రంగారెడ్డి: భార్యను హత్యచేసిన భర్తకు జీవితఖైదుతోపాటు నాలుగువేల రూపాలయల జరిమానా విధిస్తూ 3వ అదనపు డిస్ట్రిక్‌అండ్ సేషన్స్ జడ్జీ బుధవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్‌ప్రాసిక్యూటర్ నక్క రవీందర్ కథనం ప్రకారం మహేశ్వరం మండలం తుక్కగూడ గ్రామంలో నివాసముండే సత్తయ్య, జ్యోతిలు భార్యభర్తలు. వీరి వివాహం 7సంవత్సరాల క్రితం జరిగింది. వివాహనంతరం వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి ఒక బాబు.
కొంత కాలంగా భార్యజ్యోతిని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు. ఆ క్రమంలో 2015 ఫిబ్రవరి 26న సత్తయ్య తన సొంత గ్రామమైన రాపోలుకు వెళ్లి మూడు రోజుల తర్వాత ఇంటికి రావడంతో భార్య జ్యోతి మూడు రోజులు ఎక్కడకి వెళ్లావంటూ భర్త సత్తయ్యను ప్రశ్నించింది. మద్యం మత్తు లో ఉన్న సత్తయ్య భార్య జ్యోతితో గొడవ పడి భార్యను చంపేస్తానంటూ అమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలతో జ్యోతి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మరణ వాంగూల్మం మేరకు పహాడిషరీప్ పోలీసులు భర్త సత్తయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్డులో అభియోగ పత్రాలు నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలు పరిశీలించిన 3వ అదనపు డిస్ట్రిక్‌అండ్ సెషన్స్ జడ్జీ పై విధంగా తీర్పు చెప్పారు.
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
Published Wed, Aug 31 2016 7:23 PM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM
Advertisement
Advertisement