Federal Bureau of Investigation (FBI)
-
Christopher Wray : ‘ట్రంప్ రాకముందే నేనే రాజీనామా చేస్తా’
వాషింగ్టన్ : అమెరికా శక్తిమంతమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఆ లోపే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ప్రకటించారు. క్రిస్టోఫర్ నిర్ణయంపై ‘గ్రేట్ డే ఫర్ అమెరికా’ అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా వ్యాఖ్యానించారు.‘కొంత కాలంగా సుదీర్ఘంగా సాగిన ఆలోచలన తర్వాత, ప్రస్తుత ప్రభుత్వ పాలన ముగిసే వరకు బాధ్యతలు నిర్వర్తిస్తా. ఆపై వైదొలగాలని నిర్ణయించుకున్నాను’ అని క్రిస్టోఫర్ వ్యాఖ్యానించారు. పదేళ్ల పదవీకాలంలో ఎఫ్‌బీఐ డెరెక్టర్‌గా క్రిస్టోఫర్‌కి మరో మూడేళ్లు ఉన్నాయి. అయినప్పటికీ ట్రంప్ రాకముందే పదవి నుంచి పక్కకి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.2017లో 38,000 మంది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్‌కు అధిపతిగా క్రిస్టోఫర్ని ట్రంప్ నియమించారు. ఆ తర్వాత అమెరికాలో జరిగిన వరుస పరిణామల నేపథ్యంలో ట్రంప్‌పై క్రిస్టోఫర్ చర్యలు తీసుకున్నారు. తాజా, ఎఫ్‌బీఐ డైరెక్టర్ నిర్ణయంపై ట్రంప్ స్పందించారు.క్రిస్టోఫర్ రాజీనామా అమెరికాకు గొప్ప రోజు. క్రిస్టోఫర్ వ్రే నాయకత్వంలో ఎఫ్‌బీఐ ఎలాంటి కారణాలు లేకుండా నా ఇంటిపై అక్రమంగా దాడి చేసింది. చట్టవిరుద్ధంగా అభిశంసన, నేరారోపణలు చేయడంలో శ్రద్ధగా పనిచేసింది. అమెరికా విజయం, భవిష్యత్తుకు అంతరాయం కలిగించడానికి చేయాల్సిన వన్సీ చేసింది’ అని ట్రంప్ ట్రూత్ సోషల్లోని పోస్ట్‌లో పేర్కొన్నారు. 🇺🇸Trump Nominates Cash Patel For FBI Director.😎 pic.twitter.com/f8d6I4l6gE— S p r i n t e r (@SprinterFamily) November 14, 2024తదుపరి ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా తన సన్నిహితుడు కాష్ పటేల్‌ను అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ‘తదుపరి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు చేపడతారని గర్వంగా ప్రకటిస్తున్నా. కాష్ ఎంతో తెలివైన న్యాయవాది, పరిశోధకుడు. అవినీతిపై పోరాటం, దేశ ప్రజల రక్షణ కోసం తన కెరీర్లో ఎక్కువ కాలం వెచ్చించిన పోరాటయోధుడు’ అని ప్రశంసించారు. 44 ఏండ్ల పటేల్ 2017లో ట్రంప్ హయాంలో యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు. -
భారతీయ విద్యార్థి నాలుగేళ్లుగా మిస్సింగ్.. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డ్
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ విద్యార్థి నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదు. అయితే ఆ యువతి జాడ తెలిపిన వారికి 10 వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 8.32 లక్షలు) ఇవ్వనున్నట్లు యూఎస్ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రకటించింది. వివరాలు.. 29 ఏళ్ల మయూషీ భగత్.. 2019, ఏప్రిల్ 29వ తేదీన జెర్సీ సిటీలోని తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయింది. తల్లిదండ్రులు ఫోన్ చేస్తేమో స్విచ్చాఫ్ వచ్చింది. ఆమె స్నేహితుల్ని సంప్రదించినా ఎలాంటి సమాచారం లభించలేదు.దీంతో కూతురు అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు మే 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మయూషీ ఇంటి నుంచి వెళ్లిన సమయంలో కలర్ పైజామా, బ్లాక్ టీ షర్ట్ ధరించింది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి మిస్సింగ్‌పై న్యూజెర్సీలోని ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీసు శాఖ ఆమె కోసం గత నాలుగేళ్లుగా కోసం వెతుకుతూనే ఉంది. పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినా.. ఎలాంటి ఫలితం దక్కలేదు. అయితే మయూషీ ఆచూకీ ఇంకా తెలియరాకపోవడంతో తాజాగా ఎఫ్‌బీఐ ఓ ప్రకటన చేసింది. యువతి సమాచారం ఇచ్చిన వారికి పదివేల డాలర్ల రివార్డు ఇవ్వనున్నట్లు ఎఫ్‌బీఐ తెలిపింది. చదవండి: జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..! ఎవరీ మయూషీ భగత్ మయూషీ భగత్.. భారతీయ విద్యార్థి. 1994లో వడోదరాలో జన్మించింది. 2016లో ఎఫ్ 1 స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లిన ఆమె అక్కడ న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తోంది. మయూషి భగత్ ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఉంటుందని. గోధుమ రంగు కళ్ళు, నల్లటి జుట్టు కలిగి ఉంటుందని అధికారులు వివరాలు వెల్లడించారు. ఆమె 2016లో ఎఫ్1 స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చింది. FBI గత ఏడాది జూలైలో తన వెబ్‌సైట్‌లోని ‘మోస్ట్ వాంటెడ్’ పేజీలో మయూషీ ‘తప్పిపోయిన వ్యక్తుల’ పోస్టర్‌ను ప్రదర్శించింది. -
ఖలిస్తాన్ వాదులూ జాగ్రత్త!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్–కెనడాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న ఖలిస్తానీల ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) హెచ్చరికలు చేసింది. అమెరికన్ సిఖ్ కాకస్ కమిటీ కోఆర్డినేటర్‌గా ఉన్న ప్రీత్‌పాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..తనతోపాటు మరో ఇద్దరు అమెరికన్ సిక్కులను ఎఫ్‌బీఐ అధికారులు జూన్‌లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారని చెప్పారు. ట్రూడోకు వ్యతిరేకంగా ఆందోళన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యునైటెడ్ హిందూ ఫ్రంట్ నిరసన తెలిపింది. భారత వ్యతిరేక ఖలిస్తానీలకు కెనడా ప్రధాని మద్దతు, రక్షణ కలి్పంచడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వారిపై అంతగా ప్రేముంటే కెనడాలోనే ప్రత్యేక ఖలిస్తాన్‌ను ట్రూడో ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. -
కష్టాన్నే నమ్ముకుంది! అదే ఆమెను ఎఫ్‌బీఐకి తిరుగులేని ఏజెంట్‌గా..
‘ఎఫ్‌బీఐలో పనిచేయడం అదృష్టం’ అంటాడు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్. ‘ఎఫ్‌బీఐ’లో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న ఇండో–అమెరికన్ సోహిని సిన్హా ఎప్పుడూ అదృష్టాన్ని నమ్ముకోలేదు. కష్టాన్నే ఇష్టంగా నమ్ముకుంది. ఎఫ్‌బీఐలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో స్థాయిలలో పనిచేసింది. తాజాగా సోహిని సిన్హాను ఎఫ్‌బీఐ సాల్ట్‌లేక్ సిటీ ఫీల్డ్ ఆఫీస్స్పెషల్ ఏజెంట్ ఇన్చార్జిగా నియమించింది... ఎఫ్‌బీఐలో సోహిని సిన్హాకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. కౌంటర్–టెర్రరిజం ఇన్వెస్టిగేషన్లో మంచి పేరు తెచ్చుకుంది. భద్రతకు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలను హ్యాండిల్ చేయడంలో, క్రిమినల్ సైబర్ ఇన్వెస్టిగేషన్లో దిట్టగా పేరున్న సోహిని సిన్హా తన వృత్తిపరమైన అంకితభావంతో ఎన్నో ప్రమోషన్లు పొందింది. 2001లో ఎఫ్‌బీఐలో స్పెషల్ ఏజెంట్‌గా చేరిన సిన్హా 2009లో సూపర్వైజరీ స్పెషల్ ఏజెంట్‌గా నియామకం అయింది. ఆ తరువాత వాషింగ్టన్ డీసీలోని కౌంటర్–టెర్రరిజం విభాగానికి బదిలీ అయింది. 2012లో అసిస్టెంట్ లీగల్ అటాషైగా ప్రమోట్ అయింది. కౌంటర్ టెర్రరిజమ్‌కు సంబంధించిన వ్యవహారాల్లో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలిస్, కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్‌లతో కలిసి పనిచేసింది. ఆ తరువాత ఫీల్డ్ సూపర్వైజర్ (డెట్రాయిట్ ఫీల్డ్ ఆఫీస్)గా ప్రమోట్ అయింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఉగ్రవాదానికి సంబంధించిన సంక్లిష్టమైన కేసులను ఇన్వెస్టిగేట్ చేసింది.2020లో సైబర్ ఇన్‌ట్రూజన్ స్క్వాడ్‌లో చేరింది. తన నాయకత్వ సమర్థతతో 2021లో నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్‌కు సంబంధించి అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్ ఇన్చార్జి (పోర్ట్లాండ్ ఫీల్డ్ ఆఫీస్) గా ప్రమోట్ అయింది. ఏజెన్సీ ఆపరేషన్స్‌లో తనదైన ముద్ర వేసింది. ఆ తరువాత ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు ఎగ్జిక్యూటివ్ స్పెషల్ అసిస్టెంట్‌గా నియామకం అయింది. ఇంటర్నేషనల్ ఎసైన్మెంట్స్లో కూడా తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్ నుంచి ఇరాక్ వరకు ఎన్నో దేశాల్లో, ఎన్నో సంస్కృతుల మధ్య పనిచేసింది.ఎఫ్‌బీఐలో చేరడానికి ముందు సోహిని సిన్హా థెరపిస్ట్‌గా, ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన క్లినిక్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసింది. ఇక చదువు విషయానికి వస్తే సైకాలజీలో డిగ్రీ, మెంటల్ హెల్త్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ చదువు తన వృత్తి జీవితంలో ఎంతో ఉపయోగపడింది. ఇతరులకు సహాయపడాలనే సోహిని సిన్హా తపనకు ఎఫ్‌బీఐ బలమైన వేదికలా ఉపయోగపడుతోంది. -
దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!
రెండు విజయవంతమైన యునికార్న్ స్టార్టప్‌లను సృష్టించిన ఏకైక టెక్ వ్యవస్థాపకుడు, సందీప్ అగర్వాల్. వ్యాపారవేత్తగా పాపులర్ అవుతున్న తరుణంలో ఎఫ్‌బీఐ అరెస్టు బాగా దెబ్బతీసింది. రూ. 8వేల కోట్ల సంస్థ పోయింది. చేయని నేరానికి జైలు శిక్ష, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు అయినా ఫీనిక్స్ పక్షిలా తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. రోలర్ కోస్టర్ లాంటి జీవితాన్నిఎదురీది ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తగా, ప్రస్తుతం రూ. 16400 కోట్ల కంపెనీ యజమానిగా తానేంటో నిరూపించుకున్న సందీప్ అగర్వాల్ సక్సెస్ స్టోరీ.. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అతని జీవితంలో అనుకోని కుదుపు తీవ్ర సంక్షోభాన్ని సృష్టించింది. కుటుంబంతో కలిసి అమెరికాలో వెకేషన్లో ఉండగా, ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సందీప్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసింది. అరెస్టు తర్వాత 8 వేల కోట్ల రూపాయల కంపెనీని కోల్పోవాల్సి వచ్చింది. ఇదే తరుణంలో 17 ఏళ్ల వైవాహ జీవితానికి స్వస్తి పలుకుతూ 2018లో భార్య విడాకులు తీసుకుంది. అయినా ఎక్కడా ఆశను కోల్పోలేదు. కుటుంబానికి దూరంగా యూఎస్‌లో ఉండి, కేసుపై పోరాడవలసి వచ్చింది. కంపుకొట్టే టాయిలెట్ మధ్య జైలు జీవితాన్ని గడిపాడు. మరోవైపు రిమోట్‌గా కార్యకలాపాలను నిర్వహించినప్పటికీ వాటాదారుల అభ్యంతరాలతో కంపెనీ సీఈవో పదవి నుంచి వైదొలిగి, తాను నిర్మించిన సంస్థ పగ్గాలను తన స్నేహితుడికి అప్పగించారు. 2019లో, షాప్‌క్లూస్‌ను మరో కంపెనీ సుమారు 100 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. విచారణ, తీర్పు ఆలస్యం కారణంగా 2014లో ఇండియాకు రావడానికి అనుమతి లభించింది. చివరికి 2020లో యూఎస్ కోర్టు ద్వారా ఆర్థిక నేరాల కేసులో నిర్దోషిగా తేల్చింది. డ్రూమ్ టెక్నాలజీస్ ఏప్రిల్ 2014లో డ్రూమ్ టెక్నాలజీస్ అనే మరొక యునికార్న్ ఏర్పాటుచేశారు.అనేక ఇబ్బందుల మధ్య అత్యంత విశ్వసనీయమైన ఆటోమొబైల్ ప్లాట్‌ఫారమ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 16 మిలియన్ డాలర్లు ,తరువాతి మూడు సంవత్సరాలలో, పలు దఫాలుగా 90 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చారు. ఏప్రిల్ 2021న భారతదేశంలో 55వ యునికార్న్‌గా అవతరించింది. కంపెనీ వాల్యుయేషన్ 2 బిలియన్ డాలర్లు లేదా రూ.16400 కోట్లు. డ్రూమ్ తన జీవితంలో లేకుంటే తాను ఈ సంక్లిష్ట పరిస్థతులనుంచి తాను బయటపడేవాడిని కాదని ఒక సందర్భలో సందీప్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. కుటుంబానికి దూరంగా, జైలు శిక్షను ఎదుర్కొంటున్న తరుణంలో కంపెనీ తనకు ఊరటనిచ్చిందని చెప్పారు. తరువాత ఉపాసనను రెండో పెళ్లి చేసుకున్నారు. షాప్‌క్లూస్ ముందు సందీప్ అగర్వాల్ ఎంబీఏ పట్టా పొందిన తరువాత అమెరిలో రెండు వేర్వేరు కంపెనీలలో పనిచేశారు. ఆ తరువాత వాల్ స్ట్రీట్‌లో 14 ఏళ్లు ఎనలిస్టుగా పనిచేశారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ! మొదలైన కంపెనీలను కవర్ చేస్తూ ఎనిమిదేళ్లపాటు విశ్లేషకుడిగా పనిచేశాడు.టాప్ ర్యాంక్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పేరు సంపాదించారు.TiE సిలికాన్ వ్యాలీలో చార్టర్ సభ్యుడు కూడా. ఇంటర్నెట్ విశ్లేషకుడిగా 2010లో ఇండియాను సందర్శించిన సమయంలోఆన్లైన్ మార్కెట్ ప్రారంభించాలనే ఆలోచనకు పునాది పడింది. షాప్‌క్లూస్ ప్రారంభం డెలావేర్లో రాధికా ఘై అగర్వాల్ (సందీప్ అగర్వాల్ మాజీ భార్య),మృణాల్ ఛటర్జీ , సంజయ్ సేథితో కలిసి ఇ-మార్కెట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. సెప్టెంబరు 2011లో ఈ టీం దేశానికి వచ్చి శాశ్వతంగా గుర్గావ్లో స్థిరపడింది. షాప్‌క్లూస్ ప్రారంభంలో తన సోషల్ సర్కిల్స్ ద్వారా 1.95 మిలియన్ డాలర్లను సేకరించడం విశేషం. షాప్‌క్లూస్ పబ్లిక్ బీటా వెర్షన్ 26 జనవరి 2012న విడుదలచేయగా, ముగ్గురు లేదా నలుగురుగా ఉన్న టీంసంఖ్య 25 మంది సభ్యులకు పెరిగింది. నెలవారీ 20 లక్షలకు పైగా యూజర్లతో భారీ లాభాల్ని సాధించింది. ఈ దెబ్బకు అలెక్సా ర్యాంకింగ్ అదే సంవత్సరం ఆగస్టులో 14వేల నుండి 200కి పడిపోయింది. జనవరి 2013 నాటికి, షాప్‌క్లూస్ దేశంలో ఐదో అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్‌గా మారింది. అలెక్సా ర్యాంకింగ్ ఏకంగా 90కి పడిపోయింది. 2013 జూలైలో అమెరికాలో ఎప్బీఐ ఈరెస్టు చేసింది. వాల్ స్ట్రీట్‌లో సీనియర్ ఇంటర్నెట్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పని చేస్తున్నప్పుడు అతనిపై 'ఇన్సైడర్ ట్రేడింగ్' ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో చట్టపరమైన ఆరోపణలను నమోదు చేసేదాకా అదే జోరు కొనసాగింది. అప్పటికీ కంపెనీ నెలవారీగా 200-300శాతం వృద్ధిని సాధిస్తోంది. కరియర్లో సందీప్ అగర్వాల్ తొలి అడుగులు 1995లోముంబైలోని కోటక్ మహీంద్రాలో ఇంటర్న్‌గా కరియర్‌ను మొదలు పెట్టారు సందీప్ అగర్వాల్. ఈ ఇంటర్న్‌షిప్ తన వ్యాపార కమ్యూనికేషన్‌తో పాటు తన విశ్లేషణాత్మక నైపుణ్యాలు,వ్యూహాత్మక ఆలోచనలఅభివృద్ధికి తోడ్పడిందని స్వయంగా సందీప్ అగర్వాల్ చెప్పారు. సందీప్ అగర్వాల్ చదువు కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. వాషింగ్టన్ యూనివర్శిటీ సెయింట్ లూయిస్ ఓలిన్ బిజినెస్ స్కూల్ నుచి ఎంబీఏ చేసారు. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సందీప్‌కు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం , గురుగ్రామ్‌లోని తన పెంట్‌హౌస్‌లో దాదాపు 1000 మొక్కలు ఉన్నాయి. తన కుమారులతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం. గోల్ఫ్ , స్క్వాష్ ఆడుతారు. తోటపని, ప్రయాణాలు, చదవడం, రాయడం లాంటి ఇష్టాలు తనకు మంచి ఊరట అంటారు సందీప్. ‘ఫాల్ ఎగైన్, రైజ్ ఎగైన్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. -
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మెడకు రహస్య పత్రాల గొడవ
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మెడకు రహస్య పత్రాల గొడవ -
బైడెన్ ఇంట్లో ఎఫ్‌బీఐ సోదాలు.. అధ్యక్షుడి మెడకు రహస్య ఫైళ్ల వ్యవహారం
వాషింగ్టన్: రహస్య ఫైళ్ల వ్యవహారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చుట్టుకుంటోంది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఫైళ్లు బయటపడడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆయన నివాసంలో తాజాగా చేపట్టిన సోదాల్లో మరో ఆరు ఫైళ్లు లభ్యం కావడం కలకలం రేపుతోంది. విల్మింగ్టన్లోని బైడెన్ ప్రైవేట్ నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏకంగా 13 గంటలపాలు సోదాలు చేపట్టారు. మొత్తం ఆరు ఫైళ్లు లభ్యమయ్యాయి. ఎఫ్‌బీఐ అధికారులు వీటిని ఉన్నతాధికారులకు నివేదించారు. సోదాల సమయంలో ఇరుపక్షాలకు చెందిన న్యాయ బృందాలతోపాటు శ్వేతసౌధం అధికారి ఒకరు ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సోదాలు జరుపుతున్న సమయంలో బైడెన్ గానీ, ఆయన భార్య గానీ ఇంట్లో లేరని తెలిసింది. సోదాల్లో ఫైళ్లతో పాటు చేతి రాతతో ఉన్న కొన్ని పత్రాలు కూడా లభించినట్లు సమాచారం. ఆరు ఫైళ్లు లభ్యం కాగా, ఇందులో కొన్ని బైడెన్ సెనేటర్‌గా ఉన్నప్పటివి, మరికొన్ని ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలానికి సంబంధించినవని ఆయన వ్యక్తిగత అటార్నీ బాబ్ బోయర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. నాకు ఎలాంటి విచారం లేదు: బైడెన్ గత ఏడాది నవంబర్ 2న వాషింగ్టన్ డీసీలో బైడెన్‌కు చెందిన పెన్ బైడెన్ సెంటర్లో, డిసెంబర్ 20న వాషింగ్టన్ ఇంట్లోని గ్యారేజీలో, ఈ ఏడాది జనవరి 12న అదే ఇంట్లో మరోసారి రహస్య దస్త్రాలు బయటపడడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆయన వాటిని నేషనల్ ఆర్కైవ్స్ అందజేశారు. నిజానికి పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక రహస్య పత్రాలను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఇలాంటి చర్యలను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. అధ్యక్షుడిని అభిశంసించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ చట్టం ప్రకారం.. పదవీ కాలం ముగిసిన తర్వాత అధికారిక పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు పంపించాలి. ఇదిలా ఉండగా, తన నివాసాల్లో జరుగుతున్న సోదాలపై బైడెన్ స్పందించారు. ఫైళ్లు దొరకడంపై తనకు ఎలాంటి విచారం లేదన్నారు. అయితే, బైడెన్ తీరుపై రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహస్య పత్రాల విషయంలో బైడెన్ ఇక తప్పించుకోలేరని చెబుతున్నారు. ఆయన కుటుంబంతోపాటు కుమారుడు హంటర్ బైడెన్ అక్రమ వ్యాపారాలపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు. బైడెన్ నివాసాల్లో రహస్య పత్రాలు బయటపడడంపై కాంగ్రెస్ విచారణ చేపడుతుందని స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ ఆశాభావం వెలిబుచ్చారు. బైడెన్‌కు సన్ స్ట్రోక్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో జో బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి అధికారమే అండగా ఆయన కుమారుడు హంటర్ బైడెన్ చెలరేగిపోయాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాకు ప్రత్యర్థి దేశాలుగా భావించే చైనా, రష్యాలో హంటర్ బైడెన్‌కు వ్యాపారాలున్నాయి. ఆయా దేశాల్లో పలు కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టి, భారీగా ఆర్జించినట్లు సమాచారం. అంతేకాకుండా రష్యా నుంచి హంటర్ లక్షలాది డాలర్లు ముడుపులుగా స్వీకరించాడని సాక్షాత్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంఫ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు హంటర్ బైడెన్‌కు చెందినవిగా భావిస్తున్న ల్యాప్‌టాప్‌ల్లో ఆయన మత్తు మందులు వాడుతున్న ఫొటోలు, ఇతర వీడియోలు, మెయిళ్లు బయటపడడం సంచలనం సృష్టించింది. 2019 డిసెంబర్లో ఎఫ్‌బీఐ ఆ ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకుంది. అందులోని వివరాలను న్యూయార్క్ పోస్టు పత్రిక ప్రచురించింది. -
సైబర్ క్రైమ్ వలలో ఐసీసీ.. 20 కోట్ల నష్టం
క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషించే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సైబర్ క్రైమ్ చిక్కుకున్నట్లు సమాచారం. గత ఏడాది ఆన్లైన్ మోసం కారణంగా ఐసీసీ 2.5 అమెరికన్ మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 20 కోట్లు) నష్టపోయినట్లు ఒక వెబ్సైట్ కథనం ప్రచురించింది. అమెరికా స్థావరంగా ఫిషింగ్ మెయిల్ స్కామ్ జరిగినట్టు సమాచారం. ఈ విషయంపై ఐసీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సమాచారం ప్రకారం ఐసీసీ ఫిర్యాదు మేరకు ఎఫ్‌బీఐ(FBI) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐసీసీ అకౌంట్ నుంచి నేరగాళ్లకు డబ్బు ఎలా చేరిందనేది కచ్చితంగా తెలియరాలేదు. బిజనెస్ మెయిల్ తరహాలో సందేశాన్ని పంపి.. సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఐసీసీకి చెందిన కన్సల్టెంట్ అంటూ సంస్థకు కుచ్చుటోపీ వేసినట్లు తెలుస్తోంది. సదరు కన్సల్టెంట్ ఈమెయిల్ ఐడీని పోలిన ఐడీతో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు మెయిల్ చేశారట. ఆ మెయిల్లో 5 లక్షల డాలర్ల విలువైన వోచర్‌ను క్లియర్ చేయాలని కోరారు. ఏ ఖాతాకు ఆ సొమ్మును పంపాలో ఆ అకౌంట్ వివరాలు కూడా పంపించారు. దీంతో ఐసీసీ ఫైనాన్స్ విభాగం ఆ వోచర్‌ను క్లియర్ చేసింది. ఆ తర్వాత మరో రెండు, మూడు సార్లు ఇలాంటి టెక్నిక్‌తోనే సైబర్ నేరగాళ్లు డబ్బును కాజేసినట్లు తెలుస్తోంది. ఈ తరహా మోసాలను బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ (బీఈసీ) ఫిషింగ్ అంటారు. చదవండి: 'మంచి భవిష్యత్తు'.. చహల్‌ను టీజ్ చేసిన రోహిత్ శర్మ Usain Bolt: బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం -
సినిమాటోగ్రాఫర్‌ను కాల్చి చంపింది ఆ అగ్రహీరోనే!
న్యూయార్క్: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) సంచలన నివేదికతో హాలీవుడ్ అగ్రహీరోకు షాక్ ఇచ్చింది. సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మృతిలో ప్రముఖ నటుడు అలెక్ బాల్డ్విన్ ప్రమేయం ఉందన్న విషయాన్ని ఎఫ్‌బీఐ దాదాపుగా నిర్ధారించేసింది. ప్రాప్ గన్ వర్కింగ్ కండిషన్లోనే ఉందని, నటుడి ప్రమేయం లేకుండా అది పేలే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. ప్రముఖ నటుడు(అమెరికన్) అలెక్ బాల్డ్విన్(64) చేతిలోని డమ్మీ తుపాకీ (ప్రాప్ గన్) పేలి సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్ మరణించగా, డైరెక్టర్ జోయల్ సౌజా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కిందటి ఏడాది అక్టోబర్‌లో ‘రస్ట్’ షూటింగ్ సందర్భంగా చోటు చేసుకుంది. తొలుత ఈ ఘటనపై బాల్డ్విన్ పై ఎలాంటి కేసూ నమోదు కాకపోవడంతో సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో పోలీసులు, ఆపై ఎఫ్‌బీఐ కూడా రంగంలోకి దిగింది. ఈలోపు తుపాకీట్రిగ్గర్ను తాను నొక్కనేలేదని, ప్రమాదం ఎలా జరిగిందో తనకు తెలియదని, ఘటనకు వేరేవరైనా కారణం అయ్యి ఉండొచ్చని చెబుతూ వస్తున్నాడు అలెక్. ఈ తరుణంలో ఎఫ్‌బీఐ తాను రూపొందించిన నివేదికను బయటపెట్టింది. ఫోరెన్సిక్ నివేదికలో.. అలెక్ బాల్డ్విన్ ప్రమేయం లేకుండా ఆ తుపాకీ ట్రిగ్గర్ నొక్కుకుపోయే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ ఘటనకు వేరెవరో బాధ్యులన్న బాల్డ్విన్ ఆరోపణలు నిజం కాదని తేలింది. ఇక బాల్డ్విన్ లాయర్, ఎఫ్‌బీఐ నివేదికను తప్పుబడుతున్నాడు. తుపాకీ కండిషన్ ఏమాత్రం బాగోలేదని అంటున్నాడు. ఎఫ్‌బీఐ మాత్రం ఆయుధాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం నివేదిక రూపొందించినట్లు చెబుతోంది. ఇక శాంటా ఫే కౌంటీ పోలీసులు ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతుందని, ఇదొక ప్రమాద ఘటనగా మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని ప్రకటించారు. న్యూమెక్సికోలో ఉన్న బొనాంజా క్రీక్ రాంచ్లో కిందటి ఏడాది రస్ట్ సినిమా షూటింగ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సినిమాటోగ్రాఫర్ హల్యానా హచిన్స్(42) అక్కడికక్కడే కన్నుమూసింది. హచిన్స్ స్వదేశం ఉక్రెయిన్. కానీ, ఆర్కిటిక్ సర్కిల్ లో సోవియట్ మిలటరీ బేస్ పెరిగింది. కైవ్‌లో జర్నలిజం చేసిన ఆమె.. ఆపై లాస్ ఏంజెల్స్‌లో సినిమాటోగ్రఫీపై శిక్షణ తీసుకుంది. ఆమె పని చేసిన ‘ఆర్కెనిమీ’ 2020లో రిలీజ్ అయ్యింది కూడా. ఇదీ చదవండి: సామాన్యుడిలా ఆ యువరాజు! ఏం చేశాడంటే.. -
ప్రపంచంలో ఎక్కడా చేయనట్లు మేమేదో కొత్తగా చేస్తున్నట్లు చేస్తారేం!!
ప్రపంచంలో ఎక్కడా చేయనట్లు మేమేదో కొత్తగా చేస్తున్నట్లు చేస్తారేం!! -
ఒకే ఒక్కడు.. ఫ్లైట్ హైజాకింగ్.. అమెరికాకు ముచ్చెమటలు పట్టించాడు!
కొన్నిసార్లు నేరస్థుడే కథానాయకుడు. దోపిడీలు, హత్యలు చేసినా సరే.. అతడే గెలవాలని, పోలీసులకు దొరక్కూడదని కోరుకునే ప్రేక్షక హృదయాలు కోకొల్లలు. దృశ్యం, కిక్ , ధూమ్ 2, సూపర్.. వంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. విశేషవిజయాలు అందుకున్నవే. ఈ తరహా సినిమాలెన్నింటికో స్ఫూర్తిగా నిలిచిన క్రిమినల్ ‘డేనియల్ కూపర్’ కథే ఈ వారం మిస్టరీ. ఎందరో నేరగాళ్లకు ముచ్చెమటలు పట్టించిన అమెరికన్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సర్వీస్..‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ)’ని సైతం గడగడలాడించిన అతగాడు.. అసలు ఏం నేరం చేశాడు? ఎలా తప్పించుకున్నాడు? సినిమాని తలపించే ఆ కథే ఈ నార్త్‌వెస్ట్ హైజాకింగ్. అది 1971, నవంబర్ 24. అమెరికాలోని ఒరెగాన్‌లో పోర్ట్లాండ్ ఎయిర్ పోర్ట్‌లోకి ఎంటర్ అయ్యాడు అతను. ఆరడుగుల ఆజానుబాహుడు. వయసు నలభై పైనే. వైట్ షర్ట్, బ్లాక్ టై, ఓవర్ కోట్, గోధుమ రంగు షూస్, చేతిలో ఓ సూట్ కేస్.. చూడటానికి అచ్చం ఓ బిజినెస్మేగ్నెట్లానే ఉన్నాడు. ఇరవై డాలర్లు పెట్టి.. వాషింగ్టన్‌లోని సియాటెల్ వెళ్లేందుకు నార్త్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో ఓ టికెట్ కొనుక్కున్నాడు. పేరు డేనియల్ కూపర్ అని నమోదు చేయించుకున్నాడు. అప్పటిదాకా ఆ విమానంలో 305 మంది ప్రయాణికుల్లో అతడూ ఒకడు. తనకు కేటాయించిన సీట్లో తాపీగా కూర్చుని.. విమానం ఇంకా బయలుదేరకముందే.. ఫ్లైట్ అటెండెంట్‌ని పిలిచి... తనకు ఓ బోర్బన్ బిస్కట్, సోడా కావాలన్నాడు. కొన్ని నిమిషాల్లోనే విమానం స్టార్ట్ అయ్యింది. ఫ్లైట్ అటెండెంట్ అతడు కోరినట్లే.. రెండూ తెచ్చి ఇచ్చింది. వాటిని అందుకున్న కూపర్ ఆమె చేతిలో ఒక స్లిప్ పెట్టాడు. అప్పటికే ఫ్లైట్ గాల్లో ఉంది. ఆ స్లిప్ ఓపెన్ చేసి చదివిన ఆమెకు కాళ్ల కింద విమానం షేక్ అయినట్లు షాక్ అయ్యింది. పక్కనే కూర్చోమన్నట్లు ఆమెకు సైగ చేశాడు కూపర్. తప్పనిస్థితిలో గమ్మున కూర్చుంది. ఆ స్లిప్‌లో ఉన్న మ్యాటర్‌ను నమ్మేందుకు.. ఆమె ముందే సూట్‌కేస్ ఓపెన్ చేసి చూపించాడు కూపర్. అందులో రెండు ఎరుపు రంగు కడ్డీలు.. రకరకాల వైర్లుతో చుట్టి ఉన్నాయి. అవి బాంబులే అని నిర్ధారించుకున్న ఆమె.. మరింత వణికిపోయింది. ‘స్లిప్ తీసుకుని, నేను చెప్పింది రాసుకో’ అని ఆదేశించాడు. ఆమె చేతిలో పెన్ వణుకుతూ కదులుతోంది. ‘నాకు అయిదు గంటల్లోపు రెండు లక్షల డాలర్లు (ప్రస్తుతం దీని విలువ 1.2 మిలియన్లు) కావాలి. ఆ మొత్తం 20 డాలర్ల నోట్ల రూపంలోనే ఉండాలి. అలాగే నాకు రెండు బ్యాక్ పారాష్యూట్లు, రెండు ఫ్రంట్ పారాష్యూట్లు కావాలి. విమానం ల్యాండ్ అవ్వగానే... వెంటనే ఇంధనం నింపేందుకు ఎయిర్‌పోర్టులో ఫ్యూయెల్ ట్యాంకర్ రెడీగా ఉండాలి. తేడా వస్తే... బాంబు పేలుతుంది’ అని కూపర్ చెప్పినట్లే అక్షరం పొల్లుపోకుండా రాసింది ఆ అటెండెంట్. ఆమె ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని.. కూపర్ అడిగినట్లే సియాటెల్ ఏరియా బ్యాంకుల నుంచి డబ్బును, స్థానిక స్కైడైవింగ్ స్కూల్ నుంచి పారాష్యూట్లను రప్పించారు. విమానం సియాటెల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. అడిగినవన్నీ చేతికి అందిన తర్వాత.. కొందరు ప్రయాణికుల్ని, కొంతమంది సిబ్బందినీ విమానం దిగేందుకు ఒప్పుకున్నాడు కూపర్. ఆ ఒప్పందం ప్రకారం 36 మందిని క్షేమంగా విమానం నుంచి దింపేశారు. అనంతరం విమానంలో ఇంధనం నింపాలని ఆదేశించాడు. కూపర్ చెప్పినట్లే చేశారు అధికారులు. మిగిలినవారంతా విమానంలో ఉండగానే.. మళ్లీ విమానం పైకి లేచింది. మెక్సికో సిటీ మీదుగా పదివేల అడుగుల ఎత్తులో విమానాన్ని నడపమన్నాడు. కూపర్‌కి ఎదురుచెప్పలేదు పైలెట్స్. రాత్రి ఎనిమిది దాటింది. ఫ్లైట్ గాల్లో ఎగురుతూనే ఉంది. కూపర్ అధీనంలోనే ఉంది. సియాటెల్, రెనో మధ్యలో ఓ చోట.. విమాన వెనుక డోర్ ఓపెన్ చేయించి, పారాష్యూట్ సాయంతో కిందకు దూకేశాడు. తనతో పాటూ డబ్బు, మిగిలిన పారాష్యూట్లనూ తీసుకెళ్లాడు. ఇక అంతే.. 50 ఏళ్లుగా అతడు ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలియలేదు. చివరికి అతడి పేరు కూడా అబద్ధం అని తేలింది. కూపర్ విమానంలో ఉన్నంత సేపు డార్క్ సన్ గ్లాసెస్ పెట్టుకునే ఉన్నాడనేది ప్రత్యక్ష సాక్షుల సమాచారం. ఎఫ్‌బీఐ చరిత్రలోనే సుదీర్ఘమైన ఇన్వెస్టిగేషన్ ఈ నార్త్‌వెస్ట్ హైజాకింగ్. మొదట్లో కూపర్‌ను మిలిటరీలో అనుభవజ్ఞుడైన పారాట్రూపర్‌గా భావించారు. నిజానికి అనుభవజ్ఞుడైన స్కైడైవర్ కాదని తేల్చారు. ఘటన జరిగిన ఐదేళ్లలో దాదాపు 800 మంది అనుమానితులను పరిశీలించి, వారిలో కూపర్ లేడని నిర్ధారించేశారు. నిందితుడిగా రిచర్డ్ ఫ్లాయిడ్ మెకాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ అతడూ కూపర్‌కు సరిపోలలేదు. చివరికి కూపర్ చనిపోయి ఉంటాడనే అనుకున్నారు. ఎందుకంటే కూపర్ దూకాడు అని ఊహిస్తున్న ప్రాంతంలో గంటకు 200 మైళ్లు(322 కిమీ)వేగంతో గాలులు వీస్తాయని, ఆ ప్రతికూల పరిస్థితుల్లో పారాష్యూట్తో దిగడం కష్టమని అంచనా వేశారు. 1980లో అంటే దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కొలంబియా నది సమీపంలో పోర్ట్‌ల్యాండ్‌కు ఉత్తరాన ఏరియల్ నుంచి 20 మైళ్ల (32 కిమీ) దూరంలో ఓ బాలుడికి.. 5,800 డాలర్లున్న శిథిలావస్థలోని ప్యాకెట్ ఒకటి దొరికింది. దాంట్లో అన్నీ 20 డాలర్ల నోట్లే ఉన్నాయి. కూపర్ డిమాండ్ చేసి తీసుకున్న 20 డాలర్ల నోట్ల మీదున్న సీరియల్ నంబర్లకు శిథిలావస్థలోని ప్యాకెట్లో దొరికిన 20 డాలర్ల నోట్ల మీది సీరియల్ నంబర్లు సరిపోలాయి. విస్తృతశోధన తర్వాత తేలిన విషయం అదొక్కటే. దాంతో 2016లో అధికారికంగా ఈ కేసుని క్లోజ్ చేసింది ఏజెన్సీ. అపరిష్కృతమైన ఈ క్రైమ్ స్టోరీ చాలా మందిని ఆకర్షించింది. చివరికి ఈ కేసులో కీలక సూత్రధారి అయిన డేనియల్ కూపర్.. పేరు మీద పాటలు, పుస్తకాలు, సినిమాలు వగైరా వగైరా చాలానే వచ్చాయి. చివరికి కూపర్ ‘జానపద కథానాయకుడు’గా మారిపోయాడు. అయితే డాన్ కూపర్‌గా గుర్తింపు పొందిన డేనియల్ కూపర్.. ఇన్వెస్టిగేషన్ సమయంలో ఓ రిపోర్టర్ పొరబాటుగా విన్న పేరునే శాశ్వతం చేసుకున్నాడు డి.బి.కూపర్‌గా. చదవండి: Virender Sehwag: కోహ్లి కెప్టెన్సీ వివాదం: సెహ్వాగ్ భయ్యా ఎక్కడున్నావు!? -
క్రిప్టోకరెన్సీ.. ఇలాంటి నేరాలే జరుగుతాయ్ జాగ్రత్త!
ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ చెలామణిపై ఆర్బీఐ ఆందోళన నేపథ్యంలో.. కేంద్రం సానుకూల కోణంలోనే స్పందించే అవకాశాలు ఉన్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే క్రిప్టోకరెన్సీ ద్వారా ఆర్థిక నేరాలతో పాటు అమాయకులూ బలి అవుతారంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ కరెన్సీ విషయంలో కొత్త తరహా నేరాలు తప్పవని సైబర్ నిపుణులు సైతం వారిస్తున్నారు. అందుకు ఉదాహరణగా తాజాగా రికార్డైన క్రిప్టోకరెన్సీ భారీ చోరీ కేసును ప్రస్తావిస్తున్నారు. తాజాగా ఓ టీనేజర్ ఏకంగా 46 మిలియన్ కెనడా డాలర్లు( 36.5 మిలియన్ అమెరికా డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 270కోట్ల రూపాయలపైనే) క్రిప్టోకరెన్సీని కాజేశాడు. కెనడా హామిల్టన్‌కు చెందిన 17 ఏళ్ల ఆ పిలగాడు.. అంత డబ్బుతో ఏం చేశాడో తెలుసా? ఆన్లైన్ గేమింగ్‌లో అరుదైన ఓ యూజర్‌నేమ్‌ను కొనుగోలు చేశాడు. స్విమ్ స్కాపింగ్(సెల్యూలార్ నెట్వర్క్ ఉద్యోగుల్ని డూప్లికేట్ నెంబర్ల ద్వారా బురిడీకొట్టించి.. బాధితుల అకౌంట్లను హ్యాక్ చేయడం) ద్వారా ఆ టీనేజర్ ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో టీనేజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక వ్యక్తి ఇంత భారీస్థాయిలో క్రిప్టోకరెన్సీ చోరీకి పాల్పడడం ఇదే తొలిసారి అని ప్రకటించారు. నిజానికి ఈ చోరీ జరిగింది కిందటి ఏడాదిలో. బాధితుడు కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జోష్ జోన్స్!. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. క్లిక్ చేయండి: క్రిప్టోకరెన్సీ.. నీటి బుడగల్లాంటివి హామిల్టన్ సిటీ పోలీసుల సహకారంతో దర్యాప్తు కొనసాగించింది ఎఫ్‌బీఐ. అయితే అరుదైన ఆ యూజర్ నేమ్ దొంగను పట్టించింది. అంతేకాదు మొత్తం సొమ్ములో కేవలం ఏడు మిలియన్ల సొమ్ము మాత్రమే రికవరీ అయ్యిందని తెలుస్తోంది. కంటికి కనిపించని ఈ కరెన్సీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని, లేనిపక్షంలో ఇలాంటి నేరాలకు గురై భారీగా మోసపోవాల్సి వస్తుందని క్రిప్టో ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. చదవండి: క్రిప్టో కరెన్సీ చేతికి రాలేదని.. ఖమ్మంవాసి బలవన్మరణం -
హ్యాకర్స్ రూట్ మార్చారు, స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు
హ్యాకర్స్ తమ పంథాని మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మాల్ వేర్ సాయంతో సంస్థలపై దాడులు చేసే సైబర్ నేరస్తులు ఇప్పుడు స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయా స్కూళ్ల డేటా బేస్‌లో ఉన్న స్కూల్ చిల్డ్రన్స్ డేటాను దొంగిలిస్తున్నారు. ఆ డేటాతో సొమ్ము చేసుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే అక్రమ వ్యాపార కార్యకలాపాలకు వేదికగా నిలిచే ‘డార్క్ వెబ్’లో అమ్ముకుంటున్నట్లు నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ఎన్బీసీ) ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈఏడాది 1200స్కూళ్లని టార్గెట్ చేసి.. నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ఎన్బీసీ) రిపోర్ట్ ప్రకారం..అమెరికాకు చెందిన ఓ జిల్లా స్కూల్‌కు చెందిన విద్యార్ధుల వ్యక్తిగత వివరాల్ని మాల్ వేర్ సాయంతో దొంగిలించారు. విద్యార్ధుల పేర్లు, డేటా బర్త్,సోషల్ సెక్యూరిటీ నెంబర్ల(ssn)ను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా సైబర్ దాడులతో డబ్బుల్ని డిమాండ్ చేశారని, అలా ఇవ్వలేదనే విద్యార్ధుల వ్యక్తిగత డేటాను డార్కెవెబ్‌లో అమ్ముకున్నట్లు ఎఫ్‌బీఐ విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ సైబర్ దాడులతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా టీచర్స్ సైతం ఈ సైబర్ దాడులు విద్యార్ధుల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా,ఈజీ మనీ ఎర్నింగ్ కోసం హ్యాకర్స్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్ని టార్గెట్ చేయడంతో పాటు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అమెరికాకు చెందిన 1200 స్కూళ్లకు చెందిన కంప్యూటర్లను మాల్ వేర్‌తో దాడులు చేసినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అధ్యక్షుడి ప్రకటన తరువాతే కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ..ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఐటీ విభాగాల్ని మరింత పటిష్టం చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు సైబర్ నేరాలపై జరిగే న్యాయ విచారణకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అంశాల్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటన చేశారో లేదు. హ్యాకర్స్ దాడుల్ని ముమ్మరం చేయడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: సాయిధరమ్ తేజ్... చిత్రలహరిలో చెప్పింది ఇదే -
ఎఫ్‌బీఐపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన అసహనాన్ని దాచుకోలేకపోతున్నారు. అమెరికా నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)పై సైతం నిందలు మోపడానికి వెనుకాడడం లేదు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల లెక్కింపులో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అందుకే ఫలితాలు తారుమారు అయ్యాయని, తనకు అన్యాయం జరిగిందని ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మద్దతుదారులు న్యాయ పోరాటం సాగిస్తున్నారు. తన వాదనను బలపరిచేలా ఎఫ్ఐబీ ఒక్క ప్రకటన కూడా చేయలేదని ట్రంప్ ఆక్షేపించారు. ఆయన ఆదివారం ఓ ఇంటర్వ్యూలో.. ఎఫ్‌బీఐ క్రియాశీలతను కోల్పోయిందన్నారు. ఆ సంస్థ తీరుతో నిరుత్సాహానికి గురయ్యానని చెప్పారు. ఎఫ్బీఐలోని కొందరు తనకు వ్యతిరేకంగా పని చేశారని ధ్వజమెత్తారు. (చదవండి: శాస్త్రవేత్త దారుణ హత్య.. ట్రంప్‌పై అనుమానం!) -
కోల్డ్ బ్లడెడ్ మర్డర్ : ఆచూకీ చెబితే ఎఫ్‌బీఐ రివార్డు
వాషింగ్టన్: అమెరికాలో ఒక భారతీయ వ్యక్తిని కిడ్నాప్ చేసిన హత్య చేసిన కేసులో నిందితుడికి సంబంధించిన సమాచారం అందించిన వారికి భారీ రివార్డును ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రకటించింది. ఈ కేసును ఎఫ్‌బీఐ సెంట్రల్ వర్జీనియా హింసాత్మక నేరాల టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే నేరస్థుడి ఆచూకీని కనుక్కునేందుకు తాజా ప్రకటన చేసింది. ఈ హత్యకు సంబంధించిన ఏదైన సమాచారం ఇచ్చిన వారికి 15,000 డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నామని ఎఫ్‌బీఐ ప్రకటించింది. పరేష్‌కుమార్ పటేల్ (ఫైల్ ఫోటో) ఎఫ్‌బీఐ సమాచారం ప్రకారం సెప్టెంబర్16, 2012 న అమెరికాలో ఉంటున్న భారత జాతీయుడు పరేష్‌కుమార్ పటేల్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు. వర్జీనియాలోని చెస్టర్ ఫీల్డ్ లో పనిచేస్తున్న పటేల్‌ను ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు పథకం ప్రకారం ఎత్తుకెళ్లారు. నాలుగు రోజుల తరువాత తుపాకీ గుళ్ల గాయాలతో ఉన్న అతని మృతదేహాన్నివర్జీనియా రిచ్మండ్ నగరంలోని అంకారో బోట్ ల్యాండింగ్ వద్ద పోలీసులు గుర్తించారు. అప్పటినుంచి ఈ కేసుకు సంబంధించి నిందితుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో చాలెంజింగ్ గా తీసుకున్న దర్యాప్తు సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. #FBIRichmond's Central VA Violent Crimes Task Force offers up to $15K #reward for info leading to arrest/conviction of person(s) responsible for the 2012 murder of Mr. Pareshkumar Patel. https://t.co/2rk9WgTRwq or 804-261-1044.https://t.co/qtJjIzl9hj @RichmondPolice @CCPDVa — FBI Richmond (@FBIRichmond) September 15, 2020 -
ఉచితంగా అందించలేం: జూమ్ సీఈఓ
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. లాక్డౌన్ వల్ల అందరు ఇంట్లో ఉంటూ సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. అత్యాధునిక వీడియో సెషన్స్‌కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్ యాప్ లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా అధిక లాభాలను అర్జించినట్లు జూమ్ సంస్థ తెలిపింది. అయితే టెక్నాలజీ, భద్రతకు ప్రాధాన్యతమిస్తు కొత్త అప్‌గ్రేడ్ వర్షన్‌ను ఇన్స్టాల్ చేశామని.. అయితే ఈ వెర్షన్‌ను ఫ్రీగా అందించడంలేదని, రీచార్జ్ చేసుకోవాలని జూమ్ సీఈఓ ఎరిక్ యాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులతో కలిసి తమ సంస్థ పనిచేయనుందని.. అందువలన ఉచితంగా యూజర్లకు అందించలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. యాప్‌ను ఉచితంగా అందించడం వలన కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపారు. తాజా నివేదికల ప్రకారం జూమ్ యాప్ AES 256-bit జీసీఎమ్ అనే కొత్త వెర్షన్‌ను ఇన్స్టాల్ చేయనుందని సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త వర్షన్‌తో అనేక నూతన సాంకేతిక అంశాలను పొందుపరిచామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ జూమ్ రూమ్స్, సిస్టమ్స్, వైర్లెస్ సేవలను యూజర్లకు అందిస్తోంది. సరికొత్త రీతిలో జూమ్ రూమ్స్‌ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. చదవండి: హైదరాబాద్: సిటీ బస్సులకూ ఇక రైట్ రైట్! సరికొత్త వెర్షన్లో జూమ్ యాప్.. -
వరవరరావు హార్డ్‌డిస్క్ డేటా రికవరీ కోసం..
పుణే: ఎల్గార్ పరిషద్– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన విరసం నేత వరవరరావు ఇంట్లో స్వాధీనంచేసుకున్న హార్డ్‌డిస్క్‌లోని డేటా రికవరీ కోసం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సాయం తీసుకోవాలని పుణే పోలీసులు భావిస్తున్నారు. గతేడాది ఆగస్టులో వరవరరావు ఇంట్లో సోదాల్లో లభ్యమైన హార్డ్‌డిస్క్‌లో ఏముందో తెల్సుకునేందుకు నాలుగు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు పంపినా ఫలితం లేదు. తొలుత పుణేలోని ల్యాబొరేటరీకి పంపగా, నిపుణులు హార్డ్ డిస్క్‌లోని డేటాను రికవరీ చేయలేకపోయారని ఓ అధికారి చెప్పారు. తర్వాత ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినా అక్కడి నిపుణులు డేటా సంపాదించలేకపోయారు. గుజరాత్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల నిపుణులు రికవరీ చేయలేకపోయారని పేర్కొన్నారు. ‘సాంకేతికతలో ఎఫ్‌బీఐ చాలా పురోగతి చెంది ఉంటుంది. అందుకే ఎఫ్‌బీఐకి హార్డ్ డిస్క్ పంపాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు అవసరమైన అనుమతులను కేంద్ర హోం శాఖ ఇచ్చింది’అని ఆ అధికారి చెప్పారు. -
వరవరరావు కేసు: ఎఫ్‌బీఐకు హార్డ్‌డిస్క్!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరేగావ్ హింసాకాండ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావును నవంబర్ 17 ,2018లో పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని వరవరరావు ఇంట్లో సోదాలు చేసిన అనంతరం పోలీసులు స్వాధినం చేసుకున్న హార్డ్ డిస్క్ ధ్వంసం కావడంతో.. అందులోని డేటాను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో డేటాను రాబట్టేందుకు పూణె పోలీసులు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)ను ఆశ్రయించారు. వరవరరావు ఇంటి నుంచి స్వాధీనం చేసుకొన్న హార్డ్ డిస్క్‌ను ఇప్పటికే నాలుగు ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించారు. మొదట పూణేలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా.. ఎటువంటి డేటాను గ్రహించక పోవడంతో.. ఆ తర్వాత ముంబైలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ డైరెక్టరేట్‌కు చేరవేశారు. అక్కడనుంచి డేటాను తెరవలేకపోవడంతో.. అనంతరం గుజరాత్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో తెరిచే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ధ్వంసమయిన హార్డ్ డిస్క్ నుంచి డేటాను పొందడం కష్టతరమవడంతో.. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐకు పంపేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా 2017 డిసెంబర్ 31న పూణేలో మావోయిస్టుల మద్దతుతో ఎల్గర్ పరిషత్ సమావేశం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్న ప్రసంగం, కులాల మధ్య అల్లర్లకు కారణమై.. భీమా కోరెగావ్‌లో హింసాకాండ చెలరేగింది. ఇక భీమా కోరేగావ్ ఘటనలో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎల్గర్ పరిషత్-కోరెగావ్ భీమా కేసులో.. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే నెపంతో వరవరరావును అరెస్టు చేశారు. అదేవిధంగా విప్లవ సంఘాల నేతలకు మావోయిస్టులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయనే అభియోగాలతో సుధా భరద్వాజ్, సుధీర్ ధవాలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, షోమా సేన్‌పై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. -
‘ద్వేషపూరిత దాడుల్లో సిక్కులు’
అమెరికాలో 2018లో జరిగిన ద్వేషపూరిత దాడుల్లో బాధితులుగా సిక్కులు మూడో స్థానంలో ఉన్నారని యుఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం సిక్కులపై 60 దాడులు చోటు చేసుకున్నాయని పేర్కొంది. గత ఏడాది అమెరికాలో మొత్తం ద్వేషపూరితమైన దాడులు 7,120 జరిగాయని.. 2017తో పోల్చతే కొంచం తగ్గాయిని ఎఫ్‌బీఐ నివేదిక తెలిపింది. ద్వేషపూరితమైన దాడులు ముఖ్యంగా మతం ఆధారంగా యూదులు(835), ముస్లింలు(188), సిక్కులు (60)పై జరిగాయని పేర్కొంది. ఇతర మతాలపై ఇటువంటి దాడులు 91 అయ్యాయని తెలిపింది. ఇందులో భాగంగా హిందువులపై 12 దాడులు, బుద్ధులపై పది చోటుచేసుకున్నట్టు వెల్లడించింది. జాతి అధారంగా మొత్తం 4,047 దాడులు జరిగితే.. అందులో అత్యధికంగా అమెరికాలోని నల్లజాతి అఫ్రికన్లపై సుమారు 1,943 దాడులు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించింది. తరువాత తెల్ల జాతివారైన అమెరికన్లపై కూడా 762 దాడులు.. లాటిన్లపై 485 దాడులు జరిగాయని ఆ నివేదికలో వెల్లడైంది. కాగా 2018లో ఆసియన్లపై 148, అరబ్బులపై 82, అలాస్కా ప్రజలపై 194 ద్వేషపూరిత దాడులు జరిగినట్టు ఎఫ్‌బీఐ నివేదిక వెల్లడించింది. అయితే మిగతా మతస్తులపై దాడులు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ సిక్కులపై మాత్రం పెరుగుతున్నాయని.. దుండగులు దాడులకు లక్ష్యం చేసుకున్న మతాల్లో సిక్కులు మూడో స్థానంలో ఉన్నారని ఎఫ్‌బీఐ నివేదిక వెల్లడించింది. -
చిక్కడు.. దొరకడు.. ఎఫ్‌బీఐకి కూడా..
న్యూయార్క్/న్యూఢిల్లీ: ఆ హంతకుడిపై ఏకంగా రూ. 70లక్షల రివార్డు. దర్యాప్తులోనే మేటి అయిన అమెరికా అతని కోసం తెగ అన్వేషిస్తోంది. భారత్‌సహా నాలుగేళ్లుగా ప్రపంచాన్ని జల్లెడ పట్టినా అతడు దొరకలేదు. అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) టాప్ 10 వాంటెడ్ లిస్టులో స్థానం దక్కించుకున్నాడు. అతడే అహ్మదాబాద్‌కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ (24). అమెరికాలోని డంకిన్ డోనట్స్ స్టోర్‌లో పనిచేస్తున్న అతడు తన భార్యను కిరాతకంగా చంపాడు. అనంతరం తప్పించుకొని పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. 2015 ఏప్రిల్ 12న రాత్రి పనిచేస్తున్న అతడు తన భార్య ఫలక్ (21)తో కలసి స్టోర్‌లోని కిచెన్‌కు వెళ్లాడు. కాసేపటికి ఒక్కడే బయటకు వచ్చాడు. కొద్ది గంటల తర్వాత పోలీసులు అమె మృత దేహాన్ని కనుక్కున్నారు. చాలా సార్లు కత్తితో పొడిచి మరీ హత్యచేశాడు. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం అతడు ఓ టాక్సీలో హోటల్‌కు వెళ్లి రాత్రంతా పడుకొని తెల్లవారాక మాయమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడు కనిపించలేదు. ఎఫ్‌బీఐ అతడి కోసం అమెరికాలోనేగాక భారత్‌లోని గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలలో కూడా వెదికారు. ఇరుదేశాలు కలసి చేసిన పెద్ద కేసు విచారణ ఇదే కావడం గమనార్హం. -
యాపిల్‌ను భయపెట్టిన 16 ఏళ్ల బాలుడు!
సిడ్నీ: యాపిల్ సంస్థలో పనిచేయాలనే కోరిక ఓ 16 ఏళ్ల బాలుడిని ఆ సంస్థ కంప్యూటర్లను హ్యాక్ చేసేలా చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ టీనేజర్ యాపిల్ కంపెనీ కంప్యూటర్లను హ్యాక్ చేసి ఆ సంస్థను భయపెట్టాడు. అయితే చివరకు దొరికొపోయి శిక్షను అనుభవించేందుకు సిద్దమయ్యాడు. ఇక వినియోగదారుల సమాచారానికి ఎలాంటి నష్టం కలిగించలేదని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మెల్బోర్న్లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థి అయిన ఈ టీనేజర్ యాపిల్ సంస్థకు వీరాభిమాని. అందులో పనిచేయాలని కలలుగన్నాడు. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. అందులో భద్రపర్చిన 90 జీబీ ఫైళ్లను కూడా డౌన్లోడ్ చేశాడు. ఏడాదిలో పలుమార్లు ఇలా కంప్యూటరైజ్డ్ టన్నెల్స్ అండ్ ఆన్లైన్ బైపాసింగ్ సిస్టం ద్వారా కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. దీన్ని గుర్తించిన సంస్థ ప్రతినిధులు ఆ యువకుడిపై ఎఫ్‌బీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆస్ట్రేలియా పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఇంట్లో తనిఖీలు చేసి ఈ మొత్తం సమాచారాన్ని ‘హాకీ హాక్ హాక్’ పేరుతో ఫోల్డర్‌ను క్రియేట్ చేసి దాచినట్టు తెలిసింది. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో.. వచ్చేనెల న్యాయస్థానం శిక్ష విధించనుంది. మైనర్ కావడంతో అతని పేరును భయట పెట్టలేదు. -
ఆ ముష్కరులను గుర్తించొచ్చు: ఎఫ్‌బీఐ
వాషింగ్టన్: అమెరికాలో విచక్షణారహితంగా అమాయకులపై కాల్పులకు పాల్పడుతున్న వ్యక్తుల ప్రవర్తనా సరళి ఎలా ఉంటుందో గుర్తించామని దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తెలిపింది. ఈ లక్షణాలు తెలిసి ఉండటం వల్ల పోలీసులు కొన్ని కాల్పుల ఘటనలనైనా అడ్డుకోగలగడానికి వీలవుతుందంది. హంతకుల్లో చాలా వరకు శ్వేతజాతీయులేననీ, వారు వివిధ రకాల ఒత్తిడులకు, అన్యాయానికి గురైన వారేనని తెలిపింది. 75 శాతం హంతకులకు మానసిక అనారోగ్యాలేవీ లేవని ఎఫ్‌బీఐ తెలిపింది. -
సెక్స్‌రాకెట్.. సీఎం సన్నిహితుడి విచారణ!
సాక్షి, అమరావతి: సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అమెరికాకు సినీతారలను తరలించి వ్యభిచారం ఊబిలోకి దింపిన వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును అమెరికాలోని చికాగో పోలీసులు సీరియస్‌గా తీసుకోవడంతో తీగ లాగితే డొంక కదులుతోంది. తొలుత ఇది కేవలం సినీతారలకు సంబంధించిన అంశంగానే భావించినప్పటికీ ఈ రాకెట్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ వేమనను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తాజాగా విచారించడం కలకలం రేపుతోంది. తానా నుంచి సినీతారలకు ఆహ్వానాలు, మెయిల్స్ పంపడంతోపాటు సతీష్ వేమన బ్యాంకు ఖాతా నుంచి సినీతారలకు పెద్ద మొత్తంలో డబ్బులు మళ్లాయని ఎఫ్‌బీఐ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారించినట్టు తెలిసింది. టీడీపీలో సతీష్ చురుకైన పాత్ర తొలుత ఎఫ్‌బీఐ విచారణకు హాజరైన సతీష్ వేమన తరువాత ఫోన్ స్విచాఫ్ చేసినట్లు తెలిసింది. అయితే తానా ప్రతినిధులపై పోలీసులు ఒత్తిడి తేవడంతో సతీష్ విచారణకు హాజరై సహకరించారని చెబుతున్నారు. సినీతారల సెక్స్ రాకెట్‌కు సంబంధించి సతీష్ వేమన ప్రమేయంపై ఈ సందర్భంగా ఎఫ్‌బీఐ ఆరా తీసినట్టు సమాచారం. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే సతీష్ గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు హీరోయిన్లను అమెరికా తీసుకెళ్లి పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయితే సెక్స్ రాకెట్లో తన ప్రమేయం లేదని సతీష్ వేమన ముందు జాగ్రత్తగా కొన్ని మీడియా సంస్థలకు వివరణ ఇచ్చుకోవడంపై తానా ప్రతినిధుల్లో భిన్న వాదనలు వ్యక్తమైనట్టు తెలిసింది. తప్పు చేయనప్పుడు మీడియాకు ముందే వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని పలువురు సహచరులు ఆయన్ను ప్రశ్నించినట్టు తెలిసింది. చికాగో కోర్టుకు ‘సెక్స్ రాకెట్’ దంపతులు... సినీతారల సెక్స్ రాకెట్ కేసులో మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను ఎఫ్‌బీఐ గురువారం ఇల్లినాయిస్ కోర్టులో హాజరు పరిచింది. గురువారం నుంచి ఈ కేసు విచారణ ప్రారంభం అయినందున కిషన్ దంపతులు అప్రూవర్‌గా మారి నోరు విప్పితే పలువురు ప్రముఖుల గుట్టు రట్టు అవుతుందని భావిస్తున్నారు. కిషన్ దంపతులకు రెండేళ్ల క్రితమే వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటూ సినీతారలు, ప్రముఖులను తరలించి సెక్స్ రాకెట్ నడపటాన్ని అమెరికా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం నాలుగేళ్ల నుంచి జరుగుతున్నట్లు భావించినా పదేళ్ల నుంచి కొనసాగుతున్నట్టు ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలిందని విశ్వసనీయ సమాచారం. అమెరికాకు సినీతారలు, ప్రముఖులు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు తీసుకొచ్చారు, ఎవరెవరికి ఎంత మొత్తం చెల్లించారు తదితర వివరాలు చంద్రకళ డైరీలో రాసి ఉన్నట్టు చెబుతున్నారు. ఆ డైరీ ఇప్పుడు ఎఫ్‌బీఐ చేతికి చిక్కడంతో ఎవరి జాతకాలు బయటపడతాయోననే కలవరం మొదలైంది. తీవ్ర నేరంగా పరిగణిస్తున్న ఎఫ్‌బీఐ దాదాపు ఆరు నెలల క్రితం దొరికిన ఒక కాగితం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎఫ్‌బీఐ పలు కీలక ఆధారాలు సేకరించి సెక్స్ రాకెట్లో పాత్రధారులైన మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను అదుపులోకి తీసుకుంది. వీరిపై కేసు నమోదు చేసిన చికాగో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు చేపట్టి దీని వెనుక కీలక వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. సాంస్కృతిక ప్రదర్శనల పేరుతో వ్యభిచారం చేయడం తీవ్రమైన నేరంగా ఎఫ్‌బీఐ పేర్కొంటోంది. అమెరికాలో ఇష్టపూర్వకంగా జరిగే వ్యభిచారంపై పెద్దగా ఆంక్షలు లేనప్పటికీ మారుపేర్లతో విదేశీయులను తరలించి వ్యభిచారంలోకి దించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించినట్టు తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్లో దాదాపు రూ.40 కోట్ల మేర చేతులు మారినట్టు చెబుతున్నారు. -
చక్రబంధంలో ట్రంప్!
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాక డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశ పౌరులను మాత్రమే కాదు... ప్రపంచ ప్రజానీకాన్నే విస్మయపరుస్తున్నాయి. ఈ పరంపరలో ఆయన వెలువరించిన తాజా ట్వీట్ వాటన్నిటినీ తలదన్నింది. అధ్యక్షుడిగా తనను తాను క్షమించుకునే అధికారం తనకున్నదన్నదే ఆ ట్వీట్ సారాంశం. అలా అంటూనే తాను ఆ పని చేయా ల్సిన అవసరం రాదని ముక్తాయించారు. ఎందుకంటే ఆయన ఏ తప్పూ చేయలేదట! ఇప్పటికిప్పుడు ట్రంప్ ఇలా చెప్పడానికి కారణం ఉంది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై అమెరికా పౌరుల్లో ఉన్న విశ్వసనీయతనూ, ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ అవకాశాలనూ దెబ్బతీయడానికి ప్రయత్నించిన రష్యాతో ఆయన కుమ్మక్కయ్యారన్న అభియోగాలపై సాగుతున్న విచారణ కీలక దశకు చేరింది. ఏడాదినుంచి ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ఎస్. మ్యూలర్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ విచా రణపై ట్రంప్‌కు మొదటినుంచీ అసహనం ఉంది. దానిపై వీలు చిక్కినప్పుడల్లా ఆయన విరుచుకు పడుతూనే ఉన్నారు. ఈమధ్యకాలంలో ట్రంప్ న్యాయవాద బృందం మ్యూలర్ విచారణ చెల్లుబాటు కాదని వాదించడం మొదలుపెట్టారు. అంతేకాదు... పదవిలో ఉన్నంతకాలం ఎలాంటి ప్రాసిక్యూషన్ నుంచి అయినా ట్రంప్‌కు రక్షణ ఉంటుందని కూడా బల్లగుద్ది చెబుతున్నారు. ఆఖరికి ట్రంప్ ఎవరి నైనా కాల్చిచంపినా సరే ఆ విషయంలో ఆయనపై చర్య తీసుకోవడానికి వీలుండదని కూడా సెల విస్తున్నారు. దానికి కొనసాగింపుగానే ట్రంప్ తాజా ట్వీట్ చేసినట్టు కనబడుతోంది. వాటర్‌గేట్ కుంభకోణంలో చిక్కుకుని 1974లో పదవీభ్రష్టుడైన రిచర్డ్ నిక్సన్ కూడా ట్రంప్ మాదిరే మాట్లా డేవారు. వాటర్‌గేట్ విచారణ సాగుతున్న సమయంలో ‘అధ్యక్షుడు ఏదైనా చేస్తే అది చట్టవిరుద్ధం కాదనే అర్థం’ అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. మరో మాటలో చెప్పాలంటే అధ్యక్షుడు అన్ని చట్టాలకూ అతీతుడని నిక్సన్ వాదనలోని సారాంశం. ఇంతకూ ట్రంప్ ‘స్వీయ క్షమాభిక్ష’ నిర్ణయం తీసుకుంటారా లేక ఆ అవసరం రానివిధంగా ఏకంగా మ్యూలర్ విచారణనే రద్దు చేస్తారా అన్నది ఇంకా చూడాల్సి ఉంది. ఏం చేసినా అది అమె రికాలో పెను సంక్షోభాన్ని కలిగించడం ఖాయం. అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికుండే క్షమాభిక్ష అధికారాల గురించి, ఏ విచారణనైనా ప్రారంభించమని లేదా నిలిపేయమని కోరే అధికారం గురించి వివరంగానే మాట్లాడినా...అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి తన విషయంలో తాను ఇలా చేయవచ్చునా అనే సంగతిని మాత్రం చెప్పలేదు. అధ్యక్షుడిగా ట్రంప్ వంటివారు వస్తారని రాజ్యాంగాన్ని రచించినవారి ఊహకు తట్టి ఉండకపోవచ్చు. కానీ ఆ లొసుగును ట్రంప్ ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదని ఆయన నుంచీ, ఆయనవైపునుంచీ వెలువడుతున్న ప్రకటనలు గమనిస్తే అర్ధమవుతుంది. విచారణలో భాగంగా ట్రంప్‌ను పిలిపించినా, దానికి ఆయన కట్టుబడాల్సిన అవసరం లేదని ఇప్పటికే మ్యూల ర్కు అందించిన లేఖలో ట్రంప్ న్యాయవాదులు స్పష్టం చేశారు. విచారణకు ట్రంప్ హాజరైతే అది అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించడంలో అవరోధంగా మారుతుందని, ఆయన స్థాయిని తగ్గిస్తుందని కూడా వారు వాదించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ టీంలో సభ్యులుగా ఉండి ఆ తర్వాత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు వివిధ కారణాలరీత్యా తప్పుకోవాల్సి వచ్చింది. స్వల్పకాలం జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన మైకేల్ ఫ్లిన్ అందులో ఒకరు. ఆయన ట్రంప్ ఎన్నికల ప్రచార బృందంలో సభ్యుడిగా ఉన్నప్పుడు రష్యా రాయబారితో మాట్లాడిన మాటలు నిరుడు వెల్లడయ్యాయి. రష్యాపై అప్పటికి అమలులో ఉన్న ఆంక్షల్ని ట్రంప్ అధ్యక్షు డయ్యాక తొలగిస్తారన్నది ఆ మాటల సారాంశం. ఆ సంభాషణలు వెల్లడయ్యాక ఫ్లిన్ రాజీనామా చేయాల్సివచ్చింది. దానిపై అప్పటి ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ దర్యాప్తునకు ఆదేశించగా దాన్ని నిలిపేయమని ట్రంప్ ఆయన్ను కోరారు. విననందుకు ఆగ్రహించి కోమీని తప్పించారు. కోమీ కూడా ట్రంప్‌కు ఒకప్పుడు సన్నిహితుడే. ట్రంప్ ఏరికోరి తెచ్చుకున్న 26మంది ఉన్నతాధికారులు ఇలా వివిధ సందర్భాల్లో తమంత తాము వైదొలగవలసి వచ్చింది. లేదా కొందరిపై ఆగ్రహించి ట్రంప్ తొలగించారు. ముఖ్యంగా మ్యూలర్ చేసిన అభియోగాలకు సరిగా జవాబు చెప్పలేక నలుగురు రాజీనామా చేశారు. ఇలా పదే పదే జరగడం వల్ల కావొచ్చు... విచారణ కీలక దశకు చేరుకుని తనపై అభియోగాలు మోపే అవకాశాలు స్పష్టంగా కనబడటం వల్ల కావొచ్చు ట్రంప్ తాజా ట్వీట్ చేశారని అనుకోవాలి. అమెరికా రాజ్యాంగం ‘స్వీయ క్షమాభిక్ష’ గురించి చెప్పకపోయినా ‘ఎవరూ తమ గురించి తాము తీర్పు ఇచ్చుకోరాద’న్న సంప్రదాయమైతే ఉంది. అయితే ట్రంప్ విశిష్టత ఏమంటే ఆయన ఏ సంప్రదాయాలనూ గౌరవించే రకం కాదు. నిక్సన్ చెప్పినట్టు అధ్యక్షుడు ఏం చేసినా చట్టవిరుద్ధం కాదని ఆయన బలంగా నమ్ముతారు. ట్రంప్ స్వీయ క్షమాభిక్షకు పూనుకున్నా, రష్యా ప్రమేయంపై సాగే దర్యాప్తులో నిందితులుగా నిర్ధారణ అయిన తన బృందంలోని వారికి క్షమాభిక్ష పెట్టేందుకు ప్రయత్నించినా, మ్యూలర్ దర్యాప్తును మూలపడేసినా అది ట్రంప్‌పై ఉన్న అభియోగాల తీవ్రతను మరింత పెంచుతుంది. ఆ అభియోగాల్లో నూరు శాతం నిజం ఉండొచ్చునని ప్రతి ఒక్కరూ భావించే ప్రమాదం ఏర్పడు తుంది. తనను అన్యాయంగా వేధిస్తున్నారని, బాధ్యతలపై దృష్టి కేంద్రీకరించకుండా అవరోధం కలిగిస్తు న్నారని ట్రంప్ వాపోతున్నా ఆయన తప్పించుకోవడం సాధ్యం కాదు. అధ్యక్షుడిగా ఆయన తీసుకునే నిర్ణయాల్లోని అసంబద్ధతలపైనా, అందులో ఉండే పరస్పర వైరుధ్యాలపైనా ఇప్పటికే అందరిలోనూ అసంతృప్తి ఉంది. మ్యూలర్ దర్యాప్తును ఏమాత్రం ఆటంకపరిచినా ఇది మరిన్ని రెట్లు పెరుగుతుంది. అమెరికన్ కాంగ్రెస్ ఆయనపై మహాభియోగ తీర్మానం చేసేందుకు కూడా సిద్ధపడొచ్చు. ట్రంప్ వివేకంతో వ్యవహరిస్తారో, తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
బిత్తిరి చర్య.. తప్పిన పెను ప్రమాదం
వాషింగ్టన్: జాగ్రత్తగా ఉండాల్సిన అధికారి నిర్లక్ష్యంగా వహించాడు. బిత్తిరి చర్యతో నైట్ క్లబ్లో ప్రజలను బెంబేలెత్తించాడు. అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి మాత్రం గాయపడ్డాడు. డెన్వర్ నగరం(కొలరెడా)లోని ఓ నైట్ క్లబ్లో జరిగిన ఘటన తాలుకూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎఫ్‌బీఐ అధికారి(ఆఫ్ డ్యూటీలో ఉన్నాడు) ఒకరు శుక్రవారం రాత్రి డెన్వర్‌లోని మైల్ హైల్ స్పిరిట్ అనే నైట్ క్లబ్‌కు వెళ్లాడు. హుషారుగా ఫ్లోర్‌పై బ్రేక్ డాన్స్ చేయటం ప్రారంభించాడు. చుట్టూ అమ్మాయిలు, అబ్బాయిలు చేరి వావ్ అనుకుంటుంటే.. ఆ కోలాహలం చూసి తట్టుకోలేక తన ట్యాలెంట్ ప్రదర్శించాడు. బ్యాక్‌ఫ్లిప్ మూమెంట్‌తో అదరగొట్టాడు. ఆ ప్రయత్నంలో అతని వెనకభాగంలో దాచుకున్న గన్ ఎగిరి కింద పడిపోయింది. కంగారులో దాన్ని తీసుకునే క్రమంలో అది కాస్త పేలింది. బార్లో పని చేసే ఓ ఉద్యోగి కాలికి తగిలి గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ బుల్లెట్ కింది దిశగా ప్రయాణించటంతో పెను ప్రమాదమే తప్పింది. ఘటన తర్వాత సారీ చెబుతూ అక్కడి నుంచి అతను గాయబ్ అయిపోయాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేసి వైరల్ చేశాడు. ఎఫ్‌బీఐ మౌనం... ఘటన అనంతరం రంగంలోకి దిగిన డెన్వర్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అయితే ఎఫ్‌బీఐ అధికారి కావటంతో కేసు మాత్రం నమోదు చేయలేదు. మరోవైపు ఎఫ్‌బీఐ ఈ కేసును గోప్యంగా డీల్ చేయాలని చూస్తోంది. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడా? లేదా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై మీడియాకు ఎలాంటి వివరణ ఇచ్చేందుకు ఎఫ్‌బీఐ అధికారులు సుమఖంగా లేకపోవటం విశేషం. అయితే డెన్వర్ పోలీసులు మాత్రం ఎఫ్బీఐతో ప్రమేయం లేకుండా ఈ కేసులో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. ఇప్పటికే డిస్ట్రిక్ అటార్నీ కార్యాలయానికి నివేదిక ను సమర్పించగా, వారిచ్చే ఆదేశాలనుసారం ముందుకు వెళ్తామని పోలీసులు స్పష్టం చేశారు.