
సాక్షి, వరంగల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే టీడీపీకి మూడు మంత్రి పదవులు దక్కనున్నాయనీ, తాను మంత్రి కావడం తథ్యమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి ఏపాటిదో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేసిన పనులను చెప్పుకునే దమ్ములేక చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబును విమర్శించకుండా టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల వారిగా కూటమి తరపున సమన్వయ కమిటీలు పనిచేస్తాయని రేవూరి తెలిపారు. ఇక వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు రేవూరికి టీడీపీ టికెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment