కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం | Woman Murdered by Husband In Kukatpally Hyderabad | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం

Published Fri, Dec 10 2021 3:51 PM | Last Updated on Sat, Dec 11 2021 3:36 PM

Woman Murdered by Husband In Kukatpally Hyderabad - Sakshi

ఉమా, సంతోష్‌ల పెళ్లినాటి ఫొటో

సాక్షి, హైదరాబాద్‌: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. వివాహం అయిన ఏడు నెలలకే ఆ అభాగ్యురాలు భర్త కర్కశత్వానికి బలైంది. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సిఐ నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా హిర మండలం, గొట్ట గ్రామానికి చెందిన సంతోష్, ఉమ అలియాస్‌ శిరీష దంపతులు మూసాపేట గూడ్స్‌షెడ్‌ రోడ్డులో లచ్చయ్య నగర్‌లో నివాసముంటున్నారు. సంతోష్‌ స్థానికంగా ఇదే కాలనీలో వెల్డింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. వీరికి ఈ ఏడాది మే 30వ తేదీన వివాహమైంది. సంతోష్, ఉమ కుటుంబ సభ్యులు సైతం మూసాపేటలో స్ధిరపడ్డారు.


అయితే సంతోష్‌ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఉమను అనుమానిస్తూ మానసిక వేదనకు గురి చేసేవాడు. ఉమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. ఇంటికి ఎవరినీ రానిచ్చే వాడు కాదు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం కూడా వీరిద్దరు ఘర్షణ పడగా..పెద్ద మనుషులు జోక్యం చేసుకొని సర్ధిచెప్పారు. అనంతరం కొద్దిసేపటికి ఉమని గొంతు నులిమి హత్య చేసి..శవాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి పరారయ్యాడు.

రెండు రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో పక్కింటి వారు ఉమ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు సంతోష్‌కు ఫోన్‌ చేయగా ఫోన్‌ ఎత్తకపోవటంతో అనుమానం వచ్చి తాళం పగలగొట్టి చూడగా ఉమ హత్యకు గురైన విషయం తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా గొంతునులిమి హత్యచేసినట్లుగా గుర్తించారు.

చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement