తాగిన మైకంలో భార్యను చంపిన భర్త
Published Mon, May 29 2017 11:10 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
నర్సంపేట రూరల్: తాగిన మైకంలో భార్యను కర్రతో మోది హత్య చేసిన భర్త ఉదంతమిది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం ధర్మరావుపేటలో జరిగింది. రాజేందర్, మంగమ్మ(35)లు భార్యాభర్తలు. వీరికి బాబు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలకు తాగుడు అలవాటు ఉందని, రోజూ ఇద్దరూ తాగి గొడవ పడుతుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలో దుర్గమ్మ పూజ ఉండడంతో ఎవరూ తాగవద్దని తోటి కులస్తులు చెప్పడంతో మంగమ్మ తాగలేదు. అయితే రాజేందర్ తాగి వచ్చి అర్ధరాత్రివేళ భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కర్రతో ఆమె తలపై కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి కర్రతో తల్లిని కొట్టి చంపాడని బాలిక చుట్టుపక్కలవారికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement