. ఇంతకు ముందు ప్రకటించిన జాబితాలో కంటోన్మెంట్ (ఎస్సీ)ను క్రిషాంక్‌కు, నర్సంపేటను డి.మాధవరెడ్డికి, తుంగతుర్తి(ఎస్సీ) ని గుడిపాటి నర్సయ్యకు కేటాయించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు స్వయంగా కలుగజేసుకొని ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ జేఏసీ నేతలు కత్తి వెంకటస్వామి, రాజేందర్ రెడ్డి, సినీ దర్శకుడు శంకర్, గజ్జెల కాంతం తదితరులు ఈ ఉదయం పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన విషయం తెలిసిందే. జేఏసీ నేతలకు పోటీ చేసే అవకాశం కల్పించేందుకు అవకాశం కల్పిస్తామని సోనియా వారికి హామీ ఇచ్చారు. ఆ మేరకు జాబితాలో మార్పులు చేశారు. రాజేందర్ రెడ్డి, శంకర్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని సోనియా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
ముందు బస్సు...వెనక టైర్లు
ఖానాపురం : 25మంది ప్రయాణికులతో బస్సు వెళుతోంది. ఉన్నట్టుండి వెనక టైర్లు హౌసింగ్‌తో సహా ఊడిపోయాయి. బస్సు అక్కడే కూలబడింది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీస బస్సు బుధవారం నర్సంపేట నుంచి కొత్తగూడ మండలం వేలుబెల్లికి వెళ్తుండగా ఖానాపురం మండలం అశోకనగరం శివారులోకి రాగానే కోడిపిల్ల రోడ్డుకు అడ్డు రావటంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. తిరిగి బస్సు వేగాన్ని పెంచుతుండగా వెనుక వైపు ఉన్న నాలుగు టైర్లుతో ఉన్న యాక్సిల్ హౌసింగ్ ఊడిపోయి రోడ్డుపై పడిపోయింది. దీంతో బస్సు కుదుపునకు గురవటంతో ప్రయాణికులు ఆందోళనకు గురై కేకలు వేశారు. టైర్లు ఊడిపోయినా ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో ఎస్బీహెచ్ బ్యాంక్ దగ్ధం
నర్సంపేట, న్యూస్‌లైన్ : షార్ట సర్క్యూట్‌తో ఎస్బీహెచ్ బ్యాంక్ దగ్ధమైన సంఘటన పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మేనేజర్ అవుర్కువూర్ కథనం ప్రకారం.. బ్యాంక్ పునఃనిర్మాణంలో భా గంగా ఇటీవల కార్యాలయంలో రెండు నూతన గదుల నిర్మాణం చేపడుతున్నారు. అయితే ఇందులో ఒక గది ఇటీవల పూర్తి కావడంతో పాత గదుల్లో ఉన్న రికార్డులను తీసి సిబ్బంది అందులో భద్రపర్చారు. ఈ క్రమంలో రెండో గదిలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా ప్రవూదవశాత్తు తెల్లవారుజామున 3 గంటలకు విద్యుత్ వైర్లు షార్ట్‌సర్క్యూట్‌కు గురయ్యాయి. గమనించిన చుట్టుపక్కల వారు ఫైర్‌స్టేషన్‌కు సవూచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వుంటలు ఆర్పే ప్రయుత్నం చేసినప్పటికీ గదిలో ఉన్న రికార్డులు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. కాగా, ఈ సంఘటనలో భవనం ధ్వంసమై సువూరు 30 లక్షల నష్టం జరిగినట్లు మేనేజర్ పేర్కొన్నారు. ఖాతాదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, బ్యాంక్‌లో పనులు కార్యకలాపాలు యుథావిధిగా కొనసాగుతాయుని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సంఘటనా స్థలాన్ని ఎస్బీహెచ్ డీజీఎం వూర్చ్ ఫుటీ, ఏజీఎం పటేల్, డీఎస్పీ కడియుం చక్రవర్తి, టౌన్ సీఐ వాసుదేవరావు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. -
ఆదుకోనిఆపద్బంధు
=విధివంచితులకు అందని సాయం =దరఖాస్తు చేసుకున్న వారు 76 మంది =పెండింగ్‌లో ఉన్నవి 41... నర్సంపేటలోనే అధికం =ఏడాదిగా ప్రభుత్వ కార్యాలయూల చుట్టూ ప్రదక్షిణలు =కనికరించని సర్కారు... అధికారులు నర్సంపేట, న్యూస్‌లైన్: అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్ద చనిపోతే బాధితులకు సాయమందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపద్భందు పథకం జిల్లావాసులకు అందని ద్రాక్షగా మారుతోంది. పరిశీలన పేరిట ఇన్సూరెన్స్ కంపెనీలు జాప్యం చేస్తుండడం... అధికారుల నిర్లక్ష్యం... ప్రజాప్రతినిధులు అలసత్వం వెరసి ఆపద్బంధు పథకం లక్ష్యం నీరుగారుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 76 వుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా... 29 వుందికే ఆర్థిక సాయం అందింది. ఆరు దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా... ఇంకా 41 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వ సాయం కోసం నర్సంపేట డివిజన్లో అత్యధికంగా 19 మంది బాధిత కుటుంబాలు ఏడాదిగా ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయూలు చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారుు. తక్కువ నిధుల కేటారుయింపు ఆపద్భందు పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ. లక్ష సాయుం అందించాలి. జిల్లాలో ఏటా 400 వుంది వరకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే అధికారులు క్షేత్రస్థాయిలోనే చాలా వరకు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. 40 నుంచి 50 వుందికి మాత్రమే ఇస్తున్నారు. ఆపద్బంధు కింద ప్రభుత్వ కేటారుయింపులు తక్కువగా ఉండడంతో వారు ఆ మేరకే సరిపుచ్చుతున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన దరఖాస్తుదారులకు వురుసటి సంవత్సరం బడ్జెట్లో ఇస్తున్నావుని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా... జిల్లాలో అటువంటి ఛాయులు కనిపించడంలేదు. సీఎం సహాయనిధికి మళ్లింపు ఆపద్బంధు పథకం అవులులో చిత్తశుద్ధి లోపించడంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న విధివంచితులకు ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు. ఈ పథకం కింద దరఖాస్తు చేసిన వారిని నిధుల కొరతతో సీఎం సహాయు నిధికి వుళ్లిస్తున్నారు. ఫలితంగా వారు ఆపద్భందు పథకానికి అర్హత కోల్పోతున్నారు. రూ. ఐదు వేల నావువూత్రపు సాయమందుతుండడంతో సదరు కుటుంబాలకు అవి ఏవిధంగా ఉపయోగపడడడం లేదు. పత్తి ఏరుతూ కనిపిస్తున్న ఈ వృద్ధురాలు నల్లబెల్లి మండలం కొడైలుపల్లికి చెందిన ఒదెల సమ్మక్క ఆమె భర్త ఈ ఏడాది మే 17న జరిగినరోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు... ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరి కూతుళ్ల వివాహం కాగా... పెద్దకొడుకు వరంగల్‌లో టైలర్ పని నేర్చుకుంటున్నాడు. చిన్న కొడుకు ఆటో ట్రాలీ నడుపుతున్నాడు. భర్త చనిపోయిన నాటి నుంచి కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో రోజూ కూలికి పోతోంది. ఆమె ఆపద్బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ... ఇప్పటివరకు సాయమందలేదు. దీంతో సమ్మక్క వ్యక్తం చేసిన ఆవేదన ఆమె మాటల్లోనే...‘నా పెనిమిటి పోరుున తర్వాత విధి లేక రూ. 50 వేల అప్పు చేశా... ఆపద్బంధు పైసలు వస్తాయని చెబితే ఇన్నాళ్లు ధైర్యంగా ఉన్నా. అవి వత్త లేవు... ఇవి ఎట్లా తీర్చాలో తెలియడం లేదు.’