లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మథురలో షాకింగ్ ఘటన జరిగింది. భర్త చేతిలో హత్యకు గురైన భార్య ఆరేళ్ల తర్వాత తిరిగి ప్రత్యక్షమైంది. మరొకరితో కలిసి హాయిగా జీవిస్తున్న ఆమెను చూసి భర్త షాక్ అయ్యాడు. ఆమె హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడు ఇప్పటికే 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు.
ఏం జరిగిందంటే?
ఆర్తి దేవి, సోను సైని 2015లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. బృందావన్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముండే వారు. అయితే ఆర్తి కొద్ది రోజుల తర్వాత అదృశ్యమైంది. ఆ తర్వాత గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. అది తన కూతురిదే అని ఆర్తి తండ్రి పోలీసులకు చెప్పాడు.
దీంతో పోలీసులు ఆర్తి భర్త సోను, అతని స్నేహితుడు గోపాల్‌పై హత్యానేరం కింద అభియోగాలు మోపారు. 2016లో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో సోను 18 నెలలు, గోపాల్ 9 నెలలు జైలు శిక్ష అనుభవించారు. హత్యను త్వరగా ఛేదించినందుకు పోలీసులకు రూ.15వేల నజరానా కూడా ఇచ్చింది ప్రభుత్వం.
అయితే సోను, గోపాల్‌కు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇద్దరూ జైలు నుంచి విడుదల అయ్యారు. తన భార్య చనిపోలేదని భావించిన సోను ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆరేళ్ల తర్వాత ఆమెను మరొకరితో చూశాడు. వెంటనే మథుర పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన వారు.. ఆ మహిళను ఆదివారం అరెస్టు చేశారు.
చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
Comments
Please login to add a commentAdd a comment