సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్‌పై ఏపీ ప్రభుత్వ దాడిని ఖండిస్తున్నానని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్‌లో పెట్టిన పోస్టులో తప్పేముందంటూ ప్రశ్నించారు. సునీల్‌పై చంద్రబాబు ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అనడం సర్వీసు రూల్ ఉల్లంఘన ఎట్లయితది? రాజ్యాంగం ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదవండి. అప్పుడయినా విషయం అర్థం అయితదేమో!’’ అంటూ ట్వీట్ చేశారు.
సోదరులు, సాటి అధికారి పీవీ సునీల్ కుమార్ గారిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దాడిని పూర్తిగా ఖండిస్తున్న. ఆయన ట్విట్టర్‌లో పెట్టిన పోస్టులో తప్పేముంది? ‘మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అనడం సర్వీసు రూలు ఉల్లంఘన ఎట్లయితది? రాజ్యాంగం ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదవండి. అప్పుడయినా విషయం అర్థం… pic.twitter.com/H8axZ8A8CX
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 13, 2024
కాగా, రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టు మూడేళ్ల క్రితం తోసిపుచ్చిన ఆరోపణల ఆధారంగా కూటమి సర్కార్ తప్పుడు కేసు నమోదు చేసింది. 2021లో తనను సీఐడీ అధికారుల కస్టడీలో గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని.. హింసించారని నాటి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైద్య పరీక్షలు గతంలోనే నిర్ధారించాయి. ఆ ఆరోపణల ఆధారంగా రఘురామకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించగా, అదే ఆరోపణల ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించేందుకు సుప్రీం కోర్టు సైతం తిరస్కరించింది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించేందుకు బరి తెగించింది.
నాడు న్యాయస్థానాలు తోసిపుచ్చిన ఆరోపణలతోనే రఘురామరాజు మూడేళ్ల తరువాత మెయిల్‌లో ఫిర్యాదు చేయడం.. ఆ వెను వెంటనే ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్‌ఆర్ ఆంజనేయులు, నాటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిలతోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసులు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ చర్య కక్ష సాధింపే కాదు.. కోర్టు ధిక్కారమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకానికి ఈ పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఇదీ చదవండి: సుప్రీంకోర్టు వారించినా వినరా?
Comments
Please login to add a commentAdd a comment