వాషింగ్టన్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూలస్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అమెరికా రాయబారితో, అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అనంతరం.. సీఎం జగన్ నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) ఉంటుంది. అనంతరం డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఇక సీఎంతో సమావేశం నేపథ్యంలో నాటా అన్ని ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ను సంప్రదించి.. సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికి ఓ వెబ్‌సైట్ రూపొందించింది. ఈ కింది లింక్ ద్వారా సీఎం జగన్‌ను ప్రశ్నలు అడగొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment