సాక్షి, వరంగల్: గీసుకొండ పీఎస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మండలంలోని ధర్మారంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో కొండా వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేదని రేవూరి వర్గీయులు నిరసన తెలిపారు.
ఈ క్రమంలో ఫ్లెక్సీని ధ్వంసం చేశారని రేవూరి వర్గీయులపై కొండా అనుచరులు దాడి జరిపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గీసుకొండ పోలీసులు కొండా వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గీసుకొండ పీఎస్‌కు వచ్చిన మంత్రి కొండా సురేఖ.. సీఐ సీటులో కూర్చొని కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు కొండా సురేఖ వర్గీయులు భారీగా చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
గీసుకొండ వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి.. ఇక్కడి వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. పార్టీ వర్గాలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారం కాదు.. స్థానికతకు సంబంధించిన ఇష్యూ.. ఎవరు తొందరపడినా పార్టీకే నష్టం.. సమన్వయం పాటించడం మంచిందని రేవూరి అన్నారు.
ఇదీ చదవండి: సునీల్ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్‌పై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment