
న్యూయార్క్/న్యూఢిల్లీ: ఆ హంతకుడిపై ఏకంగా రూ. 70లక్షల రివార్డు. దర్యాప్తులోనే మేటి అయిన అమెరికా అతని కోసం తెగ అన్వేషిస్తోంది. భారత్‌సహా నాలుగేళ్లుగా ప్రపంచాన్ని జల్లెడ పట్టినా అతడు దొరకలేదు. అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) టాప్ 10 వాంటెడ్ లిస్టులో స్థానం దక్కించుకున్నాడు. అతడే అహ్మదాబాద్‌కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ (24). అమెరికాలోని డంకిన్ డోనట్స్ స్టోర్‌లో పనిచేస్తున్న అతడు తన భార్యను కిరాతకంగా చంపాడు. అనంతరం తప్పించుకొని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.
2015 ఏప్రిల్ 12న రాత్రి పనిచేస్తున్న అతడు తన భార్య ఫలక్ (21)తో కలసి స్టోర్‌లోని కిచెన్‌కు వెళ్లాడు. కాసేపటికి ఒక్కడే బయటకు వచ్చాడు. కొద్ది గంటల తర్వాత పోలీసులు అమె మృత దేహాన్ని కనుక్కున్నారు. చాలా సార్లు కత్తితో పొడిచి మరీ హత్యచేశాడు. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం అతడు ఓ టాక్సీలో హోటల్‌కు వెళ్లి రాత్రంతా పడుకొని తెల్లవారాక మాయమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడు కనిపించలేదు. ఎఫ్‌బీఐ అతడి కోసం అమెరికాలోనేగాక భారత్‌లోని గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలలో కూడా వెదికారు. ఇరుదేశాలు కలసి చేసిన పెద్ద కేసు విచారణ ఇదే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment