వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జాన్ ట్రంప్ శ్వేతసౌధంలో జనవరి 20న అడుగుపెట్టారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపాయని చెప్పవచ్చు. ట్రంప్ నిర్ణయాలపై అనూకుల, వ్యతిరేకతలు భారీ స్థాయిలో రావడం గమనార్హం. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రపంచ మీడియాలో ట్రంప్ పేరుతో పతాక శీర్షికల్లో మార్మోగుతోంది. ట్రంప్ అధ్యక్షుడైన వెంటనే తీసుకున్న ట్రావెల్ బ్యాన్, సరిహద్దు గోడ వంటి నిర్ణయాలు అమెరికానే ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి.
ట్రంప్ కీలక నిర్ణయాలు
- అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో అడుగుపెట్టిన వెంటనే ట్రంప్.. ఒబామా కేర్ పాలసీని రద్దు చేశారు.
- ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్.. అధ్యక్షుడిగా ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో తొలి పర్యటన చేశారు.
- అమెరికా-ఉత్తర కొరియాల మధ్యనున్న వైరం ట్రంప్ రాకతో.. మరింత పెద్దదయింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ వరుస అణుక్షిపణి పరీక్షలు నిర్వహించడం ప్రపంచాన్ని కలవరపెట్టింది. అదే సమయంలో ఉత్తర కొరియాను నేలమట్టం చేస్తానంటూ ట్రంప్ చేసిన ప్రకటన మరింత వేడిని రాజేసింది.
- గత ఏడాది చివర్లో ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అంతేకాక తమ రాయబార కార్యాలయాన్ని టెల్ అవైవ్ నుంచి జెరూసలేంకు మారుస్తున్నట్లు స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనతో మధ్య ప్రాచ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తపరిస్థితులు చోటు చేసుకున్నాయి.
- ఉగ్రవాదంపై పోరులో సహకరించడం లేదంటూ.. పాకిస్తాన్‌కు ఇచ్చే నిధులను నిలిపేస్తున్నట్లు ప్రకటించి మరో సంచలనం సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment