ట్రంప్‌ నిర్ణయాల ఎఫెక్ట్‌.. అమెరికాలో అమ్మకానికి భారీగా ఇళ్లు! | Social Media Users Claimed Real Estate Market Crash Fears In Washington DC Area | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ నిర్ణయాల ఎఫెక్ట్‌.. అమెరికాలో అమ్మకానికి భారీగా ఇళ్లు!

Published Sun, Feb 16 2025 12:07 PM | Last Updated on Sun, Feb 16 2025 1:38 PM

Social Media Users Claimed Real Estate Market Crash Fears In Washington DC Area

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర దేశాలను మాత్రమే కాకుండా, ఆ దేశ ప్రజలను కూడా భయపెడుతున్నాయి. దీంతో వాషింగ్టన్ డీసీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనం జరగనున్నట్లు భావించి.. వేల ఇళ్లను అమ్మకానికి ఉంచారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

వాషింగ్టన్ డీసీలో గత 14 రోజుల్లోనే 4,271 కంటే ఎక్కువ ఇళ్ళు అమ్మకానికి ఉంచినట్లు.. ఒక ఎక్స్ యూజర్ పేర్కొంటూ.. ''ఎలుకలు పారిపోతున్నాయి” అని అన్నారు. నగరవాసులు తమ వస్తువులను సర్దుకుని.. సామూహికంగా నగరం విడిచి వెళ్తున్నారని అన్నారు.

వలసలకు కారణం.. ఇలాన్ మస్క్ నేతృత్వంలోని 'డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' (DOGE) అని చెబుతున్నారు. నగరంలో, ఆ చుట్టుపక్కల అమ్మకానికి ఉన్న 14,825 ఇళ్లను చూపించే ఫోటోలను కూడా షేర్ చేశారు. నగరంలో 500 కంటే ఎక్కువ ఇల్లు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ ధరకు అమ్మకానికి ఉన్నాయని.. అమెరికన్లను సురక్షితంగా ఉంచే విధానాలపై పనిచేసే థింక్ ట్యాంక్ అయిన సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీలో పనిచేస్తున్న సీనియర్ విశ్లేషకుడు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: యూపీఐ లిమిట్ పెంచుకోండిలా..

ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ప్లేస్ అయిన 'జిల్లో'లో అమ్మకానికి ఉన్న ఇళ్ల జాబితాలను మరో ఎక్స్ యూజర్ షేర్ చేసాడు. ఏడు రోజులలో 201, 14 రోజులలో 378, 30 రోజులలో 706, 90 రోజులలో 1,198 కొత్త ఇళ్లు అమ్మకానికి ఉన్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement