washington DC
-
అమెరికా వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు!
అమెరికా వాషింగ్టన్ డీసీ లోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. వాషింగ్టన్ డీసీ పరిధి వర్జీనియాలోని అష్బర్న్ ఇండిపెండెన్స్ హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్‌కు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వాలన చేసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడు వేలకు పైగా మంది ప్రవాసీయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు తీకొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ ఆడపడుచులు సామూహికంగా పాడుతూ, చప్పట్లు కొడుతూ కోలాటాలు, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ.. లయబద్దంగా కదులుతుంటే ఆడిటోరియం అంతటా సందడి నెలకొంది. వారిని అనుసరిస్తూ కుటుంబ సభ్యులు చప్పట్లు కొట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పోతురాజులు, హైదరాబాదీ బ్యాండ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతితో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రపంచం నలుమూలల ప్రతిబింబించేలా పండుగలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ సంస్కృతి, సాంప్రదాయాలు మరువకూడదని, భావితరాలకు వారసత్వంగా అందించాలన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను మంత్రి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు అందించిన సహాకారం మరువలేనిదని తెలిపారు. అనంతరం యూఎస్ గవర్నమెంట్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్ అందరూ కలిసి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) వాషింగ్టన్ డీసీ ఛాప్టర్ కు ప్రోక్లమేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్జీనియా డెలిగేట్ శ్రీనివాసన్ కన్నన్, అటార్నీ జనరల్ జేసన్ ఎస్. మియారెస్, లౌడన్ కౌంటీ సూపర్వైజర్ లౌరా సావినో, లౌడన్ కౌంటీ స్కూల్ బోర్డు డాక్టర్ సుమేరా రషీద్, డెమొక్రాట్ పార్టీ నేత శ్రీధర్ నాగిరెడ్డి, జీటీఏ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ప్రెసిడెంట్ మునుకుంట్ల తిరుమల్ రెడ్డి , చైర్మన్ కళావల విశ్వేశ్వర్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పడూరు శ్రీవన్ రెడ్డి , నేషనల్ ట్రెజరర్ ముద్దసాని సుధీర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నంది సమరేంద్ర, దేశినేని సంపత్, జీటీఏ వనిత టీమ్ తెలకుంట్ల జయశ్రీ , ప్రత్యూష నారపరాజు, సేరిపల్లి రేఖ తదిరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.(చదవండి: అమెరికాలో బతుకమ్మ సంబరాలు..!) -
ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం
న్యూఢిల్లీ/న్యూయార్క్/టెల్అవీవ్: అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీతోపాటు న్యూయార్క్‌లో పలు కార్యక్రమాలు జరిగాయి. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా జనం వేలాదిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో జరిగిన కార్యక్రమంలో 300 మంది పాల్గొన్నారు. సింగపూర్‌లో ఆరోగ్య శాఖ మంత్రి రహయు మహజం ఆధర్యంలో జరిగిన కార్యక్రమంలో 200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. నేపాల్‌లోని పొఖారా, బుద్ధుడి జన్మస్థలం లుంబినిలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. శ్రీలంక రాజధాని కొలంబో, చైనా రాజధాని బీజింగ్, ఫ్రాన్సు రాజధాని పారిస్, మాల్దీవులు రాజధాని మాలె, ఇటలీ రాజధాని రోమ్, సౌదీ రాజధాని రియాద్, కువైట్, మలేసియా, ఇండోనేసియాలో, స్వీడన్ రాజధాని స్టాక్‌హోం, లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్‌లోనూ యోగా కార్యక్రమాలు జరిగాయి. -
జాహ్నవి కేసు.. భారత్ కీలక ప్రకటన
సీటెల్: రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అధికారికి అక్కడి కోర్టు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లేనందున ఆ అధికారిపై క్రిమినల్ అభియోగాలు మోపడం లేదని వాషింగ్టన్ స్టేట్‌లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. అయితే జాహ్నవి కందుల కేసులో భారత్ కీలక ప్రకటన చేసింది. తీర్పును సమీక్షించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని సీటెల్‌లోని భారత దౌత్య కార్యాలయం ధృవీకరించింది. ‘‘దురదృష్టకర రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జాహ్నవి కందుల కేసులో.. ఇటీవలె కింగ్ కౌంటీ అటార్నీ ప్రాసిక్యూషన్ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అయితే ఈ విషయంలో బాధిత కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. న్యాయం జరిగేంతవరకు అన్ని రకాలుగా సహకారం అందిస్తూనే ఉంటాం అని దౌత్య కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. ఈ కేసులో తగిన పరిష్కారం కోసం సీటెల్ పోలీసులతో సహా స్థానిక అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తీర్పుపై సమీక్ష కోసం ఇప్పటికే సీటెల్ సిటీ అటార్నీ కార్యాలయానికి సిఫార్సు చేశామని పేర్కొంది. సీటెల్ పోలీస్ విచారణ ముగింపు కోసం ఎదురు చూస్తున్నామని, అప్పటిదాకా కేసు పురోగతిని పరిశీలిస్తామని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. On the recently released investigation report of the King County Prosecution Attorney on the unfortunate death of Jaahnavi Kandula, Consulate has been in regular touch with the designated family representatives and will continue to extend all possible support in ensuring justice… — India In Seattle (@IndiainSeattle) February 23, 2024 ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. కిందటి ఏడాది జనవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల టైంలో ఇంటికి వెళ్లబోతూ రోడ్డు దాటుతున్న ఆమెను.. ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ వేగానికి వంద అడుగుల ఎత్తులో ఎగిరిపడి తీవ్రంగా గాయపడి జాహ్నవి మృతి చెందింది. ఆ టైంలో వాహనం నడుపుతున్న కెవిన్ డేవ్ అనే అధికారి నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణం పోయిందని ఆ తర్వాతే తేలింది. ఇంకోవైపు.. ఇదీ చదవండి: జాహ్నవికి అన్యాయం.. కేటీఆర్ ఆవేదన సియాటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆర్డరర్ జాహ్నవి మృతిపై చులకనగా మాట్లాడాడు. ప్రమాదం గురించి పైఅధికారికి సమాచారం చేరవేస్తూ.. ఆర్డరర్ నవ్వులు చిందించాడు. అంతేకాదు.. ఆమె(జాహ్నవి) జీవితానికి పరిమితమైన విలువ ఉందని.. పరిహారంగా కేవలం చెక్ ఇస్తే సరిపోతుందని.. చిన్న వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడాడు. ఈ వ్యవహారం వీడియోతో సహా బయటకు రావడంతో దుమారం రేగింది. అయితే తాను అవమానించేందుకు అలా మాట్లాడలేదంటూ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు ఆర్డరర్. అంతేకాదు.. జాహ్నవి మృతికి కారణమైన కెవిన్‌కు అనుకూలంగా.. తప్పంతా జాహ్నవిదే అన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చాడు కూడా. ఇక కెవిన్‌పై ఇప్పటికిప్పుడు క్రిమినల్ చర్యలు లేకపోయినా.. డిపార్ట్మెంట్ తరఫున చర్యలు ఉంటాయని అధికారులంటున్నారు. మార్చి 4వ తేదీన క్రమశిక్షణా కమిటీ ముందు కెవిన్ హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అతని వివరణతో కమిటీ సంతృప్తి చెందకపోతే మాత్రం చర్యలు తప్పవు. -
ఘనంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం
వాషింగ్టన్ డిసి: నేషనల్ మాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో మొదటిరోజునే రికార్డు స్థాయిలో పది లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా హాజరై తిలకించారు. ప్రపంచంలోని భిన్న సంస్కృతుల సమాహారంగా, మానత్వం, శాంతి సందేశాల ద్వారా మానవాళిని ఏకంచేసే ఉద్దేశ్యంతో రూపొందిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు 180 దేశాల నుంచి కళాకారులు ఇక్కడకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో ఐక్యరాజ్యసమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, వాషింగ్టన్ డిసి నగర మేయర్ మురియెల్ బౌసర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గౌరవ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్ మార్సెలో శాంచెజ్ సోరోండో ఉన్నారు. మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా గ్రామీ అవార్డు గ్రహీత చంద్రికా టాండన్, 200 మంది కళాకారుల బృందంచే అమెరికా ది బ్యూటిఫుల్, వందేమాతరం మనోహర సంగీత ప్రదర్శన, పంచభూతం పేరిట, 1000 మంది భారతీయ శాస్త్రీయ నృత్యకళాకారులచే శాస్త్రీయ నృత్య-వాద్య సంగమం, గ్రామీ అవార్డు విజేత మిక్కీ ఫ్రీ నేతృత్వంలో1000మంది కళాకారులచే ప్రపంచ గిటార్ వాద్యగోష్టి, ఇంకా ఆఫ్రికా, జపాన్, మధ్యప్రాచ్య దేశాల కళాకారుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ రవిశంకర్ తన భావాలను పంచుకున్నారు. “మానవ జాతిలోని వైవిధ్యాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునే సుందరమైన సందర్భం ఇది. ఈ భూమి చాలా వైవిధ్యంతో కూడి ఉంది, అయినప్పటికీ, మానవ విలువలనే సూత్రం ద్వారా మనందరిలో అంతర్లీనంగా ఐక్యత ఉంది. ఈ రోజు, ఈ ఉత్సవం సందర్భంగా, సమాజానికి మరింత ఆనందాన్ని తీసుకురావడానికి మనం కట్టుబడదాం. ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వులు పూయించేందుకు కృషిచేద్దాం. అదే మానవత్వం. మనమందరం దానితోనే రూపొందించబడ్డాం. జ్ఞానం ఆలంబనగా లేకపోతే ఏ ఉత్సవమైనా శోభించదు. ఆ జ్ఞానం మన అందరిలోనూ ఉంది. మనలో ప్రతీ ఒక్కరూ ప్రత్యేకమైన వారని, అదే సమయంలో అందరూ ఒకటే అని గుర్తించడమే ఆ జ్ఞానం. మీలో ప్రతీ ఒక్కరికీ మరొక్కసారి చెబుతున్నాను. మనమంతా ఒకరికొకరు సంబంధించిన వారం. మనమంతా ఒకే విశ్వకుటుంబానికి చెందినవారం. రండి, మన జీవితాలను పండుగలా, ఉత్సవంలా జరుపుకుందాం. సవాళ్లను అంగీకరించి, ధైర్యంగా ఎదుర్కొందాం. మనకోసం, రాబోయే తరాలకోసం మరింత మెరుగైన భవిష్యత్తును ఆశిద్దాం’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, “మనం మరింత సమృద్ధికోసం, మన భూమి భవిష్యత్తును కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నపుడు, దానికి వ్యతిరేకంగా సవాళ్ళను ఎదుర్కొనడం సహజం. అవి ప్రకృతి ఉత్పాతాలు కావచ్చు. లేదా మానవ తప్పిదాలు, సంఘర్షణలు, లేదా అంతరాయాలు కావచ్చు. ఈనాటి పరస్పర ఆధారిత ప్రపంచంలో మనమంతా ఒకరికొకరు అండగా ఉన్నామనేది ముఖ్యమైన విషయం. ఈ విషయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మనకు ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచింది. ఇటీవలి ఉక్రెయిన్ సంఘర్షణలో వీరిద్వారా కలిగిన ప్రభావవంతమైన మార్పును నేను ప్రత్యక్షంగా గమనించాను. ఈ రోజు, వారి సందేశం, మీ సందేశం, నా సందేశం ఒకటే. పరస్పరం దయ కలిగి ఉండడం, మనకు కలిగిన దానిని ఇతరులతో పంచుకోవడం, పరస్పరం సుహృద్భావంతో అర్థంచేసుకోవడం, సహకరించుకోవడం. ఇవే ఈనాడు మనందరినీ సమైక్యంగా ఇక్కడకు చేర్చాయి.” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోప్ తమ సందేశాన్ని పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గౌరవ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్ మార్సెలో శాంచెజ్ సోరోండో ద్వారా పంచుకున్నారు. “ప్రపంచ శాంతిని సాధించేందుకు, మనకు అంతరంగంలో శాంతి అవసరం. శాంతిని ప్రవచించేందుకు ముందు, మనం శాంతితో జీవించాలి. శాంతియుతంగా జీవించడానికి మనకు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కావాలి. శాంతియుతంగా జీవించే కళను పొందాలంటే మనం దైవంతో సంభాషిస్తూ ఉండాలి. దేవుడంటే మనిషికి శత్రువు కాదు, దైవం మనకు మిత్రుడు. దైవం అంటే ప్రేమ. దైవాన్ని పొందాలంటే మనం ధ్యానంలోకి, ప్రార్థనలోకి తిరిగి వెళ్లాలి. మన మూలాలకు చేరుకోవాలి. కాబట్టి, ఈనాటి సున్నితమైన క్షణంలో, మనలో దైవాన్ని ఆవాహన చేసుకోవాలి. పోప్ ఫ్రాన్సిస్ తరపున, సమస్త ప్రజలకు సోదరుడినైన నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ అతిపెద్ద సమావేశానికి హాజరైన మీ అందరికీ నా ఆశీస్సులు. నిజంగా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఈ విధంగా జీవించే కళ) మన మానవాళికి భవిష్యత్తు అని నా ఉద్దేశ్యం.” అని పేర్కొన్నారు. రవిశంకర్ స్ఫూర్తితో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం, దేశాల భౌగోళిక ఎల్లలను చెరిపివేస్తూ మానవాళి, సౌభ్రాతృత్వాలను పడుగు పేకలుగా నేసి, విశ్వమానవ సంస్కృతి అనే అద్భుతమైన వస్త్రాన్ని సృజించింది. సంగీత, నృత్యాల ద్వారా ప్రాంతీయ, దేశీయ సంప్రదాయాల పరిరక్షణకు, అదే సమయంలో ప్రతి ఒక్కరూ ఆనందించి, ఆస్వాదించడానికి ఒక చక్కని వేదికను ఈ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం అందించింది. ప్రేమ, కరుణ, స్నేహశీలత వంటి సార్వత్రిక మానవ విలువల పునరుద్ధరణకు ఈ ఉద్యమం స్ఫూర్తినిస్తుంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ మాట్లాడుతూ, “సంస్కృతి అనేది వారధులను నిర్మిస్తుంది, అడ్డుగోడలను కూల్చివేస్తుంది, చర్చలు, పరస్పర అవగాహనల ద్వారా ప్రపంచాన్ని కలుపుతుంది. ప్రజల మధ్య, దేశాల మధ్య ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. సంస్కృతి ప్రపంచ పౌరులందరి మధ్య శక్తివంతమైన పరస్పర చర్చలను, అవగాహనల మార్పిడిని సృష్టించగలదు. ఈనాడు, ప్రపంచంలోని సాంస్కృతిక సంపద అంతా యునైటెడ్ స్టేట్స్ లోని ఈ నేషనల్ మాల్ కు తరలి వచ్చింది. ఏకత్వం, భిన్నత్వం విషయంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ కు గల స్ఫూర్తిదాయకమైన దృక్పథానికి నా అభినందనలు. ఇటువంటి మరిన్ని వేడుకలు, మరింతమంది కలిసి రావడం, మరింత శాంతి, మరింత సహకారం, సంఘీభావం, భాగస్వామ్యం మనకు అవసరం. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను పట్టుదలతో ఎదుర్కొనడం వీటిద్వారా మనకు సాధ్యం అవుతుంది. ఈ విధంగా మనం శాంతిని స్థాపించగలుగుతాం, సంఘర్షణలను పరిష్కరిస్తాము, ఆకలిబాధను అంతం చేసి, ఆరోగ్యకరమైన జీవితాలను సమకూర్చి, నాణ్యమైన విద్యను అందించగలుగుతాము. మహిళలు, బాలికలకు సాధికారత కల్పిస్తాము. ఈ విధంగా మనం ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా అంతా కలసి ముందుకు వెళ్తాము’’ అని పేర్కొన్నారు. -
మన జాతీయగీతం మిల్బన్ నోట
వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన మన ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగింపు కార్యక్రమంలో ఆఫ్రికన్–అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బన్ ఆలపించిన మన జాతీయగీతం ‘జనగణమన’ వీడియో వైరల్‌గా మారింది. ‘అద్భుతం’ అంటున్నారు నెటిజనులు. ‘భారతీయులు నన్ను తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగా ప్రేమిస్తారు’ అంటున్న మిల్బన్ మన ప్రధానికి పాదాభివందనం చేసింది. మన జాతీయగీతం మాత్రమే కాదు ‘ఓమ్ జై జగదీష్ హరే’ భక్తిగీతాన్ని కూడా అద్భుతంగా ఆలపిస్తుంది మిల్బన్. -
భారత్ అభివృద్ధే ప్రపంచాభివృద్ధి
వాషింగ్టన్: మానవాళికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయడంలో ‘అయితే, కానీ’లకు ఎంతమాత్రం తావులేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే ఉగ్రవాదాన్ని నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ప్రధాని మోదీ గురువారం వాషింగ్టన్ డీసీలో అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 60 నిమిషాలపాటు మోదీ ప్రసంగం కొనసాగింది. పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లతోపాటు సందర్శకుల గ్యాలరీల నుంచి వందలాది మంది భారతీయ–అమెరికన్లు మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. అమెరికాలో 9/11 దాడులు జరిగి రెండు దశాబ్దాలు, భారత్‌లో 26/11 దాడులు జరిగి దశాబ్దం పూర్తయినా ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచానికి ఇప్పటికీ సవాలు విసురుతూనే ఉన్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మతి తప్పిన సిద్ధాంతాలు కొత్తరూపును, కొత్త గుర్తింపును సంతరించుకుంటున్నాయని, అయినప్పటికీ వాటి ఉద్దేశాలు మాత్రం మారడం లేదని ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి ముమ్మాటికీ శత్రువేనని స్పష్టం చేశారు. ముష్కర మూకలను అణచివేయడంలో ఎవరూ రాజీ పడొద్దని సూచించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ పొరుగు దేశాలను ఎగుమతి చేస్తున్న దుష్ట దేశాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ఏం మాట్లాడారంటే.. భారీగానే కాదు.. వేగంగానూ అభివృద్ధి ‘‘గత దశాబ్ద కాలంలో వంద మందికిపైగా అమెరికా పార్లమెంట్ సభ్యులు భారత్‌లో పర్యటించారు. భారతదేశ అభివృద్ధిని తెలుసుకోవాలని, అక్కడి ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. భారత్ ఇప్పుడేం చేస్తోంది? ఎలా చేస్తోంది? అన్నదానిపై అందరికీ ఆసక్తి ఉంది. ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో నేను మొదటిసారి పర్యటించినప్పుడు భారత్ ప్రపచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. మేము భారీగానే కాదు, వేగంగానూ అభివృద్ధి సాధిస్తున్నాం. భారత్ ప్రగతి సాధిస్తే మొత్తం ప్రపంచం ప్రగతి సాధిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం .. భూగోళంపై ఆరింట ఒక వంతు జనాభా భారత్‌లోనే ఉంది. ఇండో–పసిఫిక్‌లో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం.. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఇతర దేశాల సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి చార్టర్ సూచిస్తోంది. ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) అన్ని దేశాలూ అనుసరించాలి. చార్టర్‌ను గౌరవించాలి. కానీ, ఇండో–పసిఫిక్‌పై బలప్రయోగం, ముఖాముఖి ఘర్షణ అనే నీలినీడలు ప్రసరిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. భారత్–అమెరికా భాగస్వామ్యానికి ఇది కూడా ఒక ప్రాధాన్యతాంశమే. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ఆవశ్యకతపై అమెరికాతో మా అభిప్రాయాలు పంచుకున్నాం. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం పరిఢవిల్లాలన్నదే మా ఆకాంక్ష. ఇందుకోసం ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలతో, భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. ‘క్వాడ్’ వంటి కూటములు ఈ ప్రయత్నంలో ఒక భాగమే. ఇండో–పసిఫిక్ బాగు కోసం క్వాడ్ కృషి చేస్తోంది. ఉక్రెయిన్ సంఘర్షణ ఆసియా ప్రాంతంలో సమస్యలు సృష్టించిన మాట వాస్తవమే. ఇది యుద్ధాల శకం కాదని, చర్చలు, దౌత్యమార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలని సూటిగా చెప్పా. ఇదొక గొప్ప గౌరవం 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ అమెరికా పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. రెండుసార్లు ఈ అవకాశం దక్కడం గర్వకారణం. మనం ఒక ముఖ్యమైన కూడలిలో ఉన్నాం. గత కొన్నేళ్లుగా కృత్రిమ మేధ(ఏఐ)లో ఎన్నో ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అదేసమయంలో మరో ఏఐ(అమెరికా, ఇండియా)లో మరిన్ని ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ శతాబ్దం ఆరంభంలో రక్షణ సహకారం విషయంలో మనం(భారత్, అమెరికా) అపరిచితులమే. పెద్దగా రక్షణ సహకారం లేదు. కానీ, ఇప్పుడు భారత్‌కు అమెరికా అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామిగా మారింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణం ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత్ తల్లిలాంటిది. భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా వర్ధిల్లుతున్నాయి. సమానత్వం, ప్రజల గౌరవానికి స్ఫూర్తినిచ్చేదే ప్రజాస్వామ్యం. ఆలోచనకు, వ్యక్తీకరణకు రెక్కలు తొడిగేది ప్రజాస్వామ్యం. ప్రాచీన కాలం నుంచి ప్రజాస్వామ్య విలువలకు భారత్ ఆయువుపట్టుగా నిలుస్తోంది. వెయ్యి సంవత్సరాల పరాయి పాలన తర్వాత భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర ప్రయాణాన్ని పండుగలా జరుపుకుంది. ఇది కేవలం ప్రజాస్వామ్య ఉత్సవం కాదు, వైవిధ్య వేడుక. సామాజిక సాధికారత, ఐక్యత, సమగ్రత వేడుక. డిజిటల్ చెల్లింపుల అడ్డా భారత్ యువ జనాభా అధికంగా ఉన్న ప్రాచీన దేశం భారత్. సంప్రదాయాలకు పెట్టింది పేరు భారత్. నేటి యువత భారత్‌ను టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నారు. భారత్‌లో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దేశంలో ప్రత్యక్ష నగదు బదిలీల విలువ 320 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ ప్రక్రియలో 25 బిలియన్ డాలర్లు ఆదా చేశాం. భారత్‌లో ఇప్పుడు అందరూ స్మార్ట్ఫోన్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వీధి వ్యాపారుల సైతం యూపీఐ సేవలను వాడుకుంటున్నారు. గత ఏడాది ప్రపంచంలో జరిగిన ప్రతి 100 రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 46 చెల్లింపులు భారత్‌లోనే జరిగాయి. వేలాది మైళ్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, చౌక డేటాతో భారత్‌లో సాంకేతిక విప్లవం కొనసాగుతోంది. మహిళల సారథ్యంలో అభివృద్ధి ప్రాచీన కాలం నాటి వేదాలు నేటి మానవాళికి గొప్ప నిధి లాంటివి. మహిళా రుషులు సైతం వేదాల్లో ఎన్నో శ్లోకాలు, పద్యాలు రాశారు. ఆధునిక భారతదేశంలో మహిళలు ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా ప్రజలను ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో మహిళల సారథ్యంలో అభివృద్ధి జరగాలన్నదే మా ఆకాంక్ష. గిరిజన తెగకు చెందిన ఓ మహిళ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో 10.5 లక్షల మంది మహిళలు వివిధ పదవులు చేపట్టారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళంలోనూ విశేషమైన సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశం భారత్. అంగారక గ్రహంపైకి మనుషులను చేర్చేందుకు చేపట్టిన మార్చ్ మిషన్‌లో మహిళామణులు పనిచేస్తున్నారు. మహిళలకు సాధికారత కలి్పసే సమూల మార్పులు రావడం ఖాయం. ఆడపిల్లల చదువులు, వారి ఎదుగుదల కోసం పెట్టుబడి పెడితే వారు మొత్తం కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. సంస్కరణల సమయమిది.. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం వచి్చంది. ప్రపంచం మారుతోంది. అంతర్జాతీయ సంస్థలూ మారాల్సిందే. భారత్–అమెరికా మరింత సన్నిహితమవుతున్నాయి. పరస్పర సంబంధాల విషయంలో నూతన ఉషోదయం కనిపిస్తోంది. భారత్–అమెరికా సంబంధాలు కేవలం ఈ రెండు దేశాలనే కాదు, ప్రపంచ భవితవ్యాన్ని కూడా నిర్ధారిస్తాయి. మహాత్మా గాం«దీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌తోపాటు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడినవారిని మేమే స్మరించుకుంటున్నాం. భారత్‌లో 2,500కు పైగా రాజకీయ పారీ్టలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలను 20 వేర్వేరు పార్టీలు పరిపాలిస్తున్నాయి. దేశంలో 22 అధికార భాషలున్నాయి. వేలాది యాసలున్నాయి. కానీ, మేమంతా ఒకే స్వరంతో మాట్లాడుతాం. ప్రపంచంలోని అన్ని నమ్మకాలు, విశ్వాసాలకు భారత్‌లో స్థానం ఉంది, వాటిని గౌరవిస్తున్నాం. వైవిధ్యం అనేది భారత్‌లో ఒక సహజ జీవన విధానం. అమెరికా పార్లమెంట్లో భారతీయ–అమెరికన్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సభలో సమోసా కాకస్ ఫ్లేవర్ ఉంది. ఇది మరింత విస్తరించాలి. భారత్‌లోని భిన్న రుచులు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నా’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నాను. -
అమెరికాలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ విజయవంత మైంది. అమెరికాలో వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు బాణాసంచాతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి స్వాగతం పలికారు. మే 07న హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో నిర్వహించిన ఈ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు 275 మందికి పైగా పాల్గొన్నారు. తొలుత దివంగత నేత, తెలుగు ప్రజల స్ఫూర్తి ప్రదాత, మహానేత రాజశేఖర రెడ్డికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి వల్లూరు, వెంకట్ రెడ్డి కల్లూరి, పార్థ బైరెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన, పుష్ప గుచ్చాలతో అంజలి ఘటించారు. వివిధ జాతీయ తెలుగు సంఘాల ప్రతినిధులు - రిపబ్లిక్ పార్టీ లీడర్ వర్జీనియా ఆసియన్ అడ్విసోరీ బోర్డు మెంబెర్ శ్రీమతి శ్రీలేఖ పల్లె, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెట) నుంచి శ్రీమతి శైలజ, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట) నుంచి శ్రీ సతీష్ రెడ్డి నరాల, కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (కాట్స్) నుంచి శ్రీ అనిల్ రెడ్డి నందికొండ, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) నుంచి సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైస్సార్సీపీ మిడ్ అట్లాంటిక్ ఇంచార్జి పార్థ బైరెడ్డి ముఖ్య అతిధులను వేదికకు ఆహ్వానించారు. రమేష్ రెడ్డి వల్లూరు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అడ్వైసర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ (ఈవెంట్ ఆర్గనైజర్) వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను దిగ్విజయంగా నడిపారు. మేరీల్యాండ్ స్టేట్ 10th డిస్ట్రిక్ట్ సెనెటర్ బెంజమిన్ బ్రూక్స్ మరియు అతని ప్రతినిధి కెన్నీ బ్రౌన్ తమ రాష్ట్రానికి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాకను సాదరముగా ఆహ్వానించారు. వర్జీనియా డెమొక్రాట్ లీడర్ శ్రీ శ్రీధర్ నాగిరెడ్డి.. మంత్రిని వాషింగ్టన్ డల్లాస్ ఎయిర్ పోర్ట్ లో సాదరముగా అమెరికా రాకను ఆహ్వానించారు. స్థానిక YSRCP సభ్యులు ప్రసంగిస్తూ.. శ్రీ రాజశేఖర రెడ్డి ఆశయాలను, ప్రవేశపెట్టిన పధకాలను కొనియాడుతూ, ప్రస్తుత ముఖ్య మంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పని తీరు తెన్నులను మనస్ఫూర్తిగా పొగిడారు. శివ రెడ్డి మాట్లాడుతూ ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో గ్రామ, వార్డు సచివాలయం. ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ, ఎవరికీ ఏ సమస్య వచ్చినా చెయ్యి పట్టుకొని నడిపించే పరిస్థితి. ఏకంగా లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం, లంచాలకు లేకుండా, వివక్షకు తావులేకుండా ఇవ్వగలిగే గొప్ప వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకు రావడం చాల గొప్ప విషయమన్నారు. రమేష్ రెడ్డి ప్రసంగిస్తూ తరాలు మారినా రాజశేఖరుడిలాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కానరారని ,కులమత ప్రాంతాలకు అతీతంగా అజన్మాంతం సామాన్యుడి మదిలో నిలిచిపోయారని ,అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడుగా ఆశయ సాధనలో ధీరుడిగా "రాజన్న సువర్ణ రాజ్యం" కొరకు గత నాలుగు సంవత్సరాలుగా అహర్నిశలు పాటుపడుతూ ప్రతి పక్షం గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న వై యస్ జగన్ రాష్టానికి మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చే 2024 ఎన్నికల్లో గెలుపొందేవిధంగా నవతరం పాటుపడాలన్నారు. దివంగత నేత రాజశేఖరుడి తనయుడు పెద్దాయన ఏర్పరచిన దారిలో నడుస్తున్న నేటి తరం జన నేత జగన్ కి మన సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మాట నిలబెట్టుకుంటూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నాలుగేళ్ల పరిపాలనలో 98 శాతానికి పైగా నెరవేర్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ ప్రజా మద్దతు నిలువెత్తు నిదర్శనమన్నారు. గత 48 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా చేస్తున్న మేలును ఇంటింటా వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం మంచి పరిమాణం అన్నారు. జార్జ్ ఉపన్యసిస్తూ మారిన కాలానికి అనుగుణంగా మన దేశ ఆర్థిక పరిస్థితులు మారాలని,యువతరం ముందుకు రావాలని,ఇపుడున్న ప్రభుత్వం ఎలా సామాన్య ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నారో అందరూ చూస్తున్నారని సెలవిచ్చారు. అలాగే నిన్నటి రాజన్న పరిపాలనలో కాంచిన పేదవారి చిరునవ్వులు నేడు మల్లీ జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి రధ సారధిగా వచ్చి వీరభూస్తున్నారని పునరుధ్ఘాటించారు. నేటి ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఎం జగన్ మధ్య సఖ్యత నాటి ఆర్ధిక మంత్రి కొణజేటి రోశయ్య, ,డాక్టర్ వైఎస్ సఖ్యతను తలపిస్తున్నారని పొగిడారు. అనంతరం సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల మాట్లాడుతూ NRI YSRCP అంతా ఒక్కటై ఒకేమాటగా ఒకే బాటగా YSRCP పార్టీని 2024 లో తిరిగి అధికారంలోకి తీసుకురావాలని అందుకు అందరి సహాయ సహకారాలు చాలా అవసరమని పేర్కొన్నారు. గోరంట్ల వాసు బాబు విద్య యెక్క ఆవశ్యకతను తెలియచేస్తూ తాను ఎలా పేద విద్యార్థులకు భోధనాభ్యసన పరికరములు, భోధన సామాగ్రి సాయం చేస్తున్నారో తెలిపారు. ఈ సభలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఏపీ రాష్ట్రం పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో నిలిచిన నేత వైఎస్సార్ అని, దివంగత మహానేత అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ మనందరి గుండెల్లో నిలిచి ఉన్నారని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో ఏపీ దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, రెవిన్యూ జనరేషన్, యువతకు ఉపాధి, స్కిల్ విషయాలు ఏవీ పచ్చమీడియా పట్టించు కోదు. 192 స్కిల్ హబ్‌ల ద్వారా పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నాం. 95 వేల మందికి శిక్షణ ఇస్తే వారిలో 85 శాతం మందికి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి. మంత్రి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి విద్య ఒక్కటే ...రాష్ట్రంలో పేదల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం అని నమ్మి రాష్ట్రంలో ప్రతి విధ్యార్ధి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్ గారు విద్య ,ఉద్యోగం పై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అమెరికాలో ఉండే ప్రవాసాంధ్రులందరినీ సంఘటితపరచి వచ్చే ఎన్నికలలలో మన పార్టీని బలోపేతం చేయాలనీ, పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను సోషల్ మీడియా ద్వారా తెలియచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మేం ఏది చెప్పినా ప్రజలు నమ్ముతున్నారనుకుంటున్నారు. అందుకే చెప్పిన అబద్ధాన్నే పది సార్లు చెబుదాం అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా బతుకుతోందని దుయ్యబట్టారు. కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రగతి, రాష్ట్రానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయని, వారి రాతలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలనే ప్రయత్నంలా కనిపిస్తోందని అన్నారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తిరిగి 2024 లో రాజన్న రాజ్యం తథ్యం అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు జన నేత శ్రీ వైయస్ జగన్ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్ 175’ అంటున్నామని అన్నారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోన సాగిస్తూ ముఖ్యమంత్రి శ్రీ జగన్ నవరత్నాలు రూపంలో చేస్తున్న సుపరిపాలన భేషుగా ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు అన్నారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్ వైయస్ఆర్ అడుగుజాడల్లోనే నడుస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేయడాన్ని భారత దేశం మొత్తం ఒక కొలమానం గ చూడడాన్ని చాల గొప్పగా ఉందని ప్రసంశించారు. రానున్న 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని, మళ్ళి శ్రీ జగన్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న ధీమాను వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్, వర్జీనియా, న్యూ జెర్సీ, డెలావేర్, నార్త్ కరోలినా రాష్ట్రముల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి సభ్యులు, ఇతర ప్రాంతాల నుండి అనేకులు పాల్గొన్నారు. రామ్ (RAAM) నాయకులు న్యూజెర్సీ నుంచి రామ్మోహన్ రెడ్డి ఎల్లంపల్లి , వర్జీనియా నుంచి శ్రీధర్ నాగిరెడ్డి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. కళ్యాణి , శ్రీధర్ వన్నెంరెడ్డి తమ హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో అందరికి పసందైన విందు భోజనంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆత్మీయ సమ్మెళనా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. చివరగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ రెడ్డి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. -
వేడి అలలు... జీవజాలానికి ఉరితాళ్లు! పరిస్థితి ఇలాగే కొనసాగితే..
నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) వల్ల భూఉపరితం క్రమంగా వేడెక్కుతోంది. భూమిపై విలువైన జీవావరణ వ్యవస్థ దెబ్బతింటోంది. పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంటోంది. ఈ పరిణామం కేవలం భూమి ఉపరితలంపైనే కాదు, సముద్రాల అంతర్భాగాల్లోనూ సంభవిస్తున్నట్లు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఓషియానిక్, అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాల అడుగు భాగం సైతం వేడెక్కుతోందని, అక్కడున్న జీవజాలం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని తేలింది. ఫలితంగా సముద్ర జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. భూతాపంతో సముద్రాల్లో వేడి అలల తీవ్రత పెరుగుతోంది. ఇవన్నీ ప్రమాద ఘంటికలే’’ అని హెచ్చరించారు. ఏమిటీ భూతాపం? శిలాజ ఇంధనాల వినియోగం, కర్బన ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు, తద్వారా భూ ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పెరగడమే భూతాపం. భూగోళంపై జనాభా వేగంగా పెరుగుతుండడంతో అదే స్థాయిలో శిలాజ ఇంధనాల వినియోగం సైతం పెరుగుతోంది. బొగ్గు, చమురు, గ్యాస్ వంటివి మండించడం వల్ల భూమి వేడెక్కుతుంది. దీంతోపాటు అడవుల నరికివేత, పారిశ్రామిక విప్లవం, అగ్నిపర్వతాల పేలుళ్లు, నీరు వేగంగా ఆవిరి కావడం, అడవుల్లో కార్చిచ్చు వంటివి కూడా భూతాపానికి కారణాలే. వాస్తవానికి సూర్య కాంతి వల్ల సంభవించే వేడి వాతావరణంలోకి తిరిగి వెనక్కి వెళ్తుంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఉత్నన్నమయ్యే విష వాయువులు వేడి వెనక్కి వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో భూమిపై ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఈ ప్రభావం సముద్రాలపైనా పడుతుంది. అధ్యయనంలో ఏం తేలిందంటే... ► మెరైన్ హీట్‌వేవ్స్‌గా పిలిచే సముద్రాల అంతర్భాగాల్లోని వేడి అలల తీవ్రత, వ్యవధి అధికంగా ఉంది. సముద్రాల లోపలి ఉష్ణోగ్రతలు వేర్వేరు ప్రాంతాల్లో 0.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ దాకా పెరిగాయి. ► సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలకు భూతాపం కారణమని సైంటిస్టులు నిర్ధారించారు. ► హీట్‌వేవ్స్ ప్రభావం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ► సముద్రాల ఉపరితలంలో హీట్వేవ్స్పై గత పదేళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నామని, అంతర్భాగంలోని వేడి అలలు, అక్కడి పరిణామాలు, జీవజాలం ప్రభావితం అవుతున్న తీరు గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి అని ఎన్ఓఏఏ రీసెర్చ్ సైంటిస్టు దిల్లాన్ అమామా చెప్పారు. ► సముద్రాల్లో ఉండే ప్లాంక్టన్ అనే సూక్ష్మజీవుల నుంచి భారీ పరిమాణంలోని వేల్స్ దాకా అన్ని రకాల జీవులు హీట్‌వేవ్స్ వల్ల ప్రభావితమవుతున్నాయి. ► ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సముద్ర జీవుల వలసలు ఆగిపోతున్నాయి. వాటిలో పునరుత్పాదక శక్తి దెబ్బతింటోంది. వివిధ జీవుల మధ్య అనుసంధానం తెగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థ ప్రమాదంలో పడుతున్నట్లే లెక్క. ► భూతాపం వల్ల నీరు ఇలాగే వేడెక్కడం కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సముద్రాల్లోని పగడపు దీవులన్నీ అంతరించిపోతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం వెల్లడించింది. ► సముద్రాల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగితే 70–90 శాతం, 2 డిగ్రీలు పెరిగితే పూర్తిగా పగడపు దీవులు మాయమవుతాయని యునెస్కో పేర్కొంది. సముద్రాలే రక్షణ ఛత్రం భూతాపం వల్ల ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత లో 90% మిగులు వేడిని సముద్రాలే శోషించుకుంటాయి. భూమిని చల్లబరుస్తాయి. సముద్రాలే లేకుంటే భూమి అగ్నిగుండం అయ్యేది. సాగరాల ఉష్ణోగ్రత గత శతాబ్ద కాలంలో సగటున 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. మెరైన్ హీట్‌వేవ్స్ గత పదేళ్లలో 50% పెరిగాయి. భూతాపం పెరుగుదలను అడ్డుకోకపోతే సముద్రాలు సలసల కాగిపోవడం ఖాయం. ఫలితంగా భూమి అగ్నిగోళంగా మారుతుంది మానవులతో సహా జీవుల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘనంగా ఆటా వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆటా వేడుకలు ముగిశాయి. సమావేశాలకు తెలుగు వాళ్లు పోటెత్తారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఏకంగా 15,000 మందికిపైగా హాజరవడం విశేషం. వేడుకల సందర్భంగా కపిల్, సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్, సద్గురు గోల్ఫ్ టోర్నమెంట్లో కూడా పాల్గొన్నారు. బతుకమ్మపై ఆటా ముద్రించిన పుస్తకాన్ని టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. శివమణి, థమన్ మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రూతలూగించింది. తెలంగాణ నుంచి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, గ్యాదరి కిశోర్, ఏపీ నుంచి ప్రజాప్రతినిధులు ఎంవీవీ సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌధరి తదితరులు పాల్గొన్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అందరినీ మైమరిపించింది. మనో, కార్తీక్ లాంటి ప్రముఖ గాయని గాయకులు అంధింస్తు సంగీతాల ఝురిలో వోలాలడిస్తు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కో ఆర్డినేటర్ కిరణ్ పాశం, ఆటా ఫౌండింగ్ మెంబర్ హనుమంత్ రెడ్డి, తదితరులు మాట్లాడారు. హీరో అడివి శేష్, సినీ నటుడు తనికెళ్ల భరణి తదితరులు సందడి చేశారు. -
ఆటా సభల్లో మహానేత డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
వాషింగ్టన్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జూలై 1 నుండి 3 తేదీ వరకు వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న 17వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్‌లో భాగంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో హాజరైన అభిమానులు, నేతలు వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఆ మహానేత సేవలను, స్ఫూర్తిని ఏపీ ఆధికారిక భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రావు గుర్తు చేశారు. ఇంగ్లీష్ మీడియం మీద కొన్ని విపక్షాలు కుట్ర చేస్తున్నాయని యార్లగడ్డ మండిపడ్డారు. ప్రతి పేద వాడి పిల్లలకు ఇంగ్లీష్ చదువులు కావాలని ఎందరో పాదయాత్రలో తమ కోరికను వెల్లడించారని చెప్పారు. అలాగే 98శాతం ఇంగ్లీష్ మీడియం కావాలాని సర్వేలో చెప్పారని తెలిపారు. కేవలం సీఎం జగన్‌కు క్రెడిట్ వస్తుందన్న దుగ్ధతోనే ఇంగ్లీషు మీడియంను తప్పు బట్టారని విమర్శించారు. మీ పిల్లలకు ఇంగ్లీషులు చదువులు కావాలి గానీ, మరి పేదల పిల్లలు ఇంగ్లీషులు చదువుకోవద్దా ? అని విమర్శిస్తున్నవారినుద్దేశించి ప్రశ్నించారు. వైఎస్సార్ చిరకాలం అందరి గుండెల్లో నిలిచిపోయారని వైజాగ్ ఎంపీ సత్య నారాయణ మహానేతకు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. అమెరికాలో ఏ ముఖ్యమైన తెలుగు కార్యక్రమం జరిగినా వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటారన్నారు. జులై 8 కంటే ముందే అమెరికాలో జయంతి వేడుకలు జరపడం ఎంతో సంతోషకరమని ఆటా సెక్రెటరీ హరి లింగాల వెల్లడించారు. డా. వైఎస్సార్ తన పాలనతో చెరగని ముద్ర వేశారనీ, తన ప్రసంగాలతో అసెంబ్లీకి వన్నె తెచ్చారంటూ నాటా అధ్యక్షుడు రాఘవ రెడ్డి గోసాల వైఎస్సార్ సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ను మరిపించేలా జగన్ పాలన దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు మేడపాటి వెంకట్ ప్రశంసించారు. అంతేకాదు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి 175కు 175 సీట్లు గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ మాట్లాడుతూ సామాన్యులకు చేరువైన వ్యక్తి వైఎస్సార్ అనీ, ఆయన మనకు దూరమై 12 ఏళ్లు గడిచినా అందరి మనసుల్లో సజీవంగా నిలిచే ఉన్నారని పేర్కొన్నారు. డా. వైఎస్సార్ చేసిన సంక్షేమంతో ఎంతోమంది ఉన్నత విద్యనభ్యసించి అమెరికా వరకు చేరుకున్నారని అన్నారు. మహానేత వైఎస్సార్ పాలనను ఆయన తనయుడు జగన్ కొనసాగిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ సేవా కార్యక్రమాలు జరిగినా వైఎస్సార్ ఫౌండేషన్ స్పందించి తనవంతు సాయాన్ని అందిస్తుందనీ వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి వెల్లడించారు. వైఎస్సార్ ఫౌండేషన్‌కు సంబంధించి అమెరికాలో ఎంతోమంది తమవంతుగా ముందుకు వచ్చారన్నారు. మానవత్వం, దార్శనికత కలగలిసిన వ్యక్తి మహా మనిషి వైఎస్సార్, మన మధ్య లేరు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామంటూ అమెరికా వైస్సార్సీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి ఆ మహానేతను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిమిక్రి రమేష్ తన అద్భుతమైన గళంతో వైఎస్సార్‌ను అనుకరించి సభికులను అలరించారు. - వాష్టింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆటా సభల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు (ఫోటోలు)
-
అమెరికా వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం.. పరుగులు తీసిన ప్రజలు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అమెరికాలోని వాషింగ్టన్లో సోమవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందగా.. నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. వైట్ హౌస్‌కు రెండు మైళ్లదూరంలో వాష్టింగన్ డీసీలోని 14వ, యూస్ట్రీట్ నార్త్‌వెస్ట్‌లో జరుగుతున్న ఓ సంగీత కచేరి కార్యక్రమంలో కాల్పులు జరిగాయి. కాల్పుల భయంతో ఒక్కసారిగా రోడ్లపై జనం పరుగులు తీశారు. కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం వైపుగా ఎవరూ వెళ్లొద్దని సూచించారు. అయితే, కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఫైరింగ్‌లో ఒకరు మృతిచెందగా.. పోలీస్ అధికారి సహా పలువురికి తూటాలు తగిలినట్లు మెట్రోపోలిటన్ పోలీస్ విభాగం తెలిపింది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. అంతకుముందు.. మే 24న టెక్సాస్‌లోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 19 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. Multiple people, including a police officer, were shot at a music event on U Street Northwest in #Washington, DC, just less than 2 miles from the White House. pic.twitter.com/Vw0penv4jj — Gal Jammu Di (@GalJammuDi) June 20, 2022 ఇది కూడా చదవండి: చైనాలో జీరో కోవిడ్ వ్యూహం తెచ్చిన తంటా.. -
ప్రియుడితో గొడవ.. ఎనిమిదో అంతస్థు నుంచి దూకేసింది
ప్రాణ భయంతో ఎనిమిదవ అంతస్తు నుంచి దూకింది ఓ మహిళ. తుపాకీతో ప్రియుడే చంపే ప్రయత్నం చేయగా.. తప్పించుకునే క్రమంలో ఆమె అలా దూకేసింది. అయితే తీవ్ర గాయాలతో బయటపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా వాషింగ్టన్ డీసీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నార్త్‌వెస్ట్ వాషింగ్టన్‌లోని ఓ అపార్ట్మెంట్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ జంటకు ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఆ రాత్రి ఇద్దరూ గొడవపడి.. పరిస్థితి హత్య చేసే దాకా వెళ్లిందట. కాళ్లు, చేతులు కట్టేసి మరీ ఆమెను తుపాకీతో కాల్చే యత్నం చేశాడు దుండగుడు. అయితే.. చేతులు విడిపించుకున్న ఆమె కిటికీ గుండా ఎనిమిదవ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. మెట్రోపాలిటిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ వివరాల ప్రకారం.. నిందితుడిని కైలీ జమల్ పామర్గా గుర్తించి.. అరెస్ట్ చేశారు. దాడి, హత్యాయత్నం కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఘోస్ట్ గన్ చట్టం తెచ్చినా.. అమెరికాలో అక్రమంగా తుపాకులు కలిగి ఉండడం, ఇంట్లో తయారు చేయడం కఠిన నేరం. ఇలాంటి తుపాకుల్ని ఘోస్ట్ గన్లు అంటారు. అంటే లైసెన్స్ లేనివన్నమాట. దేశంలో కాల్పుల ఘటనలు పేట్రేగి పోతుండడంతో బైడెన్ ప్రభుత్వం ఇలాంటి వాటిని నిషేధిస్తూ ఈమధ్యే ఓ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. చట్టం తెచ్చిన వారం తిరగక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 2021లో వివిధ నేరాల దర్యాప్తుల్లో భాగంగా.. సుమారు ఇరవై వేల ఘోస్ట్ గన్స్‌ను వివిధ దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. 2016లో దొరికిన అక్రమ ఆయుధాలతో పోలిస్తే.. ఇది పది రెట్లు ఎక్కువని వైట్‌హౌజ్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: మనిషే.. కుక్కను కరిచాడు! -
ఒకప్పుడు మంత్రి.. ఇప్పుడేమో రోడ్ల మీద..!
అధికారంలో ఉన్నా.. అది పోయాక కూడా అంతే విలాసాలతో, హంగులతో బతికే నాయకులను చూస్తున్నాం. కానీ, అధికారం దూరం అయ్యాక.. సాదాసీదా జీవితం గడిపేవాళ్లు లేకపోలేరు. అయితే పరిస్థితుల మూలంగా అధికారానికి దూరమైన ఓ మంత్రి.. కుటుంబం కోసం రోడ్లపై క్యాబ్‌లు నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనే.. ఆప్ఘానిస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి ఖలీద్ పయేంద Khalid Payenda. తాలిబన్లు కిందటి ఏడాది అప్ఘనిస్థాన్ ఆక్రమణ కొనసాగిస్తున్న టైంలో.. ఖలీద్ పయేంద అమెరికాకు వెళ్లి తలదాచుకున్నారు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్లో ఉబెర్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు.. జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గానూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అయితే ఆ వచ్చే జీతం చాలకనే.. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇలా రాత్రిళ్లు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారట ఆయన. తాజాగా.. ఆయన దుస్థితిపై వాషింగ్టన్ పోస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చింది. అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు ఖలీద్ పయేంద. లెబనీస్ కంపెనీకి చెల్లింపుల విషయంలో ఆరోపణలు రావడంతో తనను అరెస్ట్ చేయిస్తారేమోనని ఆయన భయపడ్డాడట. అందుకే తాలిబన్లు ఆక్రమణ మొదలుపెట్టాక.. అమెరికాకు ఆయన పారిపోయారు. ‘‘నాకంటూ ఓ చోటు లేదు. నేను ఇక్కడి వాడిని కాదు. అక్కడి వాడిని కూడా కాదు. జీవితం శూన్యంగా కనిపిస్తోంది. అలాగని ఎవరిని నిందించాలని అనుకోవడం లేదు’’ అని అంటున్నారాయన. అఫ్గన్లను అమెరికా అనాధలుగా వదిలేసిందని, అలాగని ఇప్పుడు మళ్లీ సమిష్టిగా నిర్మించుకుందామనే సంకల్పం కూడా లేదన్నారు. ‘‘మేమంతా అవినీతిపై పేక ముక్కలతో ఇంటిని నిర్మించుకున్నాం. అందుకే అంత వేగంగా కుప్పకూలింది. బక్క పలుచగా ఉన్నా జనాల్ని.. ప్రభుత్వం దోచుకోవాలనే చూసింది. మా ప్రజలకు మేమే ద్రోహం చేశాం. చేసిన పాపం ఇవాళ మాకు ఈ బతుకుల్ని ఇచ్చింది’’ అని పయేంద్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. విశేషం ఏంటంటే.. ఖలీద్ పయేంద కుటుంబం ఆర్థికంగా బాగున్న కుటుంబమే ఒకప్పుడు. అఫ్గనిస్థాన్‌లో మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ నెలకొల్పిన భాగస్వాముల్లో ఈయన కూడా ఉన్నారు. ఆయనకు ఈ పరిస్థితీ కొత్తేం కాదు. ఎందుకంటే.. అఫ్గనిస్థాన్‌లో అంతర్యుద్ధంతో తన 11 ఏళ్ల వయసు లో కుటుంబంతోపాటు పాక్‌కు వలస వెళ్లాడు ఆయన. తిరిగి అమెరికా దళాల ఎంట్రీతో.. సొంత గడ్డపై అడుగుపెట్టి, సంపాదించిన దాంతో యూనివర్సిటీలో పెట్టుబడి పెట్టారు. -
కారు దొంగతనాన్ని అడ్డుకోబోయాడు, పాపం.. ప్రాణం పోగొట్టుకున్నాడు!
కారు దొంగతనం అడ్డగించేందుకు చేసే ప్రయత్నంలో ఓ డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో మార్చి 8న రాత్రి 8 గంటల సమయంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన రాకేశ్ పటేల్ (33) అనే వైద్యుడు దుర్మరణం పాలయ్యాడు. వాష్టింగ్టన్ డీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు రాకేశ్ పటేల్. దుర్ఘటన జరిగిన రోజు నగరంలో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు వెళ్లాడు. అక్కడ ఆమెకు కొన్ని వస్తువులు అందించి వెనక్కి తిరగ్గా.. తన కారులో మరెవరవో ఉన్నట్టు రాకేశ్ గుర్తించాడు. వెంటనే కారు వైపుకు నడిచాడు. రాకేశ్ రావడం గమనించిన కారులోని అగాంతకుడు... కారుతో వేగంగా రాకేశ్‌ని ఢీ కొట్టాడు. ఆ తర్వాత అతని శరీరంపై నుంచి కారుని పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రాకేశ్‌ని వెంటనే ఆస్పత్రికి తరలించినా అతని ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనలో దుండగుడు రాకేశ్‌కి చెందిన మెర్సిడెజ్ బెంజ్ కారుని దొంగలించడంతో పాటు అతని ప్రాణాలు బలిగొన్నాడు. ఈ దుర్ఘటనకు కారణమైన నిందితుడిని పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని వాష్టింగ్టన్ పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఓహియోలో ఉన్న రాకేశ్ తల్లిదండ్రులు వాషింగ్టన్‌కి పయణమయ్యారు. కళ్లెదుటే జరిగిన దారుణం చూసిన రాకేశ్ పటేల్ గర్ల్‌ఫ్రెండ్ ఇంకా షాక్‌లోనే ఉంది. -
వాషింగ్టన్ డీసీ వేదికగా ఆటా వేడుకలు
వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ని 2022 జులై 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆటా కార్యవర్గం ప్రకటించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న హెర్న్‌డాన్ వరల్డ్ గేట్ సెంటర్ ఏరియాలో క్రౌన్ ప్లాజా హోటల్లో జరిగిన ఆటా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు ఎనిమిది వందల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. మొదటిసారి ఇప్పటి వరకు 16 సార్లు ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్‌లు జరిగాయి. అయితే ఇవన్నీ అమెరికాలోని వేర్వేరు నగరాల్లో జరిగాయి. అయితే 17వ కాన్ఫరెన్స్‌కి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మొదటిసారి వేదికగా నిలవనుంది. ఈ వేడుకలు నిర్వహించేందుకు వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్‌ని ఎంపిక చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కి క్యాపిటల్ ఏరియా తెలుగు సంఘం, కాట్స్ కో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఏర్పాట్ల పరిశీలన ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కాట్స్ ఆధ్వర్యంలో 70 మందికి పైగా ఆటా కార్యవర్గ, అడ్హాక్, అడ్విసోరీ, లోకల్ కన్వెన్షన్ కమిటీలు కాన్ఫరెన్స్ ఏర్పాట్లను పరిశీలించారు. వాల్టేర్ ఈ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న సౌకర్యాలను పర్యవేక్షించారు. 12 వేల మంది ఆటా కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమం లో 12,000 మందికి పైగా తెలుగు వారు పాల్గొనే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. -
అమెరికాలో గూగుల్‌పై కేసు
వాషింగ్టన్: ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ ‘గూగుల్ ప్లే స్టోర్’లో ఆరోగ్యకరమైన పోటీని తన విధానాల ద్వారా తోసిపుచ్చుతోందని, దేశ కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ వాషింగ్టన్ డీసీతో పాటు 36 రాష్ట్రాలు దిగ్గజ టెక్నాలజీ కంపెనీ ‘గూగుల్’పై కోర్టులో కేసు వేశాయి. వ్యాపారంలో పోటీని వ్యతిరేకించే ఒప్పందాలు, విధానాలను అవలంబిస్తూ యాండ్రాయిడ్ వినియోగదారులకు సరైన, చవౖMðన ఉత్పత్తులు లభించకుండా చూస్తోం దని ఆరోపించాయి. న్యూయార్క్, నార్త్ కరోలినా, టెన్నెసీ తదితర రాష్ట్రాలు గూగుల్‌పై ఈ దావా వేశాయి. యాప్ డెవలపర్లు వారి డిజిటల్ కంటెంట్‌ను గూగుల్ ప్లే సోర్ట్‌లో కొనుగోలు చేసిన యాప్‌ల ద్వారా, గూగుల్ మధ్యవర్తిగా మాత్రమే అమ్మాలని నిర్దేశిస్తోందని, తద్వారా వారి నుంచి గూగుల్ కమిషన్ సహా పెద్ద ఎత్తున ఆదాయం సముపార్జిస్తోందని ఆయా రాష్ట్రాలు ఆరోపిం చాయి. ‘చాన్నాళ్లుగా ఇంటర్నెట్కు గేట్‌కీపర్‌గా గూగుల్ వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పుడు మన డిజిటల్ డివైజెస్‌కు గేట్ కీపర్‌గా మారింది. తద్వారా మనం రోజూ వాడే సాఫ్ట్‌వేర్‌ను ఎక్కువ ధరకు కొనుక్కోవాల్సి వస్తోంది. తన ఆధిక్యతను ఆసరాగా తీసుకుని పోటీని అక్రమంగా అణచివేస్తోంది. పోటీకి నిలిచిన థర్డ్ పార్టీ యాప్ డెవలపర్ల చిన్న,చిన్న వ్యాపారాలను తొక్కేస్తోంది’ అని న్యూయార్క్ అటార్నీ వ్యాఖ్యానించారు. -
భారత సంతతి సాధికారతకు శుభరూపం
యూఎస్‌లోని ఉన్నతస్థాయి బాధ్యతల్లోకి భారత సంతతి మహిళలు రావడం ఇటీవలి కాలంలో సాధారణం అయింది! స్త్రీ సాధికారతకు ఇది శుభరూప తరుణంలా కనిపిస్తోంది. తాజాగా రూప రంగ పుట్టగుంట ఫెడరల్ జడ్జిగా నామినేట్ అయ్యారు. శుభా తటవర్తి విప్రో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పదవి చేపట్టనున్నారు. రూప రంగ పుట్టగుంట ప్రస్తుతం వాషింగ్టన్ ‘డీసీ రెంటల్ హౌసింగ్ కమిషన్’ అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఆమెను వాషింగ్టన్ డీసీ జిల్లా ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేశారు. ఆమె ఎంపికను సెనెట్ ఆమోదిస్తే కనుక అమెరికాలో ఫెడరల్ జడ్జి అయిన తొలి భారత సంతతి మహిళగా రూప గుర్తింపు పొందుతారు. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కావడానికి ముందు 2013 నుంచి 2019 వరకు ఆమె క్రిమినల్ న్యాయవాదిగా ఉన్నారు. రూపతోపాటు మరో తొమ్మిది మందిని అత్యున్నస్థాయి న్యాయ సంబంధ స్థానాలకు నామినేట్ చేసిన వైట్ హౌస్.. ‘‘ఉన్నత అర్హతలు, సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నిష్ణాతులు అమెరికాలోని భిన్నజాతుల ప్రజలకు ప్రయోజనకరమైన సేవలను అందిస్తారని అమెరికా అధ్యక్షుడు బలంగా విశ్వసిస్తున్నారు..’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. రూపకు ఫ్యామిలీ కోర్టు న్యాయవాదిగా కూడా రెండేళ్ల పాటు అనేక కేసులను పరిష్కరించిన అనుభవం ఉంది. 2008 నుంచి 2011 వరకు ఆమె లా క్లర్క్‌గా పని చేశారు. 2007లో ఒహియో స్టేట్ మోర్టిజ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ‘లా’లో పట్టభద్రురాలయ్యారు. ఇక శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్న సీనియర్ టెకీ శుభా తటవర్తి మంగళవారం విప్రో కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సి.టి.ఓ.) గా నియమితులయ్యారు. వాల్‌మార్ట్ నుంచి విప్రోకి వచ్చిన శుభ వాల్‌మార్ట్ కంటే ముందు పేపాల్‌లో పదేళ్లు సేవలు అందించారు. వాల్‌మార్ట్‌లో సీనియర్ డైరెక్టర్‌గా, పేపాల్‌లో హెడ్ ఆఫ్ ప్రాడక్ట్‌గా ఆమె అనుభవం విప్రో సి.టి.వో. అయేందుకు తోడ్పడింది. రూప కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. -
బైడెన్ ప్రమాణస్వీకారం.. ఎమర్జెన్సీ విధించిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్లో రెండు వారాల పాటు ఎమర్జెన్సీ విధించారు. వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారుల క్యాపిటల్ హిల్ బిల్డింగ్ మీద దాడి చేయడమే కాక ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం సమయంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్ వాషింగ్టన్లో ఎమర్జెన్సీ విధించారని వైట్‌హౌస్ ప్రెస్ ఆఫీస్ సోమవారం వెల్లడించింది. ‘ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 59వ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 11 నుంచి 24 వరకు ఎమర్జెన్సీ ప్రకటించారు. గత వారం ట్రంప్ మద్దతుదారలు క్యాపిట్ల హిల్‌పై దాడి చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఫెడరల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’ అని ప్రకటనలో ఉంది. (చదవండి: యూఎస్‌లో హింసాత్మకం: ట్రంప్ తీరుపై ఆగ్రహం) ఈ నిర్ణయం వెలువడిన తర్వాత వాషింగ్టన్లో అత్యవసర పరిస్థితుల వల్ల స్థానిక జనాభాకు కలిగే కష్టాలను, బాధలను తగ్గించడం.. విపత్తు సహాయక చర్యలను సమన్వయం చేయడం.. స్టాఫోర్డ్ చట్టం టైటిల్ 5 కింద అధికారం పొందిన అవసరమైన అత్యవసర చర్యలకు తగిన సహాయం అందించడం.. ప్రాణాలను కాపాడటం, ఆస్తిని రక్షించడం, ప్రజారోగ్యం, భద్రత, విపత్తు ముప్పును తగ్గించడం, నివారించడం వంటి బాధ్యతలన్ని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తుంది. ఇక ఈ అత్యవసర సహాయ చర్యలకు అవసరమైన నిధులను ఫెడరల్ ప్రభుత్వమే 100 శాతం అందిస్తుంది. (చదవండి: చివరి రోజుల్లో.. అవమానభారంతో...) జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు ఈ వీకెండ్, జనవరి 20న మొత్తం 50 రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోన్నట్లు ఎఫ్‌బీఐ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు పెంటగాన్ వాషింగ్టన్ సిటీలో మరోసారి దాడులు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో క్యాపిటల్ సిటీలో 15 వేల మంది జాతీయ భద్రతా దళాలను మోహరించింది. ట్రంప్‌కు మరో షాకిచ్చిన ట్విట్టర్ డొనాల్డ్ ట్రంప్ విషయంలో ట్విట్టర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నా 70 వేల ఖాతాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్రంప్ అధికారిక ఖాతాను శాశ్వతంగా నిషేధించిన ట్విట్టర్.. తాజాగా ఆయన మద్దతుదారుల అకౌంట్లను కూడా నిలిపివేసింది. ఇక ట్రంప్ అనుకూల పోస్టులపై ఫేస్బుక్ చర్యలు తీసుకుంది. ఎఫ్బీలో 'ఆమోదాన్ని ఆపండి' అనే పోస్టుపై ట్రంప్ మద్దతుదారలు పోస్టులు పెడుతున్నారు. దాంతో ఎఫ్బీ ‘ఆమోదాన్ని ఆపండి’ అనే పదం ఉన్న అన్ని పోస్టులను తొలగించింది. -
క్యాపిటల్ హిల్ ఘటన: ‘అక్కడ మన జెండా ఎందుకుంది?’
వాషింగ్టన్: అమెరికాలోని క్యాపిటల్ హిల్ బిల్డింగ్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఇక దీని పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యింది. పలువురు దేశాధినేతలు ఈ ఘటనను ఖండించారు. ఇక నిరసనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎందుకంటే ఆ వీడియోలో ఓ వ్యక్తి భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని కనిపించడం గమనార్హం. అయితే ఆ వ్యక్తి ఎవరు? అతడు ఏ పార్టీకి చెందినవాడన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కానీ అమెరికా ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసన కార్యక్రమంలో త్రివర్ణపతాకం కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.(చదవండి: బైడెన్ గెలుపును ధ్రువీకరించిన కాంగ్రెస్) ‘ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో మన జెండా ఎందుకుంది... ఇలాంటి చోట మన మద్దతు అనవసరం అంటున్నారు’ నెటిజనులు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా దీని మీద స్పందించారు. ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ.. అక్కడ మన జెండా ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు. ఈ పోరాటంలో మనం పాలుపంచుకోవాల్సిన అవసరం అసలే లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియో ఈ రోజు జరగిన నిరసనకు సంబంధించిందా.. లేక పాత వీడియోని ఇప్పుడు మళ్లీ పోస్ట్ చేశారా అనేది ప్రస్తుతానికి తెలియలేదు. ఇక అమెరికా కాంగ్రెస్ బైడెన్‌ని అధ్యక్షుడిగా ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. -
యూఎస్‌లో హింసాత్మకం: ట్రంప్ తీరుపై ఆగ్రహం
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుతోంది. యూఎస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఊహించని రీతిలో ఓటమి పాలైన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన వెర్రి చేష్టలతో అధికార మార్పిడికి మోకాలొడ్డుతున్నారు. అధికారదాహంతో ఊగిపోతూ.. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా తన మద్దతుదారులను ఉసిగొల్పుతున్నారు. ఒకప్పుడు శాంతికి చిహ్నంగా నిలిచిన శ్వేతజాతీయులు నడిరోడ్డుపై నిరసనలకు దిగుతున్నారు. బైడెన్ గెలుపును అధికారికంగా ధృవీకరించేందుకు భేటీ అయిన కాంగ్రెస్ సభ హింసాత్మకంగా మారింది. అగ్రరాజ్యం రాజధాని వాషింగ్టన్ డిసీలోని క్యాపిటల్ భవన్ ముందు ఘర్షణ చెలరేగింది. ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున పార్లమెంట్‌కు చొచ్చుకెళ్లెందుకు ప్రయత్నించారు. భవనంలోని అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన రణరంగాన్ని సృష్టించారు. బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారుల ఆందోళనకు దిగడం ఒక్కసారిగా కలకలం రేపింది. (వాషింగ్టన్ డీసీలో తీవ్ర ఉద్రిక్తత) ప్రపంచ దేశాల ఉలిక్కిపాటు అందోళకారులు శాంతించాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఓ వీడియోను విడుదల చేసినా.. ఏమాత్రం లాభం లేకుండా పోయింది. ట్రంప్ మద్దతు దారులను అదుపులోకి తెచ్చేందుకు అక్కడి సిబ్బంది తూటాలకు పనిచెప్పక తప్పలేదు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళతో పాటు మరోముగ్గురు మృతి చెందగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. తొలుత టియర్ గ్యాస్ ప్రయోగించగా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటన యావత్ ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ప్రజాస్వామ్యానికి నిర్వచనంగా చెప్పుకునే అమెరికాలో అధికార మార్పిడి హింసాత్మకంగా మారడంలో ప్రపంచ దేశాల అధినేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమెరికా పార్లమెంట్ ముందు జరిగిన ఘర్షణపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాన బోరిస్ జాన్స్‌న్, కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్రరాజ్యంలో అధికార మార్పడిన శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నాం. ప్రపంచ పెద్దన్నగా వర్ణించే యూఎస్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం నిజంగా బాధాకరం. నిరసనకారులను శాంతిపచేయాల్సిన బాధ్యత వారి నేతలకుంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి ఆమోద యోగ్యం కాదు’ అని అభిప్రాయపడ్డారు. (క్యాపిటల్ భవనంపై దాడి: ట్రంప్‌కు బైడెన్ విజ్ఞప్తి) ఫలితాల తారుమారుకు ట్రంప్ ఒత్తిడి... మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత ఏడాది నవంబర్ 3న జరగిన ఎన్నికల్లో 306- 232 తేడాతో ట్రంప్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే తొలినుంచీ గెలుపుపై ధీమాగా ఉన్న ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితాలను సవాలు చేస్తూ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థులు దాఖలు చేసిన దాదాపు 60 పిటిషన్లను అక్కడి కోర్టులు కొట్టివేశాయి. ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఎక్కడా కనిపించడంలేదని న్యాయస్థానాలు తేల్చిచెబుతున్నాయి. అయినప్పటికీ ట్రంప్ తీరులో ఏమాత్రం మార్పు రావడంలేదు. ఈ క్రమంలో.. స్వింగ్ స్టేట్ అయిన జార్జియా ఎన్నికల చీఫ్‌కు ఆయన చేసిన ఫోన్ కాల్ ఆడియో లీకవ్వగా అది ఎంతి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా బైడెన్ గెలుపును పార్లమెంట్లో అధికారికంగా ప్రకటించే ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను సైతం ట్రంప్ ప్రభావితం చేయాలని ప్రయత్నించారు. ఫలితాలను తారుమారు చేయాలన్న ట్రంప్ విజ్ఞప్తిని మైక్ తీవ్రంగా తోసిపుచ్చారు. రాజీనామా చేసే యోచనలో ట్రంప్.. ఇక క్యాపిటల్ భవన్ ముందు చెలరేసిన హింసపై జో బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమిని అంగీకరించలేకనే ట్రంప్ ఇలాంటి దుస్సాహసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమెరికా ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని వ్యాఖ్యానించారు. ఇది నిరసన కాదు.. రాజకీయ తిరుగుబాటు అంటూ మండిపడ్డారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ లాక్ చేస్తూ ట్విటర్ యాజమన్యం నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ఖాతాను 12 గంటలపాటు నిలివేస్తున్నట్లు ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్వీట్లు తొలగించాలని తొలుత ట్రంప్‌ను కోరగా.. ఆయన స్పందించకపోవడంతో ట్వీట్లు తొలగించి అన్‌లాక్ చేసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపిస్తుండటంతో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన వ్యక్తిగత సలహాదారులతో ట్రంప్ చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా జనవరిన అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీని కొరకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. -
మళ్లీ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి మైక్రోసాఫ్ట్
వాషింగ్టన్ : దాదాపు 4ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి తిరిగి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త డ్యూయల్ స్క్రీన్ ఆండ్రాయిడ్ డివైజ్ సర్ఫేస్ డ్యూయో కోసం కంపెనీ బుధవారం ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు 1,399 డాలర్లు ఉండొచ్చు. ఈ స్మార్‌ఫోన్ 5.6అంగుళాల డిప్లేను, 4.8 మిల్లిమీటర్ల మందాన్ని కలిగి ఉండొచ్చు. సెప్టెంబరులో మార్కెట్లోకి విడుదల కావచ్చనే అంచనాలున్నాయి. స్మార్ట్ ఫోన్ అధిక ధరను కలిగి ఉన్నప్పటికీ.., వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. అయితే కరోనా ఎఫ్టెక్తో అమెరికా ఆర్థిక వ్యవస్థ భారీ పతననాన్ని చవిచూడటం, నిరుద్యోగం రెండంకెల క్షీణత చూస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ స్మార్ట్ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టడం పట్ల మార్కెట్ వర్గాలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. -
అమెరికాలో కాల్పులు.. ఒకరి మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సరదాగా అంతా కలిసి ఓ చోట చేరి పార్టీ చేసుకుంటున్న సమయంలో తలెత్తిన వివాదం యువకుడి ప్రాణం బలిగొంది. మరో ఇరవై మంది గాయపడ్డారు. ఈ ఘటన వాషింగ్టన్ డీసీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ విషయం గురించి మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్టుమెంట్ చీఫ్ పీటర్ నీషం మాట్లాడుతూ.. వందలాది మంది ఒక్కచోట చేరి అవుట్డోర్ పార్టీ చేసుకున్నట్లు తెలిపారు. ఫుడ్ లాగిస్తూ.. మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వివాదం చెలరేగిందని.. ఈ క్రమంలో కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. (ట్రంప్ నిర్ణయం; 293 మంది అమెరికన్ల మృతి) ఈ ఘటనలో ఓ పోలీస్ ఆఫీసర్(ఆ సమయంలో విధుల్లో లేరు)కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకైతే ఎవరినీ అరెస్టు చేయలేదని, దుండగులు కాల్పులకు తెగబడటానికి కారణం ఇంతవరకు తెలియరాలేదన్నారు. కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ వందలాది మంది ఒక్కచోట చేరి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారని, ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇక ప్రత్యక్ష సాక్షులు ఈ విషయం గురించి చెబుతూ.. బర్త్‌డే పార్టీలో ఒక్కసారిగా గన్‌ఫైరింగ్ శబ్దాలు వినిపించాయని, అప్పటివరకు సరదాగా గడుపుతున్న వారంతా ఒక్కసారిగా రోడ్ల మీద పడిపోయారని పేర్కొన్నారు. మరికొంత మంది కార్ల కింద దాక్కొన్నారని, అదో భయంకర ఘటన అని గుర్తు చేసుకున్నారు. -
కరోనా వేళ.. కొత్త రకం కరెన్సీ!
వాషింగ్టన్ డీసీ: డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? ఈ మాట సర్వసాధారణంగా మనం ఏదో ఒక చోట వింటూనే ఉంటాం. అయితే ఆ మాట ఇప్పుడు నిజమైంది. అది మారుమూల ఏదో ఒక వెనుకబడిన దేశంలో కాదు, అగ్రరాజ్యంలోనే చెట్లకు డబ్బులు కాస్తున్నాయి. అదేంటి వింతగా చెట్లకు డబ్బులు కాయడం ఏంటా అనుకుంటున్నారా. అయితే ఇది చదవండి. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే చెప్పొచ్చు. ధనిక, పేద దేశాలనే తేడా లేకుండా అన్ని దేశాలు కరోనా కోరల్లో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల మాట అటుంచితే ఇక కరోనా మహమ్మారి కారణంగా చిరు వ్యాపారులు, చిన్న చితక పనులు చేసుకునే వారి జీవితాలు అతలాకుతలమయ్యాయి. చేతిలో డబ్బు లేక వారంతా విలవిలలాడుతున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవశ్యకత ఏర్పడింది. అందుకోసం ఒక కొత్త కరెన్సీకి శ్రీకారం చుట్టింది అమెరికాలోని ఒక చిన్న పట్టణం. వాషింగ్టన్ రాష్ట్రంలోని టెనినో అనే చిన్న పట్టణంలో ఒక నూతన ఒరవడిని ప్రారంభించింది. అక్కడ చెక్క కరెన్సీని తయారు చేసి చలామణిలోకి తీసుకువచ్చారు. దానిని ‘కోవిడ్ డబ్బు’ అని పిలుస్తున్నారు. అక్కడ ఏది కొనడాకైనా ప్రజలు ఇప్పుడు ఆ డబ్బునే వినియోగిస్తున్నారు. మద్యం, పొగాకు, గంజాయి మినహా మిగిలిన వాటన్నింటిని ఈ డబ్బుతో కొనవచ్చు. దీనిని మాపుల్ వెనిర్ అనే కలప నుంచి తయారు చేస్తున్నారు. ఇది తెలుపు, తేల పసుపు రంగులో ఉంటుంది. దానిపై అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ చిత్రాన్ని ముద్రించారు. చదవండి: కాయ్ రాజా కాయ్.. కరోనా కేసులపై బెట్టింగ్‌ల జోరు పర్యాటక రంగంపై ఆధారపడే నగరం టెనినో, అమెరికాలో కరోనా లాక్డౌన్ నుంచి అనేక సమస్యలను ఎదుర్కోంటోంది. దాని ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. దీంతో వారు చెక్క డబ్బును ఆవిష్కరించారు. స్థానిక వ్యాపారాలు నిర్వహించడం కోసం సిటీ హాల్లో రియల్ డాలర్ల కోసం దాన్ని రీడీమ్ చేసుకోవచ్చు. దీనిపై టెనినో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు టైలర్ విట్వర్త్ మాట్లాడుతూ, ‘ఈ డబ్బు ఎక్కడికి వెళుతుందో మాకు తెలియదు. కానీ చెక్క కరెన్సీతో, మేం ఇక్కడి సమాజంలో బతకవచ్చు’ అని పేర్కొన్నారు. చదవండి: కరోనా అతని ఆయుష్షు పెంచింది! -
వాషింగ్టన్ డి.సిలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వాషింగ్టన్ డి సి (వర్జీనియా): దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా అమెరికాలో వాషింగ్టన్ డి సి మెట్రో వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం జులై 8వ తేదీ సాయంత్రం (ఇండియా కాలమానము - గురువారం ఉదయం) ఘనంగా నివాళులు అర్పించారు. వాషింగ్టన్ డి సి రీజినల్ ఇన్ ఛార్జ్ శశాంక్ రెడ్డి, సత్య పాటిల్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు సమక్షంలో సామాజిక దూరం పాటిస్తూ జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. (మదిలో మహానేత) వైఎస్సార్ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు మాట్లాడుతూ, ‘ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం, చెదరిపోని గుండె బలం, నాయకత్వానికి నిలువెత్తు రూపం, మేరునగ ధీరుడు మన వైఎస్ రాజశేఖరుడు. ఎందరికో అసాధ్యమయిన అనేక అభ్యుదయ పథకాలను సుసాధ్యం చేసి సంక్షేమ రథసారథిగా తెలుగు రాజకీయ యవనికపై తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రజలంతా బాగుండాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి అని నిరంతరం తపించిన వ్యక్తి ఆయన. అదే ఆలోచనలతో, భావనలతో అనేక పథకాలు రూపొందించి, అమలు చేసి తాను మరణించే వరకు రైతు సంక్షేమ పథకాలను కొనసాగించి ప్రజలందరి మన్ననలు చూరగొన్న మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి’ అని కొనియాడారు. (రైతు దినోత్సవం) వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ శశాంక్ రెడ్డి మాట్లాడుతూ, సమున్నత వ్యక్తిత్వం, చెరగని చిరునవ్వు, చెదరని దృఢనిశ్చయం, పదహారణాల తెలుగుదనం కలబోసి విరబూసిన విలక్షణ వ్యక్తిత్వమే ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. వామనుడి మూడు పాదాలంత విస్తృత వ్యక్తిత్వానికి వైయస్ఆర్ అనే మూడంటే మూడు పొడి అక్షరాలు కొండను అద్దంలో కొంచెంగా చూపించే ప్రతీకలు. ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. పోయారు. కానీ దేశ రాజకీయ పటంపై హిమశిఖర సదృశంగా సమున్నతమైన వ్యక్తిగా భాసిల్లిన మహా వ్యక్తిత్వం వైయస్ఆర్ది’ అని ప్రశంసించారు. (తెలంగాణలో ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు) రఘునాథ రెడ్డి మాట్లాడుతూ, ‘మహానేత జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసి ముఖ్య మంత్రికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. వైయస్ఆర్ కడప జిల్లా నుంచే నవరత్నాల పథకాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. ప్రతి ఊరు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడకుండా అందరికి మంచి చేయాలని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం నవరత్న పథకాల్లో ఎంతో ప్రాధాన్యతనిచ్చారని కొనియాడారు. వినీత్ లోక వైఎస్సార్‌ను స్మరించుకుంటూ, ఆయన మరణం లేని మహానేత అని అన్నారు. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం.. ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే..అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ శశాంక్ రెడ్డి, నాటా నాయకులు సత్య పాటిల్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎల్వి కిరణ్, రఘునాథ్ రెడ్డి, వినీత్ లోక, నరేన్ ఒద్దులా, మదన గళ్ళ, అర్జున్ కామిశెట్టి, వినయ్ మాదాసు లతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు