వైట్ హౌస్ కంపూటర్ల హ్యాకింగ్ | White House computer system breached by hackers says report | Sakshi
Sakshi News home page

వైట్ హౌస్ కంపూటర్ల హ్యాకింగ్

Published Wed, Oct 29 2014 5:43 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

వైట్ హౌస్ కంపూటర్ల హ్యాకింగ్ - Sakshi

వైట్ హౌస్ కంపూటర్ల హ్యాకింగ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలోని కంప్యూటర్ వ్యవస్థలోకి హ్యాకర్లు చొరబడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. హ్యాకింగ్ కారణంగా తాత్కాలికంగా పలు సేవలు స్తంభించినట్టు తెలిపింది. ఈ చొరబాటు వెనుక రష్యా ప్రభుత్వం హస్త ముందని అమెరికా అనుమానిస్తోంది.

హ్యాకింగ్ జరిగిన విషయాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టామని వైట్ హౌస్ అధికారి తెలిపినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. హ్యాకింగ్ వల్ల అధ్యక్ష భవనంలో కంప్యూటర్ వ్యవస్థకు ఎటువంటి నష్టం కలగలేదని, కొంత సమయం పాటు సేవలు స్తంభించాయని వెల్లడించారు. హ్యాకింగ్ పై ఎఫ్బీఐ, సీక్రెట్ సర్వీస్ అండ్ నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement