నర్సంపేటకు సబ్‌కోర్టు మంజూరు | sub court granted to Narsampetaku | Sakshi

నర్సంపేటకు సబ్‌కోర్టు మంజూరు

Oct 1 2016 1:15 AM | Updated on Sep 4 2017 3:39 PM

నర్సంపేట మున్సిఫ్‌ కోర్టుకు అదనంగా సబ్‌ కోర్టు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం పట్టణంలో మున్సిఫ్‌ కోర్టు, సెకండ్‌ మెజిసే్ట్రట్‌ కోర్టు, స్పెషల్‌ కోర్టు ఉన్నాయి. ఇంకా పైస్థాయి కోర్టుకు వెళ్లాలంటే మహబూబాబాద్‌ పోవాల్సిందే. దీంతో డివిజన్‌లోని ఆరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

నర్సంపేట :  నర్సంపేట మున్సిఫ్‌ కోర్టుకు అదనంగా సబ్‌ కోర్టు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం పట్టణంలో మున్సిఫ్‌ కోర్టు,  సెకండ్‌ మెజిసే్ట్రట్‌ కోర్టు, స్పెషల్‌ కోర్టు ఉన్నాయి. ఇంకా పైస్థాయి కోర్టుకు వెళ్లాలంటే  మహబూబాబాద్‌ పోవాల్సిందే. దీంతో డివిజన్‌లోని ఆరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
 
డివిజన్‌ ప్రజల సౌకర్యార్ధం నర్సంపేటకు సబ్‌ కోర్టు ఏర్పాటు చేయాలని అధికారులకు,  ప్రజాప్రతినిధులకు విన్నవించగా రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్‌ ఆర్‌డీ 615 జీవో జారీ చేసింది. సబ్‌ కోర్టు ఏర్పాటుతో  30 మంది సిబ్బంది, 40 మంది న్యాయవాదులు, 150 మందికి అనధికారికంగా ఉపాధి లభించనుంది. ఇటీవల నర్సంపేటకు నూతన భవన నిర్మాణం కోసం రూ. 4 కోట్లతో ప్రతిపాధనలు పంపించారు. త్వరలోనే నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement