వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. 2009 ఫిబ్రవరి 19న రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల రిజర్వాయర్‌లో దక్షిణ కాలువ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నాటి టీడీపీ ఎమ్మెల్యేలైన కడియం, రేవూరి ముందుగానే రిజర్వాయర్ నీళ్లు వదిలారు. అక్కడే ఉన్న అప్పటి ధర్మసాగర్ ఎంపీపీ ఆర్.రాజు నేతృత్వంలో వారిని అడ్డుకున్నారు.
వీరిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలతో పోలీసులు కడియం, రేవూరి సహా 18 మందిపై కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా వారు వాయిదాలకు రాలేదు. సోమవారం వాయిదా ఉండగా.. గైర్హాజరుకు శ్రీహరి, ప్రకాష్‌రెడ్డి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి ప్రమీలాజైన్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తక్షణమే అరెస్టుకు ఆదేశిస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
కడియం, రేవూరికి నాన్ బెయిలబుల్ వారెంట్
Published Tue, May 27 2014 2:19 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM
Advertisement