సాక్షి, వరంగల్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఇక, రెండు రోజుల్లో వరంగల్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గమన్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలు బీజేపీ ఆఫీసుపైనే దాడులు చేయడం సంచలనంగా మారింది. కొందరు నేతలు తమకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు.
వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణంలో బీజేపీలో ఒక్కసారిగా ఎప్పటి నుండో నివురుగప్పిన ట్లుగా ఉన్న అసమ్మతి బయటకు వచ్చింది. పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంపై సొంత పార్టీ నేతలు దాడి చేశారు. పార్టీలో మాకు గుర్తింపు లేదు, ప్రాధాన్యం లేదని దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో, ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. వాగ్వాదంలో భాగంగా పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు. అయితే, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలోనే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. ఇక, ప్రధాని మోదీ పర్యటన వేళ వరంగల్ జిల్లాలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: త్వరలో ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నాం.. రేవంత్ సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment