
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత కీలక నిర్ణయాలు తీసకుంటున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ ప్రచార వ్యూహకర్తను సుజీ వైల్స్‌ను వైట్‌హౌజ్ స్టాఫ్ చీఫ్‌గా ట్రంప్ నియమించారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి తనతో పోటీ పడిన నిక్కీ హేలీ వైట్‌హౌజ్ కార్యవర్గంలోకి తీసుకోబోనని ట్రంప్ స్పష్టం చేశారు.
హేలితో పాటు మైక్ పాంపియోను కూడా తీసుకోవడం లేదని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.‘నిక్కీ హేలీ, మైక్ పాంపియోను నూతన కార్యవర్గంలోకి ఆహ్వానించడం లేదు. గతంలో వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందానిచ్చింది. దేశానికి వారు చేసిన సేవకు ధన్యవాదాలు’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
కాగా, ట్రంప్ పోస్టుపై నిక్కీ హేలీ స్పందించారు. గతంలో ట్రంప్‌తో కలిసి పనిచేయడం తనకు ఆనందాన్నిచ్చిందని, అమెరికాను ట్రంప్ మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అరిజోనాలోనూ ట్రంప్ గెలుపు
Comments
Please login to add a commentAdd a comment