అనుమానంతో భార్యను చంపిన భర్త | Husband kills his wife with knife in karimnagar district | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను చంపిన భర్త

Published Wed, Apr 29 2015 3:48 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

మల్లేశం-మమత (ఫైల్ ఫోటో) - Sakshi

మల్లేశం-మమత (ఫైల్ ఫోటో)

కరీంనగర్(గొల్లపల్లి): గొల్లపల్లి మండలం గోవిందునిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఓ భర్త, భార్యను పాశవికంగా హతమార్చాడు. వివరాలు.. మమత(26), మల్లేశం భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. కొన్ని రోజులుగా మల్లేశం తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

అనంతరం పరారయ్యాడు. అనుమానం పెంచుకుని, అదనపు కట్నం కోసం తరచూ వేధింపులకు గురిచేసేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement