Revuri Prakash Reddy
-
కొండా వర్సెస్ రేవూరి..
-
ఫ్లెక్సీ వార్.. గీసుకొండ పోలీస్ స్టేషన్ కు కొండా సురేఖ
-
ఫ్లెక్సీ వార్.. కొండా సురేఖ వర్సెస్ రేవూరి
సాక్షి, వరంగల్: గీసుకొండ పీఎస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మండలంలోని ధర్మారంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో కొండా వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని రేవూరి వర్గీయులు నిరసన తెలిపారు.ఈ క్రమంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గీసుకొండ పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ.. సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు కొండా సురేఖ వర్గీయులు భారీగా చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.గీసుకొండ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. ఇక్కడి వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. పార్టీ వర్గాలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారం కాదు.. స్థానికతకు సంబంధించిన ఇష్యూ.. ఎవరు తొందరపడినా పార్టీకే నష్టం.. సమన్వయం పాటించడం మంచిందని రేవూరి అన్నారు.ఇదీ చదవండి: సునీల్ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ -
బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
-
రైట్ లీడర్‌గా రాంగ్ పార్టీలో ఉండలేకపోయా..
సాక్షి, వరంగల్: ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ అవసరమని.. అందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరారని మాజీ ఎమ్మెల్యే, ఇటీవల బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హన్మకొండలోని తన స్వగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవూరి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని తన సొంత జాగీరులా భావిస్తున్న కేసీఆర్.. తెలుగుదేశం పార్టీపై కక్షగట్టి ఆంధ్రా పార్టీగా ముద్రవేసి ప్రజలకు దూరం చేశారని పేర్కొన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో హన్మకొండ పశ్చిమ నుంచి పోటీ చేసిన సందర్భంగా పలువురు ఓటర్లు, శ్రేయోభిలాషులు.. ‘మీరు మంచోళ్లే కానీ మీరు పోటీ చేస్తున్న పార్టీ రాంగ్’ అని చెప్పడంతో రైట్ పర్సన్‌గా రాంగ్ పార్టీ(టీడీపీ)లో ఉండలేక బీజేపీలో చేరానని ప్రకాశ్‌రెడ్డి వివరించారు. ‘పార్టీలు మారడం నాకు ఫ్యాషన్ కాదు.. అట్లనుకుంటే చాలా పార్టీలు, చాలా సార్లు, చాలా ఆఫర్లు ఇచ్చాయి... అయినా వెళ్లలేదు.. నేను స్వచ్చంద సంస్థలు నడవడం లేదు.. రాజకీయ పార్టీలో ఉన్నా... ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా.. రాజకీయ పునరేకీకరణ కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుని ఆ పార్టీలో చేరాను’ అని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. లేఖలు ఇప్పించడంలో కీలకం తెలంగాణ ఉద్యమం సందర్భంగా చంద్రబాబుతో రెండు సార్లు అనుకూలంగా లేఖలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించానని.. అప్పటి కేంద్రమంత్రి చిదంబరంను కలిసిన అఖిలపక్షంలో కూడా తెలంగాణ వాణిని గట్టిగా వినిపించానని ప్రకాశ్‌రెడ్డి గుర్తుచేశారు. కాగా, టీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, రజాకార్లను మించిన నిర్భంధం సాగుతుందని అన్నారు. టీఆర్ఎస్లో అంతర్గత ప్రజాస్వామ్యం దెబ్బతిందని, కుటుంబ పెత్తనం నడుస్తోందదని పేర్కొన్నారు. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనని పేర్కొన్న ఆయన... టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఆలోచించి నిర్బంధం, అణచివేతల నడుమ కొనసాగే కంటే రాజకీయ పునరేకీకరణ కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. నర్సంపేట ప్రజలతోనే నా జీవితం ముడిపడి ఉంటుంది రాజకీయంగా ఎదుగుదలకు అవకాశం కల్పించిన, ఆశీర్వదించిన నర్సంపేట నియోజకవర్గం ప్రజలతోనే తన రాజకీయ జీవితం ముడిపడి ఉంటుందని రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా తనకు ఎప్పుడు అవకాశం వచ్చినా నర్సంపేట నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడంలో ముందు నిలుస్తానని తెలిపారు. ‘మా నాన్న కూడా ఒకప్పుడు ప్రజలతో చెప్పారు... నాకు ముగ్గురు కొడుకుల్లో ఒకరిని నర్సంపేట ప్రజలకు ఇస్తున్నా’ అని.. ఆ మాటకు కట్టుబడి నర్సంపేట ప్రజలతోనే ఉన్నానని, హన్మకొండ పశ్చిమలో 44 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయంటే నర్సంపేటలో ఉన్న పేరు, అక్కడ చేసిన పనులే కారణమని తెలిపారు. అయితే, మిగిలిపోయిన పనులు కూడా చేసి నర్సంపేట ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది’
సాక్షి, వరంగల్: తన రాజకీయ భవిష్యత్తు గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించిన అనంతరమే తాను బీజేపీలో చేరానని రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. టీడీపీపై వ్యతిరేకతతోనో, లేక చంద్రబాబుపై కోపంతోనో తాను పార్టీకి రాజీనామా చేయలేదని తెలిపారు. తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీలో చేరానని పేర్కొన్నారు. వరంగల్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీని తెలంగాణలో కనిపించకుండా చేయడంలో ఆయన విజయవంతమయ్యారని అన్నారు. తాను రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాలా లేక పార్టీ మారాలా అన్న విషయంపై చంద్రబాబుతో సుధీర్ఘంగా చర్చించానని వెల్లడించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను ఎదుర్కొవాలంటే రాజకీయ పునరేకీకరణ జరగాలని, దానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వం జాతీయ స్థాయిలో గర్వపడేలా ఉంది కాబట్టే పార్టీలో చేరాన్నన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో నిజమైన ఉద్యమ కారులెవ్వరూ ప్రశాంతంగా లేరని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, అందుకే నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. -
బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యం లో బుధవారం ఢిల్లీ వెళ్లిన నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మురళీధర్‌రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా.. లక్ష్మణ్ పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలనపై పోరాడే సత్తా ఒక్క బీజేపీకే ఉందని, రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందనేందుకు నేతల వరుస చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. ఓర్వలేక తప్పుడు కేసులు: లక్ష్మణ్ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి బీజేపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమంగా యూరియా కొరత సృష్టించి కేంద్ర ప్రభుత్వంపై నెపంనెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. యూరియా డిమాండ్‌ను అంచనా వేయ డంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, వ్యవసా య ప్రణాళిక లేకపోవడంతో కరీంనగర్, నిజామా బాద్‌లో రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. కాగా, టీడీపీని వీడి బీజేపీలో చేరే ముందు చంద్రబాబుతో మాట్లాడినట్టు రేవూరి తెలిపారు. రవీంద్రనాయక్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో ప్రజల కలలు నెరవేరడం లేదన్నారు. -
చంద్రబాబుకు చెప్పే పార్టీ మారాను : రేవూరి
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ మాజీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు మురళీధరరావు సమక్షంలో ఆయన బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాషాయ కండువా కప్పుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరే విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో చెప్పానని రేవూరి స్పష్టం చేశారు. తెలంగాణ సెంటిమెంటుతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, కానీ తెలంగాణ ఫలాలు మాత్రం ప్రజలకు అందడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ విభజించు పాలించు అనే సూత్రంతో పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ వనరుల్ని కొల్లగొట్టారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితితో కేసీఆర్ పరిపాలన ఏమిటో ప్రజలందరికీ అర్థమైందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన వాక్చాతుర్యంతో టీడీపీని ఆంధ్ర పార్టీగా ముద్ర వేశారని గుర్తు చేశారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై విశ్వాసం సన్నగిల్లిందని, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేకపోవడంతో తెలంగాణలో బలమైన ప్రతిపక్షమే కరువైందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ మాజీ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ బుధవారం ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పార్టీ సభ్యత్వ రశీదును అందజేశారు. అనంతరం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. బీజేపీనే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తి అని, అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారని మురళీధర్ రావు స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ పోలీసులను ఉసిగొల్పుతోందని ఆరోపించారు. టిఆర్ఎస్ అవినీతి పరిపాలన చేస్తోందని, కుటుంబ పాలనను ఎదుర్కొనేందుకు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. దీన్ని చూసి టీఆర్ఎస్ ఓర్వలేక బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని అన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, యూరియా కృత్రిమ కొరతను సృష్టించి నెపాన్ని కేంద్రంపై నెట్టువేస్తున్నారని దుయ్యబట్టారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎంపీలపై కక్షతో వారి జిల్లాలలో కృత్రిమ యూరియా కొరత సృష్టిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్, గ్రానైట్లలో అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. రైతులకు యూరియా ఎంత అవసరమనేది లెక్కించి కేంద్రానికి అందజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రైతులకు అండగా నిలబడేందుకు కేంద్ర ఎరువుల శాఖ మంత్రిని కలుస్తున్నామని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
రాజకీయాల్లో నిబద్ధత, నిజాయితీ ఉండాలి : రేవూరి
సాక్షి, వరంగల్: రాజకీయాల్లో నిబద్ధత, నిజాయితీ ఉండాలని, మద్దతు ఇస్తే మర్డర్ చేస్తామని బెదిరింపులకు భయపడే ప్రస్తకే లేదని వరంగల్ పశ్చిమ ప్రజాకూటమి అభ్యర్థి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ భవానీనగర్‌లోని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం రాత్రి వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన రిటైర్డ్ డీఈని దాస్యం విజయ్‌భాస్కర్ ఫోన్లో నానా దుర్భాషలాడడమే కాకుండా ఇంటికి తన అనుచరులను పంపించి బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఈ బెదిరింపులకు సంబంధించిన ఫోన్ రికార్డులు, సీసీ ఫుటేజీల ఆధారంగా వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినట్లు తెలిపారు. దాస్యం సోదరులు చేస్తున్న పనులతో ప్రజల్లో మంచి పేరున్న స్వర్గీయ దాస్యం ప్రణయ్‌భాస్కర్‌కు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయన్నారు. ఎవరైనా ఫోన్లో బెదిరించినా ఇంటికి వచ్చినా వెంటనే 100 నెంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు వస్తారని తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్‌కు వీరు చేస్తున్న ఆగడాలను దృషికి తీసుకుపోయామన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ తనను చంద్రబాబుకు తొత్తు అని సంభోదించారని, ఆయన తండ్రి కేసీఆరే మోదీకి తొత్తుగా మారారని అన్నారు. సమావేశంలో కూటమి నాయకులు ప్రొఫెసర్ వెంకటనారాయణ, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ జాటోత్ సంతోష్‌నాయక్, శంకర్, మార్గం సారంగంలు పాల్గొన్నారు. -
వరంగల్ పశ్చిమలోని ’కీ‘.. త్రీ..
సాక్షి, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రసవత్తర పోటీ నెలకొంది. టీఆర్ఎస్, ప్రజాకూటమి, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి 21 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా పోటీ ముగ్గురు మధ్యనే ఉంది. టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ప్రజా కూటమి నుంచి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు పోటీలో ఉన్నారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి గతంలో నర్సంపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ధర్మారావు బీజేపీ అభ్యర్థిగా హన్మకొండ నియోజకవర్గం నుంచి 1999లో గెలిచారు. గత ఎన్నికల సందర్భంగా ఉద్యమ ప్రభావం ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. దీంతో పోటీ రసవత్తరంగా మారుతోంది. ఒకరిపై మరొకరు కత్తులు దూస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. దాస్యం వినయ్‌భాస్కర్ (టీఆర్ఎస్) బలాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిత్యం ప్రజల మధ్య ఉండడం, ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడం ఆంధ్ర పార్టీగా టీడీపీకి ముద్ర... కూటమి నుంచి ఆ పార్టీ అభ్యర్థి బరిలో ఉండడం మంత్రి కేటీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి చేసిన అభివృద్ధి పనులు కార్మిక సంఘాలు, చిరు వ్యాపారులతో ఉన్న అనుబంధం మాజీ మంత్రి, సోదరుడు ప్రణయ్‌భాస్కర్‌పై ఉన్న అభిమానం అభ్యర్థిగా ముందుగా ప్రకటించడం, ముందు నుంచి ప్రచారంలో ఉండడం బలహీనతలు టీఆర్ఎస్ ప్రభత్వంపై, తాజా మాజీ ఎమ్మెల్యేగా వ్యతిరేకత భూ కబ్జాదారునిగా ప్రచారం కావడం అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, కమీషన్ల కోసం అభివృద్ధి పనులు ఆపారని అపవాదు కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమ స్థల సేకరణను పట్టించుకోవడం లేదనే ఆరోపణ నియోజకవర్గానికి ఆశించిన మేర ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కాకపోవడం రేవూరి ప్రకాష్‌రెడ్డి (టీడీపీ) బలాలు టీఆర్ఎస్ ప్రభుత్వం, తాజా మాజీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రజా కూటమిగా ఏర్పాటు కావడం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ వివాద రహితుడు కావడం, వ్యక్తిగతంగా అతనికున్న ఇమేజ్, పార్టీ మారకుండా నిబద్ధతతో ఉండడం. గతంలో నర్సంపేటలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులతో ఉన్న మంచితనం కాంగ్రెస్ నుంచి పోటీపడిన నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు ప్రజా కూటమిలో అన్ని పక్షాలు కలిసిరావడం మేధావి వర్గంలో సానుకూల దృక్పథం బలహీనతలు ఆంధ్ర పార్టీగా టీడీపీకి ఉన్న ముద్ర స్థానికుడు కాదనే ప్రచారం కూటమిలోని పార్టీల ఓట్ల బదిలీపై సందిగ్ధం టీడీపీకి గట్టి పునాదులు లేకపోవడం, ఇతర పార్టీలపై ఆధారపడడం. ఆలస్యంగా టికెట్ కేటాయించడం, ప్రచారం ఆలస్యం కావడం మార్తినేని ధర్మారావు (బీజేపీ) బలాలు ప్రభుత్వం, గత ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, ప్రజా కూటమి నుంచి ఆంధ్ర పార్టీగా ముద్రపడిన టీడీపీ అభ్యర్థి ఉండడం గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి సుపరిచితుడు కావడం వరంగల్ నగరానికి కేంద్రం నుంచి స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ పథకాల ద్వారా రూ.కోట్లలో నిధులు తీసుకురావడం వివాద రహితుడు ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో ఆదరణ గతంలో చేసిన అభివృద్ధి పనులు బలహీనతలు బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలు నియోజకవర్గంలో బీజేపీకి పూర్తిస్థాయిలో పట్టు లేకపోవడం ప్రచారం ఆలస్యం కావడం ఎన్నికల తర్వాత ప్రజల్లో లేకపోవడం -
‘నేను మంత్రిని కావడం తథ్యం’
సాక్షి, వరంగల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే టీడీపీకి మూడు మంత్రి పదవులు దక్కనున్నాయనీ, తాను మంత్రి కావడం తథ్యమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏపాటిదో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేసిన పనులను చెప్పుకునే దమ్ములేక చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించకుండా టీఆర్ఎస్ నేతలు మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల వారిగా కూటమి తరపున సమన్వయ కమిటీలు పనిచేస్తాయని రేవూరి తెలిపారు. ఇక వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు రేవూరికి టీడీపీ టికెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
టీఆర్ఎస్లో అంతర్యుద్ధం
హన్మకొండ: టీఆర్ఎస్లో అంతర్యుద్ధం సాగుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ భవానినగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ కుటంబసభ్యులకు ఇస్తున్న ప్రా«ధాన్యతల్లో తేడా వస్తోందని, అది అంతర్యుద్ధానికి దారితీసిందన్నారు. ఆ పరిస్థితి నుం చి బయట పడడానికి బావ, బామ్మర్థులు టీడీపీపై దాడి చేస్తున్నారని «ధ్వజమెత్తారు. ప్రజా కూటమి ఏర్పాటుతో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని, ఆ పార్టీ అభ్యర్థులపై వ్యతిరేకత ప్రస్పుటంగా కనిపిస్తోందన్నారు. ప్రజాకూటమి ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్కు ప్రజల్లో తగ్గుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఆ పార్టీ నాయకులకు పిచ్చెక్కి అవాకులు, చెవాకులు పేలుతున్నారని చెప్పారు. సామాజిక న్యాయం, రాజకీయ అవకాశాలు టీడీపీతో సాధ్యమయ్యాయని, సంక్షేమ కార్యక్రమాలు తమ పార్టీతోనే మొదలయ్యాయన్నారు. తాను నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ప్రజాకూటమి అవకా శం కల్పిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 2024లో రాజకీయాల నుంచి రిటైర్ కావాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు జాటోత్ సంతోష్ నాయక్, షేక్‌బాబాఖాదర్ అలీ, హన్మకొండ సాంబయ్య, బొచ్చు పరమానందం, భూక్యా రాజేష్ నాయక్, బైరపాక ప్రభాకర్, మార్గం సారంగం తదితరులు పాల్గొన్నారు. -
నాలుక చీరేస్తా.. ఒళ్లు దగ్గర పెట్టుకో
గజ్వేల్: ‘డిసెంబర్ 11 తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుడు ఖాయం.. ఆ పార్టీది ఇక ముగిసిన అధ్యాయం. ఇది గ్రహించి దింపుడుకల్లం ఆశతో ఆ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తుండ్రు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే నాలుక చీరేస్తా! నీకే టికెట్‌కు దిక్కులేదు.. నా గురించి మాట్లాడుతావా?’అంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ టీడీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. వెన్నుపోటుదారుల పార్టీ టీడీపీ.. అని ధ్వజమెత్తారు. ‘పచ్చ కండ్లు ఉన్నోనికి.. లోకమంతా పచ్చగా కనిపిస్తదట. మీరు కూడా గట్లనే చేస్తుండ్రు. చివరి ప్రయత్నంగా గోబెల్స్ ప్రచారానికి దిగుతుండ్రు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు ఉనికి కోసం మాట్లాడుతుండ్రు. ఆంధ్రా పార్టీలో ఉన్న రేవూరి ప్రకాశ్రెడ్డిలాంటి నాయకులు నాపై, టీఆర్ఎస్పై విమర్శలు చేస్తే జనం నవ్వుకుంటుండ్రు’అని అన్నా రు. తమ గురించి ప్రజలకు తెలుసునని పేర్కొన్నా రు. ‘ఉద్యమం నుంచి వచ్చిన నాకు త్యాగాలు మాత్రమే తెలుసు.. మీలాగా మోసాలు చేయడం తెలియదు’ అని అన్నారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు ఓటమి భయం.. కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని హరీశ్‌రావు అన్నారు. కూటమికి మహా ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలోనూ అనేక కుట్రలు చేసిన చరిత్ర మీది.. అంటూ ధ్వజమెత్తారు. పదవులు తమకు గడ్డిపోచలతో సమా నమని స్పష్టంచేశారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీలు ప్రజల జీవితాల్లో మట్టి కొట్టాయని.. నేడు ఆ దుస్థితిని మార్చడానికి ప్రయత్సిస్తున్నామన్నారు. ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్పు త్వరలో పరిష్కారమవుతుందన్నా రు. సభలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, భూపతిరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మాజీ జెడ్పీచైర్మన్ లక్ష్మీకాంతారావు, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, ముదిరాజ్ సంఘం గజ్వేల్ నియోజకవర్గ నేత కొట్టాల యాదగిరి పాల్గొన్నారు. -
హంగ్ వస్తే హరీశ్ సీఎం అయ్యే చాన్స్!
హన్మకొండ: టీఆర్ఎస్, ప్రజాకూటమికి సమానంగా సీట్లు వచ్చి రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే మంత్రి హరీశ్‌రావు పార్టీ నుంచి తన వర్గంతో బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. కూతురు, కుమారుడికి అధిక ప్రాధాన్యం ఇస్తూ తనను అవమానిస్తున్నారనే ఆవేదనతో హరీశ్‌రావు ఉన్నారని చెప్పారు. హన్మకొండలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హరీశ్ రియల్, ప్రాక్టికల్ పొలిటీషియన్, హార్డ్ వర్కర్ కూడా.. అసలు హరీశ్‌రావు లేని చంద్రశేఖర్‌రావును ఊహించలేం.. రాజకీయ ఊహ తెలిసిన నాటి నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు’అని పేర్కొన్నారు. అయితే.. హరీశ్‌రావు తన తెలివిని వక్రమార్గంలో ఉపయోగించి టీడీపీని విమర్శించడం తగదన్నారు. పార్టీలో తనకు ఆదరణ తగ్గడంతోనే మామ ముందు నిజాయితీ చాటుకోవడానికి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు ముందస్తు ఎన్నికలకు వచ్చారన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకై కేసీఆర్ ఆయా రాష్ట్రాలు సందర్శించింది ఇందులో భాగమేనన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే హరీశ్‌రావు ఆనాడే కాంగ్రెస్‌లోకి వెళ్లే వారని పేర్కొన్నారు. నా కోసం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ నర్సంపేట నియోజకవర్గం నుంచి తాను బరిలో ఉంటానని రేవూరి స్పష్టం చేశారు. తనకు అవకాశం కల్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. నర్సంపేట నుంచి మరోసారి ప్రాతినిథ్యం వహించి.. 2024లో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. తాము 45 సీట్లు అడిగామన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తమకు 14 సీట్లు మాత్రమే కేటాయించినట్లు ఢిల్లీలో ప్రకటించడాన్ని అభ్యంతరం తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు లేకుండా ఎలా ప్రకటిస్తారని, తాము 21 సీట్లు కావాలని పట్టుదలతో ఉన్నామన్నారు. టీఆర్ఎస్తో పొత్తు అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకున్నామని, ఈ అభిప్రాయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే స్వతంత్రంగానే పోటీ చేయాలన్నారని చెప్పారు. -
18న మిర్యాలగూడలో టీడీపీ మినీమహానాడు
నల్లగొండ రూరల్ : మిర్యాలగూడలో ఈనెల 18న టీడీపీ మినీ మహానాడు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యు డు సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలో నల్లగొండ పార్లమెంట్‌స్థాయి మినీ మçహానాడు సన్నద్ధ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమస్యలపై పలు తీర్మానాలు చేశా రు. సభ నిర్వహణకు 11కమిటీలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సభకు 3వేల మంది నాయకులు, కార్యకర్తలు రానున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ హామీలు, సామాజిక న్యాయం, నిరుద్యోగ సమస్య, ఉపాధి అవకాశాలు, సాగునీటి ప్రాజెక్టుల వైపల్యాలపైన, విద్యా, వైద్యరంగం నిర్లక్ష్యంపై మహనాడులో చర్చిస్తామన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో టీడీపీ గట్టిపోరాటం చేయాలన్నారు. రైతుబంధు పథ కం కింద ఎకరానికి 4వేలు ఇచ్చినా రైతులు టీఆర్ఎస్కు వ్యతిరేకంగానే ఉన్నారని తెలిపారు. ఒకేసారి రుణమాఫీ చేయకపోవడంతో రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. టీడీపీకి గల్లీ నుంచి బలమైన కేడర్ ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు. సమావెశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యూసుఫ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజు, నియోజకవర్గ ఇన్చార్జులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, సాదినేని శ్రీని వాస్‌రావు, కడారి అంజయ్య, చావా కిరణ్మయి, రాంరెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, బాబురావునాయక్, అరున్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, రమేశ్‌బాబు, ఎల్‌వీయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ ఇంట్లోనే అవినీతి పునాదులు
పరకాల : కేసీఆర్ ఇంట్లోనే కొడుకు, కూతురు, అల్లుడుతో కలిసి అవినీతి పునాదులు వేస్తున్నారని, మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయగా మార్చి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని దామెర చెరువు, ధర్మారం వద్ద ఉన్న మారేడు చెరువును బుధవారం టీడీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిషన్ కాకతీయకు తాము వ్యతిరేకం కాదని, చెరువుల పూడికతీత పనులలో జరుగుతున్న అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని అన్నారు. బినామీలతో స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. దామెర చెరువు పనుల్లోనే రూ.2 కోట్ల వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ టెండర్లలో జరిగిన అవినీతిని ప్రజల ముందు పెడితే నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉండగా, అవినీతిలో మాత్రం మొదటి స్థానాన్ని ఆక్రమించిందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించిన కోదండరామ్‌ను విషపునాగు అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో నాయకులు తోట రవీందర్, చిట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోరండ్ల రాజయ్య, రాజేశ్వర్‌రావు, సాంబరాజు కృష్ణ పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే పంటలు ఎండాయి: రేవూరి
అధికారుల నిర్లక్ష్యం వల్లే పంట పొలాలు ఎండిపోయాయని దీనికి ప్రభుత్వమే పూర్తి భాధ్యత వహించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని వెల్తుర్లపల్లి శివారులో ఎండిపోయిన వరిపంటలను వారు పరీశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. రామప్ప సరస్సు పరిధిలోని వీర్లకాలువ, ఒగరుకాలువలకు చెందిన 250ఎకరాల ఆయకట్టు పంటలు ఐబీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎండిపోయాయని ఆరోపించారు. రామప్ప సరస్సులో నీరు ఉన్నప్పటికీ కాలువ లు మట్టితో కూరుకపోవడంతో ఆయకట్టు పొలాలకు సాగు నీరు అందలేదన్నారు. దీంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధుల జేబులు నింపేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టిందనీ.. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై పనులను ఇష్టానుసారంగా చేస్తూ పథక లక్ష్యాన్ని నీరుకారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయలో భాగంగా రామప్ప, లక్నవరం, గణపసముద్రం చెరువులకు సరిపడా నిధులు కేటాయించి అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. రామప్ప సరస్సులోకి దేవాదుల నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పంట నష్ట పోయిన రైతులకు ఎకరానికి రూ.20వేలు పరిహారం చెల్లించాలని అడిగారు. -
'కేసీఆర్ కేబినెట్లో రౌడీలు, దొంగలు'
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ద్రోహం చేసిన రౌడీలు, దొంగలు ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో ఉన్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మంలోని టీఎన్జీఓ హాల్లో ఆదివారం జరిగిన టీడీపీ జిల్లా స్థాయి మినీ మహానాడుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉద్యమాన్ని వ్యతిరేకించిన మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అధికార వ్యామోహంతో పార్టీలు మారుతున్న వారిని టీఆర్ఎస్ అందలమెక్కిస్తోందని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. టీడీపీని సెంటిమెంట్, అధికారంతో దెబ్బతీయలేరన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ హైదరాబాద్‌లో గల్లీగల్లీ తిరుగుతూ మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. అధికారంతో విర్రవీగుతున్న టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ప్రజలు తమ సత్తా ఏమిటో చూపించాలన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ వస్తే ఇంటింటికి ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, కేజీ టూ పీజీ, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు, ఎంటీసీసీలు, జెడ్పీటీసీలు టీడీపీని వీడడంతో జిల్లాలో పార్టీ పనైపోయిందని ప్రచారం జరుగుతుందని, జిల్లాలో పార్టీకి పెట్టని కోటలా ఉన్న కార్యకర్తల బలమే తమ సత్తా ఏంటో నిరూపిస్తుందన్నారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ మారిన ద్రోహులకు ఓటమి తప్పదన్నారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. రెండోసారి తుళ్లూరి బ్రహ్మయ్య జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మహానాడులో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నియోజకవర్గ ఇన్చార్జిలు పాల్గొన్నారు. -
కడియం, రేవూరికి నాన్ బెయిలబుల్ వారెంట్
వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. 2009 ఫిబ్రవరి 19న రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల రిజర్వాయర్‌లో దక్షిణ కాలువ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నాటి టీడీపీ ఎమ్మెల్యేలైన కడియం, రేవూరి ముందుగానే రిజర్వాయర్ నీళ్లు వదిలారు. అక్కడే ఉన్న అప్పటి ధర్మసాగర్ ఎంపీపీ ఆర్.రాజు నేతృత్వంలో వారిని అడ్డుకున్నారు. వీరిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలతో పోలీసులు కడియం, రేవూరి సహా 18 మందిపై కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా వారు వాయిదాలకు రాలేదు. సోమవారం వాయిదా ఉండగా.. గైర్హాజరుకు శ్రీహరి, ప్రకాష్‌రెడ్డి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి ప్రమీలాజైన్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తక్షణమే అరెస్టుకు ఆదేశిస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. -
బాబు ప్రయత్నమంతా టీడీపీని కాపాడుకోవడానికే: రేవూరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్‌తో టీడీపీని దెబ్బతీయొద్దని ఆ పార్టీ సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణలో టీఆర్ఎస్ మమ్మల్ని టార్గెట్ చేస్తే సీమాంధ్రలో జగన్ టీడీపీ లేఖ ఇవ్వడం వల్లనే విభజన జరుగుతోందని ప్రచారం చేస్తున్నారు. టీడీపీని అన్ని ప్రాంతాల్లో కాపాడుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు’’ అని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి టీఆర్ఎస్ దోహదపడిందని, అంతమాత్రాన తమతోనే తెలంగాణ వచ్చిందనుకుంటే అమాయకత్వమేనని రేవూరి వ్యాఖ్యానించారు. తెలంగాణను కాంగ్రెస్ ప్రేమతో ఇవ్వట్లేదని, రాజకీయ కుట్ర, లబ్ధి కోసమే ఇస్తోందని చెప్పారు. -
పీహెచ్‌సీకి తాళం వేసిన గ్రామస్తులు
నర్సంపేట, న్యూస్‌లైన్ : నెల రోజులుగా వైద్యులు విధులకు రావడం లేదని ఆరోపిస్తూ భాంజీపేట సర్పంచ్ భూక్య లలిత ఆధ్వర్యంలో గ్రామస్తులు పీహెచ్‌సీకి బుధవారం తాళం వేశారు. అనంతరం పీహెచ్సీ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతోపాటు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్డీఓ అరుణకువూరితో వూట్లాడారు. వెంటనే ఆమె పీహెచ్‌సీని సందర్శించి, విచారణ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ వూట్లాడుతూ పీహెచ్‌సీకి వైద్యులు, సిబ్బంది వస్తున్నారా లేదా అని విచారణ చేపట్టగా గైర్హారవుతున్నట్లు తెలిసిందని చెప్పారు. పీహెచ్‌సీలోని స్టాక్ రిజిష్టర్, అటెండెన్స్ రిజిష్టర్‌ను సీజ్ చేసి, సిబ్బందిపై చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఆమె వివరించారు. -
జీవోఎంకు నివేదిక ఇవ్వం: రేవూరి ప్రకాష్ రెడ్డి
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడే సమస్యలపై ఇరుప్రాంతాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీఓఎం) విధి విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ టీడీపీ ఫోరం సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ.... జీవోఎంకు నివేదిక ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే అందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్లదే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.