
సాక్షి, తాడేపల్లి: నాటా తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వనం అందింది. ఈ మేరకు నాటా ప్రెసిడెంట్, సభ్యులు సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయం వెళ్లి.. ఆయన్ని కలిసి ఆహ్వానించారు.
సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించిన వాళ్లలో నాటా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి కొరసపాటి, నాటా సభ్యులతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. 2023 జూన్ 30 – జులై 02 వరకు డాలస్‌లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment