wife murder
-
బాచుపల్లిలో భార్యను పాశవికంగా హత్య చేసిన భర్త
నిజాంపేట్: కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలు తీశాయి. కర్కోటకుడైన ఓ భర్త..భార్యను అతిదారుణంగా హత్య చేసి..మృతదేహాన్ని ముక్కలుగా నరికేందుకు యత్నంచాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలి్పన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం గోట్లగట్టు గ్రామానికి చెందిన మధులత(29)కు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నాగేంద్ర భరద్వాజ్‌కు 2020లో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో బాచుపల్లి పరిధిలోని సాయి అనురాగ్ కాలనీలోని ఎంఎస్ఆర్ ప్లాజా బి బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత దంపతుల మధ్య విభేదాలు ఏర్పడి తరచు గొడవ పడేవారు. డబ్బుల విషయంలో గొడవలు జరిగాయని, భరద్వాజ్ తరుచుగా మధులతను అనుమానించేవాడని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మధులత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మధులత మగ బిడ్డకు జన్మనిచి్చంది. ఇక నాటి నుంచి భరద్వాజ్ భార్య వద్దకు వెళ్లలేదు. ఈదశలో బంధువులు జోక్యం చేసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఇద్దరికి రాజీ కుదుర్చి మధులతను భరద్వాజ్‌తో కాపురానికి పంపించారు. విచక్షణ కోల్పోయి..రాజీ కుదుర్చినా వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ నెల 13న ఎన్నికలు ఉండటంతో తాను పుట్టింటికి వెళ్తానని మధులత చెప్పగా..ఈ నెల 4న ఇద్దరి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. విచక్షణ కోల్పోయిన భరద్వాజ్ భార్య మధులత తలను నేలకేసి కొట్టి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ముక్కలుగా నరికి మాయం చేయాలనుకుని మోకాలి కింద భాగాలను కోసే ప్రయత్నం చేశాడు. వీలుకాక ఈ ప్రయత్నాన్ని విరమించుకుని ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఇందులో భాగంగా ఇంట్లోని వంట గ్యాస్‌ను లీక్ చేసి భార్య మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేసి కుమారుడితో పరారయ్యాడు. గ్యాస్ వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసు లు పోలీసులకు సమాచారం ఇవ్వగా..పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి తలుపులు బద్ధలు కొట్టి గ్యాస్‌ను నిలిపివేశారు. అనంతరం మధుల త మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు. హత్య చేసి స్నేహితుడి ఇంటికి.... భార్యను హత్య చేసిన భరద్వాజ్ చందానగర్‌లోని స్నేహితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకో వాలని చెప్పి భార్యను పొడిచిన కత్తితోనే తాను సైతం పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భరద్వాజ్‌కు పైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పసికందు ముందే.. కుమారుడు శ్రీజై (17 నెలలు) ఇంట్లో ఆడుకుంటుండగా..బాలుని ముందే భరద్వాజ్ భార్యతో గొడవ పడి హత్య చేశాడు. మే 4న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసుల వివరణ మధులత హత్య కేసు విషయమై బాచుపల్లి ఎస్హెచ్ఓ ఉపేందర్‌ను వివరణ కోరగా ఈ నెల 4న తమకు సుమారు రాత్రి 12 గంటల సమయంలో సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అదే రాత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాం«దీకి తరలించడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా మీడియాకు కేసు వివరాలు వెల్లడించలేదన్నారు.అన్నీ అనుమానాలే.. మధులత హత్యపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నెల 4న హత్య జరగగా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మీడియాకు తెలుపలేదు. అలాగే అపార్ట్మెంట్ వద్ద ఇంత గొడవ జరిగినా విషయం బయటకు పొక్కలేదు. హత్యకు గురైన మధులత కుటుంబ సభ్యులు సైతం హత్య జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయాన్ని శుక్రవారం మీడియాకు వెల్లడించడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
భర్తను హత్య చేసిన భార్యకు రిమాండ్
చింతపల్లి రూరల్: భర్తను హత్య చేసిన భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులకు తెలిపిన వివరాలివి. జి.కె వీధి మండలం సపర్లకు చెందిన కొర్ర కృష్ణారావు, గెమ్మిల వీరమ్మ దంపతులు గత బుధవారం గొడవ పడ్డారు. గొడవ ముదిరి వీరమ్మ భర్త కృష్ణారావును గొడ్డలితో తలపై కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన కృషారావును ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. ఈ ఘటనపై కృష్ణారావు తల్లి కోర్రా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జి.కె వీధి సీఐ అశోక్‌కుమార్, సీలేరు ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కృష్ణారావుకు గతంలో పైళ్లె ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని భార్య రెండేళ్ల క్రితం మృతి చెందడంతో అదే గ్రామంలో భర్త చనిపోయి ఉంటున్న వీరమ్మను వివాహమాడాడు. తన మొదట భార్య పిల్లలను వీరమ్మ సరిగ్గా చూడటం లేదనే భావనతో పాటు ఒకరిపై ఒకరు అనుమానంతో ఇద్దరూ నిత్యం గొడవ పడేవారు. పిల్లలను హాస్టల్లో చేర్పించి, వీరమ్మ పిన్ని ఇంట్లో చట్రపల్లిలో నివాసముంటుంది. ఇద్దరూ తరుచూ గొడవలు పడడంతో విసుగు చెందిన వీరమ్మ అతని అడ్డు తొలగించుకోవాలని కృషారావు తలపై గొడ్డలితో మూడుసార్లు కొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన కృష్ణారావును ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆధారాలు సేకరించి వీరమ్మను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
‘‘రేణుకను చంపేశాను.. వెంటనే వచ్చి శవం తీసుకెళ్లండి’
మెదక్: ‘‘రేణుకను చంపేశాను.. వెంటనే వచ్చి శవం తీసుకెళ్లండి’అని ఓ వ్యక్తి తన భార్య బంధువుకు ఫోన్ చేశాడు. ఈ సంఘటన నారాయణఖేడ్ మండలం సిర్గాపూర్ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని వాసర్‌కు చెందిన రేణుక (22)కు, నారాయణఖేడ్ మండలం జూకల్కు చెందిన కుందేలు శర్ణప్ప (25)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. శర్ణప్ప తరచూ ఆమెను మానసికంగా వేధించేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించినా అతనిలో మార్పురాలేదు. ఇటీవల వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి రేణుక బంధువైన జగదేవికి శర్ణప్ప చేశాడు. రేణుకను చంపేశాను, వచ్చి శవం తీసుకెళ్లండని చెప్పడంతో ఆమె కంగుతిన్నది. మంగళవారం ఉదయం బంధువులు వచ్చి వెతకగా గ్రామ శివారులోని బావిలో రేణుక మృతదేహం లభించింది. రేణుకను భర్త, అతని కుటుంబ సభ్యులే హత్య చేసి బావిలక్ష పడేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యాచరణ్‌రెడ్డి తెలిపారు. -
భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది
లండన్: సిప్రస్ లో తన భార్యను చంపిన కేసులో ఓ హంతకుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బ్లడ్ క్యాన్సరుతో బాధపడుతున్న భార్య జానీస్ హంటర్ బాధను తట్టుకోలేక తానే చంపమని కోరిందని, తప్పని పరిస్థితుల్లో నిందితుడు డేవిడ్ హంటర్ ఆమె ఆత్మహత్యకు సాయం చేశాడని హంతకుడి తరపు న్యాయవాది కోర్టుకి వాదనలు వినిపించగా కోర్టు ఆ వాదనలతో ఏకీభవించింది. డేవిడ్ హంటర్ నరహంతకుడిగా అనిపించడం లేదని తెలిపింది. డేవిడ్ హంటర్(76) భార్య జానీస్ హంటర్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. చూస్తుండగానే వ్యాధి ముదిరిపోవడంతో చివరి రోజుల్లో ఆమె నొప్పిని భరించలేకపోయింది. బ్రతికి ఉండటం కంటే చనిపోవడమే మేలని తరచూ భర్తకు గోడు వినిపించేది. చివరికి ఒకరోజు బాధ తీవ్రం కావడంతో తనను చంపి నొప్పి నుండి విముక్తి కలిగించమని భర్తను వేడుకుంది. తాను ఎంతగానో ప్రేమించిన భార్య అంత వేదన భరించడాన్ని చూడలేకపోయిన హంటర్ మరో ప్రత్యామ్నాయం లేక 2021 డిసెంబర్లో భార్యను కడతేర్చాడు. దీంతో హంటర్ పై హత్యా నేరం మోపబడింది. భార్య ఆవేదన తట్టుకోలేకే ఆమెను చంపినట్టు హంటర్ పదేపదే కోర్టుకు విన్నవించాడు. అతని తరపు వకీలు కూడా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పుకొచ్చారు. తన భార్య చివరి రోజుల్లో చూడ విహీనంగా తయారైన తన ఆకృతిని ఎవరికీ చూపించలేక మానసికంగా బాగా కుంగిపోయిందని, తనకు డైపర్లు కూడా మార్చేవాడినని, తనకోసం నేను అంతగా శ్రమ పడటం చూడలేకపోయింది. దాన్ని తలచుకుని ఇంకా ఎక్కువ బాధపడేది. ఒకానొక దశలో బాధని తట్టుకోలేక ఎలాగైనా తనను చంపేయమని ఆరేడు వారాలు ప్రాధేయపడిందని, తప్పని పరిస్థితులలోనే అలా చేశానని కోర్టుకు తెలిపారు హంటర్. వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు హంటర్ నరహంతకుడేమీ కాదని వ్యాఖ్యానించింది. కోర్టు తన అభిప్రాయం వెల్లడించిన తర్వాత హంటర్ కళ్ళు చెమ్మగిల్లాయి. మూడేళ్ళుగా జైలులో మగ్గిపోతున్న తన తండ్రి ఎట్టకేలకు బయటకు రానున్నారని సంతోషాన్ని వ్యక్తం చేసింది హంటర్ కుమార్తె. జులై 27న హంటర్ నిర్దోషని తీర్పు వెలువడటమే తరువాయి అమ్మ సమాధి దగ్గరకు వెళ్ళిపోతారని చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి: ఆ రెస్టారెంట్లో తిన్న తర్వాత హాయిగా పడుకోవచ్చు.. -
భర్త వీడియో కాల్ చేయలేదని.. మొదటి భార్య ఆత్మహత్య
అన్నానగర్: తన భర్త మొదటి భార్యతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లడంతో రెండున్నర ఏళ్ల బిడ్డను విడిచిపెట్టి మహిళ ఆత్మహత్య చేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని గణపతి వీధికి చెందిన రఘుపతి (38) వ్యాపారి. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోయంబత్తూరుకు చెందిన దివ్యభారతి(31)ని రఘుపతి 2వ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర ఏళ్ల కుమార్తె ఉంది. ఆ ప్రాంతంలోని లక్ష్మీపురంలో దివ్యభారతి తన బిడ్డతో కలిసి నివసిస్తోంది. రఘుపతి కొద్ది రోజులు భార్య ఇంట్లోనూ, కొన్ని రోజులు దివ్యభారతి ఇంట్లోనూ ఉండేవాడు. రఘుపతికి అప్పటికే పెళ్లయిందని, భార్య, పిల్లలు ఉన్నారని దివ్యభారతికి తెలిసినా.. మొదటి భార్య ఇంటికి వెళ్లవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రఘుపతి తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి తన మొదటి భార్య పిల్లలతో కలిసి ఆంధ్రాకు వెళ్లొద్దని చెప్పి గొడవకు దిగినట్లు సమాచారం. అయితే అతను తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి భర్తను ఎక్కడున్నావని ప్రశ్నించింది. తనతో వీడియో కాల్ మాట్లాడాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అయితే రఘుపతి వీడియో కాల్ చేయలేదని తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన దివ్యభారతి సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
పెళ్లై ఏడు నెలలు.. భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు
దొడ్డబళ్లాపురం: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త ఉదంతం దొడ్డ పట్టణ పరిధిలోని శ్రీనగర్‌లో చోటుచేసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన జనిలా జోబియా(23)కు శ్యామ్(26)తో ఏడు నెలల క్రితం వివాహమైంది. శ్యామ్ స్థానిక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. శ్రీనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఓ దశలో శ్యామ్ కత్తితో జనిలాను శరీరమంతా విచక్షణారహితంగా పొడిచాడు. అడ్డు వచ్చిన శ్యామ్ తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ జనిలాను శ్యామ్ స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.శ్యామ్‌ను అరెస్టు చేశారు. -
భార్య హత్య కేసులో జైలుకెళ్లిన భర్త.. ఆరేళ్ల తర్వాత షాక్..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మథురలో షాకింగ్ ఘటన జరిగింది. భర్త చేతిలో హత్యకు గురైన భార్య ఆరేళ్ల తర్వాత తిరిగి ప్రత్యక్షమైంది. మరొకరితో కలిసి హాయిగా జీవిస్తున్న ఆమెను చూసి భర్త షాక్ అయ్యాడు. ఆమె హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడు ఇప్పటికే 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఏం జరిగిందంటే? ఆర్తి దేవి, సోను సైని 2015లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. బృందావన్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముండే వారు. అయితే ఆర్తి కొద్ది రోజుల తర్వాత అదృశ్యమైంది. ఆ తర్వాత గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. అది తన కూతురిదే అని ఆర్తి తండ్రి పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఆర్తి భర్త సోను, అతని స్నేహితుడు గోపాల్‌పై హత్యానేరం కింద అభియోగాలు మోపారు. 2016లో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో సోను 18 నెలలు, గోపాల్ 9 నెలలు జైలు శిక్ష అనుభవించారు. హత్యను త్వరగా ఛేదించినందుకు పోలీసులకు రూ.15వేల నజరానా కూడా ఇచ్చింది ప్రభుత్వం. అయితే సోను, గోపాల్‌కు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇద్దరూ జైలు నుంచి విడుదల అయ్యారు. తన భార్య చనిపోలేదని భావించిన సోను ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆరేళ్ల తర్వాత ఆమెను మరొకరితో చూశాడు. వెంటనే మథుర పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన వారు.. ఆ మహిళను ఆదివారం అరెస్టు చేశారు. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. -
భార్య సివిల్స్ పోరాటం..భర్తలో అనుమానం
సాక్షి, బెంగళూరు: భార్యను సినిమాశైలిలో హత్య చేసిన భర్త బండారం బయటపడడంతో కటకటాల పాలయ్యాడు. మడివాళ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ అని ఫిర్యాదు చేసిన భర్త పృధ్వీరాజ్ (48) పై అనుమానంతో పోలీసులు అదుపులోకి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డీసీపీ సీకే.బాబా కేసు వివరాలను వెల్లడించారు. మడివాళలో గత 13 ఏళ్లుగా ఎలక్ట్రానిక్ప్ అప్లయన్స్ దుకాణం నిర్వహిస్తున్న బిహార్‌కు చెందిన పృధ్వీరాజ్, 8 నెలల కిందట జ్యోతికుమారి (38) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెది కూడా బిహారే. గత కొద్దిరోజులనుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య విద్యావంతురాలు కాగా ఆమె సివిల్స్‌కు ప్రిపేరవుతోంది. ఒక యువకునితో తరచూ ఫోన్లో మాట్లాడేది. దీంతో భర్త ప్రశ్నించడంతో గొడవలు జరిగేవి. చివరకు ఆమెను హత్యచేయాలని పృధ్వీరాజ్ పథకం రూపొందించాడు. భర్త పృధ్విరాజ్ భార్య జ్యోతి (ఫైల్) ఉడుపిలో తొలి యత్నం విఫలం ఇద్దరి సెల్ఫోన్లు ఇంట్లో పెట్టి ఈ నెల 2న భార్యను ఉడుపి మల్పె బీచ్‌కు తీసుకెళ్లడానికి జూమ్ కారును బాడుగకు తీసుకున్నాడు. స్నేహితుడు సమీర్‌కుమార్‌ను కూడా తీసుకెళ్లాడు. బీచ్‌లో భార్యను ముంచేసి సహజ మరణంగా నమ్మించాలన్నది భర్త కుట్ర. కానీ సముద్రం లోతులోకి దిగలేక ప్లాన్ ఫలించలేదు. తరువాత సకలేశపురకు తీసుకెళ్లి కారులోనే ఆమెను చున్నీతో గొంతుబిగించి ప్రాణాలు తీసి అక్కడే పొదల్లో పడేసి ఇంటికి చేరుకున్నాడు పృధ్వీరాజ్, అతని మిత్రుడు. చదవండి: (మహిళపై అత్యాచారం.. బీజేపీ నేతపై కేసు నమోదు చేయాలని కోర్టు సీరియస్) మిస్సింగ్ అని ఫిర్యాదు 5వ తేదీన మడివాళ పోలీస్‌స్టేషన్‌లో భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ఇంట్లోనే ఉండటాన్ని తెలుసుకుని అనుమానంతో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. పోలీసులు చివరకు అనుమానం వచ్చి భర్తను తమదైన శైలిలో విచారించగా ఒప్పుకున్నాడు. భార్య తనను తీవ్ర వేధింపులకు గురిచేసిందని చెప్పాడు. రెండుసార్లు సివిల్స్ పరీక్షలు రాయడానికి, శిక్షణ సమయంలో ఢిల్లీకి వెళ్లిన సమయంలో అక్కడ ఒక యువకునితో సంబంధం పెట్టుకుందని, దీంతో విరక్తి చెంది హత్యచేశానని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతని మిత్రుని కోసం గాలింపు జరుగుతోంది. -
రూ.28 లక్షలకు సొంతిల్లు అమ్మేసి.. భార్యను ప్లాస్టిక్ కవర్లో సీల్ చేసి..
సాక్షి, చెన్నై : కష్టపడి కట్టుకున్న సొంతింటిని రూ.28 లక్షలకు అమ్మేసి ఆన్లైన్ రమ్మీలో తగలపెట్టాడో భర్త. ప్రశ్నించిన భార్యను హతమార్చి ప్లాస్టిక్ బ్యాగ్‌లో పార్శిల్ చేసి ఇంట్లో పెట్టాడు. ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండా కరోనా నాటకాన్ని రచించి ఉడాయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన నర్సింహరాజు(38) తిరుచ్చికి వచ్చి స్థిర పడ్డాడు. 11 ఏళ్ల క్రతం తిరుచ్చి తిరువానై కావల్‌కు చెందిన గోపినాథ్ కుమార్తె శివరంజనిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులకు సమయపురం శక్తి నగర్లో ఓ ఇల్లు ఉంది. కొన్ని నెలల క్రితం నర్సింహ రాజు ఈ ఇంటిని అమ్మేశాడు. తాలకుడి సాయినగర్‌లో అద్దె ఇంట్లో కుటుంబాన్ని ఉంచాడు. వీరితో నర్సింహ రాజు తల్లి వసంతకుమారి(52) కూడా ఉన్నారు. ఆన్లైన్ రమ్మీకి బానిసై.. గత ఏడాది నుంచి నర్సింహ రాజు ఆన్లైన్ రమ్మీకి బానిస అయ్యాడు. భార్య శివరంజని వారించినా పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో సమయపురంలోని ఇంటిని రూ. 28 లక్షలకు అమ్మి ఆటలో పోగొట్టాడు. విషయం తెలుసుకున్న శివరంజని ఈ నెల 4వ తేదీ రాత్రి భర్తను నిలదీసింది. ఆగ్రహించిన నర్సింహరాజు భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లో చుట్టి బెడ్రూంలో ఉంచాడు. మరుసటి రోజు తల్లి, పిల్లలను విజయవాడకు పంపించేశాడు. ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండా తన భార్యకు కరోనా సోకిందని క్వారంటైన్లో ఉన్నట్లు నాటకం ఆడాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తానూ ఉడాయించాడు. వెలుగులోకి.. రెండు రోజులుగా శివరంజని తన ఫోన్ తీయక పోవడంతో తండ్రి గోపినాథ్ ఆందోళన చెందాడు. నర్సింహరాజు ఫోన్ పనిచేయక పోవడంతో ఆందోళనకు లోనయ్యాడు. విజయవాడలోని అల్లుడి సోదరిని సంప్రదించాడు. శివరంజనికి కరోనా వచ్చినట్టు, ఇద్దరు పిల్లలు మాత్రం తన వద్ద ఉన్నట్టు ఆమె ఇచ్చిన సమాచారంతో ఆందోళన చెందిన గోపినాథ్ గురువారం రాత్రి బంధువులతో కలిసి తాలకుడి సాయినగర్‌కు వెళ్లారు. ఇంటి తలుపులు పగుల కొట్టి చూడగా దుర్వాసన రావడంతో కొల్లిడం పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా గదిలో బెడ్ కింద ప్లాస్టిక్ కవర్లో కప్పి ఉన్న శివరంజని మృత దేహం బయట పడింది. మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు నర్సింహరాజు కోసం గాలిస్తున్నారు. -
రహస్యంగా ఫోన్‌కాల్స్.. ఎన్నిసార్లు చెప్పినా మారని కోడలు.. చివరకు
సాక్షి, భువనగిరి(నల్లగొండ): వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో మహిళను భర్త, ఆమె అత్త కలిసి హత్య చేసినట్లు భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి చెప్పారు. హత్య సంఘటనకు సంబందించి వివరాలను గురువారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్‌లోని మల్లాపూర్ సూర్యనగర్ కాలనీకి చెందిన కోట ధశరథకు ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య వెంకటమ్మకు కుమార్తె హేమలత(28)ను దశరథ బావమర్ది అయిన భువనగిరిలోని తాతానగర్‌కు చెందిన దేశగాని చంద్రశేఖర్‌కు ఇచ్చి పది సంవత్సరాల క్రితం వివాహం చేశారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హేమలత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో చంద్రశేఖర్ తరచూ గొడవపడుతుండేవాడు. ఇదే విషయాన్ని చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. హేమలత రహస్యంగా ఫోన్ వాడుతున్నదని ఆమె అత్తింటివారు నిలదీశారు. ఆమె ప్రవర్తనలో మార్పు రావడం లేదని, తమ పరువు తీస్తుందని భావించి హేమలతను చంపివేయాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు కలిసి.. ఈ నెల 13న ప్లాన్ ప్రకారం చంద్రశేఖర్ భువనగిరి గంజ్‌లోని ఓ దుకాణంలో క్రిమిసంహారక మందు డబ్బాను కొని ఇంటికి వచ్చాడు. అతని బావ రవి హేమలత కాళ్లు చేతులను గట్టిగా పటుకోగా చంద్రశేఖర్ తల్లి వెంకటమ్మ క్రిమిసంహారక మందును హేమలత నోట్లో బలవంతంగా పోసింది. చనిపోయిందోలేదో అనే అనుమానంతో చంద్రశేఖర్ హేమలత మేడకు తాడు బిగించి హత్య చేశాడు. తర్వాత పోలీస్ కేసు అవుతుందనే భయంతో ముగ్గురు అక్కడి నుంచి పారిపోయి యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో తలదాచుకొన్నారు. ఇదే సమయంలో మృతిరాలి తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే భువనగిరి చేరుకున్న హేమలత తండ్రి కూతురిని పరిశీలింగా మేడపై గాయలు ఉన్నట్లు అనుమానం రావడంతో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను నిలదీశాడు. హేమలతను తామే హత్యచేసినట్లు చెప్పడంతో దశరథ స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ సుధాకర్ కేసు నమోదు చేసుకుని ధర్యాపు ప్రారంభించారు. ఈ నెల 15న నిందితులను ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లు, తాడు, క్రిమిసంహారక మందు డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. విలేకరుల సమావేశంలో ఇంచార్జి ఏసీపీ నర్సింహ్మరెడ్డి పాల్గొన్నారు. చదవండి: నా భార్యను అలా చూసి తట్టుకోలేకపోయా.. అందుకే ఆ పనిచేశా! -
కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం
సాక్షి, హైదరాబాద్: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. వివాహం అయిన ఏడు నెలలకే ఆ అభాగ్యురాలు భర్త కర్కశత్వానికి బలైంది. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సిఐ నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా హిర మండలం, గొట్ట గ్రామానికి చెందిన సంతోష్, ఉమ అలియాస్ శిరీష దంపతులు మూసాపేట గూడ్స్‌షెడ్ రోడ్డులో లచ్చయ్య నగర్లో నివాసముంటున్నారు. సంతోష్ స్థానికంగా ఇదే కాలనీలో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరికి ఈ ఏడాది మే 30వ తేదీన వివాహమైంది. సంతోష్, ఉమ కుటుంబ సభ్యులు సైతం మూసాపేటలో స్ధిరపడ్డారు. అయితే సంతోష్ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఉమను అనుమానిస్తూ మానసిక వేదనకు గురి చేసేవాడు. ఉమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. ఇంటికి ఎవరినీ రానిచ్చే వాడు కాదు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం కూడా వీరిద్దరు ఘర్షణ పడగా..పెద్ద మనుషులు జోక్యం చేసుకొని సర్ధిచెప్పారు. అనంతరం కొద్దిసేపటికి ఉమని గొంతు నులిమి హత్య చేసి..శవాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి పరారయ్యాడు. రెండు రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో పక్కింటి వారు ఉమ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు సంతోష్‌కు ఫోన్ చేయగా ఫోన్ ఎత్తకపోవటంతో అనుమానం వచ్చి తాళం పగలగొట్టి చూడగా ఉమ హత్యకు గురైన విషయం తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా గొంతునులిమి హత్యచేసినట్లుగా గుర్తించారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) -
కూతురి సాక్ష్యం, తండ్రికి జీవిత ఖైదు
సాక్షి, మైసూరు(కర్ణాటక): తల్లిని తండ్రే హత్య చేయడం తాను చూశానని చిన్నారి కూతురు చెప్పిన సాక్ష్యంతో తండ్రికి శిక్ష పడింది. వివరాలు.. చామరాజనగర జిల్లా కోళిపాళ్య గ్రామానికి చెందిన తొళచనాయక్కు, పుష్పబాయికి పెళ్లి సమయంలో 20 గ్రాముల బంగారు నెక్లెస్‌ను ఇచ్చారు. వీరికి 8 ఏళ్ల కూతురు ఉంది. తొళచనాయక్ తమ్మునికి సమస్య వస్తే డబ్బుల కోసం బంగారు నెక్లెస్‌ను కుదువ పెట్టాడు. నెక్లెస్‌ను విడిపించుకురావాలని భార్య ఒత్తిడి చేసేది. 2017 మార్చి 27న ఇదే విషయమై గొడవ జరగ్గా తొళచనాయక్ వేటకొడవలితో భార్యను నరికి చంపాడు. ఈ కేసులో తుది విచారణ చామరాజనగర అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో జరిగింది. తండ్రి దాష్టీకంపై కూతురు సాక్ష్యం చెప్పడంతో నేర నిరూపణ అయ్యింది. దోషికి జీవితఖైదును విధించారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే భార్యను..
సాక్షి, శివమొగ్గ (కర్ణాటక): ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అంతలోనే అనుమానమో, ఆవేశమో చివరకు భార్యను దారుణంగా హతమార్చాడు. వివరాలు... శివమొగ్గ జిల్లా ఆయనూరుకు చెందిన కౌసర్ ఫిజా (19), టిప్పు నగర్లో ఉండే గుజరీ వ్యాపారి షోయబ్‌లు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదు, శనివారం రాత్రి షోయబ్ భార్య కౌసర్‌ను తీసుకుని నగరానికి సమీపంలోని హాలూరు గ్రామం వద్ద దారుణంగా చంపేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (బుల్లితెర నటి ఉమామహేశ్వరి కన్నుమూత) -
భార్యను కత్తితో నరికి.. భర్త ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం: తల్లాడ మండలం రంగంబంజర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను కత్తితో నరికి చంపి అనంతరం తాను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగంబంజర్ గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర రావు (65) తన భార్య సంక్రాంతి విజయలక్ష్మిని కత్తితో నరికి చంపాడు. తర్వాత తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న విజయ లక్ష్మీ మృతదేహం, భర్త సుబ్రహ్మణ్యేశ్వర రావు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మర్టంకు తరలించారు. ఈ మృతులకు దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక కూతురు విదేశంలో ఉంటుండగా మరో కూతురు రామగుండంలో జాబ్ చేస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసలు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: గొంతు నులిమి చంపాలనుకున్నాడు.. కానీ -
ప్రియురాలి మోజులో.. భార్యకు విషపు ఇంజెక్షన్
దొడ్డబళ్లాపురం : ప్రియురాలిపై వ్యామోహంతో కట్టుకున్న భార్యను కడతేర్చిన కిరాతక భర్తను రామనగర పోలీసులు అరెస్టు చేశారు. రామనగర ప్రభుత్వ ఆస్పత్రిలో రోజు కూలీ ఉద్యోగిగా పనిచేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్ (28) నిందితుడు. ఇతడు భార్య దీప (22)కు విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు... ఏడాది క్రితం రామనగర తాలూకా కొళమారనకుప్పె గ్రామానికి చెందిన దీపకు సమీప వడ్డరదొడ్డివాసి వెంకటేశ్‌తో పెళ్లయింది. ఇతనికి అంతకుముందే ఆస్పత్రిలో పనిచేసే ఒక యువతితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి తరువాత ఈ సంగతి తెలిసిన భార్య.. తన తల్లిదండ్రులకు చెబుతానని గొడవ చేసింది. ఈ విషయమై ఇద్దరికీ నిత్యం గలాటాల జరిగేవి. వెంకటేశ్ భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ప్రియురాలితో కలిసి కుట్ర తనకు, ప్రియురాలికి మధ్య అడ్డుగా ఉన్న దీపను అంతమొందించాలని అతడు పథకం వేశాడు. దాని ప్రకారం వెంకటేశ్ ప్రియురాలి సాయంతో కొన్ని మాత్రలు తీసికెళ్లి దీప చేత బలవంతంగా మింగించి ఆమె స్పహ తప్పాక ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స ఇప్పించాడు. ఆమె కోలుకున్నాక ఇంటికి తీసుకువచ్చి ఫర్టిలైజర్ దుకాణం నుంచి పురుగుల మందు తీసుకువచ్చి భార్యకు ఇంజెక్షన్ వేశాడు. విష ప్రభావంతో దీప మృతి చెందింది. అతడు ఏమీ ఎరగనట్టు ఆస్పత్రికి వచ్చి ఆరోగ్యం బాలేదని గ్లూకోజ్ పెట్టించుకుని అడ్మిట్ అయ్యాడు. ఆరోగ్యంగా ఉన్న దీప ఆకస్మాత్తుగా మరణించడంతో బంధుమిత్రుల్లో అనుమానాలు వచ్చాయి. పోలీసుల విచారణలో వెంకటేశ్ దురాగతం బయటపడింది. ప్రియుడు, ప్రియురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
చిక్కడు.. దొరకడు.. ఎఫ్‌బీఐకి కూడా..
న్యూయార్క్/న్యూఢిల్లీ: ఆ హంతకుడిపై ఏకంగా రూ. 70లక్షల రివార్డు. దర్యాప్తులోనే మేటి అయిన అమెరికా అతని కోసం తెగ అన్వేషిస్తోంది. భారత్‌సహా నాలుగేళ్లుగా ప్రపంచాన్ని జల్లెడ పట్టినా అతడు దొరకలేదు. అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) టాప్ 10 వాంటెడ్ లిస్టులో స్థానం దక్కించుకున్నాడు. అతడే అహ్మదాబాద్‌కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ (24). అమెరికాలోని డంకిన్ డోనట్స్ స్టోర్‌లో పనిచేస్తున్న అతడు తన భార్యను కిరాతకంగా చంపాడు. అనంతరం తప్పించుకొని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. 2015 ఏప్రిల్ 12న రాత్రి పనిచేస్తున్న అతడు తన భార్య ఫలక్ (21)తో కలసి స్టోర్‌లోని కిచెన్‌కు వెళ్లాడు. కాసేపటికి ఒక్కడే బయటకు వచ్చాడు. కొద్ది గంటల తర్వాత పోలీసులు అమె మృత దేహాన్ని కనుక్కున్నారు. చాలా సార్లు కత్తితో పొడిచి మరీ హత్యచేశాడు. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం అతడు ఓ టాక్సీలో హోటల్‌కు వెళ్లి రాత్రంతా పడుకొని తెల్లవారాక మాయమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడు కనిపించలేదు. ఎఫ్‌బీఐ అతడి కోసం అమెరికాలోనేగాక భారత్‌లోని గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలలో కూడా వెదికారు. ఇరుదేశాలు కలసి చేసిన పెద్ద కేసు విచారణ ఇదే కావడం గమనార్హం. -
భార్యను చంపి, కిటికీకి ఉరివేసి..
క్రిష్ణగిరి: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను మానవత్వం మరచి హత్య చేశాడో మృగాడు. భార్యను దారుణంగా హత్య చేసి ఉరికి వేలాడదీసి పరారైన భర్త కోసం సూళగిరి పోలీసులు గాలిస్తున్నారు. విళుపురం జిల్లా శంకరాపురం సమీపంలోని మరిది గ్రామానికి చెందిన ఇళయరాజ భార్య శాంతి (33) హతురాలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఉద్యోగ నిమిత్తం భార్యాభర్తలిరువురూ గత 15 రోజుల క్రితం సూళగిరికి వచ్చారు. సూళగిరి దిగువపేటలో బాడుగ ఇంట్లో నివాసముంటూ వచ్చారు. శుక్రవారం రాత్రి ఇళయరాజ భార్య శాంతిని హత్య చేసి కిటికీ ఆమెను ఉరిలో వేలాడదీసి పరారయ్యాడు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికెళ్లి శాంతి మృతదేహాన్ని స్వాధీనపరుచుకొని పరారైన భర్తపై హత్య కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ సంఘటన సూళగిరి ప్రాంతంలో సంచలనం సృష్టించింది. -
కట్టుకున్నవాడే కాల యముడయ్యాడు
ఇందల్వాయి(నిజామాబాద్ రూరల్): జీవితంలో సగభాగం పంచి భార్యను సుఖపెట్టాల్సిన భర్త ఆమె పాలిట కాలయముడై కడతేర్చిన బాధాకర ఘటన మండలంలోని ఎల్లారెడ్డిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపల్లెకి చెందిన కుంట విజయ(45)కు ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన గంగబాపుతో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ప్రశాంత్, శ్రీకాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పని చేయకుండా మద్యానికి బానిసై గ్రామంలో అందరితో గొడవలు పెట్టుకొని అప్పుల పాలై కుటుంబ ప్రతిష్టను దిగజార్చిన గంగబాపును విడిచి కుంట విజయ తన తల్లిగారి గ్రామమైన ఎల్లారెడ్డిపల్లెలో తన కుమారులను పోషిస్తూ జీవిస్తుంది. ఈ క్రమంలో తన కుమారులను గల్ఫ్ దేశాలకు పంపి గ్రామంలో ఇల్లు కూడా కొనుగోలు చేసింది. భార్య దూరమైన క్రమంలో గంగబాపు కూడా బయటి దేశాలకు వెళ్లి మూడు నెలల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చాడు. కొడుకులు లేని అదును చూసి భార్యకు మాయ మాటలు చెప్పి తనకు దగ్గరై కొంత కాలం మంచి వాడిగా నటించి పాడి పశువులు పెంచుతూ, సమీపంలో ఉన్న విశ్వ ఆగ్రోటెక్ గొర్రెల ఫామ్‌లో కూలి పనులు చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మద్యానికి మరల బానిసై భార్యను వేదిస్తూ తరుచూ గొడవలు పడేవాడని గ్రామస్తులు తెలి పారు. అదే క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం తాగి భార్యతో గొడవ పడి మద్యం మత్తులో సహనం కోల్పోయి రోకలి దుడ్డుతో భార్య తలపై బాది హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. పొద్దున ఇంటి ముందు పశువులను ఎంతకీ విడిచిపెట్టక పోవడంతో అనుమానం వచ్చిన మృతురాలి అక్క కొడుకు ఇంటి తాళం పగులగొట్టి చూడగా కుంట విజయ రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న సీఐ రామాంజనేయులు, ఎస్ఐ రాజశేఖర్ ఘటనపై గ్రామస్తుల నుంచి వివరాలు సే కరించి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుంట విజయ హత్య వార్త తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని విజయ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. -
అనుమానిస్తోందని అంతం చేశాడు..!
హైదరాబాద్: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అనుమానించిన భార్యను అంతమొందించాడు ఓ రిటైర్డ్ పోలీసు అధికారి. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని భాస్కర్‌రావు పేటకు చెందిన కె.ఎస్.ఆర్. ఆంజనేయరెడ్డి(61), లక్ష్మీ వినీల(51) దంపతులు. ఆంజనేయరెడ్డి ఏలూర్ రేంజ్లో వీఆర్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశా రు. రెండు నెలల క్రితం దంపతులు కొండాపూర్ గౌతమీ ఎన్‌క్లేవ్‌లో నివాసముండే కొడుకు శివమనోహర్రెడ్డి వద్దకు వచ్చారు. కొడుకు అత్తవారింటికి వెళ్లడంతో ఫ్లాట్‌లో ఆ దంపతులిద్దరే ఉన్నారు. సోమవారం తెల్లవారు జామున వినీలను ఆంజనేయరెడ్డి విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. రక్తం కనిపించకుండా బెడ్రూమ్ శుభ్రం చేసి ఉదయం 5.30 గంటల సమయం లో మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. అక్రమ సంబంధం.. డబ్బు వివాదమే కారణం ఆంజనేయరెడ్డి కొంతకాలం రైల్వేపోలీస్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో మరో మహిళతో చనువుగా ఉంటున్నావని లక్ష్మీవినీల తరచూ భర్తతో గొడవపడేది. రిటైర్మెంట్ అనంతరం వచ్చిన డబ్బులను బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. రూ.లక్షా ముప్పై వేల విషయంలో ఆంజనేయరెడ్డి చెప్పిన లెక్కలకు లక్ష్మీవినీల సంతృప్తి చెందలేదు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు ఆ డబ్బు ఇచ్చావని కొద్దిరోజులుగా గొడవ పడుతోంది. సోమవారం రాత్రి ఈ విషయమై మళ్లీ గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఛాతీ కింద భాగంలో 16 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్త దాడి చేసే సమయంలో వినీల పెనుగులాడిన ఆనవాళ్లు ఉన్నాయి. ఏపీకి అప్పుడప్పుడు విమానంలో వెళ్లేవాడినని, ఈ క్రమంలో డబ్బు ఖర్చు అయిం దని చెప్పినా నమ్మకుండా మరో మహిళతో సం బంధముందని వేధించడంతోనే హత్య చేసినట్లు ఆంజనేయరెడ్డి పోలీసులకు తెలిపాడు. కొండాపూర్‌లో ఉండే కూతురు రామప్రవళిక, అల్లుడు హుటాహుటిన వచ్చి కన్నీళ్ల పర్యంతమయ్యారు. -
ప్రియాంక హత్య కేసు.. ఊహించని మలుపు
సాక్షి, నల్లగొండ : పద్నాలుగేళ్ల క్రితం జరిగిన మర్రిగుడ మహిళ హత్యకేసు చివరికి ఊహించని మలుపు తిరిగింది. ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి పారిపోయిన తన అక్క కోసం ఓ తమ్ముడు చేసిన ప్రయత్నం చివరికి ఫలించింది. మర్రిగుడకి చెందిన హనుమంతు అనే వ్యక్తి నార్కట్‌పల్లికి చెందిన ప్రియాంకను 2004లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు వివాహం చేసుకున్నట్లు ప్రియాంక ఇంట్లోవారికి తెలియదు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కుటుంబంలో కలహాలు రావడంతో హనుమంతు భార్యా, పిల్లలను హత్య చేసి, మరో మహిళతో వివాహ సంబంధం పెట్టుకున్నట్లు గతంలో వెల్లడైంది. గత నాలుగేళ్లుగా తన అక్క కోసం గాలిస్తున్న ప్రియాంక సోదరుడు ఉపేందర్‌కి ఎట్టకేలకు హనుమంతు అచూకి లభించింది. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీసుల విచారణలో భార్య, పిల్లల్ని హత్య చేశానని తెలిపాడు. అతని వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు కేసును మరింత లోతుగా విచారించారు. తాజా విచారణలో పిల్లలు క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. బాబు రాంచరణ్‌ను బంధువుల వద్ద ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి హాలియాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నట్లు గుర్తించారు. -
కుమార్తెను చూసి వద్దామన్నందుకు..
మల్కాజిగిరి : కన్నపేగుపై మమకారం ఓ హత్యకు దారితీసింది. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ కొమరయ్య కథనం మేరకు వివరాలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా, చెల్లూరుకు చెందిన వెంకటరమణ, లక్ష్మి అలియాస్ చంటమ్మ(55) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. బతువుదెరువు నిమిత్తం రెండు నెలల క్రితం భార్యతో నగరానికి వలస వచ్చిన వెంకటరమణ గౌతంనగర్‌లోని మేఘన కుటీర్ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. దివ్యాంగురాలైన కుమార్తె శ్రీదేవికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో గత కొన్ని రోజులుగా ఆమెను చూసివద్దామని భర్తను కోరుతోంది. ఈ విషయమై గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం. గురువారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో వెంకటరమణ గదిలో ఉన్న మోటర్తో లక్ష్మి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సోదరి బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
భార్య, అత్తను చంపిన అల్లుడు
చుండూరు(అమృతలూరు): తల్లి, కూతురు, అల్లుడు మధ్య జరిగిన తగాదాల నేపథ్యంలో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భార్య, అత్త ప్రవర్తనపై పేట్రేగిన అల్లుడు చివరకు అత్తారింట్లోనే పచ్చడి బండతో హత్య చేశాడు. గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. మోదుకూరు దళితవాడకు చెందిన వణుకూరి వందనం, కరుణమ్మ దంపతుల కుమార్తె మరియమ్మ (35)కు వట్టిచెరుకూరు మండలం కోవెలమూడికి చెందిన బుర్రి దావీదు (50)తో దాదాపు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పదేళ్ల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడంతో మరియమ్మ కొంతకాలంగా తన ఇద్దరు పిల్లలతో సహా పుట్టింట్లోనే తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. మధ్యలో పలుమార్లు భర్త దావీదు కుల పెద్దలను పంపించి కాపురానికి రావాలని అడిగినా, తాను రానని ససేమిరా చెప్పింది. దీంతో విసుగు చెందిన భర్త నాలుగు రోజుల కిందట అత్తారింటికి వచ్చాడు. భార్యా, పిల్లలతో మూడు రోజులపాటు బాగానే ఉన్నాడు. మంగళవారం రాత్రి భోజనం చేసి అందరూ నిద్రపోతుండగా, పథకం ప్రకారం దావీదు రాత్రి 12.30 గంటల సమయంలో పచ్చడి బండతో అత్త కరుణమ్మ తలపై మోదాడు. కేకలకు నిద్ర లేచిన భార్య మరియమ్మ తల్లి వద్దకు రాగా, మరియమ్మను కూడా బండతో మోదాడు. దీంతో వారు కుప్పకూలిపోయారు. చుట్టుపక్కల జనం వచ్చి చూసి 108కు సమాచారం అందజేశారు. గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మరియమ్మ, చికిత్స పొందుతూ కరుణమ్మ మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లికి నిరాకరించిందని ఆర్మీ మేజర్ కిరాతకం
న్యూఢిల్లీ : ఆర్మీ మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజ హత్య కేసులో ప్రధాన నిందుతుడు మేజర్ నిఖిల్ హండాను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శైలజ, నిఖిల్ హండాను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతోనే నిఖిల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆర్మీ మేజర్‌గా పనిచేస్తున్న నిఖిల్ హండాకు 2015లో నాగలాండ్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అదే సమయంలో శైలజ భర్త మేజర్ ద్వివేదికి కూడా నాగలాండ్‌లోనే పోస్టింగ్ ఇచ్చారు. ఆ విధంగా నిఖిల్, శైలజల మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత నిఖిల్, శైలజను వివాహం చేసుకోవాల్సిందిగా కోరాడు. కానీ శైలజ అందుకు అంగీకరించలేదు. అయితే వీరిద్దరి స్నేహం గురించి శైలజ భర్త మేజర్ ద్వివేదికి తెలిసింది. దాంతో అతడు శైలజ, నిఖిల్ల మధ్య ఎటువంటి కాంటక్ట్ ఉండకూడదని వారించాడు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం నిఖిల్ కొడుకు ఆరోగ్యం పాడవడంతో అతన్ని ఢిల్లీలోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో చేర్చాడు. ఇదే సమయంలో శైలజ కూడా ఢిల్లీలోనే ఉంది. కొడుకు వైద్యం కోసం ఢిల్లీకి వచ్చిన నిఖిల్ శైలజకు ఫోన్ చేసి తనను కలవాల్సిందిగా కోరాడు. దాంతో గత శనివారం శైలజ ఇంట్లో ఫిజియోథెరపికి వెళ్తున్నాని చెప్పి బయటకు వచ్చింది. అయితే శైలజను ఫిజియోథెరపికి తీసుకెళ్లడానికి ద్వివేది ప్రభుత్వ వాహనాన్ని ఏర్పాటు చేశాడు. ఫిజియోథెరపి కోసం వెళ్లిన శైలజ తిరిగిరాలేదని తెలిపాడు డ్రైవర్. ఫిజియోథెరపీ కోసం వెళ్లిన శైలజ నిఖిల్ హండాను కలిసింది. ఆ సమయంలో నిఖిల్ తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా శైలజను కోరాడు. ఈ విషయం గురించి వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. శైలజ వివాహనికి నిరాకరించడంతో విచక్షణ కోల్పోయిన నిఖిల్ వెంట తెచ్చుకున్న కత్తితో శైలజ గొంతు కోసి చంపాడు. శైలజ మరణాన్ని ఆక్సిడెంట్‌గా చిత్రికరించడానికి ఆమె మృత దేహాన్ని కారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు.అనంతరం అక్కడ నుంచి ఆస్పత్రికి వెళ్లి తన కుమారున్ని కలిసి యథాప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న మీరట్(ఉత్తరప్రదేశ్)కు వెళ్లి పోయాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం రోడ్డు మీద శైలజ మృత దేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మరణించిన వ్యక్తిని శైలజగా గుర్తించి, కేసు నమోదు చేశారు. శైలజ భర్త మేజర్ ద్వివేది, నిఖిల్ హండా మీద అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఇలోపు శైలజ ఫోన్లో నిఖిల్ హండాకు, శైలజకు మధ్య జరిగిన సంభాషణను పరిశీలించిన పోలీసులు నిఖిల్ హండాను నేరస్తుడిగా నిర్ధారించారు. దాంతో ఒక పోలీసులు బృందం ఆదివారం మీరట్ వెళ్లి నిఖిల్‌ను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. -
భార్యను దారుణంగా హత్యచేసి రైల్వేట్రాక్‌పై పడేసిన భర్త
-
వీడిన వివాహిత హత్య మిస్టరీ
పుత్తూరు : నారాయణవనంలో వివాహిత హత్య మిస్టరీ ఒక రోజు వ్యవధిలోనే వీడింది. వివాహేతేర సంబంధాలకు అడ్డుగా ఉందని సాక్షాత్తు భర్తే కిరాయి వ్యక్తులతో హత్య చేయించాడు. తన అక్క కొడుకుతో కలిసి దీనికి స్కెచ్ వేశాడు. పుత్తూరు ఇన్చార్జి డీఎస్పీ సూర్యనారాయణ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన కథనం..వైఎస్సార్ కడప జిల్లా, రైల్వే కోడూరుకు చెందిన సాధు శివకుమార్‌కు 15 ఏళ్ల క్రితం అదే ఊరికి చెందిన సుజాతతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శివకుమార్ నారాయణవనంలో ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొంతకాలంగా సుజాత మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. దీం తో శివకుమార్ ఇతర స్త్రీలతో సన్నిహిత సంబంధాలు నెరపేవాడు. విడాకులు ఇవ్వాలని కోరినా సుజాత ససేమిరా అనడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని శివకుమార్ వ్యూహరచన చేశాడు. అక్క కొడుకు సహకారంతో... విషప్రయోగంతో సుజాతను కడతేర్చేందుకు దారులు అన్వేషించి , చివరకు హత్యనే మార్గంగా ఎంచుకున్నాడు. ఆపై, తిరుపతిలోని కాటన్ మిల్లు వద్ద కాపురముంటున్న తన అక్క కొడుకు రవికుమార్‌తో కలిసి ఆటోనగర్‌లో ఉంటున్న ఉపేంద్ర, నాగరాజును సంప్రదించి స్కెచ్ వేశాడు. నెత్తురు చిందించకుండా సుజాతను అంతమొందించాలంటూ రూ. 50 వేలతో డీల్ కుదుర్చుకున్నాడు. సుజాతను గుర్తు పట్టేందుకు వీలుగా పది రోజుల క్రితం వీరిద్దరినీ నారాయణవనానికి పిలిపించి తన స్నేహితులుగా ఆమెకు పరిచయం చేశాడు. గొంతు నులిమి చంపేశారు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఊరికి వెళుతున్నట్లు చెప్పి సోమవారం ఉదయం శివకుమార్ ఇంట్లో నుంచి వచ్చేశాడు. అప్పటికే బైపాస్ సమీపంలో సిద్ధంగా ఉన్న ఉపేంద్ర, నాగరాజును కలిశాడు. ఆ తర్వాత మద్యం సేవించిన ఉపేంద్ర, నాగరాజు మధ్యాహ్నం 12.15 సమయంలో శివకుమార్ ఇంటికి వెళ్లారు. తన భర్త వారిని స్నేహితులుగా పరిచ యం చేసి ఉండడంతో వారిని ఇంట్లోకి రమ్మంది. ఇదే అవకాశంగా ఆమెను హత్య చేసేందుకు వారు యత్నించారు. ఉపేంద్ర సుజాత కాళ్లూచేతులను పట్టుకోగా, నాగరాజు లెగ్గిన్‌తో ఆమె గొంతు బిగించాడు. సుజాత కేకలు పెట్టడడంతో మిద్దెపై కాపురముంటున్న వాళ్లు వచ్చి తలుపులు తట్టడంతో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో ఇరువురినీ అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. సుజాతను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆమె మృతి చెందిందిందని చెప్పారు. మరో నిందితుడు రవికుమార్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు. 24 గంటల్లో కేసును ఛేదించిన సీఐ కొండయ్య, ఎస్ఐ హనుమంతప్ప, పురుషోత్తం, ఏఎస్ఐ సురేష్, కానిస్టేబుళ్లు రాకేష్‌లను ప్రత్యేకంగా అభినందిస్తూ వీరికి ఎస్పీ రాజశేఖర్‌బాబు రివార్డులు ప్రకటించినట్లు ఆయన చెప్పారు.