సాక్షి, అమరావతి: ఏపీ కేడర్‌కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఐపీఎస్–1993 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు అడిషనల్ డీజీలకు డీజీపీ ర్యాంక్ ఇచ్చింది. వారిలో ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్, డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీస్‌లో ఉన్న మహేష్ దీక్షిత్, అమిత్‌గార్గ్ ఉన్నారు. ఐపీఎస్–1998 బ్యాచ్‌కు చెందిన మహేష్ చంద్రలడ్డాకు అడిషనల్ డీజీగా పదోన్నతి కల్పించింది.
లడ్డా ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులో ఉన్నారు. డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులో ఉన్న ఎస్.శ్యామ్‌సుందర్, గుంటూరు రేంజ్ డీజీ సీఎం త్రివిక్రమవర్మ, ఏలూరు రేంజ్ డీఐజీ జి.పాలరాజులకు ఇన్‌స్పెక్టర్ జనరల్(ఐజీ)గా పదోన్నతి కల్పించింది.
విశాఖపట్నం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ కోయ ప్రవీణ్, డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులో ఉన్న భాస్కర్ భూషణ్, ఏపీ డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఉన్న ఆర్‌ఎన్ అమ్మిరెడ్డికి డీఐజీ(సూపర్ టైమ్ స్కేల్)గా, విజయనగరం ఎస్పీ ఎం.దీపిక, ఏసీబీ ఎస్పీ బి.కృష్ణారావు, సీఐడీ ఎస్పీ అమిత్‌బర్దర్‌లకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్(సెలక్షన్ గ్రేడ్)కు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. వీరందరి పదోన్నతులు 2023, జనవరి ఒకటో తేదీ నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment