గర్భిణిని హతమార్చిన భర్త
జీడిమెట్ల (హైదరాబాద్): ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యను భర్తే హతమార్చిన ఘటన నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గాజుల రామారం పరిధిలోని ప్రకాశం పంతులు నగర్‌కు చెందిన హుస్సేన్, గౌసియా బేగం దంపతుల మధ్య కొన్నాళ్లుగా మనస్పర్థలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం కూడా వీరిద్దరు గొడవపడ్డారు. అదే రోజు రాత్రి హుస్సేన్ తన భార్య గౌసియా బేగంను హత్య చేశాడు. అనంతరం తలాబ్‌కట్టలో ఉండే అత్తా, మామలకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. వారు ఆదివారం ఉదయం కూతురు ఇంటికి వచ్చి చూడగా ఆమె శవమై కనిపించింది. దీంతో వారు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.