PV Sunil Kumar
-
సునీల్ పోస్టులో తప్పేముంది?.. ఏపీ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్‌పై ఏపీ ప్రభుత్వ దాడిని ఖండిస్తున్నానని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్లో పెట్టిన పోస్టులో తప్పేముందంటూ ప్రశ్నించారు. సునీల్‌పై చంద్రబాబు ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అనడం సర్వీసు రూల్ ఉల్లంఘన ఎట్లయితది? రాజ్యాంగం ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదవండి. అప్పుడయినా విషయం అర్థం అయితదేమో!’’ అంటూ ట్వీట్ చేశారు.సోదరులు, సాటి అధికారి పీవీ సునీల్ కుమార్ గారిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దాడిని పూర్తిగా ఖండిస్తున్న. ఆయన ట్విట్టర్లో పెట్టిన పోస్టులో తప్పేముంది? ‘మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అనడం సర్వీసు రూలు ఉల్లంఘన ఎట్లయితది? రాజ్యాంగం ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదవండి. అప్పుడయినా విషయం అర్థం… pic.twitter.com/H8axZ8A8CX— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 13, 2024 కాగా, రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టు మూడేళ్ల క్రితం తోసిపుచ్చిన ఆరోపణల ఆధారంగా కూటమి సర్కార్ తప్పుడు కేసు నమోదు చేసింది. 2021లో తనను సీఐడీ అధికారుల కస్టడీలో గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టారని.. హింసించారని నాటి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైద్య పరీక్షలు గతంలోనే నిర్ధారించాయి. ఆ ఆరోపణల ఆధారంగా రఘురామకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించగా, అదే ఆరోపణల ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించేందుకు సుప్రీం కోర్టు సైతం తిరస్కరించింది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించేందుకు బరి తెగించింది.నాడు న్యాయస్థానాలు తోసిపుచ్చిన ఆరోపణలతోనే రఘురామరాజు మూడేళ్ల తరువాత మెయిల్లో ఫిర్యాదు చేయడం.. ఆ వెను వెంటనే ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు, నాటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిలతోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసులు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ చర్య కక్ష సాధింపే కాదు.. కోర్టు ధిక్కారమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకానికి ఈ పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.ఇదీ చదవండి: సుప్రీంకోర్టు వారించినా వినరా? -
AP: పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: ఏపీ కేడర్‌కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఐపీఎస్–1993 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అడిషనల్ డీజీలకు డీజీపీ ర్యాంక్ ఇచ్చింది. వారిలో ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీస్‌లో ఉన్న మహేష్ దీక్షిత్, అమిత్‌గార్గ్ ఉన్నారు. ఐపీఎస్–1998 బ్యాచ్‌కు చెందిన మహేష్ చంద్రలడ్డాకు అడిషనల్ డీజీగా పదోన్నతి కల్పించింది. లడ్డా ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులో ఉన్నారు. డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులో ఉన్న ఎస్.శ్యామ్‌సుందర్, గుంటూరు రేంజ్ డీజీ సీఎం త్రివిక్రమవర్మ, ఏలూరు రేంజ్ డీఐజీ జి.పాలరాజులకు ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా పదోన్నతి కల్పించింది. విశాఖపట్నం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ కోయ ప్రవీణ్, డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులో ఉన్న భాస్కర్ భూషణ్, ఏపీ డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఉన్న ఆర్ఎన్ అమ్మిరెడ్డికి డీఐజీ(సూపర్ టైమ్ స్కేల్)గా, విజయనగరం ఎస్పీ ఎం.దీపిక, ఏసీబీ ఎస్పీ బి.కృష్ణారావు, సీఐడీ ఎస్పీ అమిత్బర్దర్లకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్(సెలక్షన్ గ్రేడ్)కు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. వీరందరి పదోన్నతులు 2023, జనవరి ఒకటో తేదీ నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు. చదవండి: (Araku MP: మొదట రైతు బిడ్డ.. తరువాతే ఎంపీ!) -
గోరంట్ల మాధవ్ వీడియోపై టీడీపీ నివేదిక నిజం కాదు : సీఐడీ చీఫ్ సునీల్
-
సీఐడీ అదనపు డీజీ సునీల్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు
సాక్షి, అమరావతి: సైబర్ నేరాల కట్టడిలో రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ‘సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ (సీఆర్‌సీఐడీఎఫ్) రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును, ఎస్పీ (సైబర్ క్రైమ్స్) జీఆర్ రాధికకు సైబర్ స్టార్ అవార్డులను ప్రకటించాయి. ఐఎస్ఈఏ, సీపీఎఫ్, ఐజీఎం, ఫ్రో డిస్కవర్, పీఎస్ఎం సంస్థలతో కలసి సీఆర్‌సీఐడీఎఫ్ ‘ఉత్తమ సైబర్ విధానాలు’ అనే అంశంపై మూడో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. వర్చువల్ విధానంలో ఆదివారం నిర్వహించిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది. సైబర్ పోలీసింగ్, సైబర్ నేరాల పరిష్కారంలో వినూత్న విధానాలను ప్రవేశపెట్టినందుకు 2021కు గాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు సీఆర్‌సీఐడీఎఫ్ తెలిపింది. సైబర్ నేరాల కట్టడి కోసం తగిన రీతిలో వ్యవస్థను బలోపేతం చేసినందుకు సీఐడీ విభాగం ఎస్పీ (సైబర్ క్రైమ్స్) జీఆర్ రాధికను ‘సైబర్ స్టార్’ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. సైబర్ నేరాల నియంత్రణ కోసం రాష్ట్ర సీఐడీ విభాగం అనుసరిస్తోన్న విధానాలను ఈ జాతీయ సదస్సులో వక్తలు ప్రశంసించారు. దేశంలో అత్యధికంగా సైబర్ సేఫ్ లాగిన్స్‌ను తయారు చేసిన ఘనత ఏపీ సీఐడీ విభాగానిదేనని పేర్కొన్నారు. సైబర్ బుల్లీషీట్స్, 4ఎస్4యు పోర్టల్, ఫ్యాక్ట్ చెక్, యూట్యూబ్ వెబినార్స్ మొదలైన వినూత్న విధానాలను పీవీ సునీల్‌కుమార్ ప్రవేశపెట్టారు. వాటిని సైబర్ క్రైమ్స్ విభాగం సమర్థంగా నిర్వహిస్తూ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తోంది. రాష్ట్ర సీఐడీ విభాగం అనుసరిస్తోన్న విధానాలు, వ్యూహాలను సీఆర్‌సీఐడీఎఫ్ ప్రత్యేకంగా ప్రశంసించింది. -
సైబర్ క్రైమ్‌పై అవగాహనకు ఈ-రక్షాబంధన్
సాక్షి, అమరావతి : మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి తీసుకొచ్చిన ఈ-రక్షాబంధన్ బాగా పాపులర్ అయ్యిందని సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తెలిపారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే మీమ్స్, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా 6 కోట్లమంది వీక్షించారని అయితే పలాస్ సినిమాకు వచ్చిన పాపులారిటీ ఈ-రక్షాబంధన్‌కు సైతం రావాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగినపుడు ఎలా కంప్లైంట్ ఇవ్వాలో తెలిపాం. police4u.com ద్వారా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆన్ లైన్ క్లాసులు, బ్యాంకింగ్ కోసం ఎక్కువమంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అయితే బ్యాంకు వివరాలు ఏ ఆన్ లైన్ గేమ్‌లోనూ ఇవ్వద్దు. 80% మంది సైబర్ క్రైమ్ ద్వారా డబ్బు పోగొట్టుకున్నారు. ఇప్పటికే 2,28,982 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో యువకులే అధికం. సైబర్ క్రైమ్ విషయంలో పోలీసు స్టేషన్‌కు వెళ్ళాలని చాలామందిలో అవగాహన ఉందని సునీల్ కుమార్ వెల్లడించారు. (ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం) భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మహిళలకు, పిల్లలకు సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడమే ఈ-రక్షాబంధన్ ఉద్దేశమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. సైబర్ స్పేస్ లో ఎక్కువగా ఉంటున్నందున ముఖ్యంగా మహిళలు ఈ అవగాహన కార్యక్రమాలలో భాగస్వాములు కావాలన్నారు. దిశ ఒక చట్టమే కాకుండా, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు కలిగి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మహిళ భద్రత కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా కాలేజీలు, స్కూళ్ళ విద్యార్ధినుల చేసిన అభిప్రాయాలు అభినందనీయమన్నారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారూ ఈ-రక్షాబంధన్ ద్వారా లబ్ధి పొందారని వివరించారు. సైబర్ బుల్లింగ్ ఎక్కువగా ఉంది : సమంత మహిళలను, పిల్లలను ఆన్ లైన్ మోసాల నుంచీ రక్షించడం చాలా అభినందనీయమన్నారు సినీనటి అక్కినేని సమంత. ప్రస్తుతం సైబర్ బుల్లింగ్ చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్న సమంత..దీని అడ్డుకట్ట వేయడంలో ఈ- రక్షాబంధన్ విజయవంతమైందన్నారు. ఈ-రక్షాబంధన్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం పట్ల సంతోషిస్తున్నాను.ఈ కార్యక్రమం స్త్రీలకు ఒక సోదరుడిలా పనిచేసిందని సమంత పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించేందుకు ఇచ్చిన యూట్యూబ్ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ , భారత మహిళా క్రికెటర్ రావి కల్పన తెలిపారు. సీఎం జగన్ ఆలోచనల నుంచి పుట్టిన దిశా చట్టం మహిళలకి కొండంత భరోసా ఇస్తోందని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్: ఐటీ చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ లేఖ
-
చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ లేఖ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం(సీఐడీ) అడిషనల్ డైరెక్టర్ పీవీ సునీల్ కుమార్ అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని కోరుతూ ఐటీ చీఫ్ కమిషనర్‌కు శనివారం లేఖ రాశారు. లేఖతో పాటు 106 మంది 2018 నుంచి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. రూ. 2లక్షలకు మించి జరిగిన లావాదేవీలపై విచారణ చేపట్టాలని ఐటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 106 మంది అసైన్డ్ భూముల కొనుగోలులో ఉన్న వ్యక్తుల వివరాలు, భూముల సర్వే నెంబర్లు, అడ్రసుతో సహా పూర్తి వివరాలను ఎక్సెల్ షీట్లో చీఫ్ కమిషనర్‌కు లేఖతో పాటే పంపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్; ఏడుగురిపై కేసు కాగా 2018-2019 మధ్య జరిగిన అసైన్డ్ భూముల కొనుగోలు ట్రాన్సాక్షన్లపై విచారణ చేపట్టేందుకు ఐటీ అధికారులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. కాగా ఈ కేసులో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో పాటు పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఐదుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. -
బ్లూ ఫ్రాగ్ కేసు దర్యాప్తు వేగవంతం
సాక్షి, విజయవాడ: ఇసుక మింగి పసుపు పులుముకున్న ఎల్లోఫ్రాడ్ కంపెనీగా రూపాంతరం చెందిన బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థపై అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ని హ్యాక్ చేసిన ఆరోణలపై తీగలాగగా డొంకంతా కదులుతోంది. సంస్థ నిర్వాహకులను విచారిస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసుపై దర్యాప్తును మరింత వేగంవంతం చేశారు. ఈ క్రమంలో హ్యాకింగ్‌పై సాక్ష్యాధారాలు కూడా సేకరించామని, కొన్ని రోజుల వ్యవధిలోనే అక్రమార్కుల పనిపడతామని సీఐడీ అధికారి ఏడీజీ పీవీ సునీల్ కుమార్ మీడియాకు తెలిపారు. కాగా ఈ బ్లూ ఫ్రాగ్ సంస్థ.. ప్రభుత్వ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసి ఇసుక కృత్రిమ కొరతను సృష్టించినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఈ నేపథ్యంలో బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీపై విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. అదే విధంగా విచారణలో ఆధారాలు సేకరించామని, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషించి ముందుకు సాగుతామని సునీల్ కుమార్ పేర్కొన్నారు. అదే విధంగా క్లౌడ్‌లో పెట్టిన సమాచారంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసే వారి ఐపీ అడ్రస్‌ను కూడా ట్రాక్ చేసి విచారిస్తున్నామని అన్నారు. కాగా అక్రమ నిల్వల కోసం ఆన్లైన్లో ఇసుకను బుక్‌చేసే వారిపై కూడా నిఘా పెడుతున్నామని ఏడీజీ సునీల్ కుమార్ పేర్కొన్నారు. -
పోలీసులకు సొంత ‘గూడు’!
సాక్షి, అమరావతి: పదవీ విరమణ చేసే నాటికి పోలీసులకు సొంత గూడు కోసం కసరత్తు మొదలైంది. ఈ మేరకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నడుంబిగించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. డీజీపీ చొరవతో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పీవీ సునీల్‌కుమార్ నేతృత్వంలో 15 మంది పోలీసు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ బృందం ఇప్పటికే తమిళనాడు వెళ్లి అక్కడ పోలీస్ హౌసింగ్ స్కీమ్ అమలవుతున్న తీరును అధ్యయనం చేసింది. ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే రాష్ట్రంలో దాదాపు 65 వేల పోలీస్ కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతుంది. తమిళనాడునే ఎందుకు ఎంచుకున్నారంటే.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తమిళనాడులో ప్రత్యేకంగా పోలీస్ హౌసింగ్ స్కీమ్ అమలవుతోంది. ‘వోన్ యువర్ హౌస్’ అనే పేరుతో ఈ పథకాన్ని జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ అమల్లోకి తెచ్చారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ స్కీమ్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వమే నేరుగా స్థల సేకరణ చేసి పోలీసులకు ఇల్లు కట్టిస్తోంది. ఇందుకు ప్రభుత్వ నిధులను వినియోగించడంతోపాటు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటోంది. పోలీసులకు ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను మినహాయించి ఈ మొత్తానికి ప్రభుత్వం కొంత కలిపి నెలవారీ వాయిదాలు చెల్లిస్తోంది. పోలీసులు ఇలా నెలవారీ వాయిదాలు చెల్లించిన అనంతరం పదవీ విరమణ నాటికి ఆ ఇల్లు వారి సొంతమవుతుంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించాకే నివేదిక ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పీవీ సునీల్‌కుమార్ తమిళనాడు స్కీమ్ రాష్ట్రానికి ఎంత వరకు సరిపోతుందనే దానిపై నివేదిక రూపొందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో అంశాలను అధ్యయనం చేస్తున్నాం. అన్ని జిల్లాలు, అన్ని నగరాల్లో ప్రస్తుతం భూముల ధరలు ఎలా ఉన్నాయి? ఎంత భూమి అవసరమవుతుంది? హౌసింగ్ స్కీమ్‌లో ఎంత మంది చేరడానికి మక్కువ చూపుతారు? వంటి అనేక విషయాలపై వివరాలు సేకరిస్తున్నాం. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే పోలీసులకు ఇల్లు కట్టించి నెలవారీ వాయిదాలు వారి వేతనాల్లోంచి తీసుకోవడమా? ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? అనే వాటిపై కూడా దృష్టిపెట్టాం. పోలీసుల గృహవసతి కోసం ఇచ్చే స్థలం, నిర్మాణ వ్యయంలో ప్రభుత్వ భాగస్వామ్యం ఏ మేరకు ఉండాలి.. ఇలా అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేస్తున్నాం. అన్ని విభాగాల్లోని పోలీసులకు ఆప్షన్స్ ఇచ్చి ఎక్కువ మంది ఏ పద్ధతికి మొగ్గుచూపుతారో తెలుసుకుంటాం. అందులో సాధ్యాసాధ్యాలు తెలుసుకున్నాకే ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. -
సీఐల బదిలీలపై ఉత్కంఠ
గుంటూరు, న్యూస్‌లైన్ : సీఐల బదిలీలపై గుంటూరు రేంజ్లో ఉత్కంఠ నెలకొంది. నెలరోజులుగా రేంజ్ పరిధిలో బదిలీలపై విస్తృత ప్రచారాలు కొనసాగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఒకే సర్కిల్లో రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐలు ఈ బదిలీల జాబితాలో ఉంటారనే ప్రచారం జరగడంతో పోలీస్‌వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రేంజ్ పరిధిలో 155 మంది పైగా సీఐలు ఉండగా.. వారిలో 15 నుంచి 20 మందికి బదిలీలు జరగవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు సీఐల పనితీరుతో పాటు ఆరోపణలపై కూడా నిశిత పరిశీలన సాగిస్తునట్లు సమాచారం. గత అనుభవాల దృష్ట్యా.. గత అనుభావాల దృష్ట్యా ఐజీ పీవీ సునీల్‌కుమార్ ఆచితూచి వ్యవహారిస్తున్నారు. ఆరోపణలకు తావులేకుండా తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. గత సెప్టెంబరు నెలలో రేంజ్ పరిధిలో 44 మంది సీఐల బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో ముడుపులు చేతులు మారాయని పెద్దఎత్తున ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో డీజీపీ వి.దినేష్‌రెడ్డి జోక్యం చేసుకుని బహిరంగ విచారణ జరిపించారు. అదనపు డీజీ హుడాచే ప్రత్యేక బహిరంగ విచారణ చేయించారు. ఆరోపణలు వాస్తమమేనని తేలడంతో అప్పటి ఐజీ హరీష్‌కుమార్ గుప్తాపై బదిలీ వేటుపడింది. ఆ తరువాత జరిగే బదిలీలు భారీస్థాయిలో ఉండవచ్చని అందరు ఆశించగా అత్యవసరంగా కావాల్సిన సర్కిల్ పరిధిలో 23 మంది సీఐలను బదిలీ చేసి సర్దుకున్నారు.గుంటూరు రేంజ్లో సీఐల పరిధిలోని బదిలీలు అంటే తెనే తుట్టె కదిపినట్లేనని అధికారవర్గాలు భావిస్తున్నాయి. తాజాగా జరిగే బదిలీల్లో ఈ సంఖ్య 15 నుంచి 20 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. రెండు నెలల క్రితం 23 మంది సీఐలను బదిలీ చేశారు. రేంజ్ పరిధిలోని మూడు జిల్లాల్లో సీఐలను ఎస్హెచ్వోలుగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నెలకు 200 కేసులు అధికం కావడంతో ఎస్హెచ్వోలుగా నియమించగా రేంజ్ పరిధిలో ఈ వీరి సంఖ్య 30పైగా ఉంది. ఖద్దరు ఒత్తిళ్లు... సీఐల బదిలీల వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు జిల్లాల పరిధిలో ఖద్దరు మార్క్ ఒత్తిళ్లు పోలీసుశాఖపై అధికంగా ఉన్నట్లు సమాచారం. ఏకంగా కొందరు సీఐలు మంత్రులను అశ్రయించి కీలకమైన సర్కిల్లో పోస్టింగ్ కావాలంటూ వారి నివాసాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. రాబోవు ఎన్నికల నేపథ్యంలో వారికి అనుకూలమైన, వారి సామాజికవర్గాలకు చెందిన వారినే బదిలీలో అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు చేస్తునట్లు సమాచారం. ఇప్పటికే ఉన్నతాధికారులు సీఐల సర్వీసు రికార్డులను పరిశీలించి జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.