అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అమెరికాలోని వాషింగ్టన్‌లో సోమవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందగా.. నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప‍్రకారం.. వైట్ హౌస్‌కు రెండు మైళ్లదూరంలో వాష్టింగన్ డీసీలోని 14వ, యూస్ట్రీట్ నార్త్‌వెస్ట్‌లో జరుగుతున్న ఓ సంగీత కచేరి కార‍్యక్రమంలో కాల్పులు జరిగాయి. కాల్పుల భయంతో ఒక్కసారిగా రోడ్లపై జనం పరుగులు తీశారు. కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం వైపుగా ఎవరూ వెళ్లొద్దని సూచించారు. అయితే, కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ ఫైరింగ్‌లో ఒకరు మృతిచెందగా.. పోలీస్ అధికారి సహా పలువురికి తూటాలు తగిలినట్లు మెట్రోపోలిటన్ పోలీస్ విభాగం తెలిపింది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. అంతకుముందు.. మే 24న టెక్సాస్‌లోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Multiple people, including a police officer, were shot at a music event on U Street Northwest in #Washington, DC, just less than 2 miles from the White House. pic.twitter.com/Vw0penv4jj
— Gal Jammu Di (@GalJammuDi) June 20, 2022
ఇది కూడా చదవండి: చైనాలో జీరో కోవిడ్ వ్యూహం తెచ్చిన తంటా..
Comments
Please login to add a commentAdd a comment